Implementation of assurances
-
హామీల అమలులో సర్కారు విఫలం
సీపీఎం జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ భూనిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ ఘట్కేసర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ అన్నారు. మండల కేంద్రంలోని యూసుఫ్బాబా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. డబుల్బెడ్రూం ఇళ్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రైతులకు రుణమాఫీ తదితర హామీలను ఇచ్చిందని గుర్తుచేశారు. వీటిలో ఏఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో సుమారు 60వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. భూనిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. జీవో 58 ప్రకారం ప్రభుత్వ భూముల్లో ఉన్నవారి ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, ఎం.మార్టీన్, ప్రమీలాయాదవ్, బాలరాజు, మొగులయ్య, వెంకన్న, చంద్రకళ, దాసు మధుసూధన్, జయచంద్ర, కమలమ్మ, గిరిజ, గౌసియాబేగం, జహంగీర్, అసన్బాబు, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం
చేవెళ్ల రూరల్: హామీలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలమాకుల జంగయ్య, ఎం. ప్రభులింగం, చేవెళ్ల నియోజకవర్గం కార్యదర్శి కె. రామస్వామి అన్నారు. మండలంలోని ధర్మసాగర్లో ఆదివారం పార్టీ గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసి అనంతరం వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా నల్లధనం వెలికి తీయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్, పప్పు ధాన్యాల ధరలు పెంచి సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు చేస్తే సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ కార్యదర్శిగా ఎరుకల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా తూర్పాటి చంద్రయ్య, ఈ. రాములు, మరో ఆరుగురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో సీసీఐ మండల కార్యదర్శి సుధాకర్, నాయకులు మంజుల, బ్రహ్మచారి, శంకర్గైడ్, చంద్రకళ, సావిత్రి పాల్గొన్నారు. 17సిహెచ్వి 12: చేవెళ్ల మండలంలోని ధర్మసాగర్ గ్రామంలో సీపీఐ పార్టీ జెండాను అవిష్కరించి మాట్లాడుతున్న నాయకులు.