baran
-
లైంగిక కోరిక.. కాదన్నందుకు వ్యక్తిని హత్య చేసిన స్నేహితులు
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. మంచి, మర్యాద మరిచి నీచానికి తెగబడుతున్నారు. అసభ్యంగా ప్రవర్తించి మానవత్వానికి మాయని మచ్చగా మారుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. లైంగిక కోరిక(ఓరల్ సెక్స్) తీర్చలేదని తోటి స్నేహితులే ఓ వ్యక్తిని హత్య చేశారు.. ఈ దారుణం బరన్ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 26న ఓం ప్రకాష్ బైర్వా(40), అతని స్నేహితులు మురళీధర్ ప్రజాపతి, సురేంద్ర యాదవ్‌తో కలిసి మద్యం సేవించారు. అనంతరం ముగ్గురు ప్రజాపతి సోదరుడిని చూడటానికి సమీపంలోని గ్రామానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ప్రజాపతి, మురళీధర్ తమతో ఓరల్ సెక్స్ చేయాలని బైర్వాను బలవంతం చేశారు. అందుకు అతను ససేమిరా అనడంతో బలమైన ఆయుధంతో నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని ఓ చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు సురేంద్ర యాదవ్, మురళీధర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని విచారిస్తుండగా.. మరొరకు అరెస్ట్ భయంలో విషం తాగడంతో ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బరన్ ఎస్పీ రాజ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. కాగా ప్రజాపతి రోడ్డు పక్కన దాబా నడుపుతుండగా, సరేంద్ర యాదవ్ దినసరి కూలీగా పనిచేస్తున్నట్లు అని బరన్ సిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రాంవిలాస్ తెలిపారు. చదవండి: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంట్లోనే వరుడి హత్య.. తండ్రి పనేనా? -
ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
జైపూర్: వివిధ సంస్థల్లో యూనియన్లు ఏర్పాటు చేసి దానికి లీడర్లను ఎన్నుకోవడం సాధారణ విషయమే, విద్యాసంస్థల్లోనూ ఈ విధానం అమలవుతోంది. కాలేజీ, యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా స్టూడెంట్స్ తమలో ఒకరిని విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసే విద్యార్థి నాయకులంతా ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలు, వాగ్దానాలు చేస్తుంటారు. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు తనను ఎన్నుకుంటే చేసే అభివృద్ధిని వివరిస్తూ వరాల జల్లు కురిపిస్తారు. అచ్చం ఇలాగే ఓ కాలేజీలో లీడర్‌గా పోటీ చేస్తున్న కొందరు విద్యార్థి నాయకులు ఓట్ల కోసం వినూత్నంగా వేడుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బరన్ జిల్లాలోని ఓ కళాళాలలో విద్యార్థి సంఘాల నేతలు ఓటు వేయడానికి వస్తున్న ప్రతి స్టూడెంట్స్‌ను అడ్డుకొని నమస్కరించి, కాళ్లు పట్టుకొని, తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా అమ్మాయిలు కనిపిస్తే వారి కాళ్లపై పడి పాదాలు పట్టుకొని తనకు అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు. చదవండి: అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు.. కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్ వీడియో ఓటు వేస్తామని విద్యార్థులు భరోసా ఇచ్చేంత వరకు తమ కాళ్లను వదిలిపెట్టకుండా పట్టేసుకున్నారు. దీంతో కాళ్లు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వారిని చూసి అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. ఈ వీడియోను అన్‌సీన్ ఇండియా అనే పేజీ ట్విట్టర్లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం ఓట్ల లెక్కించి, మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని राजस्थान विश्वविद्यालय छात्र संघ चुनाव के दौरान प्रत्याशियों ने सड़क पर लेटकर पैर पकड़कर माँगे वोट. pic.twitter.com/rmvlgCFXgJ — UnSeen India (@USIndia_) August 26, 2022 -
