నేటినుంచి ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ యాత్ర
Published Thu, Jul 28 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను అధ్యయనం చేసేందుకు శుక్రవారం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, శివవర్మ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కా ర్యాలయంలో సైకిల్‌యాత్ర పోస్టర్లను ఆవి ష్కరించారు. వారు మాట్లాడుతూ జిల్లాలోని కొల్లాపూర్, జడ్చర్ల నుంచి రెండు గ్రూపులుగా సైకిల్‌యాత్ర ప్రారంభం అవుతుందని వెల్లడించారు. 14నియోజకవర్గాలు, 64 మండలాలు, 250హాస్టళ్లు, 1200 కి.మీ నిర్విరామంగా యాత్ర సాగుతుందని తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని, సొంతభవనాలు నిర్మించాలని, సబ్బుల బిల్లులు బాలురకు రూ.150, బాలికలకు రూ. 200 పెంచాలని కోరారు. ఆట వస్తువుల కోసం రూ.10వేల చొప్పున మంజూరు చేయాలని తదితర డిమాండ్లలో యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement