హాస్టళ్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
- ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి
వికారాబాద్ రూరల్ : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఉపాధ్యక్షుడు వెంకట్ అన్నారు. విద్యార్థులతో రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు స్థానిక గ్రంథాలయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ. కేసీఆర్ బంగారు తెలంగాణ చేయడం ఏమో కాని సంక్షేమ హస్టల్ విద్యార్థులకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తే చాలన్నారు. అది చేయకుండా పూటకో మాట రోజుకు మాట్లాడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేయడం ఎందుకని ప్రశ్నించారు. సంక్షేమ హస్టళ్లలో సన్నబియ్యం పెడుతున్నం సంక్షేమంలో ప్రభుత్వం ముందు ఉందని చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. హస్టల్ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించిన సైకిల్ యాత్రలో బయటకొచ్చిందన్నారు. ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థుల పైన సంక్షేమ హాస్టల్ సమస్యలపైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్ బస చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు సతీష్, నాగవర్ధన్, గోరవ్ధన్, శ్రీకాంత్, గల్స్‌కన్వీనర్, పరమేశ్వరి, సంజయ్, శంకర్,దశరత్,సంజీవ, మల్లేశం, గౌతమి, అనిల్, రఘు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.