ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ యూనివర్సిటీలో పాగా వేసేందుకు కాషాయ వర్గాలు సిద్ధంగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఈ యూనివర్సిటీలో పాగా వేసేందుకు కాషాయ వర్గాలు సిద్ధంగా కనిపిస్తున్నాయి. ఏబీవీపీయే ఇక్కడ జెండా ఎగరేస్తుందని గట్టిగా చెబుతున్నారు. ఈ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సు నాలుగేళ్ల పాటు కొనసాగించాలని జరిగిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఏబీవీపీ ఇటీవలే విజయం సాధించింది. అది చాలామంది విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది.
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఏబీవీపీయే తీయించేసిందని, ఇది తమలాంటివాళ్లకు చాలా ఉపయోగపడిందని బీఏ ఎకనమిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉజ్వల్ కుమార్ అనే విద్యార్థి చెప్పాడు. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని మూడో సంవత్సరం పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఆచల్ కూడా విశ్వాసం వ్యక్తం చేసింది.ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని 50 కళాశాలల్లో చదువుతున్న దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు.