డీపీసీసీ అధికార ప్రతినిధిగా ముఖేశ్ శర్మ నియామకం
Published Sat, Mar 8 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మీడియా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న ముఖేశ్ ఇకపై ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శర్మను అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు డీపీసీసీ శనివారం ప్రకటించింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శర్మ ఇదివరకు ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డ్ చైర్మన్‌గా, షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇలా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన శర్మ లోక్‌సభ ఎన్నికల సమయంలో డీపీసీసీ అధికార ప్రతినిధిగా కూడా తనదైన ముద్ర వేస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆయన సహకారంతో తాము లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే ధీమాను డీపీసీసీ అధ్యక్షడు అర్విందర్ సింగ్ లవ్లీ వ్యక్తం చేశారు. శర్మ అనుభవం, లవ్లీ యువభాగస్వామ్యం పార్టీకి కలిసి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు.
Advertisement
Advertisement