తార్నాక, న్యూస్‌లైన్: తార్నాకలోని ఐఐసీటీ క్లబ్ మైదానంలో మంగళవారం 45వ శాంతి స్వరూప్ భట్నాగర్ స్మారక క్రికెట్, వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీబీ డెరైక్టర్ జనరల్, ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సదస్సులో ఆయన మాట్లాడుతూ క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడుతాయన్నారు. అనంతరం ఐఐసీటీ రూపొం దించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. కొంతసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఐఐసీటీలో తను శాస్త్రవేత్తగా పని చేసిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం, సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు, ఆర్‌బీఎన్ ప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
శాంతిస్వరూప్ స్మారక క్రీడలు షురూ
Published Wed, Jan 8 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM