వరంగల్ టూ పరకాల | Warangal to parakala | Sakshi
Sakshi News home page

వరంగల్ టూ పరకాల

Published Mon, Oct 21 2013 2:33 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

Warangal to parakala

 

=ఐఎంఏ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర
=వరంగల్‌లో ప్రారంభించిన     బీజేపీ నేత రాజేశ్వర్‌రావు
=పరకాల సభకు హాజరైన ఎమ్మెల్యే బిక్షపతి

 
పరకాల/పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ‘ఆత్మహత్యలొద్దు - హింస వైపు మరలొద్దు, ప ర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదాలతో ఐఎంఏ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్‌యాత్ర నిర్వహించారు. వరంగల్ కొత్తవాడలోని అమరవీరుల స్థూపం నుంచి పరకాలలోని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది. తొలుత అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించారు.
 
కాంగ్రెస్ మాట నమ్మేలా లేదు

తెలంగాణ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ ఉద్య మ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. వరంగల్‌లో సైకిల్‌యాత్రను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. కాంగ్రెస్ కుట్రలను అధిగమించేందుకు తెలంగాణ ఏర్పడే వరకు పోరాటం సాగించాలని కోరారు. కా గా, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం వెనుక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర ఉందని ఆయన విమర్శించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మా ట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడేందుకు సైకిల్ యాత్ర చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు మాట్లాడుతూ కాలుష్య రహిత తెలంగాణ కావాలనే ఆకాంక్షతో పాటు యువత ఆత్మహత్యలను అరికట్టేందుకు యాత్ర చేపట్టామని తెలిపారు.
 
తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కొంత ఆలస్యం జరగొచ్చే మో కానీ అడ్డుకునే శక్తి మాత్రం ఎవరికీ లేదని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. పరకాలకు చేరుకున్న సైకిల్‌యాత్రకు సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలకిన ఎమ్మెల్యే అమరధామం వరకు పాదయాత్రగా వారితో వెళ్లారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప ఇతర దేనికీ ఒప్పుకునేది లేదన్నారు. అమరధామం సాక్షిగా తెలంగాణ ఏర్పడే వరకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మందా డి సత్యనారాయణ, రామగళ్ల పరమేశ్వర్, యెలగం సత్యనారాయణ, చింతాకుల సునీల్, రఘుణారెడ్డి, బోడ డిన్నా, కొక్కుల సతీష్, సోమ మధుకర్, డాక్టర్ వలబోజు మోహన్‌రావు, అశోక్‌రెడ్డి, సంగా ని జగదీ శ్వర్, గజ్జెల ఓంకార్ లింగశాస్త్రి, పేరిణి రంజిత్‌కుమార్, బొచ్చు వినయ్, దగ్గు రవీందర్‌రావు, ఏకు రమేష్, గుం డెబోయిన రాజు, కుమార్, ఆర్‌పీ జయంత్‌లాల్, మేక ల రాజవీరు, డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి, కాటూరి శ్రీధరాచార్య, ఎడ్ల సుధాకర్, శ్రీహరి, జగ్గయ్య, కక్కు రాజు, ముచినపల్లి శివప్రసాద్, పచ్చిక రంజిత్‌రెడ్డి, నాగరాజు, అశోక్, సురేష్, శ్రీనివాస్, సతీష్, అవినాష్, సాగర్, శేఖర్, రమేష్, రాజు, అనిల్, మణికంఠ, అంజి, ప్రేమ్, చిరంజీవి, సురేష్, చంటి, శివాజీ, అశోక్, దేవేం దర్‌రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement