సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైనట్లు సమాచారం. క్లూస్ టీమ్‌కి దొరికిన రెండు ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు ఆధారాలను క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది.
భార్య వెంకట మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లిన భర్త గురుమూర్తి.. బాత్రూమ్‌లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై పెట్టి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగా చేసిన గురుమూర్తి.. ఎముకల పొడి మొత్తాన్ని బకెట్‌లో నింపి చెరువులో పడేశాడు.
మాధవి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. కేసులో కీలక అంశాలున్నాయని రాచకొండ సీపీ అన్నారు. దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నామన్నారు. ఈ కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందని.. టెక్నాలజీ ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.వీ
ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో అడ్డు తొలగించుకునేందుకే గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో మరో మహిళతో ఉన్న ఫోటోలు లభించడంతో ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే విచారణ సందర్భంగా అతడు పొంతన లేని సమాధానాలు చెబుతుండటం, ఇంకా ఎలాంటి ఆ« దారాలు లభించకపోవడంతో.. అసలేం జరిగింది? అతను చెప్పేది నిజమా, అబద్ధమా? అనేది మిస్టరీగా మారిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసులో అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి వివరాలనూ పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారం
తనతో గొడవ పడి భార్య బయటికి వెళ్లిపోయిందని గురుమూర్తి బంధువులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. దీనితో పోలీసులు ఆ కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. 14న మాధవి బయటి నుంచి ఇంట్లోకి వెళ్లినట్టుగా సీసీ కెమెరా వీడియోల్లో ఉంది. తర్వాత ఆమె బయటికి రాలేదు. గురుమూర్తి ఒక్కడే ఇంటి నుంచి బయటకు వెళ్లిరావడాన్ని పోలీసులు గుర్తించారు. దీనికితోడు గురుమూర్తి ప్రవర్తనపై సందేహంతో.. మాధవిని ఇంట్లోనే హత్య చేసి ఉండవచ్చని భావించి, ఇంట్లో, పరిసరాలను పరిశీలించారు. తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య తలపై ఆయుధంతో మోది హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశానని.. బకెట్‌లో వేసి వాటర్ హీటర్‌తో ఉడికించి, రోకలితో దంచి చెరువులో పడేశానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది.
పోలీసులు చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారమూ లభించలేదని.. ఇంట్లోని బాత్రమ్, వీధిలోని అన్ని మ్యాన్‌హోళ్లను తెరిపించి పరిశీలించినా ఏ స్పష్టతా రాలేదని సమాచారం. దీనితో గురుమూర్తి చెప్పేది నిజమా, అబద్ధమా? పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అలా చెబుతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. హత్యపై రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా పోలీసు అధికారులు అధికారికంగా ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు. కాగా.. గురుమూర్తి ఇంట్లో మద్యం సీసా, దాని పక్కనే మటన్ షాపులో ఉపయోగించే చెక్క మొద్దును గుర్తించారు. హత్య అనంతరం శరీరాన్ని దీనిపైనే ముక్కలుగా చేసినట్టు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment