
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. మంచి, మర్యాద మరిచి నీచానికి తెగబడుతున్నారు. అసభ్యంగా ప్రవర్తించి మానవత్వానికి మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. లైంగిక కోరిక(ఓరల్ సెక్స్) తీర్చలేదని తోటి స్నేహితులే ఓ వ్యక్తిని హత్య చేశారు.. ఈ దారుణం బరన్ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 26న ఓం ప్రకాష్ బైర్వా(40), అతని స్నేహితులు మురళీధర్ ప్రజాపతి, సురేంద్ర యాదవ్‌తో కలిసి మద్యం సేవించారు. అనంతరం ముగ్గురు ప్రజాపతి సోదరుడిని చూడటానికి సమీపంలోని గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రజాపతి, మురళీధర్ తమతో ఓరల్ సెక్స్ చేయాలని బైర్వాను బలవంతం చేశారు. అందుకు అతను ససేమిరా అనడంతో బలమైన ఆయుధంతో నరికి చంపారు.
అనంతరం మృతదేహాన్ని ఓ చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు సురేంద్ర యాదవ్, మురళీధర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని విచారిస్తుండగా.. మరొరకు అరెస్ట్ భయంలో విషం తాగడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బరన్ ఎస్పీ రాజ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. కాగా ప్రజాపతి రోడ్డు పక్కన దాబా నడుపుతుండగా, సరేంద్ర యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు అని బరన్ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రాంవిలాస్ తెలిపారు.
చదవండి: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా?
Comments
Please login to add a commentAdd a comment