డూసూ ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థిసంఘం (ఎన్‌ఎస్‌యూఐ) విజయకేతనం ఎగురవేసింది.
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) విజయకేతనం ఎగురవేసింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. ఇక ఏబీవీపీ కేవలం కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకుంది. కాగా డూసూ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ‍్యక్తం చేసింది.