Tharnaka
-
నడి రోడ్డు మీద బీజేపీ నేతల కుమ్ములాట
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరాయి. నడి రోడ్డు మీదే బీజేపీ నేతలు ఘర్షనకు దిగారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్ దాడి చేశారు. దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ హంగామా చేశారు. ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా రామచంద్రరావు ఇంటికి చేరుకున్నారు. తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్ ఆ దాడికి దిగినట్లు తెలుస్తోంది. -
విజేత ఎన్ఏఎల్
తార్నాక, న్యూస్‌లైన్: శాంతిస్వరూప్ భట్నాగర్ మెమోరియల్ క్రీడల్లో బెంగళూరుకు చెందిన నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్ (ఎన్ఏఎల్) జట్లు విజేతగా నిలిచాయి. తార్నాకలోని ఐఐసీటీ క్లబ్ గ్రౌండ్స్‌లో గత మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న 40 పరిశోధన సంస్థల నుంచి 16 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. క్రికెట్, వాలీబాల్ రెండు ఈవెంట్లలోనూ ఎన్ఏఎల్ జట్లే విజయం సాధించాయి. ముగింపు వేడుకలకు సీఎస్ఐఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ టి.రామస్వామి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
శాంతిస్వరూప్ స్మారక క్రీడలు షురూ
తార్నాక, న్యూస్‌లైన్: తార్నాకలోని ఐఐసీటీ క్లబ్ మైదానంలో మంగళవారం 45వ శాంతి స్వరూప్ భట్నాగర్ స్మారక క్రికెట్, వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీబీ డెరైక్టర్ జనరల్, ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సదస్సులో ఆయన మాట్లాడుతూ క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడుతాయన్నారు. అనంతరం ఐఐసీటీ రూపొం దించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. కొంతసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఐఐసీటీలో తను శాస్త్రవేత్తగా పని చేసిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం, సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు, ఆర్‌బీఎన్ ప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.