న్యూఢిల్లీ: మోడీ గాలిపై అంత నమ్మకం ఉంటే ఢిల్లీ శాసనసభను రద్దు చేయించాల్సిందిగా కోరాలని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) డిమాండ్ చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాయం విద్యార్థి సంఘానికి (డూసూ) జరిగిన ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గెలుపొందిన నేపథ్యంలో పైవిధంగా స్పందించింది. ఈ విషయమై డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోడీ వేవ్‌పై అంత నమ్మకం ఉంటే తక్షణమే ఢిల్లీ విధానసభను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎట్టి పరిస్థితుల్లో వర్తింపజేయకూడదని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఓడిపోయినంత మాత్రాన బీజేపీ సంబరపడిపోనవసరం లేదన్నారు. ఎన్ని కల్లో గెలుపు, ఓటములు అత్యంత సహజమ న్నారు. అయినప్పటికీ ఎన్నో ఏళ్ల విరామం తర్వా తనే ఏబీవీపీ గెలిచిందని ఆయన పేర్కొ న్నారు.
ఎఫ్‌వైయూపీపై విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగానే ఏబీవీపీ ఈ ఎన్నికల్లో విజ యం సాధించగలిగిందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు.
ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలే దు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దమ్ముంటే అసెంబ్లీ రద్దు కోరండి
Published Sat, Sep 13 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement