Mohan Rao
-
ప్రజలు – పోలీసుల బంధం బలపడాలి
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది. పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది. పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి. కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించాలి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి. అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి. – డా. పి. మోహన్‌రావు విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం) -
ఎయిడ్స్ ఉందని ప్రచారం.. దశాబ్దాల తర్వాత నోరు విప్పిన హీరో
సెలబ్రిటీలపై ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కొందరు చూసీ చూడనట్లు ఉంటారు. కొందరేమో అగ్గి మీద గుగ్గిలమవుతారు. మరికొందరేమో కోపమొచ్చినా, బాధేసినా మనసులోనే దాచుకుంటారు. అలా ఒకప్పటి పాపులర్ హీరో మోహన్ మీద అప్పట్లో పెద్ద తప్పుడు ప్రచారం జరిగింది. అతడికి ఎయిడ్స్ ఉందని ఎవరో వదంతులు సృష్టించారు. ఇంకేముంది.. ఇది నిజమేనని చాలామంది వార్తలు రాసేశారు. దశాబ్దాల తర్వాత ఆ తప్పుడు వార్తలపై స్పందించాడు.ఎయిడ్స్ ఉందని ప్రచారం..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. '90'స్లో సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు నాకు ఎయిడ్స్ అని ప్రచారం చేశారు. ఇది విని నా అభిమానులు ఆందోళన చెందారు. కుటుంబం సైతం ఇబ్బందిపడింది. కానీ ఆ సమయంలో నాకు ఎంతో అండగా నిలిచింది. నాకు ఎయిడ్స్ లేదని మీడియాకు క్లారిటీ ఇవ్వమని ఓ జర్నలిస్టు సలహా ఇచ్చాడు. నేనందుకు ఒప్పుకోలేదు. స్పందించేందుకు ఇష్టపడని హీరోఈ పుకారు సృష్టించేదే మీడియా.. కాబట్టి వాళ్లంతట వాళ్లే ఇది తప్పని చెప్పాలని మొండిగా వ్యవహరించాను. ఏ సంబంధమూ లేని నన్ను బలి చేసినప్పుడు పనికి మాలిన పుకారు గురించి స్పందించాల్సిన అవసరం నాకేంటని సైలెంట్‌గా ఉన్నాను. అప్పుడు నా భార్య, కుటుంబం నాకెంతో అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు.రెండో సినిమాకే బ్రహ్మరథంకాగా మోహన్.. 1980వ సంవత్సరంలో మూడు పని అనే తమిళ చిత్రంతో వెండితెరపై ప్రయాణం ఆరంభించాడు. తన రెండో సినిమా నేంజతై కిల్లతే ఏడాదిపాటు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఆడటంతో పాటు మూడు జాతీయ అవార్డులు అందుకుంది. అక్కడి నుంచి మోహన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సిల్వర్ జూబ్లీ హీరోఆయన సినిమాలు ఏడాదిపాటు సక్సెస్‌ఫుల్‌గా ఆడటం సర్వసాధారణం కావడంతో తనను సిల్వర్ జూబ్లీ హీరో అని పిలిచేవారు. ఈయన తెలుగులో తూర్పు వెళ్లే రైలు, శ్రవంతి, అనంత రాగాలు, ఆలాపన, చూపులు కలిసిన శుభవేళ, అబ్బాయితో అమ్మాయి వంటి చిత్రాల్లో నటించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన జూన్ 7న విడుదలైన హర (తమిళ) చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు.చదవండి: హీరోయిన్ కాకపోయుంటే ఏం చేసేదాన్నంటే?: ప్రియాంక మోహన్ -
ముధోల్ బరిలో అన్నదమ్ముళ్లు! ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రజలు!
సాక్షి, ఆదిలాబాద్: భైంసా మండలం బడ్గాం గ్రామానికి చెందిన బోస్లే గోపాల్‌రావుపటేల్ – కమలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్. భైంసాలో జిన్నింగ్ ఫ్యాక్టరీ నడిపే ఇరువురు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి మొదటిసారి బరిలో దిగిన నారాయణరావుపటేల్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డెన్నపై గెలుపొందారు. అలాగే పవార్ శ్యాంరావుపటేల్ – రాధాబాయిల కుమారుడైన పవార్ రామారావుపటేల్ ఇద్దరికీ వరుసకు సోదరుడు. అక్కాచెల్లెల్ల పిల్లలైన ఈ ముగ్గురు కలిసి వ్యాపారం చేసేవారు. ఒకేచోట ఉన్న వీరు పరిస్థితులతో రాజకీయ పార్టీలు వేరై ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. ఆసక్తికరంగా పోటీ.. ముధోల్ అసెంబ్లీ బరిలో ఇద్దరు అన్నదమ్ములు నిలిచారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్ పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లోనూ ఇద్దరు అన్నదమ్ముళ్లు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పవార్ రామారావుపటేల్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోస్లే నారాయణరావుపటేల్లు బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్, బోస్లే మోహన్రావుపటేల్లు నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటర్ల వద్దకు ప్రచారానికి వెళ్లారు. 2023 ఎన్నికల్లో బోస్లే మోహన్‌రావుపటేల్ పవార్ రామారావుపటేల్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఒకప్పుడు ముగ్గురు ఒక్కటే.. 1994 ఎన్నికల నుంచి 2009 ఎన్నికల వరకు ముగ్గురు అన్నదమ్ముళ్లు ఏకతాటిపైనే ఉండేవారు. 1994 ఎన్నికల్లో బోస్లే నారాయణరావుపటేల్ ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో వ్యాపారాలు పవార్ రామారావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్ చూసుకునేవారు. ముగ్గురు అన్నదమ్ముళ్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉండేవారు. గడిచిన పదేళ్లలో రాజకీయ వైరుధ్యాలతో వేర్వేరుగా పోటీచేస్తున్నారు. అన్నదమ్ముళ్లే ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఇరువురు సోదరులు రెండు జాతీయ పార్టీల నుంచి పోటీచేస్తున్నారు. -
‘ఆ ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : మండపేట టౌన్లో రాత్రిపూట పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు తెలిపారు. బుధవారం డీఐజీ మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసంపై కేసు నమోదు చేసి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో 20 మంది వరకు అనుమాతులు ఉన్నారని, సీసీ టీవీ ఫుటేజ్‌లో కొంతమందిని గుర్తించినట్లు తెలిపారు. మండపేట ప్రజలు సమన్వయంతో ఉండాలని సూచించారు. (‘చలో అంతర్వేది’కి అనుమతుల్లేవ్) ‘అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతి దేవాలయాల దగ్గర కమిటీలు ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ ఏర్పరుచుకోవాలి. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పరుచుకుని గుడి బాధ్యతలు కమిటీ తీసుకోవాలి. చిన్న టెంపుల్స్‌లో సైతం కమిటీలు బాధ్యత తీసుకోవాలి. కమిటీలు ఏర్పాటు చేయని ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలి’. అని ఏలూరు రేంజ్ డీఐజీ పేర్కొన్నారు. (అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత') -
‘ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదు’
సాక్షి, పశ్చిమగోదావరి : సెప్టెంబరు అయిదో తేదిన అంతర్వేది రథం కేసును సీబీఐకు అప్పగించడం జరిగిందని ఏలూరు రేంజ్ డీఐజీ మోహానరావు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పరంగ కొత్త రథం తయారు అవుతుందని వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో కొన్ని పార్టీలు ఛలో అమలాపురం అంటు పిలుపునిస్తున్నాయని, ఛలో అమలాపురం కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కోనసీమ ప్రశాంతమైన జిల్లా అని, కోవిడ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 అమలులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదన్న విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీఐజీ ఈ కేసులో అనుమానితులని విచారిస్తున్నామన్నారు. (‘గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదు’) -
విస్తుగొలిపే మోహనరావు వికృతాలు
గుంటూరు: గుంటూరు జిల్లా ఫారెస్ట్ అధికారి మోహనరావు వికృత చేష్టలపై డొంక కదులుతోంది. పోలీసుల విచారణలో పలువురు బాధిత మహిళలు ఆయన అకృత్యాలను ధైర్యంగా బయటపెడుతున్నట్టు తెలిసింది. ఉద్యోగాల పేరుతో యువతుల నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వికృత చేష్టలకు పాల్పడుతున్న కె.మోహనరావుపై మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉద్యోగం పేరుతో రూ.2 లక్షలు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వేధిస్తూ వికృత చేష్టలకు పాల్పడేవారని చీరాలకు చెందిన యువతి బుధవారం అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మేడికొండూరు సీఐ ఎం.ఆనందరావు, సిబ్బంది పేరేచర్లలోని ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకుని అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని విచారించారు. చదవండి: ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు అయితే ఫారెస్ట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ యువతిని కూడా బలవంతంగా లొంగదీసుకుని సెలవు రోజుల్లో ఆమెపై వికృత చేష్టలకు పాల్పడినట్టు పోలీసుల ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైందని తెలిసింది. గుంటూరుకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం వెళితే రూ.4 లక్షలు తీసుకుని ఆమెను కూడా ఇదే తరహాలో భయపెట్టి లోబరచుకున్నాడు. తన డబ్బు ఇవ్వకుంటే నడిరోడ్డుపై కూర్చుంటానని ఆ యువతి హెచ్చరించడంతో విడతలవారీగా రూ.3.50 లక్షలు తిరిగి ఇచ్చాడని ఆమె చెప్పినట్టు సమాచారం. మాచర్లకు చెందిన ఓ రిక్షా కార్మికుడి కుమార్తెను కూడా ఇదే తరహాలో లోబరుచుకునేందుకు యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అనంతరం మోహనరావు ఆ రిక్షా కార్మికుడిని బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశాడని తెలిసింది. అయితే ఈ విషయం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టిలో ఉండటంతో ఆయన కూడా ఈ విషయాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టికి తీసుకెళ్లి.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. డీఎఫ్ఓను బదిలీ చేయండి సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు డీఎఫ్ఓను మోహనరావును తక్షణమే బదిలీ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మోహన్‌రావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మంత్రికి ఫిర్యాదు అందింది. దీంతో ఆయనను తక్షణమే బదిలీ చేసి, విచారణ జరిపి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ దళాల అధిపతి రిజ్వీని మంత్రి ఆదేశించారు. -
జాబ్ పేరుతో వికృత చేష్టలు, డీఎఫ్‌వోపై బదిలీ వేటు!
సాక్షి, అమరావతి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా అటవీశాఖాధికారి డీఎఫ్‌వో మోహన్‌రావుపై బదిలీ వేటు పడింది. ఆరోపణలపై విచారణ జరిపి తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నత అధికారులను విద్యుత్, అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నివేదిక రాగానే డీఎఫ్‌వోపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పస్టం చేశారు. కాగా అటవీశాఖలో కాంట్రాక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని మోహన్‌రావు ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేయడంతో పాటు కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు లేదు.. ఉద్యోగమూ లేదని చెప్పడంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మంత్రి బాలినేని సదరు అధికారిని బదిలీ చేయాలంటూ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. చదవండి: ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు -
ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు
గుంటూరు: ‘అటవీశాఖలో కాంట్రాక్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని జిల్లా అటవీశాఖాధికారి చెప్పాడు. చివరకు రూ.2 లక్షలు తీసుకున్నాడు. డబ్బు ఒక్కటే అర్హత కాదు.. కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు లేదు.. ఉద్యోగమూ లేదు పొమ్మన్నాడు.’ అంటూ ఓ బాధితురాలు బుధవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. భర్తతో మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కుమార్తెతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. డీ–ఫార్మసీ చదివిన ఆమె ఉద్యోగ వేటలో పడింది. ఈ క్రమంలో గుంటూరులోని అటవీశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫారెస్ట్ ఆఫీసర్ మోహనరావును ఆమె మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఫారెస్ట్ కార్యాలయంలో కలిసింది. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇచ్చి.. ఆపై పర్మినెంట్ చేస్తానని మోహనరావు చెప్పారు. అంతడబ్బు ఇచ్చుకోలేనని ప్రాథేయపడటంతో చివరకు రూ.2 లక్షలకు అంగీకరించారు. ఫిబ్రవరి 24న గుంటూరులోని కార్యాలయంలో డబ్బు ఇచ్చి దరఖాస్తు చేసింది. రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేసి ఉద్యోగం విషయమై ప్రశ్నించింది. అయితే గుంటూరు రావాలని మోహనరావు చెప్పడంతో వెళ్లి ఆయనను కలిసింది. డబ్బులిస్తే ఉద్యోగాలు రావని, కోర్కెలు కూడా తీర్చాలన్నాడు. నిరాకరిస్తే ఉద్యోగం రాదని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. తన వికృత చేష్టలతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడు. ఇలా ఐదు నెలలు గడిచినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆయనను నిలదీయగా.. ఉద్యోగం లేదు.. డబ్బూ లేదని తెగేసి చెప్పాడు. మోసపోయానని గ్రహించిన ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఇద్వా నాయకులకు వివరించింది. హోంమంత్రికి ఫిర్యాదు.. ఈ క్రమంలో ఇద్వా నాయకుల సూచనల మేరకు హోంమంత్రి మేకతోటి సుచరితను మంగళవారం ఆమె కార్యాలయంలో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనను సీరియస్‌గా పరిగణించిన హోం మంత్రి.. వెంటనే అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆమె సూచనల మేరకు బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని మేడికొండూరు సీఐ ఆనందరావును ఎస్పీ ఆదేశించారు. బాధితులు ఇంకా ఉన్నారు! తనలాగా మోసపోయిన బాధితులు మరెందరో ఉన్నారని, గుంటూరుకు చెందిన ఓ యువతి కూడా తనలాగే మోసపోయిందని బాధితురాలు చెబుతోంది. తన కార్యాలయంలో కూడా మోహనరావు కొందరిని ఇలానే వేధించాడని.. బాధితులంతా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని తెలిపింది. ఉద్యోగాల పేరుతో మహిళలను వేధిస్తున్న జిల్లా అటవీశాఖాధికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆయనను విధుల నుంచి తొలగించి సీఐడీ విచారణకు ఆదేశించాలని ఇద్వా వ్యవస్థాపకుడు జి.రాజసుందరబాబు డిమాండ్ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
వ్యాను బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం వెంకటాపురంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొల్లేరు వైపు చేపల మేత లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న పిళ్లా మోహన్‌రావు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మోహన్‌రావు స్వగ్రామం మండలంలోని భువనపల్లి. -
మోహన్‌రావు ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రవాణా ఉప కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌రావు ఇంటిపై ఏసీబీ దాడులు శుక్రవారం రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 50 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మోహన్‌రావు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా మోహన్ రావు ఇంటి నుంచి 2.5 కేజీల బంగారంతోపాటు 5.5 కేజీల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే సొదాల్లో భాగంగా మోహన్‌రావు కుమార్తె పేరు మీద 9 ఎకరాలు, 6 బినామీ కంపెనీలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కొంపల్లి, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో మోహన్‌రావు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు కనుగొన్నారు. మోహన్‌రావును నేడు ఏసీబీ కోర్టు కు తరలించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు డీటీసీ మోహన్ రావుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ గురువారం దాడి చేసింది. -
ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
గుంటూరు జిల్లా గురజాలలో రెండో రోజు ఎడ్ల బండలాగుడు బలప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. స్థానిక పాతపాటేశ్వరి ఆలయం 417వ తిరునాళ్ల సందర్భంగా గ్రామ రైతు కమిటీ ఈ పోటీలను నిర్వహిస్తోంది. సోమవారం జరుగుతున్న వ్యవసాయ విభాగం 6 పళ్ల ఎడ్ల జతల పోటీలకు పెద్ద సంఖ్యలో రైతులు తమ ఎడ్లతో తరలివచ్చారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా రామకృష్ణ ప్రసాద్, మోహన్‌రావు వ్యవహరిస్తున్నారు. -
చదువుకోరా అంటే.. ఆత్మహత్య చేసుకున్నాడు..
శ్రీకాకుళం జిల్లా భామిని మండల కేంద్రానికి చెందిన ఓ ఐటీఐ విద్యార్థి తల్లిదండ్రులు మందలించారని... మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నాల మోహన్‌రావు శ్రీకాకుళంలో ఐటీఐ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా కళాశాలకు వెళ్లకపోవడంతో చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన మోహన్‌రావు మంగళవారం ఉదయం పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో మరణించాడు. -
స్పెషల్ కౌన్సెల్స్‌గా మోహన్‌రావు, వివేక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తరఫున వివిధ ట్రిబ్యునళ్లు, భూ ఆక్రమణల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కి సహకరించేందుకు ఇద్దరు న్యాయవాదులను స్పెషల్ కౌన్సెల్స్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాదులు మోహన్‌రావు, కె.వివేక్‌రెడ్డిలను స్పెషల్ కౌన్సెల్స్‌గా నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అడ్వొకేట్ జనరల్‌పై పెరిగిపోతున్న పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నియామకాలు చేసింది. వీరిద్దరూ ఏజీ ఆదేశాల మేరకు, ఆయన పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు వీరు తమ పదవుల్లో కొనసాగుతారు. -
పథకాల అమలుపై నిరంతర నిఘా
ఏటీఅగ్రహారం(గుంటూరు) ప్రభుత్వ పథకాలు అమలుపై విజిలెన్స్ నిఘా నిరంతరం కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కె.వి.మోహన్‌రావు చెప్పారు. బుధవారం ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందన్నారు. అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను సీరియస్‌గా పరిగణిస్తామన్నారు. మైనింగ్, ఇసుక మాఫీయాపై నిఘా కొనసాగించి వివిధ శాఖల అధికారులతో సంయుక్త దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మైనింగ్, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించి రేషన్‌బియ్యం, మైనింగ్, ఇసుక మాఫీయాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు సమాచారాన్ని 80082 03288 సెల్‌నంబరుకు అందించాలని కోరారు. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నందున సమర్థంగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత చరిత్ర ఇదీ.. మోహన్‌రావు 2006 ఐపీఎస్ బ్యాచ్‌లో డీఎస్పీగా విధుల్లో చేరారు. కొత్తగూడెం, కామారెడ్డి, నిజామాబాద్, గుంతకల్లుల్లో విధులు నిర్వహించారు. ఏఎస్పీగా పదోన్నతి పొంది కర్నూలు, విశాఖపట్నం రూరల్ జిల్లాల్లో పనిచేసి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొంది నెల్లూరు విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు. 2012లో ఎస్పీగా పదోన్నతి పొంది మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌కు నియమితులయ్యారు. అనంతరం నిజామాబాద్‌లో ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. అధికారులు, కార్యాలయ ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్డీ రామకృష్ణలను మర్యాదపూర్వకంగా కలిశారు. -
మూలకణాలతో గుండెకు చికిత్స
15 నిమిషాల్లో డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేసే పరిజ్ఞానం సీఎస్ఐ వార్షిక సదస్సులో సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: మూలకణాల (స్టెమ్‌సెల్స్) ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను నయం చేసే సరికొత్త పరిజ్ఞానం త్వరలోనే అందుబాటులోకి రానుందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ మోహన్‌రావు స్పష్టం చేశారు. గుండెలో మూల కణాలు ఉండవనేది అపోహ మాత్రమేనని, ఇప్పటికే జరిగిన అనేక పరిశోధనలు ఇదే అంశాన్ని నిర్ధారించాయన్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్‌హయత్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏపీ చాప్టర్) 19వ వార్షిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ హృద్రోగ బాధితుల్లో చాలామందికి ప్రస్తుతం ఓపెన్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు చేస్తున్నారని, ఖరీదైన స్టంట్స్‌ను అమర్చి మూసుకుపోయిన రక్తనాళాలను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి శస్త్రచికిత్సల అవసరం ఉండబోదన్నారు. స్టెమ్‌సెల్స్ పరిజ్ఞానం ద్వారా హృద్రోగ సంబంధ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని చెప్పారు. గుండెనొప్పికి కారణాలను కనుగొనేందుకు చేసే డీఎన్ఏ పరీక్షలు 15 నిమిషాల్లోనే పూర్తిచేసే సరికొత్త పరిజ్ఞానాన్ని మరో మూడేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే ఫార్మికోజెనిటిక్స్ ఆధారంగా రోగి అవ సరానికి తగినట్లుగా మందులు తయారు చేసే పరిజ్ఞానం కూడా రాబోతుందన్నారు. సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది హృద్రోగ నిపుణులు హాజరయ్యారు. -
డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : తిరుపతి-కాచిగూడ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలును గురువారం ఉదయం ప్రారంభించారు. ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే సిబ్బంది చేత ఉదయం 5:45 గంటలకు రైలును ప్రారంభించారు. అనంతరం స్థానిక లైజాన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ 2014 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన డబుల్ డెక్కర్ రైలును తిరుపతి నుంచి నడపడం జిల్లా వాసులకే కాకుండా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతం అన్నారు. ఈ రైలులో మూడు అంచెల కుషన్ సీట్లు, ఫుల్ ఏసీ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ రైలు ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడ వెళ్తుందని లైజాన్ ఆఫీసర్ తెలిపారు. కాగా గురువారం తొలిరోజు ఈ రైలులో గుంతకల్ సీనియర్ డీసీఎం స్వామినాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే టీటీఐలు మోహన్‌రావు, మహబూబ్ బాషా, సిరాజ్, గార్డు వరప్రసాద్, కలాసీ చిన్నబ్బ, టెక్నీషియన్ అంజనయ్యతో పాటు చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ దాసరి రాధాకృష్ణ, స్టేషన్ మేనేజర్ మాదిన గంగులప్ప, సీడీవో రామ్మోహన్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ప్రభాకర్‌రావు, ఏఈ కృపానంద్, స్క్వాడ్ ఇన్స్పెక్టర్లు టీవీ రావు, వేణుమాధవ్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ కుప్పాల గిరిధర్‌కుమార్ పాల్గొన్నారు. -
కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర
పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం మేడపల్లి సబ్‌స్టేషన్ ముట్టడి నల్లబెల్లి, న్యూస్‌లైన్ : మండలంలో ఇష్టానుసారం విధిస్తున్న కరెంటు కోతలతో విసిగి వేసారిన మేడపల్లి సమీప గ్రామాల రైతులు బుధవారం సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి, మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయని, ఈ సమయంలో వేళాపాలా లేకుండా విధిస్తున్న కరెంటు కోతలతో నష్టపోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ పరిధిలో మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, కొండాపురం గ్రామాల రైతులు ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని, ఈ క్రమంలో కరెంటు తరచూ నిలిచిపోవడం వల్ల మోటార్లు సరిగా నడవక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. ఈ సమయంలో ఏఈ బ్రహ్మయ్య భయపడి అక్కడికి వెళ్లకపోవడంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఆందోళన కొనసాగిస్తూనే మరోవైపు ఫోన్లద్వారా పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అధికారులు స్పందించి వెంటనే ఏఈని అక్కడికి పంపించి గ్రామాలకు రోజుకు 18గంటలు, వ్యవసాయానికి ఏడు గంటలు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని లిఖిత పూర్వక హామీ ఇప్పించారు. శాంతించిన రైతులు ఆందోళన విరమించారు. రైతులకు మద్దతుగా సర్పంచ్‌లు బాదావతు రవి, విడియాల రేవతీప్రభాకర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సంగ పోషాలు, నాయకులు మోహన్‌రావు, సురేశ్రావు ఆందోళనలో పాల్గొన్నారు. -
శాంతిస్వరూప్ స్మారక క్రీడలు షురూ
తార్నాక, న్యూస్‌లైన్: తార్నాకలోని ఐఐసీటీ క్లబ్ మైదానంలో మంగళవారం 45వ శాంతి స్వరూప్ భట్నాగర్ స్మారక క్రికెట్, వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీబీ డెరైక్టర్ జనరల్, ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సదస్సులో ఆయన మాట్లాడుతూ క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడుతాయన్నారు. అనంతరం ఐఐసీటీ రూపొం దించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. కొంతసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఐఐసీటీలో తను శాస్త్రవేత్తగా పని చేసిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం, సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు, ఆర్‌బీఎన్ ప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఎస్పీ బదిలీ
సాక్షి, నిజామాబాద్ : నాలుగు నెలల వ్యవధిలోనే జిల్లాకు మూడో ఎస్పీ రాబోతున్నారు. విక్రమ్ జిత్ దుగ్గల్ తర్వాత జిల్లా ఎస్పీగా వచ్చిన కేవీ మోహన్‌రావు ఆదివారం బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న తరుణ్జోషిని జిల్లా ఎస్పీగా నియమించింది. నాలుగు నెలల్లోపే.. మోహన్‌రావు ఈ ఏడాది జూలై 3న జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్న తరుణంలో ఆయన జిల్లాకు వచ్చారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. వినాయక చవితి ఉత్సవాలు, రంజాన్, దసరా, బక్రీద్ వంటి పండగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజావాణి, డయల్ యువర్ ఎస్పీ వంటి ప్రజా సంబంధ కార్యక్రమాలను కొనసాగించారు. గత నెలలో కొందరు కానిస్టేబుళ్లకు పదోన్నతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే తరుణంలోనే ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లావాసులు ఎంతో మంచివారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రజలు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మోహన్‌రావు 2004లో కామారెడ్డి డీఎస్పీగా పనిచేశారు. డాక్టర్.. పోలీసు జిల్లా ఎస్పీగా నియమితులైన తరుణ్ జోషి డెంటిస్టు. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ యువ అధికారి ఎక్కువ కాలం తెలంగాణ జిల్లాల్లోనే పనిచేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొద్ది రోజులు విధులు నిర్వర్తిం చారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో అదన పు ఎస్పీగా, ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేశారు. వరంగల్ జిల్లా ఓఎస్డీగా, విశాఖ పట్నం డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) గా విధులు నిర్వర్తించారు. 2010 ఆగస్టులో కడ ప జిల్లా ఎస్పీగా వెళ్లారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు. ప్రస్తుతం సౌత్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్ ఎస్పీగా బదిలీ చేసింది. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుం ది. రాజకీయ ఒత్తిళ్లు, నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్న జిల్లాలో ఆయన పనితీరు ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. -
వరంగల్ టూ పరకాల
=ఐఎంఏ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర =వరంగల్‌లో ప్రారంభించిన బీజేపీ నేత రాజేశ్వర్‌రావు =పరకాల సభకు హాజరైన ఎమ్మెల్యే బిక్షపతి పరకాల/పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ‘ఆత్మహత్యలొద్దు - హింస వైపు మరలొద్దు, ప ర్యావరణాన్ని కాపాడుదాం’ అనే నినాదాలతో ఐఎంఏ, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్‌యాత్ర నిర్వహించారు. వరంగల్ కొత్తవాడలోని అమరవీరుల స్థూపం నుంచి పరకాలలోని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది. తొలుత అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు 1969 ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించారు. కాంగ్రెస్ మాట నమ్మేలా లేదు తెలంగాణ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ ఉద్య మ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. వరంగల్‌లో సైకిల్‌యాత్రను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. కాంగ్రెస్ కుట్రలను అధిగమించేందుకు తెలంగాణ ఏర్పడే వరకు పోరాటం సాగించాలని కోరారు. కా గా, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం వెనుక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర ఉందని ఆయన విమర్శించారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మా ట్లాడుతూ పర్యవరణాన్ని కాపాడేందుకు సైకిల్ యాత్ర చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు మాట్లాడుతూ కాలుష్య రహిత తెలంగాణ కావాలనే ఆకాంక్షతో పాటు యువత ఆత్మహత్యలను అరికట్టేందుకు యాత్ర చేపట్టామని తెలిపారు. తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కొంత ఆలస్యం జరగొచ్చే మో కానీ అడ్డుకునే శక్తి మాత్రం ఎవరికీ లేదని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. పరకాలకు చేరుకున్న సైకిల్‌యాత్రకు సాయిబాబా దేవాలయం వద్ద స్వాగతం పలకిన ఎమ్మెల్యే అమరధామం వరకు పాదయాత్రగా వారితో వెళ్లారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప ఇతర దేనికీ ఒప్పుకునేది లేదన్నారు. అమరధామం సాక్షిగా తెలంగాణ ఏర్పడే వరకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మందా డి సత్యనారాయణ, రామగళ్ల పరమేశ్వర్, యెలగం సత్యనారాయణ, చింతాకుల సునీల్, రఘుణారెడ్డి, బోడ డిన్నా, కొక్కుల సతీష్, సోమ మధుకర్, డాక్టర్ వలబోజు మోహన్‌రావు, అశోక్‌రెడ్డి, సంగా ని జగదీ శ్వర్, గజ్జెల ఓంకార్ లింగశాస్త్రి, పేరిణి రంజిత్‌కుమార్, బొచ్చు వినయ్, దగ్గు రవీందర్రావు, ఏకు రమేష్, గుం డెబోయిన రాజు, కుమార్, ఆర్పీ జయంత్‌లాల్, మేక ల రాజవీరు, డాక్టర్ సిరికొండ శ్రీనివాసచారి, కాటూరి శ్రీధరాచార్య, ఎడ్ల సుధాకర్, శ్రీహరి, జగ్గయ్య, కక్కు రాజు, ముచినపల్లి శివప్రసాద్, పచ్చిక రంజిత్‌రెడ్డి, నాగరాజు, అశోక్, సురేష్, శ్రీనివాస్, సతీష్, అవినాష్, సాగర్, శేఖర్, రమేష్, రాజు, అనిల్, మణికంఠ, అంజి, ప్రేమ్, చిరంజీవి, సురేష్, చంటి, శివాజీ, అశోక్, దేవేం దర్‌రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.