ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా | ABVP wins 3 seats in Delhi University Students Union poll | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా

Published Sat, Sep 10 2016 11:48 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM

ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా - Sakshi

ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలలో ఏబీవీపీ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విద్యార్థి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలతో పాటు కార్యదర్శి సీటును ఏబీవీపీ కైవసం చేసుకోగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సంయుక్త కార్యదర్శి సీటు మాత్రమే దక్కించుకోగలిగింది. దీంతో రేండేళ్ల తర్వాత ఎన్ఎస్యూఐకి ఒక్క పదవి దక్కింది.

వర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలతో ఏబీవీపీ ప్రచారం చేసిందని ఆరోపణలున్నాయి. ఏబీవీపీ యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి ప్రియాంక చౌరీ తన పేరు కలిసొచ్చేలా ప్రియాంక పోస్టర్లతో వర్సిటీలో ప్రచారం నిర్వహించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి  విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement