![Auto Driver celebrated for wife Going parents house](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/568.jpg.webp?itok=-q4G2DMR)
పోస్టర్ వేసి, బిస్కెట్లు పంపిణీ
సోషల్ మీడియాలో వీడియో వైరల్
బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఒకరు తన భార్య పుట్టింటికి వెళ్లడంతో తనకు సంతోషంగా ఉందని పోస్టర్‌ను తన ఆటోకి వేసుకొని తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. దానిని ఒక ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది చక్కర్లు కొడుతోంది.
ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉన్న తన సీటు వెనుకాల పోస్టర్‌ను కన్నడతోపాటు ఇంగ్లిష్‌లో వేయడంతో పాటు దాని పక్కనే బిస్కెట్లు పెట్టి తన ఆటో ఎక్కిన వారికి వాటిని ఇవ్వడంతో పాటు సంతోషం వ్యక్తం చేశాడు. దాంతో ఒక ప్రయాణికుడు ఆటో డ్రైవర్ సంతోషాన్ని చూసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment