చార్జీలకు వ్యతిరేకంగా రైల్‌రోకో
న్యూఢిల్లీ: పెంచిన రైలు చార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం రైల్ రోకో నిర్వహించారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నైరుతి ఢిల్లీలోని పాలం రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పెంచిన రైలు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెరిగిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి.