hostel problems
-
వరంగల్ కేయూలో విద్యార్థుల ఆందోళన
సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ కామన్మెస్ విద్యార్థులు గురువారం క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించి, పరిపాలనాభవనం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఇస్తారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మెనూచార్టును సక్రమంగా అమలు చేయటంలేదని విమర్శించారు. మెనూకు సంబంధించిన అవకతకవలపై ఆడిట్ అ«ధికారులతో అందరి సమక్షంలో సమగ్ర విచారణ జరిపించాలని, కామన్‌మెస్‌ను డివైడ్ చేయాలని డిమాండ్ చేశారు. కేయూ వీసీ అనుమతి లేకుండా యూనివర్సిటీలో పోలీసుల జోక్యం సరికాదన్నారు. స్టీమర్ రైస్‌ను తొలగించాలని కోరారు. హాస్టళ్లకు వెళ్లేదారిలో పూర్తిస్థాయిలో విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా మెస్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వంకాయకూరలో పురుగులు వచ్చాయని రెండురోజుల క్రితం రాత్రివేళ వీసీ లాడ్జ్ వద్దకు వెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన రిజిస్ట్రార్ కె.పురుషోత్తమ్ కామన్‌మెస్‌లోని విద్యార్థుల సమస్యలపై చర్చిద్దామని సర్దిచెప్పారు. గురువారం మళ్లీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. రిజిస్ట్రార్ సమక్షంలో విద్యార్థులతో చర్చలు.. కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్‌బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో సాయంత్రం కామన్ మెస్, హాస్టళ్ల విద్యార్థులతో రిజిస్ట్రార్ కె.పురుషోత్తమ్ సమక్షంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.రవీందర్‌రెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఎం.ఇస్తారి, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ జి.వీరన్న, కేయూ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆచార్య వి.రాంచంద్రం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యారులు మాట్లాడుతూ ఒకే మెస్‌లో ఎక్కువమంది కాకుండా ఏ హాస్టల్‌కు అక్కడే మెస్‌ను విడివిడిగా ఏర్పాటు చేయాలని, మెస్‌లలో బయోమెట్రిక్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రతివిద్యార్థి ఎన్నిరో జులు తింటే అన్ని రోజులకు మాత్రమే బిల్లు వేయాలన్నారు. ఇలా అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. అయితే విడివిడిగా మెస్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో ఏర్పాటుకు పరిశీలిస్తామని ఆచార్యులు తెలిపారు. బయోమెట్రిక్ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని పేర్కొంటూ ఒక మెస్‌లో ప్రయోగాత్మకంగా పెట్టి పరిశీలించాక మిగితా వాటిల్లో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తామని సమాధానం ఇచ్చారు. -
హాస్టళ్లలోని సమస్యలు తొలగిస్తాం
కౌడిపల్లి(నర్సాపూర్) : జిల్లాలోని హాస్టళ్లలో ఏ సమస్యలు లేకుండా తొలగిస్తామని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఆయన కౌడిపల్లి మండల కేంద్రంలోని బీసీ, ఎస్టీ హాస్టల్‌తోపాటు కౌడిపల్లి మహాత్మాజ్యోతీబాపూలే బీసీ గురుకులం, తునికిలోని మత్స్యకారుల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి హాస్టల్లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో బాత్రూంలు, మరుగుదొడ్ల సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు. అలాగే కౌడిపల్లిలోని గురుకులంలో అదనపు గదుల నిర్మాణం పనులను పరిశీలించారు. వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పార్ట్ బీ లోని భూముల రైతులు ఆందోళన చెందవద్దని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి రైతులకు పాస్‌బుక్కులు ఇస్తామన్నారు. ఆలస్యమైనా.. ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. అంతకుముందు మండల కేంద్రమైన కౌడిపల్లిలోని మినీ ట్యాంక్‌బండ్ చెరువుకట్టపై హరితహారం మొక్కలు నాటేందుకు గుంతలను పరిశీలించారు. బీసీ, ఎస్టీ హాస్టల్, బీసీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది కోటి 31 లక్షలు మొక్కలు నాటేందుకు లక్షం నిర్ధేశించుకోవడం జరిగిందన్నారు. అందుకుగాను నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో గుంతలు తవ్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటుతామని తెలిపారు. ఈత, ఖర్జుర, పండ్ల మొక్కలకు కొదవ లేదన్నారు. ఈత వనం పెంచుకునే రైతులుంటే వారికి డ్రిప్ సౌకర్యం ఉందన్నారు. ఇంటివద్ద పండ్ల మొక్కలు సైతం పెంచుకోని హరితహారం విజయంవతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ హనూక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శంకర్, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ కిషన్, తహసీల్దార్ శ్రీశైలం, ఎంపీడీఓ కరుణశీల, ఏఈలు ప్రభాకర్, చిన్నినాయక్ వివిధ హాస్టల్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రామారావ్, వార్డెన్ గోవింద్ వివిధ అధికారులు పాల్గొన్నారు -
వసతి పాట్లు !
- జేఎన్టీయూ విద్యార్థులను పట్టిపీడిస్తున్న హాస్టల్ కొరత - హాస్టల్లో భోజనం చేసి క్యాంపస్ బయట ఉంటున్న విద్యార్థులు – దారుణంగా తగ్గిన అడ్మిషన్లు జేఎన్టీయూ: అన్ని వసతలు ఉంటాయి.. బాగా చదువుకోవచ్చన్న లక్ష్యంతోనే ప్రతి ఒక్క విద్యార్థీ జేఎన్టీయూ క్యాంపస్‌లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే హాస్టల్ కొరతతో మౌలిక సదుపాయలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందే విద్యార్థులు సగం మందికి వసతి కొరతగా ఉండటంతో విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఉన్న వాటిలో సామర్థ్యానికి మించి విద్యార్థులకు కేటాయించడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. భోజనం లోపల.. వసతి బయట జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ కళాశాలలో ఆరు బ్రాంచుల్లో నాలుగు సంవత్సరాల విద్యార్థులు కలిపి 1,440 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి హాస్టల్ సదుపాయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 22 బ్రాంచుల్లో 697 మంది విద్యార్థులు ఎంటెక్ అభ్యసిస్తున్నారు. వీరిలో 400 మంది విద్యార్థులకు హాస్టల్ కొరత ఉంది. హాస్టల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థికి ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ అందిస్తారు. దీంతో ఈ 400 మంది విద్యార్థులకు భోజనం హాస్టల్లో అందుబాటులో తెచ్చారు. కానీ వసతి మాత్రం బయట ఉండాల్సిన దుస్థితి దాపురించింది. బయట అద్దె అధికంగా ఉండటంతో ప్రభుత్వం నుంచి అందుతున్న స్కాలర్షిప్ ఏ మాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఓటీపీఆర్ఐలోనూ అంతే... ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్, ఫార్మసీ ఇనిస్టిట్యూట్ జేఎన్టీయూ అనంతపురంలో ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఎంఫార్మసీలో అరకొరగా సీట్లు భర్తీ అవుతున్నాయి. బీ ఫార్మసీలో సీట్లు భర్తీ అవుతున్నా.. వసతి సౌకర్యాలు లేకపోవడంతో రెండో కౌన్సెలింగ్‌లో ఇతర కళాశాలల వైపు వెళ్తున్నారు. ప్రతిపాదన పంపాము ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ సంఖ్య పెంచాలన్న ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపించాం. లేపాక్షి పక్కన మరో నూతన భవనం నిర్మాణం తలపెట్టాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ కొరత తీర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. –బి.ప్రహ్లాదరావు , ప్రిన్సిపల్, జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల -
హాస్టళ్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి వికారాబాద్ రూరల్ : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఉపాధ్యక్షుడు వెంకట్ అన్నారు. విద్యార్థులతో రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు స్థానిక గ్రంథాలయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ. కేసీఆర్ బంగారు తెలంగాణ చేయడం ఏమో కాని సంక్షేమ హస్టల్ విద్యార్థులకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తే చాలన్నారు. అది చేయకుండా పూటకో మాట రోజుకు మాట్లాడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేయడం ఎందుకని ప్రశ్నించారు. సంక్షేమ హస్టళ్లలో సన్నబియ్యం పెడుతున్నం సంక్షేమంలో ప్రభుత్వం ముందు ఉందని చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. హస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిర్వహించిన సైకిల్ యాత్రలో బయటకొచ్చిందన్నారు. ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థుల పైన సంక్షేమ హాస్టల్ సమస్యలపైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్ బస చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సతీష్, నాగవర్ధన్, గోరవ్ధన్, శ్రీకాంత్, గల్స్కన్వీనర్, పరమేశ్వరి, సంజయ్, శంకర్,దశరత్,సంజీవ, మల్లేశం, గౌతమి, అనిల్, రఘు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ సైకిల్‌యాత్ర
అలంపూర్‌రూరల్ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ వసతి గహాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవు తున్నాయిని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. జిల్లాలోని 64 మండలాల్లోని సంక్షేమ వసతిగహాలపై తాము సర్వే చేస్తూ అక్కడి సమస్యలపై అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం ఈ సైకిల్ యాత్ర అలంపూర్‌కు చేరింది. అనంతరం గాంధీచౌక్ వద్ద మాట్లాడారు. జిల్లాలో వసతిగహాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. అలంపూర్‌లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్టల్లో సరైన రక్షణ లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, ఆది, కుర్మయ్య, సుబాన్, నవీన్, రామకష్ణ, శేఖర్, నాగన్న, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ, అయ్యప్ప పాల్గొన్నారు. -
హాస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ సైకిల్‌యాత్ర
అలంపూర్‌రూరల్ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ వసతి గృహాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవు తున్నాయిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. జిల్లాలోని 64 మండలాల్లోని సంక్షేమ వసతిగృహాలపై తాము సర్వే చేస్తూ అక్కడి సమస్యలపై అధ్యయనం చేసేందుకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం ఈ సైకిల్ యాత్ర అలంపూర్‌కు చేరింది. వారు పట్టణంలోని సంక్షేమ వసతిగృహాలను సందర్శించారు. అనంతరం గాంధీచౌక్ వద్ద మాట్లాడారు. జిల్లాలో వసతిగృహాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. అలంపూర్‌లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్టల్లో సరైన రక్షణ లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, ఆది, కుర్మయ్య, సుబాన్, నవీన్, రామకృష్ణ, శేఖర్, నాగన్న, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ, అయ్యప్ప పాల్గొన్నారు. -
ఒడిశా బాలికల అరుదైన పోరాటం
భువనేశ్వర్: భారత గణతంత్ర దినోత్సవం రోజు ఒడిశాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల బాలికలు అరుదైన పోరాటాన్ని ఎంచుకున్నారు. సమస్యలతో విసిగి వేసారిన వారు.. చివరికి తాడోపేడో తేల్చుకోవాలనుకున్నారు. ఆరునూరైనా కలెక్టరును కలిసి తమ బాధలు చెప్పుకొని తీరాల్సిందేనని తీర్మానించుకున్నారు. దానికోసం పెద్ద సాహసమే చేశారు. 73 మంది బాలికలు దండుగా కదిలారు. సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. అర్థరాత్రి చలిలో 7 గంటలు పాటు నడిచి వెళ్లి మరీ తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బాలికల వసతిగృహంలో విద్యార్థులు దుర్భర స్థితిలో చదువుకుంటున్నారు. సౌకర్యాలు దేవుడెరుగు.. కనీసం కడుపునిండా భోజనం కూడా ఉండదు. దీంతో చదువు కుంటుపడింది. హాస్టల్ అధికారులు తమను చిన్న చూపు చూస్తున్నారని, నాసిరకం భోజనం పెడుతున్నారని, పాఠశాలలో సరైన బోధన వనరులు లేవని ఎన్నోసార్లు అధికారులకు విజ్క్షప్తి చేశారు. అయినా ఫలితం శూన్యం. దీంతో పాపం.. ఆ చిన్నారులు తమ దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం రాత్రి కాలినడకన బయలుదేరారు. వద్దని ఎవరు ఎంత వారించినా వెనక్కి తగ్గలేదు. పోలీసులు, ఇతర అధికారులు, పెద్దలు వారి ప్రయత్నాలను విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వాహనం ఏర్పాటుచేస్తామన్నా వినలేదు. పట్టిన పట్టు వీడకుండా ముందుకు సాగారు. చేసేదేమీ లేక పోలీసులే వారికి రక్షణగా వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ధర్నా మొదలుపెట్టారు. దీంతో కలెక్టర్ స్పందించక తప్పలేదు. కలెక్టర్ రాజేశ్ ప్రవకర్ పాటిల్ వెంటనే ఆ ప్రాంతంలో పర్యటిస్తాననీ, .. వారి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తానని హామీ యిచ్చారు. దీంతో బాలికలు ఆందోళనను విరమించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలపై జిల్లా సంక్షేమ సంఘ కార్యాలయం అధికారులు అర్ధరాత్రి ఆ బాలికల్ని సురక్షితంగా వసతి గృహానికి తరలించారు. అయితే దీనిపై జిల్లా సంక్షేమ అధికారుల వాదన మరోలా ఉంది. కొత్తగా విధుల్లో చేరిన అధికారికి వ్యతిరేకంగా కొంతమంది గ్రామస్తులు ఈ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. -
హాస్టల్ గదులు కేటాయించాలంటూ ధర్నా