హాస్టల్‌ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌యాత్ర | bicycle touring for hostels problems | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌యాత్ర

Published Sun, Jul 31 2016 10:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

bicycle touring  for hostels problems

అలంపూర్‌రూరల్‌ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంక్షేమ వసతి గృహాలపై శ్రద్ధ చూపడంలో విఫలమవు తున్నాయిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. జిల్లాలోని 64 మండలాల్లోని సంక్షేమ వసతిగృహాలపై తాము సర్వే చేస్తూ అక్కడి సమస్యలపై అధ్యయనం చేసేందుకు సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం ఈ సైకిల్‌ యాత్ర అలంపూర్‌కు చేరింది. వారు పట్టణంలోని సంక్షేమ వసతిగృహాలను సందర్శించారు. అనంతరం గాంధీచౌక్‌ వద్ద మాట్లాడారు. జిల్లాలో వసతిగృహాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. అలంపూర్‌లో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్టల్‌లో సరైన రక్షణ లేకుండా పోతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కుమార్, ఆది, కుర్మయ్య, సుబాన్, నవీన్, రామకృష్ణ, శేఖర్, నాగన్న, కేవీపీఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి రాజు, సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ, అయ్యప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement