విధాన రూపకల్పనపై సీఎంకు సలహా ఇస్తా | Ajay Maken appointed Delhi Congress chief | Sakshi
Sakshi News home page

విధాన రూపకల్పనపై సీఎంకు సలహా ఇస్తా

Published Mon, Mar 2 2015 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

Ajay Maken appointed Delhi Congress chief

 డీపీసీసీ కొత్త అధ్యక్షుడు అజయ్ మాకెన్
 సాక్షి, న్యూఢిల్లీ : విధాన రూపకల్పనలో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు సలహా ఇస్తానని ఢిల్లీ ప్రదేశ్  కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) నూతన అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. అజయ్ మాకెన్‌ను డీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ సోమవారం ప్రకటన జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ పదవిలో అర్విందర్‌సింగ్ లవ్లీ కొనసాగిన సంగతి విదితమే. ఏఐసీసీ ప్రకటన అనంతరం అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ విధాన రూపకల్పనలో అనుభవం ఉన్నందున తాను అజయ్ మాకెన్ సలహాలు, సూచనలు కోరతానంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కే జ్రీవాల్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేజ్రీవాల్ కోరినప్పుడల్లా సలహాలివ్వడానికి సిద్ధమని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిన తరువాత నుంచి కేజ్రీవాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే మార్గాలను కాకుండా, వాటి నుంచి పలాయనం చిత్తగించే దారులను అన్వేషిస్తున్నారని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement