Govt Fail
-
హాస్టళ్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి వికారాబాద్ రూరల్ : ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఉపాధ్యక్షుడు వెంకట్ అన్నారు. విద్యార్థులతో రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు స్థానిక గ్రంథాలయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ. కేసీఆర్ బంగారు తెలంగాణ చేయడం ఏమో కాని సంక్షేమ హస్టల్ విద్యార్థులకు ఉన్న సమస్యలు పరిష్కరిస్తే చాలన్నారు. అది చేయకుండా పూటకో మాట రోజుకు మాట్లాడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేయడం ఎందుకని ప్రశ్నించారు. సంక్షేమ హస్టళ్లలో సన్నబియ్యం పెడుతున్నం సంక్షేమంలో ప్రభుత్వం ముందు ఉందని చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. హస్టల్ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిర్వహించిన సైకిల్ యాత్రలో బయటకొచ్చిందన్నారు. ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థుల పైన సంక్షేమ హాస్టల్ సమస్యలపైనా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్ బస చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సతీష్, నాగవర్ధన్, గోరవ్ధన్, శ్రీకాంత్, గల్స్కన్వీనర్, పరమేశ్వరి, సంజయ్, శంకర్,దశరత్,సంజీవ, మల్లేశం, గౌతమి, అనిల్, రఘు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో సర్కారు విఫలం
సీపీఎం జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ భూనిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ ఘట్కేసర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ అన్నారు. మండల కేంద్రంలోని యూసుఫ్‌బాబా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రైతులకు రుణమాఫీ తదితర హామీలను ఇచ్చిందని గుర్తుచేశారు. వీటిలో ఏఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో సుమారు 60వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. భూనిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. జీవో 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఉన్నవారి ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, ఎం.మార్టీన్, ప్రమీలాయాదవ్, బాలరాజు, మొగులయ్య, వెంకన్న, చంద్రకళ, దాసు మధుసూధన్, జయచంద్ర, కమలమ్మ, గిరిజ, గౌసియాబేగం, జహంగీర్, అసన్బాబు, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
‘హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం’
కొత్తూరు : హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జిల్లా ఇన్చార్జి గరికపాటి రాంమోహన్ ఆరోపించారు. ఆదివారం కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్‌లో పార్టీ జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు కోసం చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. త్వరలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, రైతు రుణమాఫీపై నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింలు, ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు వెంకటేష్, శ్రీనివాస్, ఆంజనేయులు; నాయకులు నాగేశ్వర్‌రెడ్డి, అచ్యుత రామారావు, రాజేంద్రప్రసాద్‌గౌడ్, గంజిపేట రాములు, శ్రీనివాసులు, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.