
ప్రజ్వల్, పృథ్వీసాయి, క్రిపామారియాజార్జ్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి జయకేతనం ఎగురవేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5,300 ఓట్లకు గాను 76 శాతం ఓట్లు పోలైన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఏ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాల కూటమి ఘన విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రజ్వల్ 1,838 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షుడు పృథ్వీసాయికి 1,860 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా క్రిపామారియాజార్జ్, కల్చరల్ సెక్రెటరీగా లిఖిత్‌కుమార్, జాయింట్ సెక్రెటరీగా కత్తిగణేశ్, స్పోర్ట్స్ సెక్రెటరీగా సీహెచ్ జయరాజ్ ఎన్నికయ్యారు. ఇతర పదవుల్లోనూ ఈ కూటమికి చెందిన వారే ఎన్నిక కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment