sfi
-
ఇంటర్ బోర్డు ముట్టడికి SFI యత్నం
-
ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో జరుగుతున్న వరుస పుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి (శనివారం) ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే ఏడాది గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు.అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తక్షణమే వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ అధికారులు సమీక్షించి, సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు: ఎస్ఎఫ్ఐ
తిరుపతి సిటీ/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ముందు ‘వైద్య విద్యను గాడిలో పెడతాం..ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌లు ఎన్నో మాటలు చెప్పారని, తీరా అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే విధంగా అడుగులు వేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీ కి రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నేతలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట, విజయవాడ లెనిన్ సెంటర్లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 107,108 జీవోలను రద్దు చేసి వైద్య విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరంచేసే ప్రయత్నాలు చేయడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నూతన కళాశాలలను నిర్మించి మెడికల్ సీట్లు పెంచి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. పులివెందుల మెడికల్ కళాశాల సీట్లు కొనసాగించాలని లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని ఎన్ఎంసీకి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 700 సీట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.తల్లికి వందనం ఎప్పుడు...?తిరుపతి అర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినప్పటికి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యులు పూజారి రాఘవేంద్ర ప్రశ్నించారు. శుక్రవారం విద్యార్థి సంఘం నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నిసరన వ్యక్తం చేసి ఏవో ఝాన్సీలక్ష్మికి వినతిపత్రమిచ్చారు. సూపర్‌సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హాస్టల్స్‌లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. విద్యార్థుల మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలి చెప్పారు. -
సమస్యలపై కదం తొక్కిన విద్యార్థులు
నాంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు కళ్లెం వేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఫ్ల ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వేర్వేరుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ప్రసంగిస్తూ.. కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు కార్యాల యం గేట్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు రజనీకాంత్, ఇతర నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాగా, రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలల అక్రమాలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నేతల అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంటర్ బోర్డ్ వద్ద ఆందోళనకు దిగిన ఏఐఎస్ఎఫ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పీఎస్ వద్ద ఉంచి వదిలిపెట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని, అనుమతులు లేని కళాశాలల జాబితాను బహిర్గతం చేయాలని కోరుతూ ముట్టడి నిర్వహించారు. -
కేరళ ప్రభుత్వంపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ ప్రభుత్వం.. అధికార సీపీఐ(ఎం) అనుంబంధ విద్యార్థి సంస్థ అయిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI), ఉగ్రవాద నిరోధక చట్టం(UAPA) కింద కేంద్ర హోంశాఖ నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) మధ్య సంబంధాలు కొనిసాగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ మద్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేరళ ప్రభుత్వం పగలు ఎస్ఎఫ్ఐ కోసం పనిచేస్తే రాత్రి నిషేధిత పీఎఫ్ఐ కోసం పని చేస్తుందని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ-పీఎఫ్ఐ మధ్య అనుబంధం కొనసాగుతుందని తెలపడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేరళ ప్రజల నుంచి కూడా ఈ విషయాన్ని తాను విన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఖచ్చితమైన పేర్లును చెప్పలేనని.. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలోని పలు కీలక అంశాలు, విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వంతో గవర్నర్‌కు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ‘క్రేంద దర్యాప్తు సంస్థలకు అన్ని విషయాలు తెలుసు. అరెస్ట్ చేసినవారిలో సుమారు సగం మంది పీఎఫ్ఐకి చెందినవారు ఉన్నారు. ఇది కేరళలో కొత్తకాదు. గతంలో కూడా దీనికి సంబంధించిన పలు ఆరోపణలు.. కేరళ అసెంబ్లీ కూడా చర్చకు వచ్చాయి. కేరళలో పీఎఫ్ఐని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’ అని గవర్నర్ అన్నారు. గత నెలలో కొల్లం జిల్లాలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శింస్తూ గవర్నర్‌కు నిరసన తెలిపారు. దీంతో గవర్నర్ తన కాన్వాయ్ దిగి రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్ కూర్చోని ఎస్ఎఫ్ఐ నిరసనకారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రభుత్వం కార్యక్రమల్లో కూడా కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ కనీసం పలకిరించుకోకుండా వార్తల్లో నిలుస్తున్నారు. -
గవర్నర్ ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తల నిరసన
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎదుట నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కేరళలోని మట్టన్నూరులో ఆదివారం సాయంత్రం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలు నల్లజెండాలు చూపించారు. అడవి ఏనుగుల దాడిలో మృతి చెందిన ఆరీఫ్ మహ్మద్ అజీష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాయనాడ్ వైపు వెళ్తుండగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలంటూ ఎస్ఎపఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో కొందరు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అక్కడ ఉన్న ఇతర కార్యకర్తలను ఆగ్రహం తెప్పించింది. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను పోలీసులు కొట్టారని, వారి వాహనాలను అడ్డుకున్నారని వారు ఆరోపించారు. సోమవారం కూడా తమ నిరసన ప్రదర్శన కొనసాగుతుందని కార్యకర్తలు తెలిపారు. కేరళలోని మనంతవాడి సమీపంలోని నివాస ప్రాంతంలోకి చొరబడిన ఏనుగు ఆరీఫ్ మహ్మద్ అజీష్ అనే వ్యక్తిపై దాడి చేసి, చంపేసింది. ఈ నేపధ్యంలో కేరళ ప్రభుత్వం మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. #WATCH | Kerala: SFI (Students Federation of India) workers showed black flags to Kerala Governor Arif Mohammed Khan in Mattannur. The workers were detained by police after they clashed with Police. (18.2) pic.twitter.com/KI09v1OoW9 — ANI (@ANI) February 18, 2024 -
రోడ్డు పక్కన కూర్చుని కేరళ గవర్నర్ నిరసన
తిరువనంతపురం/కొల్లం: కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈసారి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ రోడ్డు పక్కన రెండు గంటలపాటు కూర్చుని దాదాపు ధర్నాకు దిగినంత పనిచేశారు. శనివారం ఉదయం కొట్టరక్కరలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ వెళ్తుండగా అధికార సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిలామెల్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ‘సంఘీ చాన్సెలర్ గో బ్యాక్’అంటూ ఆయన్నుద్దేశించి నినాదాలు చేశారు. ఆగ్రహించిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ తన కారును ఆపించి, కిందికి దిగారు. తన వద్దకు రావాలంటూ పెద్దగా అరుస్తూ వారి సమీపానికి వెళ్లారు. దీంతో, పోలీసులు నినాదాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, గవర్నర్‌కు మధ్య అడ్డుగా నిలబడ్డారు. అనంతరం, గవర్నర్ సమీపంలోని దుకాణం నుంచి కుర్చీ తెప్పించుకుని రెండు గంటలపాటు రోడ్డు పక్కనే కూర్చున్నారు. నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను గట్టిగా డిమాండ్ చేశారు. నిరసనల్లో పాల్గొన్న 17 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని చేతికి అందించాకే ఆయన నిరసన విరమించారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర అధినేతగా వాటిని సహించబోనన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వామపక్ష ప్రభుత్వం తనపై దాడులకు ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను గూండాలు, రోజువారీ కూలీలుగా ఆయన అభివరి్ణంచారు. దేశంలోని ఏరాష్ట్ర గవర్నర్ కూడా ఇలా వ్యవహరించ లేదని కేరళ విద్యామంత్రి వి.శివన్కుట్టి వ్యాఖ్యానించారు. నిలామెల్ ఘటన జరిగిన గంటలోపే ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలి్పంచినట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించిందని రాజ్‌భవన్ ప్రకటించింది. గవర్నర్ తిరిగి తిరువనంతపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడ కూడా నిరసనలు కొనసాగించడం గమనార్హం. -
SFI,ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
-
సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే, ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
నేటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ
మెదక్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం విద్యార్థి ర్యాలీతో పాటు బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను హాజరవుతున్నారన్నారు. అలాగే 33 జిల్లాల నుంచి 350 మంది ప్రతినిధులు కూడా వస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. -
హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం ఎగురవేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5,300 ఓట్లకు గాను 76 శాతం ఓట్లు పోలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డీఎస్‌యూ విద్యార్థి సంఘాల కూటమి ఘన విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రజ్వల్ 1,838 ఓట్లు సాధించారు. ఉపాధ్యక్షుడు పృథ్వీసాయికి 1,860 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా క్రిపామారియాజార్జ్, కల్చరల్ సెక్రెటరీగా లిఖిత్‌కుమార్, జాయింట్ సెక్రెటరీగా కత్తిగణేశ్, స్పోర్ట్స్ సెక్రెటరీగా సీహెచ్ జయరాజ్ ఎన్నికయ్యారు. ఇతర పదవుల్లోనూ ఈ కూటమికి చెందిన వారే ఎన్నిక కావడం విశేషం. -
ప్రగతి భవన్ ముట్టడికి యత్నం
-
‘ప్రైవేటు’ దోపిడీని అరికట్టండి: ఎస్ఎఫ్ఐ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అనేక రకాల ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
30న కార్పొరేట్ విద్యా సంస్థల బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 30వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల బంద్‌ను పాటించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమన్యాలు సహకరించాలని కోరారు. శుక్రవారం కార్మిక, కర్షక భవన్లో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కమిటీ ఉపాధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ..కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలను పెట్టడంలేదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి నిరసనగా బంద్ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రవి, శంకర్, ఆర్.శంకర్, అక్బర్, వీరేంద్ర, చంద్ర, ప్రకాష్, వెంకటేశ్, నాగరాజు, సురేష్ పాల్గొన్నారు. -
‘మరుగుదొడ్డి కట్టించలేని నీవు ఒక సీఎంవేనా’
విజయవాడ: నగరంలోని ఓ మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు ఒక మరుగుదొడ్డి కట్టించలేని నీవు హైటెక్కు సీఎంనని చెప్పుకోవడం సిగ్గుచేటని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఓ ప్రకటనలో ప్రశ్నించింది. విజయవాడలోని విద్యార్థినీలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక సీఎం డొంకతిరుగుడు బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. స్వచ్ఛ్ భారత్ , స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని కోట్ల రూపాయలతో ఖర్చు చేసి చంద్రబాబు, మంత్రి నారాయణ పెద్ద పెద్ద ఫోటోలు ప్రచారం చేసుకున్నారు కానీ పేద విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు లేవని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం బాబు అసమర్ధతే కారణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. -
ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ ప్రశ్నపత్రం విడుదల
-
తాగునీటికోసం ఎస్ఎఫ్ఐ ధర్నా
ఓదెల : ఓదెల మండలం కొలనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మంచినీటి ఎద్దడిని నివారించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పాఠశాల ప్రధాన గేట్ వద్ద సుమారు గంటపాటు మంచినీటి ఎద్దడిని నివారించండి, విధ్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సతీష్‌గౌడ్ , ఎస్ఎఫ్ఐ మండలశాఖ అధ్యక్షుడు పల్కల సుగుణాకర్‌రెడ్డి, కార్యదర్శి మార్క సతీష్‌గౌడ్, విధ్యార్థులు రాజు, నరేశ్, ఓంకార్, సాయి, చరణ్, శివసాయి పాల్గొన్నారు. -
శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
నరసాపురం : శ్రీగౌతమి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని భార్యను వెంటనే అరెస్ట్ చేసి, శ్రీగౌతమికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్‌కు చేరారు. అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. నంబర్‌ప్లేట్ లేని కారుకు, వైజాగ్‌లోని వేరే కారు నంబర్‌ప్లేట్ తగిలించి పోలీసులు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సజ్జా బుజ్జి టీడీపీ నేత కావడంతో, కొందరు ఎమ్మెల్యేలు అతనిని కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌతమి చెల్లెలు పావని ఓ పక్క కారులో ముగ్గురు, నలుగురు ఉన్నారని చెబుతుంటే, పోలీసులు కాదు ఒక్కడే ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలీసులపై నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.అనీల్, ఎం.బాలకృష్ణ, ప్రవీణ్, నరేంద్ర పాల్గొన్నారు. -
శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
నరసాపురం : శ్రీగౌతమి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని భార్యను వెంటనే అరెస్ట్ చేసి, శ్రీగౌతమికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్‌కు చేరారు. అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. నంబర్‌ప్లేట్ లేని కారుకు, వైజాగ్‌లోని వేరే కారు నంబర్‌ప్లేట్ తగిలించి పోలీసులు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సజ్జా బుజ్జి టీడీపీ నేత కావడంతో, కొందరు ఎమ్మెల్యేలు అతనిని కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌతమి చెల్లెలు పావని ఓ పక్క కారులో ముగ్గురు, నలుగురు ఉన్నారని చెబుతుంటే, పోలీసులు కాదు ఒక్కడే ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలీసులపై నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె.అనీల్, ఎం.బాలకృష్ణ, ప్రవీణ్, నరేంద్ర పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలి
భీమవరం టౌ¯ŒS : విచిత్ర జాతిని విద్యావ్యవస్థ సృష్టిస్తుంటే విద్యార్థి సంఘాలు చూçస్తూ ఊరుకోవంటూ హా¯Œ్స ఇండియా చీఫ్ ఎ డిటర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 21వ మహాసభల్లో భాగంగా శుక్రవారం ముఖ్య అతిథిగా నాగేశ్వర్ మాట్లాడారు. విద్యాసంస్థలు సమాజం గురించి ఆలోచించే మెదళ్లను తయారు చేయలేనప్పుడు విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విద్యారంగంలో వెనుకబడ్డాయన్నారు. బలమైన ప్రజా ఉద్యమా లు, సామాజికాభివృద్ధి ద్వారానే విద్యారంగం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రతి చర్యనూ సమర్థిస్తామని, ఇందుకు విరుద్ధమైన ప్రతి చర్యనూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చా రు. పాలకులు విద్యాహక్కు చట్టాన్ని కూ డా నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్త ం చేశారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటు విద్యావ్యాప్తికి దోహదపడదన్నారు. దాడులను ప్రశ్నించకూడదా..! సింగపూర్, చైనా, జపాన్, అమెరికాలను చూసి నేర్చుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని నాగేశ్వర్ అన్నారు. యూనివర్సిటీలు ఎలా ఉన్నాయనడానికి వేముల రోహిత్, కన్హయ్య సంఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. దాడులను విద్యార్థులు ప్రశ్నించకూడదనే భావనలో పాలకులు ఉన్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు జనం బారులు తీరి ఉంటుండగా ఈ విషయంపై ఉస్మానియా వర్సిటీలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. విద్యావిధానంలో, విద్యా సమాజంలో మార్పునకు విద్యార్థి సంఘాలు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. మేధావులను తయారు చేసే కేంద్రంగా విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆకాంక్షించారు. పేదలకు ఉన్నత విద్య దూరం ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు మ తోన్మాదులకు నిలయాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌సింగ్, జాతీయ మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, ఉపాధ్యక్షుడు పి.రవికుమార్, మంతెన సీతారాం, కె.హరికిశోర్, బి.సాంబశివ, పి.తులసి, ఎల్.చిన్నారి, కె.మహేష్, రాజు, పి.కిరణ్, ఎంవీ రమ ణ, ఎ.అశోక్, కె.ఆంజనేయులు, కె.క్రాం తి తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టాలి
ఎస్ఎఫ్ఐ నేతలు అనంతపురం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యచంద్రయాదవ్, జయచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. కరువు జిల్లా పేద, మధ్య తరగతి వారికి విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. జిల్లా కరువు పరిస్థితుల దృష్టా ్య బాలికలు డ్రాపౌట్స్ కాకుండా వారికి చదువుకునే అవకాశం కల్పించాలన్నారు. నాయకులు హరీష్, శ్రీను పాల్గొన్నారు. -
విద్యారంగంపై చిన్నచూపు తగదు..
* మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు * ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు ప్రారంభం తెనాలి అర్బన్: ప్రభుత్వ విద్యపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ, పేదలకు విద్యను దూరం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. భారత విద్యార్థి ఫెడరేఫన్(ఎస్ఎఫ్ఐ) 44వ జిల్లా మహాసభలు తెనాలి మారీసుపేటలోని ఎస్సీఆర్ఎన్ఎంహెచ్ స్కూల్లో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్ కుమార్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ జండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ప్రవేట్ విద్యాసంస్థలకు తక్కువ ధరకు భూములను ప్రభుత్వం కట్టబెడుతోందన్నారు. గురుకులాల పేరుతో హాస్టల్స్‌ను, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో పాఠశాలలను అర్ధంతరంగా ప్రభుత్వం మూసివేస్తోందన్నారు. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఖాళీగా ఉన్న లెక్చరర్, ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యపై ఆసక్తి పెంచుకోవాలి: అన్నాబత్తుని మరో ముఖ్యఅతిథి, వైఎస్సార్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్ వంటి వాటి ప్రభావం ఎక్కువగా యువతపై ఉందన్నారు. దీనివల్ల యువతలో ఆలోచించే తత్వం కనుమరుగవుతుందని, ఇలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. విద్యపై ఆసక్తిని పెంచుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.మనోజ్‌కుమార్, వి భగవన్దాసు మాట్లాడుతూ తెనాలిలో ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఇంటర్, డీగ్రీ కళాశాల లేకపోవటం దారుణమన్నారు. దీనివల్ల డివిజన్లోని ప్రజలు తమ పిల్లల్ని రూ.వేలు ఫీజులు చెల్లించి చదివించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ కళాశాల తెనాలికి మంజూరు అయ్యే వరకు పోరాడతామని చెప్పారు. ముందుగా భగత్‌సింగ్, క్యూబా మాజీ అధ్యక్షుడు క్యాస్ట్రో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో ఎన్సీఆర్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వేజళ్ల ఉమామహేశ్వర్, సీఐటీయూ డివిజన్ నాయకుడు షేక్ హుస్సేన్‌వలి, వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు అగస్టీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పవన్, జ్యోతి, ప్రసన్న, గోపి, తెనాలి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈపూరి వంశీ, హరి, జిల్లా పరిధిలోని నాయకులు పాల్గొన్నారు. -
22 నుంచి ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు
ఏలూరు సిటీ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) 39వ జిల్లా మహాసభలను ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్టు నగర కార్యదర్శి కె.క్రాంతిబాబు తెలిపారు. మంగళవారం స్థానిక సంఘ జిల్లా కార్యాలయంలో నగర ముఖ్య కార్యకర్తల సమావేశం ఉపాధ్యక్షుడు సీహెచ్ భరత్ అధ్యక్షతన నిర్వహించారు. భీమవరం కిరాణా మర్చంట్స్ హాల్లో జిల్లా మహాసభలు నిర్వహిస్తామని, జిల్లా నలుమూలల నుంచి దాదాపు 350 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని కార్యదర్శి క్రాంతిబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు విద్యార్థి లోకం నాంది పలికేలా మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
విద్యార్థి వ్యతిరేక విధానాలు మానుకోవాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాము ఏలూరు సిటీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై దిశానిర్దేశం చేసే విధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము తెలిపారు. శనివారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆఫీస్ బేరర్ల సమావేశం జిల్లా అధ్యక్షుడు కె.క్రాంతిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రాము మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. పేద విద్యార్థులకు విద్యానిలయాలుగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు రేషనలైజేషన్ పేరుతో మూసివేయడం అత్యంత దారుణమైన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచి ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా విద్యార్థి లోకం ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాల అనంతరం జిల్లాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వి.మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.శివరాజు, మహిళా కన్వీనర్ పి.తులసి, జిల్లా సహాయ కార్యదర్శి పి.సాయికృష్ణ, టి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
వర్సిటీలో ఎస్ఎఫ్ఐ ధర్నా
ఏఎన్‌యూ: యూనివర్సిటీలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో గురువారం యూనివర్సిటీ పరిపాలనా భవన్ ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేశారు. పరిపాలనా భవన్ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా ఏపీ యూనివర్సిటీల ఎస్ఎఫ్ఐ శాఖ కన్వీనర్ టీ పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయనందున యూజీసీ 2500 కోట్ల రూపాయల నిధులను నిలిపివేసిందన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వ, యూనివర్సిటీల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ శాఖ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ ఏఎన్‌యూలో వసతి గృహాలు, విభాగాల్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, లైబ్రరీని 24 గంటలు తెరచి ఉంచాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల ద్వారాల వద్ద బస్షెల్టర్లు ఏర్పాటు చేయాలని, వికలాంగ విద్యార్థులకు యూనివర్సిటీలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. వసతి గృహలకు వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం వీసీ అందుబాటులో లేకపోవటంతో వినతిపత్రాన్ని వీసీ కార్యాలయ తలుపునకు అంటించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఎన్‌యూ శాఖ కార్యదర్శి పీ ఏసురాజు, మహిళా కన్వీనర్ తులసి, నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీను, గోపి, రాజ్‌కమల్ తదితరులు పాల్గొన్నారు. -
స్కాలర్షిప్లను పెంచాలి
మిర్యాలగూడ అర్బన్ : పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముల్లం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని సమతడిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాలు తమ ఇష్టానుసారం పెంచుకున్న నాయకులు విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్ షిప్‌లు పెంచడంలో వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడావత్ రవినాయక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్, శివ, శ్రీకాంత్, సైదులు, సత్యనారాయణ, సతీష్, ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, బీసీ సంఘాల నాయకులు పరంగిరాము, మచ్చ సైదులు, తిరుమలగిరి అశోక్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు పరశురాములు కళాశాల ప్రిన్సిపల్ చీదళ్ల రమేష్, రామారావు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎఫ్ఐ ఎస్కేయూ నూతన కమిటీ ఎన్నిక
ఎస్కేయూ : ఎస్ఎఫ్ఐ ఎస్కే యూనివర్సిటీ శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొండన్న, చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఎస్కేయూ కమిటీ అధ్యక్షులుగా ఎస్.ముస్తఫా, ప్రధాన కార్యదర్శి జి. బాలరాజు , ఉపాధ్యక్షులు సాయికుమార్, శంకర్‌బాబు, రఘు, అశోక్, గిరి సహాయ కార్యదర్శులు సూరిబాబు, వినోద్, వీరాంజినేయులు, శివ, శంకర్లను నియమించామన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
విద్యారంగ సమస్యలపై మండిపాటు పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య తోపులాట ముకరంపుర: విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆ«ధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి విద్యార్థులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విద్యార్థి సంఘాల నేతలు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు విధ్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.తిరుపతి, బత్తిని సంతోష్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా విద్యారంగానికి చేసిందేమీ లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న బోజనం ప్రారంభిస్తామని హామీలిచ్చిన మంత్రులు విస్మరించడం శోచనీయమన్నారు. అధికారుల పర్యవేక్షణ లేక హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్‌కుమార్, మారుతి, రజిత, రవీందర్, నాగరాజు, సంతోష్, ప్రశాంత్, విఘ్నేష్, గణేశ్, వంశీ, మాలతి, పూజ, ఆదిత్య, శ్రావణ్‌కుమార్, సంపత్ పాల్గొన్నారు. -
హాస్టళ్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి వికారాబాద్ రూరల్ : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఉపాధ్యక్షుడు వెంకట్ అన్నారు. విద్యార్థులతో రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు స్థానిక గ్రంథాలయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ. కేసీఆర్ బంగారు తెలంగాణ చేయడం ఏమో కాని సంక్షేమ హస్టల్ విద్యార్థులకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తే చాలన్నారు. అది చేయకుండా పూటకో మాట రోజుకు మాట్లాడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేయడం ఎందుకని ప్రశ్నించారు. సంక్షేమ హస్టళ్లలో సన్నబియ్యం పెడుతున్నం సంక్షేమంలో ప్రభుత్వం ముందు ఉందని చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. హస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిర్వహించిన సైకిల్ యాత్రలో బయటకొచ్చిందన్నారు. ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థుల పైన సంక్షేమ హాస్టల్ సమస్యలపైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్ బస చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సతీష్, నాగవర్ధన్, గోరవ్ధన్, శ్రీకాంత్, గల్స్కన్వీనర్, పరమేశ్వరి, సంజయ్, శంకర్,దశరత్,సంజీవ, మల్లేశం, గౌతమి, అనిల్, రఘు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పీయూలో పీహెచ్‌సీని ఏర్పాటుచేయాలి
పాలమూరు యూనివర్సిటీ: పీయూలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, సమస్యలను పరిష్కారించాలని కొరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం పీయూ వీసీ భూక్యా రాజారత్నంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ పీయూలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, గ్రంథాలయం, ఫార్మసీ కళాశాలలో ఉన్న కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ఫార్మసీ ఆడిటోరియాన్ని పూర్తిచేయాలని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ హాస్టల్స్ సమీపంలో మైదానం నిర్మించాలని, ప్రతి హాస్టల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అంజి, రవి, రజినికాంత్, రాఘవేందర్, సందీప్ పాల్గొన్నారు. -
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
ఆత్మకూర్(ఎస్) : హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు సానబోయిన ఉపేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కస్తూరిబా, ఎస్సీ హాస్టల్, ఆదర్శ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్సీ హాస్టల్లో ప్రహారీ లేకపోవడంతో రాత్రిళ్లు పందులు, తేళ్లు, పాములు వస్తున్నాయన్నారు. విద్యార్ధులు నడచి వెళ్లడానికి దారికూడా సక్రమంగా లేదన్నారు. ఆదర్శ పాఠశాలలో ప్రహరీలేక బాలికలకు రక్షణలేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జుజ్జూరి సతీష్, ఏర్పుల సతీష్, ఉప్పుల సైదులు, సురేష్, రమేష్,ప్రవీణ్, ఉపేందర్, వేణు, అప్పిరెడ్డి, నాగరాజు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
23 నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు
కరీంనగర్‌ఎడ్యుకేషన్: భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈనెల 23, 24, 25 తేదీల్లో కరీంనగర్లో జరుగుతాయని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతి, బత్తిని సంతోష్ తెలిపారు. సమావేశాల ఆహ్వానపత్రాలను శుక్రవారం ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. విద్యారంగ పరిరక్షణకు అందరూ సహకరించాలని రమేశ్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి రజినీకాంత్, నాయకులు భాను, మౌనిక, సాగరిక పాల్గొన్నారు. -
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర
కోదాడఅర్బన్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమరభేరి సైకిల్ యాత్రలు మంగళవారం కోదాడ పట్టణంలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఈ సైకిల్‌యాత్రను ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు జుట్టుకొండ బసవయ్య , ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల విద్యాసాగర్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 134 వసతి గృహాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని, వాటిలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలపై తమ సైకిల్‌యాత్రలో అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనాకుల శ్రీకాంత్, వర్మ, మట్టపల్లి వెంకట్, పల్లపు శ్రీనివాస్, ఉపేందర్, మహేందర్, ప్రవీణ్, నవీన్, సతీష్, మహేష్, ఎస్.రాధాకృష్ణ, ఎం. ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
23 నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ఈ నెల 23, 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆహ్వానసంఘం ప్రతినిధులు కోరారు. నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో విద్యారంగం గందరగోళంగా తయారైందన్నారు. విద్యాసంస్థలకు సకాలంలో స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయని ఆరోపించారు. విద్యారంగానికి జరుగుతున్న అన్యాయం, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై సమావేశాల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతి, కార్యదర్శి బత్తిని సంతోష్, సుప్మా అధ్యక్షుడు సతీష్‌కుమార్, వాగేశ్వరి విద్యాసంస్థల చైర్మన్ బీఆర్.గోపాల్‌రెడ్డి, ట్రస్మా నగర అధ్యక్షుడు చెన్నప్ప, నాయకులు అరుణ్, మారుతి, రవీందర్, శ్రీకాంత్, కుమార్, నాగరాజు, రజనీకాంత్, ప్రశాంత్ పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా దాసరి మనోహర్‌రెడ్డి ఈ సందర్భంగా ఆహ్వానసంఘాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అధ్యక్షుడిగా ముద్దసాని రమేశ్‌రెడ్డి(శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్), ప్రధానకార్యదర్శిగా బత్తిని సంతోష్ (ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి), ట్రెజరర్‌గా మాదం తిరుపతి(ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు), చీఫ్ ఫ్యాట్రన్స్గా వి.నరేందర్‌రెడ్డి(అల్ఫోర్స్ చైర్మన్), జె.ప్రభాకర్‌గౌడ్(టీటీజేసీఎంఏ జిల్లా కార్యదర్శి), యాదగిరి శేఖర్‌రావు(ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి), కె.అనంతరెడ్డి(మానేరు విద్యాసంస్థల అధినేత), వి.సతీష్‌కుమార్(సుప్మా జిల్లా అధ్యక్షుడు), బీఆర్ గోపాల్‌రెడ్డి(నిగమ విద్యాసంస్థల చైర్మన్), కె.చెన్నప్ప(ట్రస్మా నగర అధ్యక్షుడు), శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు ఆహ్వాన సంఘం ప్రతినిధులు తెలిపారు. -
వసతిగహాలను పున:ప్రారంభించాలి
అనుమసముద్రంపేట : సంక్షేమ వసతిగహాలను మూసివేయడం తగదని వెంటనే పున:ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని ఉన్నతపాఠశాలలు, కళాశాలలును మూసివేయించి బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా బస్టాండు సెంటర్లో మానవహారం ఏర్పాటుచేశారు. ప్రభుత్వం మెస్ చార్జీలను రూ.1,050కి పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిఫ్‌ల బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆసిఫ్, మండలాధ్యక్ష, కార్యదర్శులు నాగూర్, రాహిల్, నాయకులు ఫహిమ్, వంశీ, చైతన్య, బాబు, జహిర్, మహిళా నాయకులు సుహన, సాలెహ షర్మిల పాల్గొన్నారు. సంగం : విద్యార్థులకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్లు సంగంలో సోమవారం విద్యాసంస్థలను మూయించి బంద్ చేశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతిగహాల్లో చదువుకునే విద్యార్థులను చిన్నచూపు చూస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ మంఢలాధ్యక్షుడు ఖాదర్‌బాష మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగాలేవని, వెంటనే కల్పించాలని కోరారు. నాయకులు వెంకటరమణ, హరి పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : విద్యా సమస్యలపై విద్యార్థి సంఘాలు సోమవారం చేపట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంతోపాటు వివిధ ప్రాంతాల్లో విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ఓ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కాకినాడలో జేఎన్టీయూ, బాలాజీచెరువు వద్ద; అమలాపురం గడియారస్థంభం సెంటర్; రంపచోడవరం, చింతూరుతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు వీసీ ఎం.ముత్యాలు నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ఆరు వేల విద్యాసంస్థలుండగా ఈ బంద్‌లో 300 పీజీ కళాశాలలు, 350 జూనియర్ కళాశాలలు, 250 డిగ్రీ కళాశాలలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కోనసీమలోని ఇంజనీరింగ్ కళాశాలలు మూత పడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థిసంఘాల జేఏసీ నాయకులు ఎస్.కిరణ్‌కుమార్, బి.పవన్‌లు మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం క్లస్టరైజేషన్, రేషలైజేషన్, మోడల్స్ స్కూల్స్ విధానాల పేరుతో దాదాపు 4 వేల పాఠశాలలు కుదించేసిందని అన్నారు. 1400 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు రద్దు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. కార్పొరేట్ రంగానికి ఎర్ర తివాచీ పరచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాలన్నారు. స్కూల్స్‌లో యూనిఫాంలు వెంటనే అందజేయాలని, విదేశీ యూనివర్సిటీలను రాష్ట్రంలో అనుమతించరాదని, మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ రంగానికి ఇవ్వరాదని డిమాండ్ చేశారు. -
దుబ్బాకకు చేరిన సైకిల్‌యాత్ర
దుబ్బాక: సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన సైకల్ యాత్ర సోమవారం దుబ్బాకకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు రూ. 15 వందలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవింద్, సంతోష్, మధు, రాజు, సాయి, నవీన్, రమేశ్, శ్రీకాంత్, సుమన్, రమేశ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ సైకిల్‌యాత్ర
అలంపూర్‌రూరల్ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ వసతి గృహాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవు తున్నాయిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. జిల్లాలోని 64 మండలాల్లోని సంక్షేమ వసతిగృహాలపై తాము సర్వే చేస్తూ అక్కడి సమస్యలపై అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం ఈ సైకిల్ యాత్ర అలంపూర్‌కు చేరింది. వారు పట్టణంలోని సంక్షేమ వసతిగృహాలను సందర్శించారు. అనంతరం గాంధీచౌక్ వద్ద మాట్లాడారు. జిల్లాలో వసతిగృహాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. అలంపూర్‌లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్టల్లో సరైన రక్షణ లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, ఆది, కుర్మయ్య, సుబాన్, నవీన్, రామకృష్ణ, శేఖర్, నాగన్న, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ, అయ్యప్ప పాల్గొన్నారు. -
సైకిల్ యాత్రను విజయవంతం చేయాలి
కందుకూరు: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్ట్ 2న జిల్లా స్థాయిలో చేపట్టనున్న సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని సంఘం సౌత్ జిల్లా కార్యదర్శి ఎర్ర యాదగిరి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం కందుకూరు మండల కేంద్రం నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించనున్నామని, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం రాష్ర్టవ్యాప్త ఉద్యమం చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రెండు జతల దుస్తులు, అవసరమైన ఉపాధ్యాయులు, కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. సంక్షేమ వసతి గృహాల్లో బాలికలకు సరిపడు మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు హాస్టళ్లకు ఒక్కరే వార్డెన్ నియమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఉద్యమ ఫలితంగానే 2012 సంవత్సరంలో హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచారని, మళ్లీ ఇప్పటి వరకు పెంచలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేపట్టే యాత్రలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గూడూరు భాస్కర్, సాయికృష్ణ, అంజి, సాయికుమార్, భాను తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
చెన్నూర్ : వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అరిగెల మహేశ్ అన్నారు. సంక్షేమ హాస్టల్ సమస్యలపై చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం చెన్నూర్‌కు చేరుకుంది. పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా జనరల్ హాస్టల్ విద్యార్థులకు రూ. 2000, కళాశాల విద్యార్థులకు రూ. 2500తో పాటు కాస్మొటిక్స్‌కు రూ. 400 పెంచాలన్నారు. మధ్యాహ్న భోజనానికి ప్రతి విద్యార్థికి రూ. 40 వరకు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ప్రతి నెల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్, అనిల్, నాయకులు పవన్‌కల్యాణ్, మహేశ్, సంధ్య పాల్గొన్నారు. -
నేటినుంచి ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను అధ్యయనం చేసేందుకు శుక్రవారం నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, శివవర్మ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కా ర్యాలయంలో సైకిల్‌యాత్ర పోస్టర్లను ఆవి ష్కరించారు. వారు మాట్లాడుతూ జిల్లాలోని కొల్లాపూర్, జడ్చర్ల నుంచి రెండు గ్రూపులుగా సైకిల్‌యాత్ర ప్రారంభం అవుతుందని వెల్లడించారు. 14నియోజకవర్గాలు, 64 మండలాలు, 250హాస్టళ్లు, 1200 కి.మీ నిర్విరామంగా యాత్ర సాగుతుందని తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని, సొంతభవనాలు నిర్మించాలని, సబ్బుల బిల్లులు బాలురకు రూ.150, బాలికలకు రూ. 200 పెంచాలని కోరారు. ఆట వస్తువుల కోసం రూ.10వేల చొప్పున మంజూరు చేయాలని తదితర డిమాండ్లలో యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలి
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను ఘట్కేసర్ టౌన్: పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా వసతి గృహాల్లోని విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర కమిటీ ఆధర్యంలో జూలై 24న సికింద్రాబాద్‌లో ప్రారంభమైన సైకిల్‌యాత్ర మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర మండలాల్లో మండలాల్లో కొనసాగి ఘట్కేసర్లో బుధవారం జరిగిన ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గృహాల్లోని విద్యార్థులకు రోజుకు ఒక్కంటికి రూ. 27 తో మూడు పూటలా భోజనం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రస్తుతమిస్తున్న కాస్మొటిక్ చారీ్జలను పెంచాలన్నారు. అద్దె భవనాలు, ఇన్చార్జి వార్డెన్లతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని, శాశ్వత వార్డెన్లను నియమించాలని, శాశ్వత భవనాలను నిర్మించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అనుసరించి కేజీ - పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వర్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ వారానికి ఒకసారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఘట్కేసర్లో మూసిన బీసీ విద్యార్థి వసతి గృహాన్ని తక్షణమే తెరిపించాలన్నారు. బంగారు తెలంగాణ అంటే విద్యారంగాన్ని కార్పొరేటుకు అప్పగించడమేనా అన్ని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని మేడ్చల్, ఘట్కేసర్ మండలాల్లో డిగ్రీ కళాశాలలను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీకాంత్, శేఖర్, ప్రశాంత్, గౌతం, లక్ష్మణ్, వెంకటేష్, నర్సింహ, రమేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
మహాధర్నా ఉద్రిక్తం
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాపై విరుచుకుపడిన పోలీసులు విద్యార్థినులపై పిడిగుద్దులు, విద్యార్థుల చొక్కాల చించివేత కడుపుమీద కొట్టొద్దంటూ విద్యార్థులు పెట్టిన ఆకలి కేకలను పోలీసు లాఠీల గాండ్రిపులతో అణగదొక్కారు. ఆకాశాన్నంటిన నిత్యావసరాలను అందుకోవాలంటే మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచాలని నినదించిన గొంతులను పోలీసు పిడిగుద్దులతో నొక్కి పడేశారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును చొక్కాపట్టి నిలదీసేందుకు రోడ్డుపైకి వచ్చిన వారి చొక్కాలనే చించేశారు. పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది బాబూ అని ధర్నా చేపట్టిన విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపడేశారు. సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన విజయవాడలో విద్యార్థులు చేపట్టిన మహాధర్నాను పోలీసులు అత్యుత్సాహం చూపి అడుగడుగునా నిలువరించారు. గాంధీనగర్: సంక్షేమ వసతి గృహాలను తిరిగి ప్రారంభించాలని, మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా, ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. రాజకీయ పక్షాలు, అంగన్వాడీ కార్యకర్తలపై వ్యవహరించిన విధంగా విద్యార్థులపైనా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. హాస్టళ్లను మూసివేసి మమ్మల్ని విద్యకు దూరం చేయొద్దంటూ నినదించిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. దీక్ష చేస్తున్న వారిని శిబిరం నుంచి తరిమివేశారు. శిబిరానికి మైకు, కరెంట్ సౌకర్యం కల్పించిన మెకానిక్ బాషాపైనా పోలీసులు దౌర్జన్యం చేశారు. నగర ప్రజల సాక్షిగా విద్యార్థుల హాహాకారాలతో అలంకార్ సెంటర్ ఘోషించింది. అరెస్ట్‌ల అనంతరం అలంకార్ సెంటర్లో విద్యార్థుల చెప్పులు, బూట్లు కుప్పలుగా పడిపోయాయి. పోలీసులు, విద్యార్థులకు మధ్య జరిగిన తోపులాటలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. సమస్యలు పరిష్కరించండంటూ అందోళన చేస్తున్న తమను రౌడీల్లా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారని విద్యార్థి సంఘం నాయకులు వాపోయారు. వెంటనే హాస్టల్స్ ప్రారంభించాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి అంతకు ముందు జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ రమాదేవి మాట్లాడుతూ హాస్టల్స్ మూసివేస్తే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విద్యకు దూరవుతారన్నారు. దళిత మంత్రి రావెల కిషోర్‌బాబు చేత్తోనే చంద్రబాబు దళితుల కళ్లు పొడుస్తున్నారని విమర్శించారు. గురుకులాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, హాస్టల్స్ రద్దు చేసి గురుకులాల్లో విలీనం చేస్తామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రెండేళ్లలో చంద్రబాబు, రావెల కిషోర్‌బాబు ఎన్ని గురుకులాలు ప్రారంభించారో స్పష్టం చేయాలన్నారు. తక్షణమే హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సానూ మాట్లాడుతూ మెస్ చార్జీలు రూ. 750 నుంచి రూ.1500కు పెంచాలని, కాలేజీ విద్యార్థులకు రూ. 2 వేలు ఇవ్వాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మౌలికç Üదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 13 డిమాండ్లపై చేపట్టిన ఆందోళనలో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం
-
సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం
సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా విజయవాడ నగరం అలంకార్ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి విద్యార్థులు సిద్ధమవటంతో పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సైకిల్‌యాత్ర
ఎల్కతుర్తి: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నాయకులు చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మాదం తిరుపతి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి, కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వంట గదులు లేని పాఠశాలల్లో వెంటనే వంట గదులు ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ చేసి కస్తూర్బా పాఠశాలల సమస్యల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. ఈ యాత్రలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, బాశబోయిన సంతోష్, నాయకులు రాజు, ప్రవీన్, చిరంజీవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఫీజులు నియంత్రించాలి
గద్వాల : ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సం స్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుభా న్ అన్నారు. గురువారం అధిక ఫీజులను నిరసిస్తూ స్థానిక కృష్ణవేణి చౌరస్తాలో కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు పెచ్చుమీరుతున్నా.. ప్రభుత్వం వారిపట్ల ఉ దాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించా రు. ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అం జి, నాగరాజు, రాకేష్, రవి, గోపాల్, రాజు, రాము, ఆనం ద్, తాయన్న పాల్గొన్నారు. -
పేదలను చదువుకోనివ్వరా?
కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు మూసివేసిన హాస్టళ్లను తక్షణమే తెరవాలి : ఎస్ఎఫ్ఐ విజయనగరం క్రైం : సంక్షేమ వసతిగృహాలను మూసివేస్తూ పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తారా? అని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. జిల్లాలో మూతపడిన హాస్టళ్లను తెరిపించాలని, మెస్ చార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్న విద్యార్థులు.. ప్రధాన గేటు ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. డీఆర్ఓ బయటకు వచ్చి విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫలితం లేకపోవడంతో రహదారిపై బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా విజయనగరం వన్‌టౌన్ సీఐ వి.వి.అప్పారావు, టూటౌన్ సీఐ జి.దుర్గాప్రసాద్‌లు విషయాన్ని డీఆర్ఓ జితేంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు డీఆర్ఓ విద్యార్థుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాని హామీ ఇవ్వడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన విరమించారు. పేద విద్యార్థులకు చదువును దూరం చేస్తున్న చంద్రబాబు ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సురేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఒక వైపు ‘బడి పిలుస్తోంది’ అంటూనే మరో వైపు బడులు, హాస్టళ్లు మూసివేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం ప్రధానమైనదని, దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను తక్షణమే ప్రారంభించాలని, మెస్‌చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. గురుకుల, కేజీబీవీ, రెసిడెన్సియల్స్ పాఠశాలల సమస్యలు పరిష్కరించి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీని ప్రారంభించి క్లాసులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న విజయవాడలో మహాధర్నా తలపెడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పి.రామ్మోహన్, లక్ష్మణ్, సాయి, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తం
కలెక్టరేట్ వముట్టడికి ఎస్ఎఫ్ఐ నాయకుల యత్నం భగ్నం చేసిన పోలీసులు సీఎం జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్ఎఫ్ఐ బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత దుర్మార్గపు చర్యంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు, కార్యాలయం గేట్లు మూసివేశారు. దీంతో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం ఒక్క ఉదుటన నాయకులు, విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించారు. ఒకరిద్దరు విద్యార్థులు కలెక్టరేట్ గేటుపైకి ఎక్కారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తొపులాట చోటు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష, కా ర్యదర్శులు కుమార్, రమే శ్,తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అంతకుముందు నిర్వహించిన ధర్నాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజినేయులు మాట్లాడుతూ ప్రభుత్వం చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23న విజయవాడలో భారీ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 15న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
హాస్టళ్లలో అన్నీ సమస్యలే
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా గుంటూరు ఎడ్యుకేషన్ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు హాస్టల్ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చారని, అవే హాస్టళ్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి రావెల కిషోర్‌బాబు హాస్టళ్లను ఫైవ్ స్టార్ హోటళ్లుగా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వం గురుకులాల్లో ఏ రకంగా కల్పిస్తారని ప్రశ్నించారు. హాస్టళ్లను మూసివేసి పేద విద్యార్థులకు నష్టం కలిగించే చర్యలు మానుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ బీసీ హాస్టళ్లను బలోపేతం చేసి మరింత మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం ఉన్న వాటినే మూసివేసే విధంగా వ్యవహరించడం దుర్మార్గ చర్యని అభిప్రాయపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసివేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గురుకులాల ఏర్పాటు పేరుతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అసత్య ప్రచారం సాగిస్తున్నారని, హాస్టళ్ల విలీనం చేయడం ద్వారా వేలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో సాయి ప్రసాద్ విద్యార్థుల వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. ధర్నాలో డీబీఎఫ్ రాష్ట్ర నాయకుడు కొరివి వినయ్‌కుమార్, చేతివృత్తిదారుల సంఘ నాయకుడు బైరగాని శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.మనోజ్, కార్యదర్శి వి.భగవాన్ దాస్, నాయకులు వి.జ్యోతి, కె.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యార్థులను విస్మరిస్తే ప్రభుత్వం పతనమే’
విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్.ఎఫ్.ఐ.) రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు నిరసనగా ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం నిర్వహించిన ధర్నాలో విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో హాస్టళ్లను మూసివేస్తున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. గురుకులాల ఏర్పాటు పేరుతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అసత్య ప్రచారం సాగిస్తున్నారని, హాస్టళ్ల విలీనం ద్వారా వేలాదిమంది విద్యార్థులకు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కడుపులు మాడ్చుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేల వేతనాలను రెట్టింపు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రావెల కిషోర్‌బాబు కలిసి విద్యార్థుల పొట్టలు కొడుతున్నారని మండిపడ్డారు. -
ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర
కాల్వశ్రీరాంపూర్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాల్వశ్రీరాంపూర్‌లో బుధవారం ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ ఫోస్టుల ఖాళీలు భర్తి చేయాలని, కేజీ టు పీజి ఉచిత విద్య వెంటనే అమలు చేయాలని, వసతి గృహాలకు పక్కాభవనాలు నిర్మించాలని, అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఎంఈవో పోస్టుల ఖాళీలు భర్తీచేసి విద్యావ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తిని సంతోష్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, అన్నపూర్ణ, మౌనిక, సురేశ్, అశోక్, రజినికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే హాస్టల్స్ తెరవాలి : ఎస్ఎఫ్ఐ
లేనిపక్షంలో ఉద్యమం తప్పదు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సురేష్ విజయనగరం: జిల్లాలో మూసివేసిన వసతిగృహాలను వెంటనే తెరిపించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సురేష్ హెచ్చరించారు. హాస్టల్స్ మూసివేతకు నిరసనగా బుధవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యను నీరుగార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వసతిగృహాలను ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్థులకు విద్య అందించడమే తన ధ్యేయమని చెప్పుకునే ముఖ్యమంత్రి వసతిగృహాలను ఎందుకు మూరుుంచివేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ఇప్పటికే 23 ఎస్సీ విద్యార్థుల వసతిగృహాలు మూసివేశారని చెప్పారు. ఈ ఏడాది విలీనం పేరుతో జిల్లా వ్యాప్తంగా 13 బీసీ విద్యార్థుల వసతిగృహాలను మూసివేయడానికి రంగం సిద్ధం చేశారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి హాస్టల్స్ విలీనంలో తన నిర్ణయూన్ని ఉపసంహరించుకోవడంతో పాటు మూసివేసిన హాస్టల్స్‌ను వెంటనే తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బి.లక్ష్మణరావు, ఎస్.వెంకటరమణ, సీహెచ్.లక్ష్మణ, పి.వాసు, ఎం.కార్తీక్, టి.మధు, డి.రాజేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
విద్యారంగానికి ప్రభుత్వం తక్కువగా నిధులు కేటాయించిందంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకంగా ఉన్నప్పటికీ, విద్యారంగాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. విద్యారంగం అభివృద్ధికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. -
హెచ్‌సీయూ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి ఘన విజయం సాధించింది. ఎస్ఎఫ్ఐ, ట్రైబల్ స్టూడెంట్ ఫోరం (టీఎస్‌యూ), దళిత్ స్టూడెంట్ యూనియన్(డీఎస్‌యూ)లు ఒక కూటమిగా ఏర్పడి, మొత్తం అన్ని పదవులను కైవసం చేసుకొన్న ఏకైక కూటమిగా నిలిచింది. నూతన అధ్యక్షుడిగా కేరళకు చెందిన జుహైల్ కె.పి.(పి.హెచ్డీ-ఫిజిక్స్) గెలుపొందారు. సమీప ఏబీవీపీ అభ్యర్థి గురజాడపై 339 ఓట్ల మెజార్టీతో నూతన విద్యార్థి నాయకునిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో జుహైల్కు 1,603 ఓట్లు రాగా, గురజాడకు 1,264 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షునిగా తెలుగు పీహెచ్డీ విద్యార్థి మూడావత్ వెంకటేష్ చౌహాన్ విజయకేతనం ఎగరవేశారు. 1,580 ఓట్లు సాధించి ఏబీవీపీ అభ్యర్థి కిరణ్ గుండాలపై 389 ఓట్ల మెజార్టీని సాధించాడు. ప్రధాన కార్యదర్శిగా రాజ్‌కుమార్ సాహు, సమీప అభ్యర్థి వందన రాథోడ్‌పై 190 ఓట్ల ఆధిక్యాన్ని సాధించాడు. వీరితో పాటు ఎస్ఎఫ్ఐ ప్యానల్‌కు చెందిన శివదుర్గారావు సంయుక్త కార్యదర్శిగా, చిలుక శ్రీలత సాంసృ్కతిక కార్యదర్శులుగా, సందీప్ కుమార్ క్రీడల కార్యదర్శిగా ఎన్నికైయ్యారు. వీరితో పాటు జీఎస్ క్యాష్ ప్రతినిధులుగా అలినా సెబాస్టియన్(పీహెచ్డీ), సనాఫాతిమా(ఐఎంఏ)లు విజయం సాధించారు. -
