హామీల అమలులో సర్కారు విఫలం
సీపీఎం జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్
భూనిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్
ఘట్‌కేసర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ అన్నారు. మండల కేంద్రంలోని యూసుఫ్‌బాబా ఫంక‌్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన పార్టీ మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రైతులకు రుణమాఫీ తదితర హామీలను ఇచ్చిందని గుర్తుచేశారు. వీటిలో ఏఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో సుమారు 60వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. భూనిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. జీవో 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఉన్నవారి ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, ఎం.మార్టీన్, ప్రమీలాయాదవ్, బాలరాజు, మొగులయ్య, వెంకన్న, చంద్రకళ, దాసు మధుసూధన్, జయచంద్ర, కమలమ్మ, గిరిజ, గౌసియాబేగం, జహంగీర్, అసన్‌బాబు, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.