న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అధ్యక్ష పదవితోపాటు మరో రెండు కీలక పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ ఒక్క స్థానానికి పరిమితం కాగా, వామపక్ష ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఐ) బలపరిచిన ఆప్ అనుబంధ ఛాత్ర విద్యార్థి సంఘర్‡్ష సమితి ఖాతా తెరవలేదు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకి చెందిన అంకివ్ బసోయా, వైస్‌ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకే చెందిన శక్తి సింగ్, జాయింట్ సెక్రటరీగా జ్యోతి విజయం సాధించారు. సెక్రటరీగా ఎన్‌ఎస్‌యూఐకి చెందిన ఆకాశ్ చౌదరి 9,199 ఓట్లతో గెలుపొందగా.. ఈ పోస్టుకు గాను నోటాకు 6,810 మంది విద్యార్థులు ఓటేయడం గమనార్హం. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో నిలవగా పోలైన ఓట్లు 44.46 శాతం మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment