తార్నాక, న్యూస్‌లైన్: శాంతిస్వరూప్ భట్నాగర్ మెమోరియల్ క్రీడల్లో బెంగళూరుకు చెందిన నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్) జట్లు విజేతగా నిలిచాయి. తార్నాకలోని ఐఐసీటీ క్లబ్ గ్రౌండ్స్‌లో గత మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న 40 పరిశోధన సంస్థల నుంచి 16 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
క్రికెట్, వాలీబాల్ రెండు ఈవెంట్లలోనూ ఎన్‌ఏఎల్ జట్లే విజయం సాధించాయి. ముగింపు వేడుకలకు సీఎస్‌ఐఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ టి.రామస్వామి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
విజేత ఎన్‌ఏఎల్
Published Sat, Jan 11 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement