న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్తగా దేశవ్యాప్తంగా 60 ఉన్నత విద్యాసంస్థలకు పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని కల్పించినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం వెల్లడించారు. వాటిలో 5 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 21 రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు, 24 డీమ్డ్ యూనివర్సిటీలు, 2 ప్రైవేటు యూనివర్సిటీలు, 8 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. 60లో తెలుగు రాష్ట్రాల నుంచి 13 విద్యా సంస్థలకు చోటు దక్కింది.
స్వయం ప్రతిపత్తి పొందిన యూనివర్సిటీలన్నీ ఇకపై కూడా యూజీసీ పరిధిలోనే ఉంటాయనీ, అయితే కొత్త కోర్సులను ప్రారంభించడం, నైపుణ్య శిక్షణా తరగతులను నిర్వహించడం, విదేశీ అధ్యాపకులను నియమించుకోవడం, విదేశీ విద్యార్థులను కోర్సుల్లో చేర్చుకోవడం తదితరాల్లో యూనివర్సిటీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని జవదేకర్ చెప్పారు. స్వయం ప్రతిపత్తి పొందిన 8 కళాశాలలకు సిలబస్‌ను నిర్ణయించడం, పరీక్షలు పెట్టడం, ఫలితాలు వెల్లడించడం తదితరాలపై స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులకు డిగ్రీలు మాత్రం సంబంధిత యూనివర్సిటీల పేరు మీదుగానే వస్తాయి.
తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థలివే..
తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ది ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ–హైదరాబాద్), నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (హైదరాబాద్), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), కాకతీయ వర్సిటీ (వరంగల్), ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్ ఫర్ హయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (హైదరాబాద్), నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల (హైదరాబాద్) ఉన్నాయి. ఏపీలోని ఆం్ర«ధా వర్సిటీ (విశాఖపట్నం), శ్రీ వెంకటేశ్వర యూనివర్సి టీ (తిరుపతి), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (తిరుపతి), గీతం వర్సిటీ (విశాఖపట్నం), వాసవి ఇంజనీ రింగ్ కళాశాల (కాకినాడ), బోనం వెంకట చలమ య్య ఇంజనీరింగ్ కళాశాల (కాకినాడ) ఉన్నాయి.
60 విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి
Published Wed, Mar 21 2018 3:01 AM | Last Updated on Wed, Mar 21 2018 3:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment