డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా | ABVP bags all four posts in DUSU polls | Sakshi
Sakshi News home page

డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా

Published Sat, Sep 13 2014 11:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా

డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా

అనుకున్నట్లే అయ్యింది. ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘన విజయం సాధించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పోస్టులు నాలుగింటినీ భారీ ఆధిక్యంతో చేజిక్కించుకుంది.

ఈ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సు నాలుగేళ్ల పాటు కొనసాగించాలని జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఏబీవీపీ ఇటీవలే విజయం సాధించింది. అది చాలామంది విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 50 కళాశాలల్లో చదువుతున్న దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement