Private Universities
-
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ టు విజయవాడ జాతీయరహదారి(65)లో మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఉన్న స్ట్రెచ్‌ను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేగా చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. అత్యంత రద్దీ ఉన్న ఈ రూట్లో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్న పరిస్థితులను దష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రైవేట్ యూనివర్సిటీల దోపిడీ ఎక్కువైందని, ఈ విద్యాసంస్థలపై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలతో విచారణ చేయించాలని ప్రధాని మోదీని కోమటిరెడ్డి కోరారు. శుక్రవారం పార్లమెంట్లో ప్రధానిని కలిసిన సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
ఈఏపీసెట్‌లో 80,935 సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2021లో 80,935 మంది విద్యార్థులకు తొలివిడత సీట్లు కేటాయించారు. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పోలా భాస్కర్ ఈ వివరాలు విడుదల చేశారు. మొత్తం 437 కాలేజీల్లో కన్వీనర్ కోటాకు 1,11,304 సీట్లు ఉండగా 80,935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30,369 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 488, ఎన్సీసీలో 976 మందికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఇంకా అందనందున కేటాయించలేదని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చింది 89,898 మంది ఏపీ ఈఏపీసెట్–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,75,796 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, 83,051 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు దరఖాస్తు చేశారు. అర్హత సాధించిన 1,34,205 మందిలో 90,606 మంది తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 90,506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులుకాగా 89,898 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరిలో 80,935 మందికి తొలివిడతలో సీట్లు కేటాయించారు. సీట్లు కేటాయించని కాలేజీ లేదు 254 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,06,236 సీట్లకుగాను 80,520 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25,716 సీట్లున్నాయి. 121 బీఫార్మసీ కాలేజీల్లో 4,386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4,034 సీట్లున్నాయి. 62 ఫార్మా–డీ కాలేజీల్లో 682 సీట్లుండగా 63 భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లున్నాయి. తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒక్కటీ లేకపోవడం విశేషం. గతంలో ఒక్కసీటు కూడా భర్తీకానివి 10 వరకు ఉండేవి. ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. తొలిసారి ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా తొలిసారిగా ప్రైవేటు వర్సిటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – అమరావతి, ఎస్ఆర్ఎం, బెస్ట్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2,012 సీట్లను పేద మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. వీరికి ఇతర విద్యార్థులకు మాదిరిగానే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధి చేకూరనుంది. -
పేద మెరిట్ విద్యార్థులకు ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీసింది. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో 35 శాతం సీట్లు నిరుపేద మెరిట్ విద్యార్థులకే కేటాయించనుంది. ఈ సీట్లను ప్రభుత్వ కోటా (కన్వీనర్ కోటా) కింద రాయితీ ఫీజులతో పేదలకు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం–2017కు సవరణలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు ఆయా సంస్థల విధివిధానాల్లో కూడా ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులతో ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలతోపాటు ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు సీట్లు దక్కనున్నాయి. ‘ప్రైవేటు’కు మాత్రమే మేలు కలిగేలా టీడీపీ ప్రభుత్వం చట్టం ప్రైవేటు వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా కాకుండా ఆ వర్సిటీలకు లాభం చేకూరేలా మాత్రమే చట్టంలో నిబంధనలు పెట్టింది. ఆ వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతోపాటు ఇతర రాయితీలూ కల్పించింది. ప్రైవేటు వర్సిటీలకు ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ కూడా రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్ని వ్యవహారాల్లోనూ ఆ వర్సిటీల ఇష్టానుసారానికే వదిలిపెట్టింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించినవారికి మాత్రమే కేటాయిస్తున్నాయి. ఫలితంగా పేద మెరిట్ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీల్లోని 35 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీట్లను ప్రవేశపరీక్షలో మెరిట్ సాధించిన రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కన్వీనర్ కోటాలో పారదర్శకంగా కేటాయించనున్నారు. ఫీజులపైనా నియంత్రణ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నోటిఫికేషన్ మేరకు ప్రైవేటు వర్సిటీలు ఫీజుల నిర్ణయానికి అకౌంటు పుస్తకాలు, ఇతర పత్రాలను అథారిటీ సమర్పించాలి. ఈ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని పరిశీలించి అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. కోర్సుల వారీగా ఆ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులను సమీక్షించి.. అంతిమంగా వాటి వాదనలను కూడా విని ఫీజులను నిర్ణయిస్తుంది. దీని సిఫార్సుల మేరకు ఆ ఫీజులను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థలపై రూ.15 లక్షలకు మించకుండా పెనాల్టీని విధించే అధికారం అథారిటీకి ఉంటుంది. వర్సిటీలు తప్పనిసరిగా నిర్ణీత ప్రమాణాల్లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కలిగి ఉండాలి. భవిష్యత్తులో రానున్న మూడేళ్లలో వివిధ కోర్సుల నిర్వహణకు రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టగలగాలి. అంతర్జాతీయ స్థాయిలో టాప్ 100 యూనివర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీలకు వీలుగా టైఅప్ కలిగి ఉండాలని ప్రైవేటు వర్సిటీల చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. -
Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు
ప్రైవేటు వర్సిటీల్లో ఇకపై 35 శాతం సీట్ల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కానుంది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలకు లబ్ధి చేకూరనుంది. ప్రొఫెషనల్ కోర్సుల్లో ‘ఏపీ ఈఏపీ సెట్’ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా, ఇతర కోర్సుల్లో సంబంధిత విధివిధానాలను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ యూనివర్సిటీల్లో సీట్లు ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకూ అందుబాటులోకి రానున్నాయి. ఈ వర్సిటీల్లో 35 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో భర్తీ చేయనుండటంతో ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటివరకు ఆర్థిక స్థోమత కలిగిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వర్సిటీల్లో చేరే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకూ కల్పిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ఖర్చులకు డబ్బులు కూడా చెల్లిస్తూ పేద విద్యార్థులు అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. 2021–22 విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని ప్రైవేట్ వర్సిటీల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర ‘సాక్షి’కి వివరించారు. చదవండి: విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండ ఇందుకు సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తెచ్చిందని తెలిపారు. దీనివల్ల ఈ వర్సిటీల్లోని ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులన్నిటిలోనూ ప్రతిభ గల పేద విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ప్రొఫెషనల్ కోర్సుల్లో ‘ఏపీ ఈఏపీ సెట్’ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా, ఇతర కోర్సుల్లో సంబంధిత విధివిధానాలను అనుసరించి ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి, వెల్లూరు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అమరావతి, సెంచూరియన్ యూనివర్సిటీ, విశాఖపట్నం, కేఆర్ఈఏ యూనివర్సిటీ శ్రీసిటీ సూళ్లూరుపేట, వేల్‌టెక్ యూనివర్సిటీ చిత్తూరు తదితర ప్రైవేట్ యూనివర్సిటీల్లోని వివిధ కోర్సులలో 35 శాతం సీట్లు ప్రభుత్వ పరిధిలో భర్తీ కానున్నాయి. నాడు నిబంధనలు గాలికి.. గత సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తప్పించుకునేందుకు కన్వీనర్ కోటా నిబంధన అమలును గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ఈ నిబంధనను పట్టించుకోలేదు. ఇప్పుడు దీన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు రూ.1,800 కోట్లను అధికారంలోకి రాగానే చెల్లించడంతోపాటు ఇప్పటివరకు దాదాపు రూ.5,573 కోట్లు ఫీజుల పథకం కింద అందచేసి విద్యార్థులను ఆదుకుంది. ఫీజులను ఎగ్గొట్టే ఆలోచన చేయకుండా పేద విద్యార్థులు మంచి కాలేజీల్లో ఉన్నత చదువులు చదవాలనే సంకల్పంతో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆర్థికంగా అండగా నిలవడంతోపాటు ప్రముఖ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా చేయూత అందిస్తోంది. చదవండి: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా 35 శాతంతో విద్యార్థులకు ఎంతో మేలు... ప్రతిష్టాత్మక ప్రైవేట్ వర్సిటీల్లో ప్రవేశాలు పొందడం ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ వర్సిటీల్లో పేద విద్యార్థులు సైతం చదువుకునేలా చర్యలు చేపట్టారు. వీటిల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు జగనన్న వసతి దీవెన కింద వసతి, భోజన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, ఇతర నిబంధనలు ఇప్పటివరకు అమలు కావడం లేదు. ఇకపై 35 శాతం సీట్ల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలకు లబ్ధి చేకూరనుంది. ఇవే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీల్లోని సీట్లు కూడా ఇదే విధానంలో భర్తీ కానున్నాయని అధికార వర్గాలు వివరించాయి. ‘ఏపీ ఈఏపీ సెట్’ ద్వారా ప్రొఫెషనల్ సీట్ల భర్తీ ఈ వర్సిటీల్లోని ప్రొఫెషనల్ సీట్లను ఏపీ ఈఏపీ సెట్ (గతంలో ఏపీ ఎంసెట్) ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వర్సిటీల కాలేజీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలలోని సీట్లను ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకర్లకు కన్వీనర్ కోటాలో కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోటా సీట్లకు ప్రభుత్వం అమలు చేస్తున్న పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర పథకాలు వర్తిస్తాయి. కన్వీనర్ కోటా ఫీజులకు పూర్తి రీయింబర్స్మెంట్ వర్తింపచేయడం ద్వారా ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ పేదలకు ఉత్తమ కళాశాలల్లో చదువుకునే అవకాశం దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి ఫీజులను చెల్లిస్తోంది. అలాగే ప్రైవేట్ వర్సిటీలలోని 35 శాతం సీట్లను ఇదే విధానంలో భర్తీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని సీట్లను గత ఏడాది నుంచి ఆన్లైన్లో విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్లను అనుసరించి భర్తీ చేస్తున్నారు. ఇదే మాదిరిగా ప్రైవేట్ వర్సిటీల్లోని నాన్ ప్రొఫెషనల్ యూజీ కోర్సులలో 35 శాతం సీట్లను ఆన్లైన్లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి భర్తీ చేయనున్నారు. ఈ వర్సిటీల్లోని వివిధ కోర్సులలో సీట్లు, భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలు తదితర అంశాలపై ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నామని సతీష్‌చంద్ర వివరించారు. ప్రభుత్వ వర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో 1.39 లక్షల సీట్లు రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వర్సిటీల కాలేజీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 272 కాలేజీల్లో 1,39,862 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. ఈసారి కొత్తగా మహిళల కోసం ఆంధ్రా యూనివర్సిటీలో 300 సీట్లతో మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి లభించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు అందుబాటులో ఉంటాయి. వర్సిటీల్లో 4,260.. ప్రైవేట్‌లో 1,35,602 రాష్ట్రంలోని మొత్తం 1,39,862 ఇంజనీరింగ్ సీట్లలో 14 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు 4,260 కాగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,35,602 సీట్లు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 40 కాలేజీల్లో 21,135 సీట్లుండగా కృష్ణా జిల్లాలో 33 కళాశాలల్లో 17,999 సీట్లు ఉన్నాయి. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో పది కాలేజీల్లో 4,434 సీట్లున్నాయి. ఈసారి ఇంజనీరింగ్ కోర్సుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్ తదితర విభాగాల్లో 6,660 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ వర్సిటీల్లోని సీట్లు కలిపితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు రూ.1,800 కోట్లు ► గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,800 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించి జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థుల చదువులకు భరోసా కల్పించింది. అవికాకుండా ఫీజుల కిందనే మరో రూ.4,207 కోట్లు తొలి ఏడాది ఈ ప్రభుత్వం చెల్లించింది. ► ఇక రెండో సంవత్సరం ఎలాంటి ఫీజుల బకాయిలు లేకుండా కాలేజీలకు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి విడతగా రూ.671 కోట్లు, రెండో విడతగా జూలైలో రూ.694 కోట్లకుపైగా విడుదల చేసింది. గత సర్కారు మిగిల్చిన పాత బకాయిలను తీర్చడంతోపాటు అవి కాకుండా ఇప్పటివరకు దాదాపు రూ.5,573 కోట్లు ఫీజుల కింద ఇచ్చింది. -
రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈనెల 27న లేదా 28న ఈ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. రిలయన్స్, మహీంద్రా, బిర్లా తదితర æప్రముఖ సం స్థలు రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతించాలని భావిస్తోంది. వీటి అనుమతుల విషయంలో కీలక నిబంధనలు ఉండేలా చూస్తోంది. ప్రముఖ సంస్థల ఆసక్తి.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు వర్సిటీలను రాష్ట్రం లో అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ సంస్థలతోపాటు పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలో వర్సిటీల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. తాజాగా రిలయన్స్ సంస్థ ఇక్కడ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరించింది. రాష్ట్రంలో క్యాంపస్‌లున్న గీతమ్ డీమ్డ్ వర్సిటీ, ఇక్ఫాయ్ వంటి సంస్థలు రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అందించే కోర్సుల ను ప్రైవేటు వర్సిటీల్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా జాగ్ర త్తలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్సిటీల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉండే అవకాశం లేదు. ఏ రంగంలోనైనా ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్పించేలా కోర్సులను డిజైన్ చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థల అవసరాలకు ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. భవనాలు ఉంటేనే సరిపోదు.. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలకు 50 నుంచి 100 ఎకరాల వరకు స్థలాలు ఉన్నాయి. విశాలమైన భవనాలు ఉన్నాయి. అంత మాత్రాన ప్రైవేటు వర్సిటీని స్థాపించేందుకు ముందుకు వచ్చినా వాటన్నింటికి అనుమతివ్వొద్దని భావిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు, బ్రాండ్ ఇమేజ్ ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని అనుమతిచ్చే అవకాశముంది. ఇందుకు అనుగుణంగా బిల్లులో నిబంధనలను పొందుపరిచినట్లు తెలిసింది. స్థలాలు, భవనాలు చూసి అనుమతులు ఇస్తే హైదరాబాద్ బ్రాండ్ ఈమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున యూనివర్సిటీల మంజూరులో అనేక జాగ్రత్తలు తీసుకునేలా నిబంధనలు సిద్ధం చేసింది. దేశంలో ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు 300 వరకు ఉంటే అందులో పేరున్నవి 50 కూడా లేవని, అందుకే రాష్ట్రంలో జాగ్రత్తలు అవసరమని అధికారులు భావిస్తున్నారు. -
60 విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్తగా దేశవ్యాప్తంగా 60 ఉన్నత విద్యాసంస్థలకు పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని కల్పించినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం వెల్లడించారు. వాటిలో 5 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 21 రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు, 24 డీమ్డ్ యూనివర్సిటీలు, 2 ప్రైవేటు యూనివర్సిటీలు, 8 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. 60లో తెలుగు రాష్ట్రాల నుంచి 13 విద్యా సంస్థలకు చోటు దక్కింది. స్వయం ప్రతిపత్తి పొందిన యూనివర్సిటీలన్నీ ఇకపై కూడా యూజీసీ పరిధిలోనే ఉంటాయనీ, అయితే కొత్త కోర్సులను ప్రారంభించడం, నైపుణ్య శిక్షణా తరగతులను నిర్వహించడం, విదేశీ అధ్యాపకులను నియమించుకోవడం, విదేశీ విద్యార్థులను కోర్సుల్లో చేర్చుకోవడం తదితరాల్లో యూనివర్సిటీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని జవదేకర్ చెప్పారు. స్వయం ప్రతిపత్తి పొందిన 8 కళాశాలలకు సిలబస్‌ను నిర్ణయించడం, పరీక్షలు పెట్టడం, ఫలితాలు వెల్లడించడం తదితరాలపై స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులకు డిగ్రీలు మాత్రం సంబంధిత యూనివర్సిటీల పేరు మీదుగానే వస్తాయి. తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థలివే.. తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ–హైదరాబాద్), నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (హైదరాబాద్), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), కాకతీయ వర్సిటీ (వరంగల్), ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (హైదరాబాద్), నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల (హైదరాబాద్) ఉన్నాయి. ఏపీలోని ఆం్ర«ధా వర్సిటీ (విశాఖపట్నం), శ్రీ వెంకటేశ్వర యూనివర్సి టీ (తిరుపతి), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (తిరుపతి), గీతం వర్సిటీ (విశాఖపట్నం), వాసవి ఇంజనీ రింగ్ కళాశాల (కాకినాడ), బోనం వెంకట చలమ య్య ఇంజనీరింగ్ కళాశాల (కాకినాడ) ఉన్నాయి. -
ప్రైవేటు యూనివర్సిటీలకు రాజధానిలో భూములు
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంలో 15 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా మూడు ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. ఎస్ఆర్ఎం, విట్, అమిటీ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను అమరావతిలో నెలకొల్పడానికి వీలుగా వాటికి భూములను కేటాయించారు. వాటితో పాటు మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా భూముల కేటాయింపును ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇంకా పలు నిర్ణయాలు తీసుకున్నారు. పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కావల్సిన భూములు కూడా కేటాయించాలని నిర్ణయించారు. స్థానికతకు సంబంధించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి విషయంలో పాటించాల్సిన నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని విభాగాల్లో ఇన్నోవేషన్ శాఖలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సర్వేకు సంబంధించి భవిష్యత్తులో మంత్రులు ఎలాంటి చొరవ తీసుకోవాలనే అంశంపై చర్చించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై చర్చ సాగింది. పట్టిసీమ ప్రాజెక్టు ఇంజనీర్లకు ఒక నెల జీతాన్ని ఇంక్రిమెంటుగా ఇవ్వాలని నిర్ణయించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి పలు అధికారాలు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీలలో వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. మచిలీపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూసమీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. -
ప్రైవేటు యూనివర్సిటీలకు పచ్చజెండా!
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ * బడ్జెట్ సమావేశాలే ప్రధాన ఎజెండా * కొత్త మైనింగ్ విధానం సహా 25 అంశాలపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రభుత్వం పచ్చజెండా ఊపుతోంది. వీసీల నియామకం, ప్రైవేటు వర్సిటీలకు అనుమతి, ఒక మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వీలుగా ఏపీ ఉన్నత విద్యా చట్టం లో మార్పు లు చేస్తూ తెలంగాణకు అన్వయిం చుకోవాలని నిర్ణయించింది. దీంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు అనుగుణంగా అంచనాల్లో, పరిపాలనా అనుమతుల్లో మా ర్పులను వేగవంతం చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 10 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని, 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లో ఆదివారం కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తొలిరోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగ పాఠానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టే ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు. నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు సంబంధించి కేబినెట్లో పలు సవరణలతో ఆమోదం పొందాల్సి ఉంది. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ప్రాజెక్టులకు రూ.5,813 కోట్ల అంచనాతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ నిర్ణయానికి ఆమోదం పొందాల్సి ఉంది. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల రీడిజైనింగ్పైనా, మిడ్‌మానేరు నిర్వాసితులకు మరింత లబ్ధి చేకూరేలా పరిహారం ప్యాకేజీ చెల్లింపుల్లో మార్పులు చేర్పులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. నీటిపారుదల విభాగంలో సూపర్ న్యూమరీ పోస్టుల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)లను మరో ఏడాది పాటు కొనసాగించాలనే ప్రతిపాదనను ఎజెండాలో పొందుపరిచారు. కొత్త మైనింగ్ విధానం కొత్త మైనింగ్ విధానానికి కేబినెట్లో ఆమోద ముద్ర వేస్తారు. హమాలీ కుటుంబాల్లో పట్టభద్రులుగా ఉన్న మహిళలకు ప్రోత్సాహకం ఇచ్చే అంశం ఎజెండాలో ఉంది. ఆర్టీసీకి రూ.500 కోట్ల గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిషన్ భగీరథకు నాబార్డు నుంచి రూ.1,900 కోట్ల రుణం, హడ్కో నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్సప్లై బోర్డుకు తీసుకునే రుణానికి ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాలను చర్చిస్తారు. ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్‌లు తెచ్చింది. వాటిని చట్టంగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లులు పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిషరీస్ ఎడ్యుకేషన్ అకాడమీ స్థాపన, బేగంపేట క్యాంపు ఆఫీసు సమీపంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు మూడెకరాల స్థలం కేటాయింపు, మెదక్ జిల్లాలోని ముచ్చర్ల సమీపంలో 50 ఎకరాలను టీఎస్ఐఐసీకి కేటాయింపు అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల మైనారిటీ విభాగంలో 20 రెగ్యులర్ పోస్టులు, 19 ఔట్ సోర్సింగ్ పోస్టులు, వైద్య ఆరోగ్య విభాగంలో 23 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి కేబినెట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
ఉద్యోగాలు వచ్చేలా..
♦ ప్రైవేటు వర్సిటీల బిల్లులో కీలక నిబంధనలు ♦ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉన్న సంస్థలకే అనుమతి ♦ సంస్థల బ్రాండ్ ఇమేజ్ ప్రధానం ♦ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చే విషయం లో కొన్ని కీలక నిబంధనలు పొందుపరచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని భావి స్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలను స్థాపించే సంస్థల బ్రాండ్ ఇమేజ్ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు రాష్ట్రం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే విధంగా చర్యలు చేపట్టవచ్చని యోచిస్తోంది. ఈ మేరకు అవసరమైన నిబంధనలను ప్రైవేటు యూనివర్సిటీల ముసాయిదా బిల్లులో పొందుపరుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు వర్సిటీలు అధిక మొత్తంలో ఉన్నప్పటికీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోతోందని, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించని పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పేరున్న విద్యా సంస్థలు నిర్వహిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న ఆలోచనతో ఈ చర్యలకు సిద్ధమైంది. ఇదే అంశంపై శుక్రవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు కూడా ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో చర్చించి, పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంత ర్జాతీయ స్థాయి సంస్థలు అనేకం ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీలు కూడా ఆయా సంస్థల పారిశ్రామిక అవసరాలు, స్థాయికి అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అలాగే దేశంలోని రిలయన్స్ వంటి వివిధ కార్పొరేట్ దిగ్గజాలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. అవసరాలకు అనుగుణంగానే కోర్సులు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అందించే కోర్సులను ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రైవేటు వర్సిటీల అనుమతుల్లో జాగ్రత్తలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు యూనివర్సిటీల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉండే అవకాశం లేదు. అంతర్జాతీయ సంస్థల అవసరాలకు ఉపయోగపడే కోర్సులు ఉంచాలని భావిస్తోంది. -
అస్మదీయులకే భూముల పందేరం!
ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం మాటున భూదందా మార్గదర్శకాలు ఖరారు కాకుండానే అప్పగింతకు యత్నాలు సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు మాటున ఏపీ ప్రభుత్వం భారీ భూ దందాకు తెరతీస్తోంది. విధివిధానాలు, నియమ నిబంధనలు, నోటిఫికేషన్ వంటివేవీ లేకుండానే భూముల పందేరానికి సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ నేతల సంస్థలకు వేలాది ఎకరాలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ద్వారా జాబితాను ఖరారు చేయించింది. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో విద్యానగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలోనూ ప్రైవేట్ వర్సిటీలు, విద్యా సంస్థలకు అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విద్యానగరాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం రాయలసీమ, జేఎన్టీయూ-కాకినాడ, శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ప్రొ.నర్సింహులు, ప్రొ.వీఎస్ఎస్ కుమార్, ప్రొ.రాజగోపాల్‌లతో కమిటీని నియమించింది. ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. మరోవైపు ప్రైవేట్ వర్సిటీల చట్టం అమలుకు విధివిధానాలను కూడా రూపొందించలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఏయే సంస్థలకు భూములు ఇవ్వాలో ముందే జాబితాను సిద్ధం చేయడం గమనార్హం. భూములపై అధికారం ప్రైవేట్‌కే... విద్యా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించకుండా విదేశీ వర్సిటీలు నేరుగా దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం లేదు. ఆ విదేశీ వర్సిటీల పేరు చెప్పి వాటి భాగస్వామ్యమంటూ వందలాది ఎకరాలను అస్మదీయులు, అధికార పార్టీ నేతల విద్యాసంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారు. కొన్నింటికి నేరుగా, మరికొన్నింటికి ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నట్లుగా చూపించి భూములు కేటాయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నట్లు చూపుతున్నా ఒప్పందాల్లో మాత్రం భూములపై పూర్తి అధికారాన్ని ప్రైవేట్ సంస్థలకే అప్పగించనున్నారు. ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారం సంస్థలు, వాటికి కేటాయించే భూములు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏపీ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అక్వాటిక్ సెన్సైస్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థకు రూ.300 కోట్ల వ్యయం కానుండగా ఇందులో ప్రభుత్వం రూ.153 కోట్లు ఇవ్వనుంది. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీడర్షిప్ అకాడమీ, లా అకాడమీల కోసం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులోని 200 ఎకరాలను ఎంపిక చేశారు. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే యోగా అండ్ ధ్యాన అనే సంస్థకు 25 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. వెబ్సిటీ (వర్చ్యువల్ అకాడమీ) కోసం విజయవాడ లేదా విశాఖపట్నంలలో స్థలాలను పరిశీలిస్తున్నారు. అమృతా వర్సిటీకి సీఆర్డీఏ పరిధిలో 300 ఎకరాలను కేటాయించనున్నారు. నేచురల్ హిస్టరీ పార్క్ అండ్ మ్యూజియం కోసం విశాఖలో 30 ఎకరాలు ఖరారు చేస్తున్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ కోసం కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో 150 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారు. టీఈఆర్ఐ ఎనర్జీ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ కోసం విశాఖ, విజయవాడల్లో 30 ఎకరాలను పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కోసం అనంతపురంలో 200 ఎకరాలను సిద్ధం చేశారు. లాజిస్టిక్ యూనివర్సిటీ కోసం 75 ఎకరాలను విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న హాస్పిటాలిటీ యూనివర్సిటీ కోసం 100 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. వైవీఆర్ యూనివర్సిటీ కోసం విశాఖపట్నం సమీపంలో 20 ఎకరాలను సిద్ధం చేశారు. జీఎమ్మార్ యూనివర్సిటీ కోసం 20 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 200 ఎకరాలు ఇవ్వనున్నారు. సాఫ్ట్ బ్యాంక్ యూనివర్సిటీకి 500 ఎకరాలు కేటాయించనున్నారు. సీఐఐ ఆధ్వర్యంలోని నాలెడ్జ్ ఎకానమీ జోన్ కోసం 200 ఎకరాలు ఖరారు చేశారు. -
త్వరలో ప్రైవేటు వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైవేటు వర్సిటీలు రాబోతున్నాయి. అందుకవసరమైన ముసాయిదా బిల్లులో ఉండాల్సిన అంశాలను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. ముసాయిదా బిల్లుకు తుది రూపు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్ణయించారు. బుధ లేదా గురువారం సమీక్షించి బిల్లును సిద్ధం చేయనున్నారు. సంప్రదాయ వర్సిటీల్లో కాలం చెల్లిన కోర్సులు కాకుండా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సుల్ని చేర్చేందుకు ప్రైవేటు వర్సిటీలను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును పెట్టనుంది. ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ రాష్ట్రాన్ని, ప్రధానంగా హైదరాబాద్‌ను ‘ఎడ్యుకేషన్ హబ్’గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రైవేటు వర్సిటీలను అనుమతించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా చూడాలన్న సంకల్పంతో ఉంది. కార్పొరేట్ దిగ్గజాలు కూడా విద్యారంగంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్, మహీంద్రా, బిర్లా వంటి సంస్థలు ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించగా, బిర్లా సంస్థ కూడా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్‌ను ఏర్పాటుచేసింది. వీటితోపాటు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఉన్న గీతమ్ డీమ్డ్ వర్సిటీ, ఇక్ఫాయ్ వంటి సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐటీ, విజ్ఞాన్ వంటి పేరున్న విద్యా సంస్థలూ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. తద్వారా ఉన్నత విద్యలో ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, ఉపాధి అవకాశాలు లభిం చనున్నాయి. దీంతో యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా మరింతగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బిల్లులో ఉండనున్న కొన్ని ప్రధానాంశాలు ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్య, పరిశోధనలకు ప్రాధాన్యం. ► జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం, పరస్పర సహకారం వీటి ద్వారా మరింత సులభం కానుంది. ► కోర్సులు, సిలబస్‌పై వర్సిటీలకే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక అవసరాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కోర్సులనే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ► సంస్థల అనుభవం, నైపుణ్యాలు, ట్రాక్ రికార్డును బట్టి వర్సిటీలకు అనుమతిస్తారు. ► విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంస్థలు చేసుకునే దరఖాస్తులు, ప్రతిపాదనలను నిపుణుల కమిటీ నేతృత్వంలో పరిశీలిస్తారు. సరిగ్గా లేదనుకుంటే తిరస్కరిస్తారు. ► ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై నియంత్రణ కోసం ఓ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఉన్నత విద్య ప్రమాణాలు కాపాడటానికి ఈ సంస్థ చర్యలు చేపడుతుంది. ► అందులో యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ, ఎంసీఐ, పీసీఐ, ఎన్ఏఏసీ, ఐసీఏఆర్, డీబీటీ, డీఎస్టీ, సీఎస్ఐఆర్, బీసీఐ వంటి సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. -
ఇక ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు వర్సిటీల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రతినిధులతో గురువారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ప్రైవేటు యూనివర్సిటీల విధానం అమలవుతోందని, దేశంలోని మొత్తం 732 యూనివర్సిటీల్లో రెండు వందలకుపైగా ప్రైవేటు యూనివర్సిటీలేనని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఏపీలో ప్రముఖ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్నారు. నిర్ణయం తీసుకుని చర్చలేంటి? ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతిస్తూ బిల్లు తేవాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకున్న తర్వాత తమతో చర్చలు జరపడం సరికాదని ప్రోగ్రెసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, ఏవీఎస్ శర్మ, గేయానంద్, వై.శ్రీనివాస్‌రెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మంత్రి గంటాతో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బిల్లు విషయంలో ముందే తమతో చర్చించి ఉంటే ఉన్నత విద్యావ్యవస్థ పటిష్టతకు మరింత ఉపయోగం ఉండేదన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1700 పోస్టులు భర్తీ చేయకపోవడంతో కేంద్ర నుంచి ఆర్యుఎస్ఎం, యూజీసీ నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీచేయకుండా, నిధులు సమకూర్చకుండా, వాటిని పటిష్టం చేయకుండా నిర్లక్ష్యం చేసి ఉన్నత విద్యను కూడా ప్రైవేటీకరణ చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. -
ప్రైవేట్ వర్సిటీలపై కార్పొరేట్ కన్ను
♦ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ♦ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన రిలయన్స్ సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విశ్వవిద్యాలయాలపై కార్పొరేట్ దిగ్గజాలు మక్కువ చూపుతున్నారు. అనుమతినిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ సంస్థ ఈ దిశగా అడుగులు వేసింది. దీంతో గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే సమావేశాల చివరి రోజున ఆ కసరత్తు పూర్తి కావడంతో బిల్లును ప్రవేశ పెట్టేందుకు వీలు కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రకటించడంతో... అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు మార్గం సుగమం అయింది. ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు... రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చి నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలను అనుమతించాలన్న నిర్ణయానికి వచ్చింది. అంతే కాకుండా అన్నివిధాలా అనుకూలమైన హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ప్రైవేటు వర్సిటీలకు అనుమతివ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా చూడాలన్న సంకల్పంతో ఉంది. రిలయన్స్, మహీంద్రా, బిర్లా వంటి బడా సంస్థలు ఇందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో మహీంద్రా ఏకోల్ తమ విద్యా సంస్థను స్థాపించింది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. వీటితోపాటు రాష్ట్రంలో క్యాంపస్‌లు ఉన్న గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ, ఇక్ఫాయ్ యూనివర్సిటీ వంటివి రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐటీ, విజ్ఞాన్ వంటి పేరున్న విద్యా సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బ్రాండ్ ఇమేజ్ ముఖ్యం... మొత్తంగా ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే... ప్రముఖ పరిశ్రమలకు చెందిన 10 నుంచి 15 ప్రైవేటు వర్సిటీలు రాష్ట్రంలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రైవేటు వర్సిటీలు మనుగడ సాగించాలంటే బ్రాండ్ ఇమేజ్ ముఖ్యమని, అలాంటి సంస్థలే సక్సెస్ కాగలుగుతాయని, ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. -
ఇక ప్రైవేటు యూనివర్సిటీలు
ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు దోహదం దీనిపై డిప్యూటీ సీఎం శ్రీహరితో మాట్లాడినట్లు వెల్లడి కొత్త గురుకులాల్లో బాలికలకే అధిక సీట్లు: కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. దీనిపై బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో మాట్లాడానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపర్చడానికి, యూనివర్సిటీల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు వీలుగా ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం హైదరాబాద్ కోకాపేటలో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ కొత్త క్యాంపస్‌ను కడియం శ్రీహరితో కలసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటుచేయాలని యువ విద్యావేత్త, రాక్వెల్ స్కూల్స్ సీఎండీ మహేష్ బిగాలను కోరినట్లు చెప్పారు. మేహ ష్ దేశవిదేశాల్లో విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇతరత్రా ఖర్చులు తగ్గించుకుని, సుఖాలను త్యాగం చేసుకుని తమ పిల్లలను ఉత్తమ పాఠశాలల్లో చదివించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమాజంలో ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే చాలా పాఠశాలలు ఉన్నాయని, ఇంకెన్ని వచ్చినా విజయవంతంగా కొనసాగే పరిస్థితులు ఉన్నాయన్నారు. బాలికలకు అధిక ప్రాధాన్యత పాఠశాలలు, గురుకుల విద్యాలయాల విద్యలో బాలికలు వెనకబడి ఉన్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. అంతేగాక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. బాలికల నమోదు శాతం పెంచేందుకు, నిరంతరాయంగా చదువులు కొనసాగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఎక్కువ శాతం సీట్లు బాలికలకే కేటాయిస్తామన్నారు. పాఠశాలలు, గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించనున్నామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు పచ్చజెండా ఊపినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, రాక్వెల్ స్కూల్స్ సీఎండీ మహేష్ బిగాల, ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ వర్సిటీ డిప్యూటీ వైస్ చాన్స్‌లర్ టాడ్ వాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు యూనివర్సిటీలు వద్దు
తిరుపతి యూనివర్సిటీక్యాంపస్ : ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎస్వీయూ బంద్ విజయవంతమైంది. ఎస్వీయూలోని ప్రకా శం భవన్, సైన్స్‌బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్, ఇతర విభాగాల్లోని విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. పరిపాలనా భవనం వరకు ప్రదర్శనగా వెళ్లి బైఠాయించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను వ్యాపారమ యం చేయాలని చూస్తోందని విమర్శించా రు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల వరకు విద్య కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటైతే సంప్రదాయ యూనివర్సిటీలు వెనుకబడిపోయి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. యూనివర్సిటీల తీరు ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విధంగా మారే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు ఆలోచనలను మానుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు పెంచాలని, అధ్యాపక నాన్‌టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వ్యతిరేకిస్తూ దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమంత్ యాద వ్, జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్, క్యాం పస్ అధ్యక్షుడు మురళీధర్, మౌలాలి, అం జన్, రామాంజి, హేమంత్‌రెడ్డి,నవీన్, కిషోర్‌రెడ్డి, సుధీర్, తేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు రమేష్, ఓబులేశు, టీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అక్కులప్పనాయక్ పాల్గొన్నారు. -
ఉసూరుమంటున్న ఉన్నత విద్య
ఓట్ల కోసం సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయలను వృథా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థులను సమర్ధ మానవ వనరులుగా తీర్చిదిద్దే విద్యను చిన్నచూపు చూడటం సిగ్గుచేటు. ఉన్నత విద్య పెనుభారాన్ని వదిలించుకొనే ఉద్దేశంతో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను తెరపైకి తీసుకురావడం దురదృష్టకరం. గత నెల 18, 19 తేదీలలో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడిం చిన అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా ప్ర మాణాలు మెరుగుపర్చేందు కు విదేశీ విశ్వవిద్యాలయాలను నెల కొల్పుతామని సీఎం ప్రకటించా రు. ప్రభుత్వ ఉన్నత విద్యా విధానం లోపభూయిష్టంగా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 21 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నా యి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలి గానీ విదేశీ విశ్వవిద్యాలయాల ను స్థాపించడానికి ప్రయత్నించడం ఎంతవరకు సబబు? ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆర్థిక వనరులు, బోధన, బోధనేతర సిబ్బంది, సరైన మౌలిక వసతులు లేక నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పబడిన కొత్త విశ్వవిద్యాలయాల పరిస్థితి ఐతే మరీ దీనంగా తయారైంది. కనీసం సొంత భవనాలు లేక, బోధన, బోధ నేతర సిబ్బంది లేక డిగ్రీ కళాశాల భవనాలలో అరకొర వసతులతో కొనసాగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా, విశ్వవిద్యా లయాలను వేధిస్తున్న ఈ సమస్య పట్ల ఏ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. ఈ మధ్య సీఎం వైస్ చాన్స లర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా ఈ సమస్యల ను, వాటి పరిష్కార మార్గాలను గూర్చి కనీసం ప్రస్తావిం చలేదు. విశ్వవిద్యాలయాలను నాలెడ్జి సెంటర్లుగా, ఎడ్యుకే షన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొంటున్నారు. విశ్వవిద్యాలయాలలో ఖాళీలుగా ఉన్న అసిస్టెంట్, అసోసి యేట్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా విశ్వ విద్యాలయాలను ఎడ్యుకేషన్ హబ్‌లుగా మారుస్తామని ప్రకటించడం నేల విడిచి సాము చేసినట్లే అవుతుంది. విశ్వ విద్యాలయాలలో బోధన సిబ్బంది లేకపోవడంతో పరిశో ధన విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. తమను గైడ్ చేసే పర్యవేక్షకులు లేకపోవడంతో పరిశోధనలు సకాలంలో పూర్తి కాక స్కాలర్లు ఏళ్ల తరబడి విశ్వవిద్యాల యాలలోనే కాలం గడుపు తున్నారు. ఒక్కొక్క పర్యవేక్షకు ని కింద అనేక మంది పరిశోధక విద్యార్థులు ఉండటంతో, ఆయా పర్యవేక్షకులు కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేక పోతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే విక్రమ సింహపురి, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఆ పోస్టుల మౌఖిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వం ఆయా పోస్టుల భర్తీకి ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఈలోపు ఆయా విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్ల పదవీ కాలం ముగియడం, కొత్త వీసీల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మళ్లీ కొత్త వీసీలు వచ్చేదెప్పుడో? ఆ పోస్టుల భర్తీకి మోక్షం ఎప్పుడో? అట్లే గత జూన్‌లోనే కృష్ణా విశ్వవిద్యాలయం కూడా బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ చివరి మాసంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కూడా బోధన, బోధనేతర సిబ్బంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు వర్శిటీల్లో భర్తీ ప్రక్రియ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్క డే అన్న చందాన ఉంది. యూజీసీ, ఉన్నత విద్యాశాఖలు పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీ పట్ల ఆసక్తి కనబర్చడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీకి జాప్యం ఎందుకు జరుగుతుందో సీఎం సమాధానం చెప్పాలి. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా విద్యాప్రమా ణాలు, పాలన భవనాలు లేకపోవడం వల్ల రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల నాణ్యత పతనావస్థలో ఉంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.1,050.64 కోట్లు కేటాయించారు. ఇందులో పది సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు రూ.712.14 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు వాటి అభివృద్ధికి ఎంత మాత్రం సరిపోవు. ఓట్ల కోసం సంక్షేమ పథకాల పేరిట కోట్ల రూపాయలను వృథా చేస్తున్న మన ప్రభుత్వం విద్యార్థుల ను సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దే విద్యను చిన్న చూపు చూడటం సిగ్గుచేటు. ఉన్నత విద్యపై వెచ్చించాల్సిన నిధులు భారీస్థాయిలో ఉన్నందున క్రమేణా భారాన్ని వది లించుకొని, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు వీలు గా ప్రైవేటు విశ్వ విద్యాలయాలను తెరపైకి తీసుకు వస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల పేదవారికి ఉన్నత విద్య గగన కుసుమంగా మారుతుంది. స్థూల జాతీయోత్పత్తిలో ఆరు శాతం విద్యకు, అందు లో ఒకటిన్నర నుంచి రెండు శాతం ఉన్నత విద్యకు కేటా యించాలని జాతీయ విజ్ఞాన సంఘం సూచించింది. విద్య కోసం ముఖ్యంగా ఉన్నత విద్య కోసం కోట్లాది రూపా యలు ప్రతి సంవత్సరం ప్రజల నుంచి సుంకం పేరిట వసూలు చేస్తున్న ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం శోచనీయం. ప్రభుత్వం ఇప్పటి కైనా కళ్లు తెరిచి వాస్తవాలను గమనించి విశ్వవిద్యా లయాలలో సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్ప న తదితర అంశాలపై దృష్టి సారించాలి. ముందు ఉన్న విశ్వవిద్యాలయాల అభివృద్ధిని గూర్చి, సమస్యల పరిష్కా రాన్ని గూర్చి ఆలోచించి నానాటికీ నిర్వీర్య మవుతున్న ఉన్నత విద్యను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. (వ్యాసకర్త తెలుగు అధ్యాపకులు, తెనాలి) -
వైఎస్ జగన్‌ను కలిసిన పలు విద్యార్థి సంఘాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం పలు విద్యార్థి సంఘాలు కలిశాయి. లోటస్ పాండ్ వైఎస్ఆస్ సీపీ కార్యాయంలో ఎస్ఎఫ్ఐ, ఏఐడీఎస్ఓ, వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు....వైఎస్ జగన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రయివేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు ఓ వినతి పత్రం సమర్పించారు. భేటీ అనంతరంఒ ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నూర్ మహ్మద్ మాట్లాడుతూ ప్రయివేట్ యూనివర్శిటీలతో పేద, మధ్య తరగతి ప్రజలకు విద్య పూర్తి అవుతుందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నిస్తోందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రయివేట్ యూనివర్శిటీల బిల్లును ప్రవేశపెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షనేతగా ఈ బిల్లును వ్యతిరేకించాలని వైఎస్ జగన్‌ను కోరామని నూర్ మహ్మద్ తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే ఏపీ ప్రభుత్వ యత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. -
ఏపి ప్రభుత్వం కొత్త అడుగు!
