cycle tour
-
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్‌లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్‌న్‌లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో -
ఫ్రాన్స్ టు కోల్‌కతా సైకిల్ యాత్ర
ఫ్రాన్స్ దేశానికి చెందిన మేరీ వయస్సు 50 ఏళ్లు, ఇరిక్ వయస్సు 60 ఏళ్లు. వీరిద్దరూ కోల్‌కతాకు సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 16 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎలక్ట్రిక్ సైకిల్‌పై ప్రారంభించారు. ఫ్రాన్స్ నుంచి ముంబై మీదుగా కోల్‌కతాకు జీపీఎస్ ఆధారంగా వెళుతూ వాకాడులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏడు నెలల సమయం పట్టే ఈ ప్రయాణం సంతోషంగా సాగుతుందని పేర్కొన్నారు. – వాకాడు -
Banothu Vennela: మట్టిని కాపాడుకుందాం!
మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదగగలదు. కానీ, సారం లేని మట్టిలో ఏ విత్తనమూ మొలకెత్తదు. మనిషి స్వార్థంతో చేసే కలుషిత కారకాల ద్వారా మట్టి సారం కోల్పోతోంది. భూసారాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు తలెత్తవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బానోత్ వెన్నెల అనే గిరిజన అమ్మాయి ‘సేవ్ సాయిల్’ పేరుతో ఐదు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రకు పూనుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మారుమూల గిరిజన గ్రామపరిధిలోని సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ వెన్నెల 60 రోజుల్లో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైకిల్ యాత్ర ద్వారా వేలాది మంది రైతులకు, ప్రజలకు ‘మట్టి’ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికి దాదాపు రెండు వేల కిలోమీటర్లకు చేరువైంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీదుగా ఆమె సైకిల్ యాత్ర చేస్తోంది. మే1న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించిన వెన్నెల మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల మీదుగా వెళుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులను, గ్రామ పెద్దలను కలిసి ‘మట్టిని ఏ విధంగా కాపాడాలో, ఎందుకు కాపాడాలో’ వివరించి, తిరిగి తన యాత్రను కొనసాగిస్తోంది. కలల అధిరోహణ వెన్నెల చిన్నతనంలోనే ఆమె తండ్రి మోహన్ చనిపోయాడు. తల్లి భూలి కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. వెన్నెలకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసింది వెన్నెల. తల్లి కూలి పనికి వెళితే గానీ కుటుంబం నడవని పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన వెన్నెలకు పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఎన్ని కష్టాలైనా సరే వాటిని సాధించాలన్న పట్టుదలతో నిరంతరం సాధన చేస్తోంది. పర్వతారోహణ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇందుకోసం కొంతకాలం భువనగిరిలో రాక్ క్లైబింగ్ స్కూల్లో మౌంటెనీర్లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే పేదరికం ఆమెకు శాపంగా మారింది. సోషల్‌మీడియాలో జగ్గీవాస్‌దేవ్ ‘సేవ్ సాయిల్’ కథనాలు విని స్ఫూర్తి పొందిన వెన్నెల భవిష్యత్తు భూసారాన్ని పెంచడానికి తన వంతుగా సమాజాన్ని జాగృతం చేయాలనుకుంది. రెండు నెలల పాటు ఒంటరిగా సైకిల్‌పై వెళ్లే యాత్రకు పూనుకుంది. తల్లి చెవి కమ్మలతో సైకిల్... ఒంటరి యాత్రకు తల్లిని ఒప్పించింది. కానీ, సైకిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు. తిరిగి తల్లినే బతిమాలుకుంది. తల్లి చెవి కమ్మలు అమ్మి, ఆమె ఇచ్చిన డబ్బులతో సైకిల్ కొనుగోలు చేసింది. మే 1 న కామారెడ్డి నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించింది. ప్రస్తుతం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. 60 రోజుల్లో 5,000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించాలని లక్ష్యం పెట్టుకుంది. రాత్రిపూట ఉండాల్సిన పరిస్థితులు, యాత్రలో సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ‘ఇప్పటి వరకు ఆరు గరŠల్స్ హాస్టల్లో రాత్రిళ్లు బస చేశాను. మిగతా చోట్ల. పోలీస్ స్టేషన్లలో ఉన్నాను. ఈ రోజు (రాత్రి) కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాను. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. 10 రోజులు యాత్ర పూర్తయ్యాక ఈషా ఫౌండేషన్ వాళ్లు కలిశారు. ఒక అమ్మాయిగా ఇలాంటి సాహసమైన పనిని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. రోజూ వంద కిలోమీటర్లు ‘రోజుకు వంద కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తున్నాను. దారిలో రైతులు, గ్రామస్తులను కలుస్తున్నాను. భూసారం గురించి, వారు చేస్తున్న పంటల పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నాను. చాలా వరకు భూమిలో సేంద్రీయత కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. ఇది ఇలాగే తగ్గితే భవిష్యత్తులో పంటల దిగుబడులకు, మనుషుల మనుగడకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మేలుకోవాలి. 2050 నాటికి కనీసం 3 నుంచి 6 శాతం తిరిగి భూసారం పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు సేంద్రీయ పద్ధతులను అవలంభించి భూసారాన్ని కాపాడాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని దారిపొడవునా కలిసిన వారికల్లా వివరిస్తున్నాను’ అని తెలిపింది వెన్నెల. నిన్నటితో దాదాపు రెండు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తయ్యింది. ఎక్కడా ఏ ఇబ్బందులూ లేవని, గ్రామస్తుల ఇళ్లలోనే వారి ఆహ్వానం మేరకు భోజనం సదుపాయం కూడా పొందుతున్నాను’ అని తెలిపింది వెన్నెల. మట్టిబిడ్డగా మట్టి కోసం... మాది పేద కుటుంబం. అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేస్తోంది. ఎవరెస్ట్ అధిరోహించాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించాలి. అందుకే కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు భూ సారాన్ని కాపాడమంటూ సైకిల్ యాత్ర చేపట్టా. యాత్ర ద్వారా ఎంతో మంది చైతన్యం అవుతున్నారు. మట్టి బిడ్డగా మట్టికోసం చేస్తున్న ఈ యాత్ర సక్సస్ అవుతుంది. దీని తరువాత కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్వతారోహణ మీద దృష్టి పెడతా. – బానోత్ వెన్నెల, సర్దాపూర్ తండా, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
తల్లి సైకిల్ యాత్ర: ఉపాసన భావోద్వేగం
బంజారాహిల్స్ : అపోలో ఆస్పత్రుల వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని తన 60వ పుట్టినరోజు వేడుకను వినూత్నంగా జరుపుకున్నారు. ఈ నెల 25న ఉదయం తన భర్త అనిల్ కామినేనితో కలసి చాలెంజ్ టు సైకిల్ టు చెన్నై ఫ్రం హైదరాబాద్ అనే నినాదాన్ని ఎంచుకొని బయల్దేరారు. రోజుకు వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ ఆరు రోజుల్లో 600 కిలోమీటర్లు వెళ్ళి చెన్నైలో తన తండ్రి ప్రతాప్.సి.రెడ్డిని బుధవారం కలుసుకొని సంతోషం పంచుకున్నారు. సైక్లింగ్‌తో తన భర్త, కూతురుతో కలసి ఔటింగ్‌కు వెళ్లిన ఆనందం కలిగించిందని ఆమె తెలియజేశారు. సైకిల్ రైడింగ్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఒక మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే నమ్మకానికి పునాది వేసిందని పేర్కొన్నారు. తన తల్లి శోభనా కామినేని తన 60వ పుట్టినరోజున హైదరాబాద్ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్లు సైకిల్ రైడింగ్ చేస్తూ వెళ్లడం తనకెంతో గర్వంగా ఉందని ఆమె కూతురు, సినీహీరో రామ్‌చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల బుధవారం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. -
కాలుష్య నివారణకు సైకిల్ యాత్ర