విద్యార్థులపై లాఠీచార్జ్.. అరెస్ట్
మహారాణిపేట: విశాఖ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని గేట్లను మూసివేశారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్యుద్ధం, తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలను ఝుళిపించారు. విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
ఖమ్మం (చింతూరు) : విలీన మండలాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చింతూరులో విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని, చింతూరులో బస్ డిపో ఏర్పాటు చేసి తక్షణమే బస్ పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూనవరం మండలంలోని బాలికల గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని, విలీన మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ, బీఈడీ, డైట్ కళాశాలు ఏర్పాటు చేయాలని కోరారు. -
'మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి'
అనంతపురం ఎడ్యుకేషన్: యముడిలాగా మంత్రి నారాయణ తన విద్యా సంస్థల్లో చదువుకుంటున్న పిల్లలను బలి తీసుకుంటున్నారని గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్లో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లాలో చైతన్య కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు మృతికి బాధ్యుడిని చేసి మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కసాపురం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థినుల ఒంటిమీద గాయాలు ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్నో ఆశలతో విద్యా సంస్థల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఐదేళ్లలో నారాయణ విద్యా సంస్థల్లో 136 మంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారాయణను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం
నెల్లూరు (టౌన్) : నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థినుల మృతికి నిరసనగా బుధవారం నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. గాంధీబొమ్మ సెంటరు నుంచి వీఆర్ కళాశాల వరకు ప్రదర్శన చేశారు. దిష్టిబొమ్మ దహనం చేసే విషయంలో కొద్దిసేపు పోలీసులు, ఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్‌చేసి 4వ పట్టణపోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ విద్యార్థినుల మృతికి బాధ్యతగా నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయుకులు ప్రసాద్, నందకిరణ్, రాము, నవీన్, రవీంద్ర, తరుణ్, క్రాంతి, విజయ్, ఆఫ్రోజ్, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు. నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ ఇద్దరు విద్యార్థినుల మృతికి కారకులై న నారాయణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి నరేంద్ర డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ముత్తుకూరు బస్డాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు మృతి చెందారని తెలిపారు. కేవలం మంత్రి పదవి ఉందన్న కారణంగా అనుమతులు లేకుండానే నారాయణ విద్యా సంస్థలు నడుస్తున్నాయన్నారు. నగర హాస్టల్స్ ఇన్చార్జి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నీరదారెడ్డి కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఏబీవీపీ నాయకులు నవీన్, నరేష్, బాలకృష్ణ, రాజు, శ్రీకాంత్, సతీష్, మాధవ్, కౌషిక్ తదితరులు పాల్గొన్నారు. -
'రిషితేశ్వరి' నిందితులను కఠినంగా శిక్షించాలి
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థి రిషితేశ్వరికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేసి ... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు నగరంలోని కళాశాలల బంద్ నిర్వహించారు. నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి బంద్‌కి మద్దతు తెలిపారు. -
ఇంటర్ బోర్డు వద్ద ధర్నా, ఉద్రిక్తత
హైదరాబాద్: ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ధర్నాకు దిగారు. బుధవారం నగరంలోని తెలంగాణ ఇంటర్ విద్య కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ కళాశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేయాలని నినాదాలు చేశారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వారి ఆందోళనతో అక్కడకు చేరుకున్న పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకుని, వారిని చెల్లా చెదురు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు ఉస్మానియా వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లించకుండా సర్కారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. మెస్ చార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో 'చలో అసెంబ్లీ' చేపట్టిన విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. విశ్వవిద్యాలయాలకు వెంటనే వీసీలను నియమించాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి, వాహనాల్లో తరలించారు. -
కరస్పాండెంట్‌ను శిక్షించాలి
విద్యార్థినిపై లైంగికదాడికి నిరసనగా ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం ఒంగోలు టౌన్ : దర్శిలోని ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడి చేసిన కరస్పాండెంట్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా నగర కమిటీల ఆధ్వర్యంలో గురువారం స్థానిక లాయర్‌పేట సాయిబాబాగుడి సెంటర్లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా నగర కార్యదర్శులు పి.రాంబాబు, కేఎఫ్ బాబు, కె.రమాదేవిలు మాట్లాడుతూ దర్శిలోని ఎక్స్లెంట్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినిపై స్కూల్ కరస్పాండెంట్ అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలా చేయడం సమాజానికి సిగ్గుచేటన్నారు. గురువులే కీచకులుగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారానికి గురైన విద్యార్థినికి తల్లిదండ్రులు లేరని, అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటుం దని, ఆ విద్యార్థినికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాం డ్‌చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు వినోద్, ఐద్వా నాయకురాళ్లు పి.కల్పన, రాజేశ్వరి, జి.ఆదిలక్ష్మి, ఎస్కే నాగూర్‌బీ, బి.గోవిందమ్మ పాల్గొన్నారు. -
విప్లవ వీరుడు అల్లూరి
ఒంగోలు టౌన్ : అల్లూరి సీతారామరాజు జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని స్థానిక మంగమ్మ కాలేజీ రిటైర్డు ప్రిన్సిపాల్ ఏవీ పుల్లారావు పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ ఆవరణలో అల్లూరి సీతారామరాజు 118వ జయంతి నిర్వహించారు. సీతారామరాజు నేతృత్వంలో 1922 జనవరి నుండి 1924 మే వరకు సాగిన రంప విప్లవం జాతీయోద్యమ చరిత్రలో ఉత్తమ ఘట్టంగా నిలిచిందన్నారు. ఈ విప్లవం తెలుగుజాతి పౌరుషాగ్నిని, దేశభక్తి స్ఫూర్తిని ప్రజ్వలింప చేసిందన్నారు. బ్రిటీష్ పాలకుల గుండెల్లో దడ పుట్టిందని.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపిందన్నారు. ఈ తిరుగుబాటు ద్వారా అల్లూరి సీతారామరాజు ఆంధ్రుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. గిరిజనుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన అల్లూరి జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి బీ రఘురామ్ మాట్లాడుతూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మన్యం ప్రాంతాల్లో అనేక పోరాటాలు నిర్వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పీ రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో నాయకులు ఎన్. నవీన్, మహేంద్రరెడ్డి, ఎన్ఆర్ఐ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం
హైదరాబాద్: వామపక్షాల ఐక్య విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్పొరేట్ పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, కేజీ టు పీజీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగాగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం
-
పేదలకు అందని ద్రాక్షగా ప్రభుత్వ విద్య
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు ప్రభుత్వ విద్యను అందకుండా చేస్తోందని ప్రొఫెసర్ రామకృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని చైతన్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. పేదోడికి ఒక విద్య, ధనికుడికి మరో విద్య అందుతుందన్నారు. శాస్త్రీయమైన విద్య, దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్నికల ముందు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. బంగారు తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ బాధల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. విద్యను వ్యాపారం చేస్తూ అంగడి సరుకుగా మారుస్తున్న విద్యాలయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, సైదులు, నాయకులు ఆది, కృష్ణ, నర్సింహా, మహేష్, కురుమూర్తి, ఎల్లయ్య, అంజి, కవిత, సుజాత పాల్గొన్నారు. -
కార్పొరేట్ విద్యా వ్యాపారాలపై కన్నెర్ర
'సాక్షి' కథనంతో కదలిన విద్యార్థి సంఘాలు అనంతపురం (గుంతకల్లు): విద్యా వ్యాపారానికి డోర్లు తెరిచిన కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాలు కన్నెర్ర చేశాయి. శుక్రవారం 'సాక్షి' దినపత్రికలో 'ఫీజులుం' విద్యా వ్యాపారినికి డోర్లు తెరిచిన స్కూళ్లు' అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందించారు. అక్రమ డొనేషన్లు, విచ్చలవిడిగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేయడాన్ని నిరసిస్తూ వారు శ్రీచైతన్య-2, భాష్యం, విజ్ఞాన్ స్కూళ్ల వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆయా పాఠశాలల యాజమాన్యాలతో వాదనకు దిగారు. ఆయా స్కూళ్ల ఫ్లెక్సీలను చించేశారు. అనంతపురం పట్టణం ధర్మవరం గేట్ వద్దనున్న విజ్ఞాన్ స్కూల్ భవనంలో అనధికారికంగా నిర్వహిస్తున్న విఘ్నేశ్ బుక్స్‌కౌంటర్ సీజ్ చేయాలని బైఠాయించారు. మండల విద్యాధికారి కుళ్లాయప్ప విజ్ఞాన్ స్కూల్ వద్దకి చేరుకుని అక్రమంగా రప్పించి విఘ్నేశ్ బుక్‌స్టాల్‌ను సీజ్ చేయించారు. కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యలతో కుమ్మక్కయ్యారని ఎంఈఓ పై విద్యార్థి నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వానికి, విద్యాధికారులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బాసిద్, రమేష్‌లు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వాటిని ఖాతరు చేయకుండా స్కూళ్లను తెరిచి అక్రమంగా అడ్మిషన్లను నిర్వహించడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రవేట్ పాఠశాలల్లోనే బుక్స్‌స్టాల్స్‌ను నిర్వహించడమే కాకుండా అత్యధిక ధరలను నిర్ణయించి పుస్తకాలను అమ్మే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చేరే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వేలకు వేలు డొనేషన్లు, వివిధ రకాల ఫీజులను వసూలు చేస్తున్నా విద్యాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని వారు దుయ్యబట్టారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూ.1 లక్షకు పైగా విలువ చేసే పుస్తకాలు కలిగిన విఘ్నేశ్ బుక్స్ కౌంటర్‌ను ఎంఈఓ సీజ్ చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు పోలీసుల జోక్యంతో విద్యార్థి నాయకులు ఆందోళన విరమించారు. కాగా భాష్యం స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆ స్కూల్లో ఫర్నిచర్ ధ్వంసం చేసిన పలువురు విద్యార్థి నాయకులపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
కార్పొరేట్ పాఠశాలల్లో ఫర్నిచర్ ధ్వంసం
గుంతకల్: కార్పొరేట్ పాఠశాలల్లో అక్రమంగా పెద్ద ఎత్తున డొనేషన్లు వసూలు చేస్తున్నారంటూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. పుస్తకాలను అధిక ధరలకు విద్యార్థులకు విక్రయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు కార్పొరేట్ పాఠశాలల్లోకి విద్యార్థి నాయకులు చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మృతి
అనంతపురం క్రైం: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు జే.నరేష్ (23) బుధవారం తుదిశ్వాస వదిలాడు. ఈ నెల 7న నరేష్‌తో పాటు ఉపాధ్యక్షుడు కుమార్ ఇద్దరూ ద్విచక్రవాహనంలో తాడిపత్రి బస్టాండు వైపు నుంచి శ్రీకంఠం సర్కిల్ వైపు వస్తుండగా, కృష్ణా థియేటర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న టీవీఎస్-అపాచి ద్విచక్రవాహనం ఢీకొంది. గాయపడ్డ నరేష్ కొలంబియా ఏసియా ఆస్పత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఆరోజు నుంచి కోమాలోనే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం మృత్యువాత పడ్డాడు. ధర్మవరం పట్టణం గూడ్స్‌షెడ్డు కొట్టాలు (జీఎస్ కొట్టాలు)కు చెందిన నరేష్ 2007 నుంచి ఎస్ఎఫ్ఐలో పని చేస్తున్నాడు. గతేడాది 2014లో పీజీ పూర్తి చేశాడు. మంచి నాయకుడిగా ఎదిగే సమయంలో రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు నరేష్‌ను కబలించింది. నరేష్ తండ్రి పెద్దన్న తొమ్మిది నెలల కిందట అనారోగ్య కారణంగా మృతి చెందాడు. స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి నరేష్ మృతదేహంతో గురువారం ఉదయం అంతిమయాత్ర చేపట్టనున్నారు. నరేష్ మృతి పట్ల వివిధ విద్యార్థి సంఘాలు, వైఎస్సార్ విద్యార్థి విభాగం, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు సంతాపం తెలియజేశారు. -
సన్నబియ్యం సక్రమంగా అందించాలి: ఎస్ఎఫ్ఐ
మహబూబ్‌నగర్: ప్రభుత్వం అమలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలుచేయాలి. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నాణ్యమైన బియ్యాన్ని సరఫరాచేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్ అన్నారు. ఈ మేరకు అచ్చంపేట డిప్యూటి తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. (అచ్చంపేట) -
పెషావర్ ఘటనకు నిరసనగా విద్యార్థుల శాంతి ర్యాలీ
ఆదిలాబాద్ రిమ్స్ : పెషావర్ ఘటనలో మరణించిన విద్యార్థులకు సంతాపంగా ఆదిలాబాద్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి తెలంగాణ చౌక్ వరకు శాంతి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ 131 మంది విద్యార్థులను బలిగొన్న ఉగ్రవాదుల పైశాచికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్యలను అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కొవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు విక్రం, అరవింద్, గోపాల్, సోన్సాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం.. భైంసారూరల్ : ప్రపంచశాంతి కోరుతూ పట్టణంలోని వేదం పాఠశాల విద్యార్థులు, భగత్‌సింగ్ యువసేన సభ్యులు గురువారం సంతాపం వ్యక్తం చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. పెషావర్ ఘటనను ఖండించారు. ప్రపంచశాంతి కోరుతూ విద్యార్థులు శాంతి ఆకారంలో కూర్చున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థులు, భగత్‌సింగ్ యువసేనా సభ్యులు బి. సుదర్శన్, సందీప్‌గౌడ్, సతీశ్‌గౌడ్, వీరేశ్, మారుతి తదితరులు ఉన్నారు. -
కదంతొక్కిన విద్యార్థులు
ఒంగోలు టౌన్ : జిల్లాలోని విద్యార్థులు కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా స్థానిక హెచ్‌సీఎం జూనియర్ కాలేజీ నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఉదయం 11.50 గంటలకు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బీ రఘురామ్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 25 కోట్ల రూపాయల ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో వాటిపై ఆధారపడిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ బాలికల విభాగం కన్వీనర్ సౌజన్య మాట్లాడుతూ చీరాలలోని బాలికల వసతి గృహంలో బాత్రూమ్కు తలుపులు లేకపోవడంతో దుస్తులు అడ్డుపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆ వసతి గృహంలో 196 మంది బాలికలున్నప్పటికీ ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పీ కిరణ్, నాయకులు సీహెచ్ సుధాకర్, సీహెచ్ వినోద్, పీ రాంబాబు, చీరాల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పీ ఏసురాజు, జీ ఏసుబాబు, దర్శి డివిజన్ కార్యదర్శి ఎస్.కోటిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ సుకుమార్, ఆదిత్య, సౌజన్య, రాజేంద్ర, అనిల్, దిలీప్, దుర్గాప్రసాద్, శ్యామ్, జీవన్, రాంగోపాల్ పాల్గొన్నారు. అరెస్టు చేసిన పోలీసులు... ముందుగా అధిక సంఖ్యలో విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టరేట్ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకోలేకపోయారు. కలెక్టరేట్ గేట్లను తోసివేసేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు అడ్డగించడంతో విద్యార్థులతో తీవ్ర వాగ్వాదం, కొద్దిసేపు తోపులాట జరిగింది. దీంతో విద్యార్థులు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12.17 గంటలకు పోలీసులు రంగంలోకి దిగి 18 మంది ఎస్ఎఫ్ఐ నాయకులను బలవంతంగా అరెస్టుచేసి వ్యాన్‌లో టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ కలెక్టరేట్ నుంచి టూటౌన్ పోలీసుస్టేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. అక్కడకు వచ్చిన ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావును విద్యార్థి సంఘ నాయకులు కలిసి సమస్యను విన్నవించారు. అరెస్టు చేసిన వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో విద్యార్థులు నిష్ర్కమించారు. -
కేంద్ర మంత్రి నిద్రపోతున్నారా ?
