DUSU election
-
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అధ్యక్ష పదవితోపాటు మరో రెండు కీలక పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ ఒక్క స్థానానికి పరిమితం కాగా, వామపక్ష ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఐ) బలపరిచిన ఆప్ అనుబంధ ఛాత్ర విద్యార్థి సంఘర్‡్ష సమితి ఖాతా తెరవలేదు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకి చెందిన అంకివ్ బసోయా, వైస్‌ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకే చెందిన శక్తి సింగ్, జాయింట్ సెక్రటరీగా జ్యోతి విజయం సాధించారు. సెక్రటరీగా ఎన్ఎస్యూఐకి చెందిన ఆకాశ్ చౌదరి 9,199 ఓట్లతో గెలుపొందగా.. ఈ పోస్టుకు గాను నోటాకు 6,810 మంది విద్యార్థులు ఓటేయడం గమనార్హం. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో నిలవగా పోలైన ఓట్లు 44.46 శాతం మాత్రమే. -
దమ్ముంటే అసెంబ్లీ రద్దు కోరండి
న్యూఢిల్లీ: మోడీ గాలిపై అంత నమ్మకం ఉంటే ఢిల్లీ శాసనసభను రద్దు చేయించాల్సిందిగా కోరాలని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) డిమాండ్ చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాయం విద్యార్థి సంఘానికి (డూసూ) జరిగిన ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గెలుపొందిన నేపథ్యంలో పైవిధంగా స్పందించింది. ఈ విషయమై డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోడీ వేవ్‌పై అంత నమ్మకం ఉంటే తక్షణమే ఢిల్లీ విధానసభను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎట్టి పరిస్థితుల్లో వర్తింపజేయకూడదని అన్నారు. ఎన్ఎస్యూఐ ఓడిపోయినంత మాత్రాన బీజేపీ సంబరపడిపోనవసరం లేదన్నారు. ఎన్ని కల్లో గెలుపు, ఓటములు అత్యంత సహజమ న్నారు. అయినప్పటికీ ఎన్నో ఏళ్ల విరామం తర్వా తనే ఏబీవీపీ గెలిచిందని ఆయన పేర్కొ న్నారు. ఎఫ్‌వైయూపీపై విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగానే ఏబీవీపీ ఈ ఎన్నికల్లో విజ యం సాధించగలిగిందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలే దు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
డూసూ ఎన్నికలు హాస్టల్ వసతే ప్రధాన ఎజెండా
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో హాస్టల్ వసతే తమ ప్రధాన ఎజెండా అని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ప్రకటించింది. డీయూ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ ఎజెండాను నిర్ణయించింది. ఎన్ఎస్యూఐ అందజేసిన ఫారాలను స్వీకరించిన దాదాపు 20 వేలమంది విద్యార్థులు హాస్టల్ వసతినే అందులో ప్రస్తావించారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని లేవనెత్తాల్సిందిగా తమను కోరారు. ఈ విషయాన్ని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు రోజి ఎం జాన్ వెల్లడించారు. దేశంలోని అత్యంత ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన డీయూలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రతి ఏడాది లక్షలమంది చేరుతుంటారన్నారు. అయితే అందులో కొందరికి హాస్టల్ వసతి లభించడం లేదన్నారు. డీయూ సెక్షన్ 33 చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయంలో చదివే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ డీయూ వెలుపల 15 హాస్టళ్లు ఉన్నాయన్నారు. ఇంకా తొమ్మిది కళాశాలల్లో బోర్డింగ్ వసతి ఉందన్నారు. డీయూలో మొత్తం 1.8 లక్షలమంది విద్యార్థులు ఉండగా కేవలం తొమ్మిది వేల హాస్టళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కారణంగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్లనే ఈ అంశాన్ని ఎన్నికల ఎజెండాగా నిర్ణయించామని వివరించారు. లాటరీ ద్వారా కేటాయింపుకోసం కోర్టుకు బ్యాలట్ క్రమసంఖ్యలను లాటరీ ద్వారా కేటాయించాలని కోరుతూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్ఏ) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. సంబంధిత అధికారులకు తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సదరు పిటిషన్లో కోరామని ఏఐఎస్ఏ నాయకుడు అమన్ గౌతం పేర్కొన్నారు. కాగా సెప్టెంబర్ 12వ తేదీన డూసూ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఆయా విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అదే నెల మూడో తేదీలోగా అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.