ప్రైవేటు యూనివర్సిటీలు వద్దు
తిరుపతి యూనివర్సిటీక్యాంపస్ : ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్, టీఎస్‌ఎఫ్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఎస్వీయూ బంద్ విజయవంతమైంది. ఎస్వీయూలోని ప్రకా శం భవన్, సైన్స్‌బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్, ఇతర విభాగాల్లోని విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. పరిపాలనా భవనం వరకు ప్రదర్శనగా వెళ్లి బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను వ్యాపారమ యం చేయాలని చూస్తోందని విమర్శించా రు.
ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల వరకు విద్య కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటైతే సంప్రదాయ యూనివర్సిటీలు వెనుకబడిపోయి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. యూనివర్సిటీల తీరు ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల విధంగా మారే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు ఆలోచనలను మానుకోవాలని కోరారు.
విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు పెంచాలని, అధ్యాపక నాన్‌టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును వ్యతిరేకిస్తూ దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమంత్ యాద వ్, జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్, క్యాం పస్ అధ్యక్షుడు మురళీధర్, మౌలాలి, అం జన్, రామాంజి, హేమంత్‌రెడ్డి,నవీన్, కిషోర్‌రెడ్డి, సుధీర్, తేజ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రమేష్, ఓబులేశు, టీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అక్కులప్పనాయక్ పాల్గొన్నారు.