కోవిడ్–19 కిట్ల పెళ్లి
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. రాజస్థాన్‌లో ఓ పెళ్లి మాత్రం కోవిడ్ సెంటర్లో జరగాలని దేవతలు నిర్ణయించినట్టున్నారు. ఇటీవల రాజస్థాన్ బారాలో ఒక జంట కెల్వారా కోవిడ్ సెంటర్లో పెళ్లితో ఒక్కటయ్యింది. నవ వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పెళ్లి జరిపించే çపురోహితుడు పిపిఇ కిట్లు ధరించి మరీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇలాంటి పెళ్లి జరగడం దేశంలో ఇదే మొదటిదిగా చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా వివాహవేడుకలపై అనేకానేక ఆంక్షలు తప్పడం లేదు. పెళ్లిళ్లలో మాస్కులు ధరించకపోయినా, ఎక్కువ సంఖ్యలో హాజరైనా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా పోలీసులు జరిమానాలు విధించిన సంఘటనలు చూశాం. కొన్ని పెళ్ళిళ్లలో వెయిటర్లు పిపిఇ కిట్లు ధరించడమూ చూశాం. కానీ, పెళ్లిలో వధూవరులు పిపిఇ కిట్లు ధరించడం మాత్రమే ఇప్పుడే చూస్తున్నాం. ఇందులో పెళ్లికూతురెవరో, పెళ్లికొడుకెవరో ఎత్తును బట్టి కొంత తెలుసుకోవచ్చు కానీ, మిగిలిన అతిథులలో ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. పురోహితుడంటే ప్రత్యేకంగా తెల్లసూటేసుకున్నాళ్లెండి. విషయమేమంటే.. రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఛతర్గంజ్ గ్రామానికి చెందిన వధువుకు దంతా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువు తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమె కోవిడ్–19 పరీక్ష చేయించుకుంది. పాజిటివ్ అని వచ్చింది. ఆ తరువాత వధువు కూడా పరీక్ష చేయించుకుంది. పెళ్లి జరిగే రోజున వధువుకు కరోనా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దీంతో వాయిదా వేయలేక అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించాలనుకున్నారు పెద్దలు. అందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, ఈ పెళ్లిలో వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మొత్తం 7 గురు పిపిఇ కిట్లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పెళ్లి తంతు ముగించారు. పిపిఇ కిట్లతో వివాహం జరుపుకున్న జంటగా ఈ రాజస్థానీ వధూవరులు వార్తల్లో నిలిచారు. ఈ వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. -
దేవుళ్ల పేర్లతో అర్చకుడి నిర్వాకం..!
జైపూర్: కత్రినా కైఫ్ పేరు కేరళ జనాభా లెక్కల్లో కనిపించడం, హాలీవుడ్ సినిమా హీరోలకు హైదరాబాద్‌లో ఓటు హక్కు లభించడం లాంటి వింతలు ఇంతకుముందు ఎన్నో చూశాం. ఇక రేషన్ కార్డుల విషయంలో.. కొందరు కోటీశ్వరులకు తెల్లకార్డులు, కూటికిలేనని వాళ్ళకు గులాబి కార్డులు అందడం గమనించాం. కానీ ఏకంగా తాను పనిచేసే ఆలయంలోని దేవుళ్ల పేరు మీదే రేషన్‌కార్డులు పొంది, ఏళ్లుగా సరుకులు బొక్కేస్తున్న అర్చకుడి గురించి విన్నారా? రాజస్థాన్‌లోని బరాన్ జిల్లా కేంద్రానికి చెందిన బాబూలాల్ అనే వ్యక్తి కజిఖేర్ ప్రాంతంలోని కృష్ణభగవానుడి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఏమంత అవసరం అనుకున్నాడోగానీ కృష్ణుడు, ఆయన భార్య మారుపేర్లతో(మురళీ మనోహర్, ఠాకురాయన్జీ) రేషన్ కార్డు సంపాదించాడు. శివపుత్రుడు గణేశ్ పేరుమీద కూడా ఇంకో కార్డు తయారుచేయించాడు. అలా 2005 నుంచి దేవుళ్ల పేరుమీద నెలనెలా సబ్సిడీ ధరకు సరుకులు తెచ్చుకునేవాడు. అయితే తెలంగాణ, ఏపీల పౌరసరఫరాల శాఖలు చేపట్టినమాదిరే మాదిరే రాజస్థాన్‌లోనూ ఇటీవలే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలియని బాబూలాల్ గత వారం యధావిధిగా రేషన్‌షాప్‌కు వెళ్లాడు.. కార్డులను పరిశీలించిన అధికారులు.. ‘ఆ పేరుగల వ్యక్తులను మా ముందు ప్రవేశపెట్టండి’ అని ఆదేశించడంతో పూజారి బాబూలాల్ బెంబేలెత్తిపోయాడు. చివరికి అసలు విషయం కక్కేశాడు.. ఆ పేర్లన్నీ దేవుళ్లవేనని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి సమన్లు జారీచేసిన పీడీఎస్ అదికారులు.. 2005 నుంచి ఇప్పటివరకు బాబూలాల్‌కు ఎంత సరుకు అందింది? అనే వివరాలను లెక్కకడుతున్నారు. బాబులాల్‌పై చర్యలు తీసుకోవాలా వద్దా అనేది ఇప్పుడే చెప్పలేమని, బయోమెట్రిక్ విధానంతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని రాజస్థాన్ పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. -
ఎట్టకేలకు విడుదలైన మహమ్మద్: మెసెంజర్ ఆఫ్ గాడ్
అతి తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించి అంతర్జాతీయ వేదికల మీద కూడా శభాష్ అనిపించుకున్న దర్శకుడు మజీద్ మజిదీ.. ఇరానియన్ దర్శకుడిగా అంతర్జాతీయ సినిమా అభిమానులకు పరిచయం అయిన మజిదీ ఎన్నో సామాజిక అంశాలను తెరకెక్కించారు. దర్శకుడిగా ఎన్నో అద్భుత విజయాలు సాదించిన మజిదీ, తన సినిమా విడుదల విషయంలో అదే స్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మజిదీ డైరెక్షన్ లో 40 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'మొహమ్మద్ : మెసెంజర్ ఆఫ్ గాడ్' రిలీజ్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో పాటు కొంతమంది విశ్లేషకుల అభ్యంతరాలతో వాయిదా పడింది. గతంలో చిల్డ్రన్స్ ఆఫ్ హెవెన్, బరాన్, ద విల్లో ట్రీ లాంటి అద్భుత చిత్రాలను తెరకెక్కించిన మజిదీ, ఆ సినిమాలతో పోలిస్తే సాంకేతికంగా కూడా ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు మజిదీ. ముఖ్యంగా విటోరియా స్టొరారో సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని మరింతగా పెంచింది. ఇక ఆస్కార్ వేదికపై మెరిసిన భారతీయ సంగీత దిగ్గజం రెహమాన్ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం మజిదీ దర్శకత్వంతో పోటీ పడ్డాయి. ఇదే కథాంశంతో 1977లో రిలీజైన 'ద మెసేజ్' కన్నా ఈ సినిమా మరింత ఉన్నతంగా తెరకెక్కింది. ఇలా ఎన్నో అద్భుతాలకు ఆతిథ్యం ఇచ్చిన 'మొహమ్మద్ : మెసెంజర్ ఆఫ్ గాడ్' ఆగస్టు 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని రకాల వివాదాల నుంచి బయటకు వచ్చిన ఈ సినిమాకు విశ్లేషకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. వివాదాల సంగతి ఎలా ఉన్నా 'మొహమ్మద్ : మెసెంజర్ ఆఫ్ గాడ్' ఎంతో నిజాయితీగా తీసిన చిత్రంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేకాదు తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించిన మజిదీ మరోసారి ప్రపంచ సినీ అభిమానులకు తన మ్యాజిక్ ను పరిచయం చేశాడు.