student union elections
-
హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం ఎగురవేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5,300 ఓట్లకు గాను 76 శాతం ఓట్లు పోలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాల కూటమి ఘన విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రజ్వల్ 1,838 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షుడు పృథ్వీసాయికి 1,860 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా క్రిపామారియాజార్జ్, కల్చరల్ సెక్రెటరీగా లిఖిత్‌కుమార్, జాయింట్ సెక్రెటరీగా కత్తిగణేశ్, స్పోర్ట్స్ సెక్రెటరీగా సీహెచ్ జయరాజ్ ఎన్నికయ్యారు. ఇతర పదవుల్లోనూ ఈ కూటమికి చెందిన వారే ఎన్నిక కావడం విశేషం. -
ఓట్ల కోసం స్టూడెంట్స్ కాళ్లు పట్టుకున్న విద్యార్థి నేత.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
జైపూర్: వివిధ సంస్థల్లో యూనియన్లు ఏర్పాటు చేసి దానికి లీడర్లను ఎన్నుకోవడం సాధారణ విషయమే, విద్యాసంస్థల్లోనూ ఈ విధానం అమలవుతోంది. కాలేజీ, యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటాయి. అక్కడ కూడా స్టూడెంట్స్ తమలో ఒకరిని విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేసే విద్యార్థి నాయకులంతా ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలు, వాగ్దానాలు చేస్తుంటారు. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు తనను ఎన్నుకుంటే చేసే అభివృద్ధిని వివరిస్తూ వరాల జల్లు కురిపిస్తారు. అచ్చం ఇలాగే ఓ కాలేజీలో లీడర్‌గా పోటీ చేస్తున్న కొందరు విద్యార్థి నాయకులు ఓట్ల కోసం వినూత్నంగా వేడుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బరన్ జిల్లాలోని ఓ కళాళాలలో విద్యార్థి సంఘాల నేతలు ఓటు వేయడానికి వస్తున్న ప్రతి స్టూడెంట్స్‌ను అడ్డుకొని నమస్కరించి, కాళ్లు పట్టుకొని, తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యంగా అమ్మాయిలు కనిపిస్తే వారి కాళ్లపై పడి పాదాలు పట్టుకొని తనకు అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు. చదవండి: అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు.. కేటీఆర్ మెచ్చిన డ్యాన్స్ వీడియో ఓటు వేస్తామని విద్యార్థులు భరోసా ఇచ్చేంత వరకు తమ కాళ్లను వదిలిపెట్టకుండా పట్టేసుకున్నారు. దీంతో కాళ్లు పట్టుకొని ఓట్లు అడుగుతున్న వారిని చూసి అక్కడున్న వారంతా ఆశ్యర్యపోయారు. ఈ వీడియోను అన్‌సీన్ ఇండియా అనే పేజీ ట్విట్టర్లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. శనివారం ఉదయం ఓట్ల లెక్కించి, మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని राजस्थान विश्वविद्यालय छात्र संघ चुनाव के दौरान प्रत्याशियों ने सड़क पर लेटकर पैर पकड़कर माँगे वोट. pic.twitter.com/rmvlgCFXgJ — UnSeen India (@USIndia_) August 26, 2022 -
Oxford University: భారత సంతతి యువతి అరుదైన ఘనత
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికైంది. స్టూడెంట్ యూనియన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో భారత సంతతి యువతి అన్వీ భుటానీ ఘన విజయం సాధించింది. ఆమె ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగ్డలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతోంది. ఈ ఫలితాన్ని అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన వివాదం కారణంగా ఇంతకు ముందు ఉన్న ఆధ్యక్షురాలు రష్మీ సమంత్ రాజీనామా తర్వాత ఈ ఉపఎన్నిక జరిగింది. భూటాని తన మ్యానిఫెస్టోలో.. చెర్వెల్ విద్యార్థి వార్తాపత్రిక ప్రకారం ఆక్స్ఫర్డ్ జీవన వేతనం అమలు చేయడం, సంక్షేమ సేవలు, క్రమశిక్షణా చర్యలను తొలగించడం లాంటివి చేర్చింది. 2021-22 విద్యా సంవత్సరానికిగాను స్టూడెంట్ యూనియన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్, రేసియల్ అవేర్నెస్, ఈక్వాలిటీ క్యాంపైన్ కో-చైర్ పదవి కోసం బరిలో నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం సాధించింది. చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను! -
జేఎన్‌యూలో వామపక్షాల విజయభేరి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ విజయం సాధించింది. జేఎన్‌యూ ప్రెసిడెంట్‌గా సాయి బాలాజీ, వైస్ ప్రెసిడెంట్‌గా సారికా చౌదరీ విజయం సాధించారు. అజీజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వగా, అమృత జయదీప్ జాయింట్ సెక్రటరీగా విజయభేరి మోగించారు. దీంతో యూనివర్సిటీలోని నాలుగు కీలక పదవులను ఆ కూటమి సొంతం చేసుకుంది. లెఫ్ట్ కూటమి నుంచి పోటీ చేసిన సాయి బాలాజీకి 2151 ఓట్లు పోలవ్వగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి పోటీచేసిన లలిత్ పాండేకి కేవలం 972 ఓట్లు మాత్రమే సాధించారు. కాగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో శనివారం ప్రకటించాల్సిన ఫలితాలు ఆదివారంకి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా గత ఆరేళ్లల్లో అత్యధికంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. యునిటైడ్ లెఫ్ట్‌ను బలపరిచిన కూటమిలో ఆల్ఇండియా స్టూడెంట్ అసోషియేషన్ (ఎఎఐఎస్‌ఎ), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఎఐఎస్ఎఫ్) ఉన్నాయి. -
