
జైపూర్: వివిధ సంస్థల్లో యూనియన్‌లు ఏర్పాటు చేసి దానికి లీడర్లను ఎన్నుకోవడం సాధారణ విషయమే, విద్యాసంస్థల్లోనూ ఈ విధానం అమలవుతోంది. కాలేజీ, యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా స్టూడెంట్స్ తమలో ఒకరిని విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసే విద్యార్థి నాయకులంతా ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలు, వాగ్దానాలు చేస్తుంటారు. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు తనను ఎన్నుకుంటే చేసే అభివృద్ధిని వివరిస్తూ వరాల జల్లు కురిపిస్తారు.
అచ్చం ఇలాగే ఓ కాలేజీలో లీడర్‌గా పోటీ చేస్తున్న కొందరు విద్యార్థి నాయకులు ఓట్ల కోసం వినూత్నంగా వేడుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బరన్ జిల్లాలోని ఓ కళాళాలలో విద్యార్థి సంఘాల నేతలు ఓటు వేయడానికి వస్తున్న ప్రతి స్టూడెంట్స్‌ను అడ్డుకొని నమస్కరించి, కాళ్లు పట్టుకొని, తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా అమ్మాయిలు కనిపిస్తే వారి కాళ్లపై పడి పాదాలు పట్టుకొని తనకు అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు.
చదవండి: అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు.. కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్ వీడియో
ఓటు వేస్తామని విద్యార్థులు భరోసా ఇచ్చేంత వరకు తమ కాళ్లను వదిలిపెట్టకుండా పట్టేసుకున్నారు. దీంతో కాళ్లు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వారిని చూసి అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. ఈ వీడియోను అన్‌సీన్ ఇండియా అనే పేజీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం ఓట్ల లెక్కించి, మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడించనున్నారు.
చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని
राजस्थान विश्वविद्यालय छात्र संघ चुनाव के दौरान प्रत्याशियों ने सड़क पर लेटकर पैर पकड़कर माँगे वोट. pic.twitter.com/rmvlgCFXgJ
— UnSeen India (@USIndia_) August 26, 2022
Comments
Please login to add a commentAdd a comment