* గిరిజన యూనివర్సిటీ తరలిపోవడంపై మండిపాటు * ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా విజయనగరం క్రైం : జిల్లాలో నెలకొల్పాల్సిన గిరిజన యూనివర్సిటీ విశాఖపట్నం తరలిపోతుంటే కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నిద్రపోతున్నారా అని ఎస్ఎఫ్ఐ విజయనగరం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జె. రామయ్య, కె. సురేష్ ప్రశ్నించారు. యూనివర్సిటీ తరలింపును నిరసిస్తూ శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన పది వరాల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒకటన్నారు. యూనివర్శిటీని పక్క జిల్లాకు తరలించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జిల్లాకు చెందిన శాసనసభ్యుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తక్షణమే స్పందించి గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును అడ్డుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అనువైన స్థలం లేదనే కారణం సరికాదన్నారు. ఇప్పటికే సాలూరు, నెల్లిమర్ల, బొండపల్లి, గుర్ల, గంట్యాడ, మెరకముడిదాం, తదితర ప్రాంతాలో అనువైన స్థలాలు ఉన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించారన్నారు. ఇప్పటికే పార్వతీపురంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాల, జీఎల్.పురంలో ఉన్న పాలిటెక్నికల్ కళాశాలను విశాఖపట్నానికి తరలించారని, ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ కూడా తరలించడం అన్యాయమన్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు స్పందించి యూనివర్సిటీ తరలింపును అడ్డుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, మణికంఠ, జిల్లా కమిటీ సభ్యుడు గణేష్, అప్పన్న పాల్గొన్నారు. యునివర్శిటీ నిర్మించాల్సిందే.. సాలూరు రూరల్ : జిల్లా విద్యార్థులకు మేలు జరగాలంటే సాలూరు నియోజకవర్గంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించాల్సిందేనని టీడీపీ నాయకురాలు, అరుకు పార్లమెంట్ ఇన్చార్జి సం ధ్యారాణి అభిప్రాయపడ్డారు. తన నివాసగృహంలో విలేకరులతో మాట్లాడు తూ, జిల్లాకు మంజురైన యునివర్శిటీ వైజాగ్ వెళ్లిపోతుందనే వార్తలు పత్రికల్లో రావడం చూసి తనకు చాలా బాధగా ఉందన్నారు. పాచిపెంట మండలం చాపరాయివలస గ్రామం సమీపంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారని, అందుకు గాను కేంద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజు మాన్సాస్ నుంచి 3200 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. అయితే ఇప్పుడెందుకు యూనివర్శిటీని తరలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పాచిపెంటలో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయకుమారి, చిన్నిదొర, నిమ్మాది పాల్గొన్నారు. -
‘గాడ్సేలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు’
ఆత్మకూర్: జాతిపిత మహాత్మాగాంధీని పొట్టనబెట్టుకున్న ఆర్ఎస్ఎస్ను ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని, ఆర్ఎస్ఎస్ను నిషేధించిన అప్పటి హొంమంత్రి పటేల్‌ను తమ వాడిగా ప్రచారం చేసుకోవడం విచారకరమని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శోభన్‌నాయక్ అన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డులో ఎస్ఎఫ్ఐ ప్రతినిధుల సభ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డివి జన్ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వం దేశ భక్తులుగా గుర్తిస్తున్నదని, గుజరాత్లో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో సైతం ఆర్ఎస్ఎస్ను సంబోధిస్తూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు. కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధించకుండా మతోన్మాదానికి పెద్దపీట వేయడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమన్నారు. ప్రధాని నరేంద్రమో డీ అణగారిన కులాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్నారు. స్వచ్చభారత్ పేరుతో ప్రచారం చేసుకుంటూ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. భారతదేశాన్ని శుభ్రంగా ఉంచే సఫాయి కార్మికుల్లో అణగారిన కులాల వారే అధికంగా ఉన్నారని గుర్తుచేశారు. 14,884 పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేయకపోగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో పూర్తిగా వెనుకబడిందని, బడ్జెట్లో విద్యకోసం మొక్కుబడిగా నిధులు కేటాయించడం దారుణమన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన పలు విద్యార్థి సంఘాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం పలు విద్యార్థి సంఘాలు కలిశాయి. లోటస్ పాండ్ వైఎస్ఆస్ సీపీ కార్యాయంలో ఎస్ఎఫ్ఐ, ఏఐడీఎస్ఓ, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు....వైఎస్ జగన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రయివేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు ఓ వినతి పత్రం సమర్పించారు. భేటీ అనంతరంఒ ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నూర్ మహ్మద్ మాట్లాడుతూ ప్రయివేట్ యూనివర్శిటీలతో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య పూర్తి అవుతుందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నిస్తోందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రయివేట్ యూనివర్శిటీల బిల్లును ప్రవేశపెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా ఈ బిల్లును వ్యతిరేకించాలని వైఎస్ జగన్‌ను కోరామని నూర్ మహ్మద్ తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే ఏపీ ప్రభుత్వ యత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. -
‘ఫాస్ట్’ను రద్దు చేయాలి : ఎస్ఎఫ్ఐ
నల్లగొండ అర్బన్ : తెలంగాణ విద్యార్థులకు మా త్రమే ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్ట్’ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యద ర్శి కె.రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక డీకే భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. 1956 నిబంధనల వల్ల తెలంగాణ విద్యార్థులకు కూడా నష్టమని, జీఓనంబర్36ను వ్యతిరేకించామని గుర్తుచేశారు. 6 సూత్రాల పథకానికి రాష్ట్ర పతి ఉత్తర్వులకు సైతం విరుద్ధమన్నారు. జిల్లాలో 120 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్స్ బకాయిలున్నాయన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేక ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు నష్టాల్లో కూరుకుపోయాయని అన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.విద్యాసాగర్, ఎం.మహేశ్, డి. వెంకటాద్రి, కె.అశోక్‌రెడ్డి, బాలు, చిన్నా, శేఖర్ ఉన్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై కేంద్రం జోక్యం చేసుకోవాలి: ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఎంసెంట్ కౌన్సెలింగ్‌పై తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలంటూ శుక్రవారం మాసబ్‌ట్యాంకులోని ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శోభన్ నాయక్ మాట్లాడుతూ.. ఎంసెట్ నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలకు చెందిన లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తూ మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే రీయింబర్స్‌మెంటు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి కార్యదర్శి కె.సతీష్‌రెడ్డికి వినితి పత్రం అందజేశారు. -
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టండి
దావణగెరె : రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏబీవీపీ, ఏఐఎంఎస్ఎస్ సంఘాలు మంగళవారం ధర్నా నిర్వహించి ఉప విభాగాధికారికి వినతిపత్రం సమర్పించారు. నగరంలోని గాంధీ సర్కిల్లో రాస్తారోకో చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మహలింగప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారంలోనే 19 అత్యాచారాలు, ఆత్మహత్య కేసులు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రవికుమార్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా స్థానిక జయదేవ సర్కిల్లో ధర్నా నిర్వహించిన ఏఐఎంఎస్ఎస్ కార్యకర్తలు మహిళలపై దౌర్జన్యాలను, అత్యాచారాలను ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా సంచాలకులు జ్యోతి కుక్కువాడ మాట్లాడుతూ వృద్ధుల నుంచి చిన్నారుల వరకు అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఇలాంటి ఘటనలను నియంత్రించాలని, లేని పక్షంలో ఉగ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా శబనం, భారతి, నాగలక్ష్మి, నాగజ్యోతి, లత, నాగస్మిత, సీతమ్మ కాలేజీ సిబ్బంది, చేతన్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో.. నగరంలోని ఐటీఐ కాలేజీ నుంచి ఏబీవీపీ నేతృత్వంలో వివిధ కాలేజీ విద్యార్థులు బృహత్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో కార్యదర్శి సుహాన్, యూఆర్.సచిన్, వినయ్, విశ్వనాథ్ అణజి, సురేష్, చన్నబసప్ప మాళి, ప్రవీణ్, రాజు, సమర్థ, అమిత్, శృతి, అక్షిత తదితరులు పాల్గొన్నారు. చిత్రదుర్గం : నగరంలో మహిళలపై దాడిని నిరసిస్తూ మంగళవారం ఏబీవీపీ బృహత్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యతారహితంగా విధులు నిర్వర్తించిందన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ హోం శాఖ మంత్రి జార్జ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
డోర్ సెలక్షన్‌పై వివాదం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన డోర్ సెల క్షన్ వివాదాస్పదంగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. సీట్లు పెంచాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకు లు ఘర్షణ పడగా ఐదుగురికి గాయాల య్యాయి. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళి తే.. ఈ కళాశాలలో మూడు లిస్టుల అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి అధికారులు శుక్రవారం ఉదయం డోర్ సెలక్షన్ నిర్వహిం చారు. అయితే సీట్లు పెంచాలంటూ ఏబీవీపీ నాయకులు ప్రిన్సిపాల్ చాంబర్ వద్ద, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నాయకులు కళాశాల గేటు బయట ధర్నా నిర్వహించారు. విషయాన్ని ఫోన్లో పీయూ రిజిస్ట్రార్ కె.వెంకటాచలం దృష్టికి తీసుకెళ్లగా 40శాతం సీట్లు పెంచుతామని హామీ ఇవ్వడంతో ఏబీవీపీ నాయకులు ఆందోళన విరమించారు. బయటకు వచ్చి గేటు వద్ద ధర్నా చేస్తున్న నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలు దూషించుకుని దాడికి పాల్పడగా ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి రాము, అధ్యక్షుడు మధు, పీడీఎస్‌యూ నాయకులు బోయిన్పల్లి రాము, వెంకట్; ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం నాగరాజుకు గాయాలయ్యా యి. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలం టూ ఇరువర్గాలవారు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడికి నిరసనగా పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కళాశాలలో నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఆందోళనకారులను బయటకు పం పించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం యథాతథంగా డోర్ సెలక్షన్ నిర్వహించగా 200 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అశోక్‌కుమార్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ ఎస్.ఎ.రషీద్ తెలిపారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేతకు ప్రభుత్వం కుట్ర
చీరాల అర్బన్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పగడాల లక్ష్మయ్య ఆరోపించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఎస్ఎఫ్ఐ 36వ జిల్లా మహాసభలు స్థానిక పాపరాజుతోటలోని ఎస్జే రంగనాయకులు, బాపనమ్మ కల్యాణ మండపంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు జిల్లా కార్యదర్శి బి.రఘురాం అధ్యక్షత వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరుకు ప్రభుత్వం ఆధార్‌ను ముడిపెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని లక్ష్మయ్య మండిపడ్డారు. ఆధార్ పూర్తిస్థాయిలో అందకపోవడంతో 8 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలలను ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే నిర్వహిస్తున్నారని, అధ్యాపకులను నియమించడంలో యాజమాన్యాలు మీనమీషాలు లెక్కిస్తున్నాయని ధ్వజమెత్తారు. యూకేజీ నుంచే అధిక ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం కళ్లెం వేయలేకపోతోందన్నారు. ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని ఏటా విద్యాశాఖ మంత్రి చెబుతున్నా తీరా పరీక్షల సమయానికి పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్పొరేట్ కళాశాలల ఒత్తిళ్లకు మంత్రులు లొంగిపోతున్నారని ఆరోపించారు. విద్యార్థినులు కళాశాలలకు వెళ్లి తిరిగి ఇంటి వచ్చేదాకా తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారన్నారు. విద్యాభివృద్ధికి చేయాల్సిన కార్యాచరణపై మూడు రోజుల మహాసభల్లో చర్చించనున్నట్లు లక్ష్మయ్య తెలిపారు. తొలుత ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు టి.మహేశ్, జిల్లా కమిటీ సభ్యులు డి.శాలినీ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏసురాజు, యేసురత్నం, చీరాల డివిజన్ నాయకులు బాలకృష్ణ, రవి, ఆదిత్య, శ్రీకాంత్, ప్రవీణ్, అనిల్, గోవర్ధన్, ఒంటరి నాగమణి, ఎన్.బాబూరావు పాల్గొన్నారు.