వారణాసిలో ఊహించని ఝలక్
వారణాసి : మోదీ సొంత నియోజకవర్గంలో భారత జనతా పార్టీకి ఊహించని పరిణామం. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. స్వతంత్ర్య అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం విశేషం. మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ ఎన్నికలను విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఏబీపీవీ తరపున వాల్మీకి ఉపాధ్యాయ బరిలోకి దిగగా, సమాజ్‌వాదీ ఛాత్ర సభ నుంచి రాహుల్ దుబే పోటీ చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రాహుల్‌కి టికెట్ ఇవ్వకపోవటంతో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశాడు. మొత్తం పోలైన ఓట్లలో 2.365 ఓట్లు రాహుల్‌కి దక్కగా, వాల్మీకికి 1,393 ఓట్లు దక్కాయి. దీంతో వెయ్యికి పైగా ఓట్లతో రాహుల్ ఘన విజయం సాధించినట్లయ్యింది. ఇక వాల్మీకిపై పలు ఆరోపణలు రావటం.. రాహుల్ అనుచరులపై దాడి చేశాడన్న కేసు వాల్మీకి ఓటమికి కారణాలైనట్లు విశ్లేషిస్తున్నారు. కాగా, ఉపాధ్యక్ష పదవి, లైబ్రేరీ సెక్రటరీ పదవులను గతేడాది అభ్యర్థులకే మద్దతు ఇచ్చి ఎస్సీఎస్(సమాజ్‌వాదీ పార్టీ విభాగం), ఎన్ఎస్యూఐ(కాంగ్రెస్ పార్టీ విభాగం) నిలుపుకోగా, ఉన్న ఒక్క పదవిని ఏబీవీపీ కోల్పోయినట్లయ్యింది. కాగా, ఈ మధ్య జరిగిన పలు యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ వరుస పరాజయాలను చవిచూడటం గమనార్హం. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్
-
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
అనుకున్నట్లే అయ్యింది. ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘన విజయం సాధించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పోస్టులు నాలుగింటినీ భారీ ఆధిక్యంతో చేజిక్కించుకుంది. ఈ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సు నాలుగేళ్ల పాటు కొనసాగించాలని జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఏబీవీపీ ఇటీవలే విజయం సాధించింది. అది చాలామంది విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 50 కళాశాలల్లో చదువుతున్న దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు. -
ఢిల్లీ వర్సిటీపై కాషాయ నజర్!
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ యూనివర్సిటీలో పాగా వేసేందుకు కాషాయ వర్గాలు సిద్ధంగా కనిపిస్తున్నాయి. ఏబీవీపీయే ఇక్కడ జెండా ఎగరేస్తుందని గట్టిగా చెబుతున్నారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సు నాలుగేళ్ల పాటు కొనసాగించాలని జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఏబీవీపీ ఇటీవలే విజయం సాధించింది. అది చాలామంది విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఏబీవీపీయే తీయించేసిందని, ఇది తమలాంటివాళ్లకు చాలా ఉపయోగపడిందని బీఏ ఎకనమిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉజ్వల్ కుమార్ అనే విద్యార్థి చెప్పాడు. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని మూడో సంవత్సరం పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఆచల్ కూడా విశ్వాసం వ్యక్తం చేసింది.ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 50 కళాశాలల్లో చదువుతున్న దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు. -
విద్యార్థి నాయకుడి కాల్చివేత
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ విద్యార్థి నాయకుడిని కొంతమంది కాల్చి చంపారు. ఈ సంఘటన సిగ్రా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అభిషేక్ కుమార్ సింగ్ (23) మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీలో చదువుతున్న అతడిని గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్చేశారని నగర ఎస్పీ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఘాజీపూర్ జిల్లాకు చెందిన సింగ్ బీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. త్వరలోనే విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండటంతో, దానికి సంబంధించి మాట్లాడుకోవాలి .. సిద్ధగిరిబాగ్ సమీపంలోని శ్మశానం వద్దకు రావాలని అతడికి ఎవరో ఫోన్ చేసి పిలిచారు. అక్కడే వాగ్వాదం పెరగడంతో అతడిని కాల్చేశారని పోలీసులు తెలిపారు. అతడు అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. దుండగులు వెంటపడి మరీ కాల్చారు. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. అతడిని బైకుపై తీసుకొస్తున్న మనోజ్ కుమార్ సింగ్ మాత్రం ఎలాగోలా తప్పించుకోగలిగాడు.