హైదరాబాద్: ఉన్నత విద్య విషయంలో ఏపి ప్రభుత్వం కొత్త అడుగు వేయనుంది. దేశంలో ఇతర రాష్ట్రాలలో మాదిరి రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నడుం బిగిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కావలసిన నియమ నిబంధనలు, తగిన సూచనలు ఇవ్వడానికి ఓ హైపవర్ కమిటీని నియమించింది. అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 30 రోజులలోగా తగిన సూచనలు ఇవ్వాలని ఆ ఉత్తర్వులలో ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా కొత్త తరహా కోర్సులు ప్రారంభించాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా అనువైన కోర్సులను ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. ఆ దిశగా ఈ కమిటీ సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. ** -
‘నకిలీ’ గుట్టు రట్టు
సాక్షి, చెన్నై:ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు, విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా చలామణి చేస్తున్న ముఠా గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు. కొడుంగయూర్ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బీఈ నకిలీ సర్టిఫికెట్లను రూ.30 వేలు చొప్పున ఈ ముఠా విక్రయించినట్టు విచారణలో తేలింది. ఈ ముఠాలోని నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, భారీగా వివిధ విద్యాసంస్థల నకిలీ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోవిద్యాసంస్థలకు కొదువ లేదు. అరుుతే చదువుల్లో రాణించే విద్యార్థులు కొందరు అయితే, పుస్తకాల్ని పక్కన పెట్టి ఎంజాయ్మెంట్ లక్ష్యంగా పరుగులు తీసేవాళ్లు మరి కొందరు. మార్కులు తగ్గిన పక్షంలో తల్లి దండ్రుల నుంచి చీవాట్లు తప్పదు. అలాగే, ఉన్నత చదువుల నిమిత్తం కాస్త మార్కులు తగ్గితే, ఎక్కడ సీట్లు కోల్పోతామోనన్న ఆందోళన మరి కొందరిది. ఇలాంటి వారిని పరిగణనలోకి తీసుకుని కొడుంగయూర్ వేదికగా రెండేళ్లుగా విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి చెలామణి చేస్తూ వచ్చిన ముఠా గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు.పట్టుబడింది ఇలా..: రెండు రోజుల క్రితం నుంగబాక్కం కాలేజ్ రోడ్డులోని డీపీఐకు కూతవేటు దూరంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కమిషనర్ జార్జ్ ఆదేశాలతో క్రైం బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఏకే రాజశేఖర్ నేతృత్వంలోని బృందం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించింది. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లో నకిలీ బీఈ సర్టిఫికెట్లు ఉండటంతో విచారణ వేగవంతం చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో కొడుంగయూర్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్లు ముఠా గుట్టు రట్టు అయింది. భారీగా సర్టిఫికెట్లు : ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో కొడుంగయూర్ వళ్లలార్ నగర్‌లోని ఓ ఇంటిపై ప్రత్యేక బృందం దాడి చేసింది. అక్కడున్న అత్యాధునిక టెక్నాలజీ, స్టాంపుల్ని, సీల్స్, స్టిక్కర్లను చూసి అధికారులు విస్మయంలో పడ్డారు. మద్రాసు వర్సిటీ, అన్నా వర్సిటీ, రాష్ట్రంలోని ప్రముఖ ప్రైవేటు వర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు, శిక్షణా కేంద్రాల సర్టిఫికెట్లు బయట పడ్డాయి. సర్టిఫికెట్లను ముందుగానే సిద్ధం చేసుకుని, అడిగిన వారికి కావాల్సినంత మార్కులు, పేర్లు ముద్రించి వెనువెంటనే అప్పగించే విధంగా అక్కడ సరంజామా సిద్ధం చేయటం వెలుగు చూసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్లు, సీపీయూలు, లామినేషన్స్, లేజర్ పరికరాలు, కలర్ డిజైనింగ్ ప్రింటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌ను రూ.15 వేలు నుంచి రూ.30 వేలకు విక్రయించినట్టు తేలింది. బెంగళూరులోని కొందరు బ్రోకర్ల సాయంతో అక్కడకు కూడా ఈ నకిలీ రాకెట్ విస్తరించినట్టు బయట పడింది. దీంతో ఆ బ్రోకర్ల భరతం పట్టే రీతిలో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అరెస్టు: ఈ రాకెట్ సాగిస్తున్న గౌతమన్ ఆయన కుమారుడు లోకేష్‌ను అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురిని, స్వాధీనం చేసుకున్న అత్యాధునిక పరికరాలు, సర్టిఫికెట్లను మీడియా సమావేశంలో గురువారం ప్రవేశ పెట్టారు. ఈ గౌతమన్ ఇది వరకు డీపీఐలో అసిస్టెంట్ అధికారిగా పనిచేసినట్టు వెలుగు చూసింది. విద్యా విభాగాలతో డీపీఐ నిండిన దృష్ట్యా, అక్కడి వ్యవహారాల మీద గౌతమన్‌కు పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో ఈ రాకెట్‌ను గుట్టుచప్పుడు కాకుండా నడిపేందుకు సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు భార్యలు, ఐదుగురు పిల్లలను కల్గిన గౌతమన్ ఇది వరకు ఓ మారు నకిలీ సర్టిఫికెట్లతో పట్టుబడి జైలు జీవితాన్ని అనుభవించినట్టు విచారణలో తేలిందన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక, కంప్యూటర్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన తనయుడు లోకేష్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల నకిలీ సర్టిఫికెట్లను సిద్ధం చేసి ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగి చివరకు తమకు చిక్కాడని ప్రత్యేక బృందం అధికారులు పేర్కొన్నారు. -
కార్పొరేట్ల చేతుల్లోకి ఉన్నత విద్య!
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవైపు ప్రైవేటు వర్సిటీల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా మరోవైపు దానిని విరమించుకోవాలంటూ విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలవల్ల రాష్ట్రంలో ఉన్నత విద్య కూడా కార్పొరేట్ విద్యాసంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుందనే ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్య కార్పొరేట్ విద్యాసంస్థల అధీనంలో కి పూర్తిగా వెళ్లిపోయింది. ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంటర్ విద్యను శాసిస్తుండడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు క్రమంగా కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటైతే ఉన్నత విద్య కూడా కార్పొరేట్పరమయ్యే పరిస్థితి నెలకొంటుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల కోసమేనా... అసలు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటే కార్పొరేట్ విద్యా సంస్థల కోసమన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. పలు విద్యా సంస్థలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వానికి బాగా దగ్గరగా ఉన్నారు. ఎన్నికల్లో వీరంతా టీడీపీకి అన్ని విధాలుగా సహకరించారనే విమర్శలున్నాయి. వీరి ఒత్తిడి వల్లే ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు దిశగా చకచకా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతోపాటు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ యూనివర్సిటీల ఏర్పాటుతో ఉన్నత విద్య పురోగమిస్తుందని పదేపదే చెబుతుండడం గమనార్హం. ఈ యూనివర్సిటీలింతేనా.. రాష్ట్రంలో ఇప్పటికే 20 ప్రభుత్వ యూనివర్సిటీలున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్నత విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో జిల్లాకో యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే కృష్ణా, నన్నయ, వేమన తదితర వర్సిటీలు ఏర్పడ్డాయి. అయితే వాటిల్లో చాలావరకూ ఇంకా బాలారిష్టాలతో సతమతమవుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడం, బోధన సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని వర్సిటీలకైతే ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాంపస్‌లు కూడా సమకూరలేదు. భూములు లేనందున మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీ ఇంకా ఆంధ్ర జాతీయ కళాశాలలోనే కొనసాగుతోంది. ఈ వర్సిటీలను పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలకోసం తపిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్తగా 11 కేంద్ర విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏర్పా టు కానున్నాయి. ఉన్న వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించి గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటే.. వాటితోపాటు కొత్తగా వచ్చే విద్యా సంస్థలతో రాష్ట్రంలో ఉన్నత విద్యను పటిష్టంగా మలి చే వీలుంది. కానీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు వైపు అడుగులేస్తుండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.