వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం పలు విద్యార్థి సంఘాలు కలిశాయి. లోటస్ పాండ్ వైఎస్ఆస్ సీపీ కార్యాయంలో ఎస్ఎఫ్ఐ, ఏఐడీఎస్ఓ, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు....వైఎస్ జగన్ను కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రయివేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు ఓ వినతి పత్రం సమర్పించారు. భేటీ అనంతరంఒ ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నూర్ మహ్మద్ మాట్లాడుతూ ప్రయివేట్ యూనివర్శిటీలతో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య పూర్తి అవుతుందన్నారు.
విద్యను వ్యాపారంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నిస్తోందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రయివేట్ యూనివర్శిటీల బిల్లును ప్రవేశపెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా ఈ బిల్లును వ్యతిరేకించాలని వైఎస్ జగన్ను కోరామని నూర్ మహ్మద్ తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే ఏపీ ప్రభుత్వ యత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ జగన్ను కలిసిన పలు విద్యార్థి సంఘాలు
Published Mon, Nov 3 2014 4:12 PM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM
Advertisement