- ప్యాపిలికి చేరిన తమిళనాడు వాసి ఆండూ చార్లెస్ ప్యాపిలి : భూతాపాన్ని కాపాడండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ తమిళనాడుకు చెందిన ఆండూ చార్లెస్ చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం ప్యాపిలికి చేరుకుంది. ఉపాధ్యాయుడైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2005 జూన్ 6వ తేదీన సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సైకిల్ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 50 వేల కిలోమీటర్లు పర్యటించినట్లు ఆయన చెపాయ్పరు.అవివాహితుడైన తాను రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున సైకిల్‌పై ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
పర్యాటకంగా సముద్రతీరం అభివృద్ధి
జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ సైకిల్ మీద బీచ్ రోడ్డు ద్వారా కాకినాడ నుంచి అన్నవరానికి సతీసమేతంగా సత్యదేవునికి పూజలు అన్నవరం (ప్రత్తిపాడు) : జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన కాకినాడ నుంచి అన్నవరం వరకూ బీచ్ రోడ్డు మీదుగా సైకిల్ తొక్కారు. దారి మధ్యలో అనేక సముద్రతీర గ్రామాలలో ఆగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన రత్నగిరికి చేరుకుని సతీసమేతంగా సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సప్తగిరి అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత గ్రామాలలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్టు తన పరిశీలనలో తేలిందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రజలలో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెండు వేల మంది జనాభా కలిగిన గ్రామాల్లో ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ’ ద్వారా చెత్తను సేకరించి వర్మీ కంపోస్టు తయారు చేయిస్తామని, దీన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఉప్పాడ వద్ద రోడ్డు సముద్ర కోతకు గురవుతోందని, దీని నివారణకు ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వాలని పూణేలో ఉన్న ఒక ఇనిస్టిట్యూట్‌ను కోరినట్టు చెప్పారు. ఇచ్చాపురం నుంచి తడ వరకూ బీచ్ కారిడార్ ఏర్పాటు కాబోతోందని, అందులో భాగంగా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రతి ఆదివారం ఈ విధంగా సైకిల్ మీద వివిధ గ్రామాలు పర్యటించడం ముందు ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు. పంచాయితీలలో ఇళ్ల పన్ను తక్కువే పెంచాం: గ్రామపంచాయితీలలో ఇంటిపన్ను భారీగా పెంచారని వస్తున్న విమర్శలు సరికాదని కలెక్టర్ అన్నారు. ఇంటిపన్ను పెంచకముందు జిల్లాలో పంచాయతీలకు వచ్చే ఆదాయం రూ.70 కోట్లు ఉంటే, పెంచాక ఆ మొత్తం రూ.87 కోట్లు మాత్రమే అయిందన్నారు. కలెక్టర్ వెంట అన్నవరం దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు తదితరులున్నారు. -
అమరజవాన్లకు నివాళులర్పిస్తూ సైకిల్‌యాత్ర
గొల్లపూడి(మైలవరం): దేశం కోసం అసువులు బాసిన అమరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రిటైర్డు మేజర్ జనరల్ సోమనాథ్‌జా సైకిల్ యాత్ర చేపట్టారు. ఆయన మంగళవారం గొల్లపూడి గ్రామం చేరుకున్నారు. గ్రామంలో ఆయనకు మాజీ సైనికులు సుబ్బారావు, నరిసింహారావు తదితరులు స్వాగతం పలికి సత్కరించారు. సోమనా«థ్‌జా మాట్లాడుతూ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ హర్యానా రాష్ట్రం నుంచి సైకిల్‌యాత్ర చేస్తున్నానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి మృతి చెందిన 21వేల మందికి సంతాపం తెలియజేయాలని అక్టోబర్ 19వ తేదీ నుంచి ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 9వేల మంది అమరజవాన్లకు సైకిల్‌యాత్రలో రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించినట్టు వివరించారు. ఏప్రిల్ నాటికి మిగిలిన వారికి శ్రద్ధాంజలి ఘటించి ఢిల్లీలోని అమరజ్యోతికి చేరుకోనున్నట్టు చెప్పారు. సోమనా«థ్‌జాతోపాటు ఆయన సతీమణి చిత్రజా కూడా యాత్రలో పాల్గొన్నారు. -
డిండికి చేరిన సైకిల్‌యాత్ర
డిండి : కర్నాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా– భీమానది సంగం నుంచి ప్రారంభించిన సైకిల్‌యాత్ర గురువారం డిండి మండల కేంద్రానికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతి కోసమే కృష్ణా నదమ్మ సైకిల్‌యాత్ర సుమారు 3,500 కిలోమీటర్లు నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మిక అధ్యయన పర్యావరణ పరిరక్షణ వేత్త పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలని ధర్మపరిరక్షణకు ప్రతిఒక్కరూ ఉద్యమించాలని కోరారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాలను సందర్శిస్తూ దేవాలయాలను దర్శిస్తూ తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఈ యాత్ర సాగుతున్నట్లు ఆయన తెలిపారు. -
తిరుమలకు సైకిల్‌యాత్ర
బాలాయపల్లి : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన వేంకటేశ్వరస్వామి భక్తులు తిరుమలకు సైకిల్‌యాత్ర చేపట్టారు. ఆదివారం మండలంలోని వెంకటరెడ్డి గ్రామం వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని 20 ఏళ్ల నుంచి 215 మంది తిరుమలకు సైకిల్ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈసారి రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ఈనెల 9వ తేదీన తేది సైకిల్ యాత్ర ప్రారంభించామని చెప్పారు. -
పేద ఆడపిల్లల చదువు కోసం సైకిల్ యాత్ర
-
నేటినుంచి ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను అధ్యయనం చేసేందుకు శుక్రవారం నుంచి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, శివవర్మ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కా ర్యాలయంలో సైకిల్‌యాత్ర పోస్టర్లను ఆవి ష్కరించారు. వారు మాట్లాడుతూ జిల్లాలోని కొల్లాపూర్, జడ్చర్ల నుంచి రెండు గ్రూపులుగా సైకిల్‌యాత్ర ప్రారంభం అవుతుందని వెల్లడించారు. 14నియోజకవర్గాలు, 64 మండలాలు, 250హాస్టళ్లు, 1200 కి.మీ నిర్విరామంగా యాత్ర సాగుతుందని తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని, సొంతభవనాలు నిర్మించాలని, సబ్బుల బిల్లులు బాలురకు రూ.150, బాలికలకు రూ. 200 పెంచాలని కోరారు. ఆట వస్తువుల కోసం రూ.10వేల చొప్పున మంజూరు చేయాలని తదితర డిమాండ్లలో యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సైకిల్ యాత్రకు సమస్యల బ్రేక్ !
‘రోడ్లు అభివృద్ధి చేయలేదు. అధ్వానంగా ఉన్న రోడ్లపై ఇబ్బందులు పడుతున్నాం. వారానికి రెండుసార్లు వచ్చే తాగునీటితో ఎలా బతకాలి. పింఛన్ల కోసం అందజేసిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. ఇళ్ల స్థలాల పంపిణీ ఊసే లేదు. డ్రెయినేజీ లేక పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ’ – మంత్రి కొల్లు రవీంద్ర వద్ద మచిలీపట్నంలోని 15వ వార్డు ప్రజల ఆవేదన ఇది మచిలీపట్నం(ఈడేపల్లి) : సైకిల్ యాత్రలో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం బందరులోని 15వ వార్డులో ఉన్న చిట్టిపిళ్లారయ్య వీధికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యలను ముక్తకంఠంతో చెబుతుండటంతో అసహనానికి గురైన మంత్రి కేవలం కొన్ని వీధుల్లో మాత్రమే యాత్రను నిర్వహించి వెళ్లిపోయారు. గుడికి, మసీదుకు వెళ్లాలంటే నరకయాతనే.. చిట్టిపిళ్లారయ్య దేవస్థానానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా ఉందని స్థానికులు మంత్రికి చెప్పారు. చిట్టిపిళ్లారయ్య దేవస్థానానికి సమీపంలో ఉన్న మసీదుకు వెళ్లే రహదారి కూడా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. ఈ రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీ వ్యవస్థ లేక చిన్నపాటి వర్షానికే నీరు రోడ్డుపై నిలిచిపోతుందని, దేవాలయం, మసీదుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. వారానికి రెండుసార్లు కూడా తాగునీరు సరఫరా చేయడంలేదని మహిళలు వాపోయారు. పింఛన్లు మంజూరు చేయాలని మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తంచేశారు. నివేశన స్థలాలు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడంలేదని పలువురు నిలదీశారు. రెండేళ్లుగా తమ సమస్యల గురించి చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే దలనీయబోమని మంత్రిని హెచ్చరించారు. దీంతో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి మంత్రి ఆ వార్డులో సైకిల్ యాత్రను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టీడీపీ నాయకుడు గనిపిశెట్టి గోపాల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సైక్లింగ్
ఒంటి కాలితోనే పతకాలెన్నో సాధించాడు. ఏకంగా ‘లివ్కూ బుక్’కెక్కాడు. ఈ రికార్డుల హీరో.. వున హైదరాబాదీ ఆదిత్య మెహతా. ప్రపంచంలో ఎత్తరుున వునాలీ నుంచి ఖర్డంగ్లా రోడ్డుపై ఆదిత్య సైకిల్ యూత్ర చేపట్టనున్నాడు. ఈ యూత్ర విజయువంతం కావాలని నెక్లెస్‌రోడ్డులో ఆదివారం ‘సైక్లింగ్ రైడ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్యతో ‘సిటీ ప్లస్’ వుుచ్చటించింది. ఆ విశేషాలు అతని మాటల్లోనే... పుట్టి పెరిగింది భాగ్యనగరిలోనే. ఓ పక్క చదువు, వురోవైపు స్నేహితులు, పబ్‌లు, క్లబ్‌లతో జీవితం సరదాగా గడిచిపోయేది. ఇగ్నోలో బీకామ్ చేసి నాన్న వ్యాపారంలోకి అడుగుపెట్టా. ఆ తర్వాత మనీషాను పెళ్లాడా. అంతా బాగున్న సమయంలో... 2006, ఆగస్టు 18న బుల్లెట్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రవూదంలో కుడి కాలు పూర్తిగా చచ్చుబడింది. ఆ సవుయుంలో బతుకంటే భయుం కలిగింది. అయితే నాన్న మాత్రం ‘దేవుడు నీకు రెండో జీవితం ఇచ్చాడు. కాలు పోయినా ఫర్వాలేదు.. జీవితంలో ప్రత్యేకంగా ఏదైనా సాధించు’ అని స్ఫూర్తిని రగిలించారు. దక్షిణాఫ్రికా నుంచి బయోనిక్ లెగ్ తెప్పించుకుని కొత్త జీవితం ప్రారంభించా. ఒకసారి హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ హోర్డింగ్ చూశా. ఆసక్తిగా అనిపించింది. సైక్లింగ్ చేయగలనా అని ఆలోచించా. సైకిల్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ, పడుతూ లేస్తూ పర్ఫెక్ట్ అయిపోయా. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. హైదరాబాద్ టు బెంగళూరు 540 కిలోమీటర్లను సైకిల్‌పై మూడురోజుల్లో చుట్టి వచ్చా. 2013లో పారా ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్ కోసం చేస్తున్న ప్రాక్టీస్‌లో గాయాలైనా, అందులో భారత్ తరఫున పాల్గొని రెండు రజతాలు సాధించా. అదే ఏడాది లండన్ నుంచి పారిస్ వరకు సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించా. కిందటేడాది డిసెంబర్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 32 రోజుల పాటు సైక్లింగ్ చేశా. నా లక్ష్యం 2016 పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించడం. - సాక్షి, సిటీప్లస్ -
బైక్ 1 భలే..
చూడ్డానికి మామూలు సైకిల్లాగేనే కనిపిస్తున్నా.. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడు ఒబామా కోసం తయారుచేసిన సైకిల్. చిలీకి చెందిన ఆక్స్ఫర్డ్ కంపెనీ దీన్ని రూపొందించింది. ఇంతకీ ఎందుకు: గల్ఫ్ యుద్ధం జరిగి 24 ఏళ్లవుతున్న సందర్భంగా నాటి యుద్ధానికి స్మారకంగా సదరు కంపెనీ బైక్ 1ను ఒబామాకు పంపుతోంది. ప్రత్యేకతలు: 8 గేర్లు, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు, ఒబామా ఉపయోగించే బ్లాక్‌బెర్రీ ఫోన్ చార్జ్ చేసుకునేందుకు చార్జింగ్ పాయింట్, ఎల్ఈడీ లైట్లు, గ్రీజు, ఆయిల్ అవసరం లేని చెయిన్ వ్యవస్థ. అన్నింటికన్నా ముఖ్యంగా ‘న్యూక్లియర్ బటన్’. ఒబామా ఎక్కడికెళ్లినా, అతనితోపాటు న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ ఒకటి ఉంటుంది. అందులో దేశ అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఉపయోగించే లాంచింగ్ కోడ్స్ ఉంటాయి. బైక్ 1లోనూ ఆ బ్రీఫ్‌కేస్ పెట్టుకోవచ్చు. కొసమెరుపు: చమురు కోసం నాడు జరిగిన గల్ఫ్ యుద్ధానికి గుర్తుగా.. ఒబామాకు త్వరలో బైక్ 1 ను పంపనున్న ఆక్స్ఫర్డ్.. పనిలోపనిగా అమెరికా విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ.. చురకలేసింది. ఒబామా దీన్ని విరివిగా ఉపయోగించడం ద్వారా పర్యావరణ అనుకూలమైన రవాణా విధానాలకు మరింత ప్రాచుర్యం తెస్తారని ఆశిస్తున్నామని చెబుతూ.. ‘‘మనమందరమూ సైకిల్‌నే ఉపయోగిస్తే.. భవిష్యత్తులో చమురు కోసం యుద్ధాలు జరగనే జరగవు’’ అంటూ చిన్నగా వాతపెట్టింది. -
‘తెలంగాణ’ కోసం సైకిల్‌యాత్ర
తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వీరప్ప మహరాజ్ చేపట్టిన సైకిల్‌యాత్ర బుధవారం పిట్లం మండల కేంద్రానికి చేరుకుంది. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం తాత్సారాన్ని నిరసిస్తూ సైకిల్‌యాత్ర చేపట్టానని తెలిపారు. ఇప్పటికి మెదక్ జిల్లాలో 11 మండలాల్లో సైకిల్‌యాత్ర పూర్తి చే శానని, జిల్లాలో 11 మండలాల్లో యాత్ర చే పడతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు సైకిల్‌యాత్ర చేపడతానని ఆయన పేర్కొన్నారు. - పిట్లం, న్యూస్‌లైన్ -
వరంగల్ టూ పరకాల
=ఐఎంఏ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర =వరంగల్‌లో ప్రారంభించిన బీజేపీ నేత రాజేశ్వర్‌రావు =పరకాల సభకు హాజరైన ఎమ్మెల్యే బిక్షపతి పరకాల/పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ‘ఆత్మహత్యలొద్దు - హింస వైపు మరలొద్దు, ప ర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదాలతో ఐఎంఏ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్‌యాత్ర నిర్వహించారు. వరంగల్ కొత్తవాడలోని అమరవీరుల స్థూపం నుంచి పరకాలలోని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది. తొలుత అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించారు. కాంగ్రెస్ మాట నమ్మేలా లేదు తెలంగాణ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ ఉద్య మ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. వరంగల్‌లో సైకిల్‌యాత్రను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. కాంగ్రెస్ కుట్రలను అధిగమించేందుకు తెలంగాణ ఏర్పడే వరకు పోరాటం సాగించాలని కోరారు. కా గా, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం వెనుక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర ఉందని ఆయన విమర్శించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మా ట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడేందుకు సైకిల్ యాత్ర చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు మాట్లాడుతూ కాలుష్య రహిత తెలంగాణ కావాలనే ఆకాంక్షతో పాటు యువత ఆత్మహత్యలను అరికట్టేందుకు యాత్ర చేపట్టామని తెలిపారు. తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కొంత ఆలస్యం జరగొచ్చే మో కానీ అడ్డుకునే శక్తి మాత్రం ఎవరికీ లేదని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. పరకాలకు చేరుకున్న సైకిల్‌యాత్రకు సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలకిన ఎమ్మెల్యే అమరధామం వరకు పాదయాత్రగా వారితో వెళ్లారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప ఇతర దేనికీ ఒప్పుకునేది లేదన్నారు. అమరధామం సాక్షిగా తెలంగాణ ఏర్పడే వరకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మందా డి సత్యనారాయణ, రామగళ్ల పరమేశ్వర్, యెలగం సత్యనారాయణ, చింతాకుల సునీల్, రఘుణారెడ్డి, బోడ డిన్నా, కొక్కుల సతీష్, సోమ మధుకర్, డాక్టర్ వలబోజు మోహన్‌రావు, అశోక్‌రెడ్డి, సంగా ని జగదీ శ్వర్, గజ్జెల ఓంకార్ లింగశాస్త్రి, పేరిణి రంజిత్‌కుమార్, బొచ్చు వినయ్, దగ్గు రవీందర్రావు, ఏకు రమేష్, గుం డెబోయిన రాజు, కుమార్, ఆర్పీ జయంత్‌లాల్, మేక ల రాజవీరు, డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి, కాటూరి శ్రీధరాచార్య, ఎడ్ల సుధాకర్, శ్రీహరి, జగ్గయ్య, కక్కు రాజు, ముచినపల్లి శివప్రసాద్, పచ్చిక రంజిత్‌రెడ్డి, నాగరాజు, అశోక్, సురేష్, శ్రీనివాస్, సతీష్, అవినాష్, సాగర్, శేఖర్, రమేష్, రాజు, అనిల్, మణికంఠ, అంజి, ప్రేమ్, చిరంజీవి, సురేష్, చంటి, శివాజీ, అశోక్, దేవేం దర్‌రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.