ఏపి ప్రభుత్వం కొత్త అడుగు! | AP Government new step! | Sakshi
Sakshi News home page

ఏపి ప్రభుత్వం కొత్త అడుగు!

Published Sat, Oct 18 2014 7:50 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

ఏపి ప్రభుత్వం కొత్త అడుగు! - Sakshi

ఏపి ప్రభుత్వం కొత్త అడుగు!

హైదరాబాద్: ఉన్నత విద్య విషయంలో ఏపి ప్రభుత్వం కొత్త అడుగు వేయనుంది. దేశంలో ఇతర రాష్ట్రాలలో మాదిరి   రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నడుం బిగిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కావలసిన నియమ నిబంధనలు, తగిన సూచనలు ఇవ్వడానికి   ఓ హైపవర్ కమిటీని నియమించింది. అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 30 రోజులలోగా తగిన సూచనలు ఇవ్వాలని ఆ ఉత్తర్వులలో ఆదేశాలు జారీ చేశారు.

 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా కొత్త తరహా కోర్సులు ప్రారంభించాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా అనువైన కోర్సులను ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. ఆ దిశగా ఈ కమిటీ సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement