![Baby born with rare case in Bengaluru](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/3333.jpg.webp?itok=EdlxExdu)
బెంగళూరు: వైద్య లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా వింత శిశువు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని హురా గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించింది. పుట్టిన శిశువును చూసి తల్లిదండ్రులు, వైద్యులు నోరెళ్లబెట్టారు. విచిత్రమైన కళ్లు, పెదవులు, ఒళ్లంతా బొగ్గులా నలుపు రంగుతో కూడి చూపరులకు వింత గొలిపింది.
హురా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వ్యాప్తిలోని ఒక గ్రామానికి చెందిన గర్భిణి నెలలు నిండి ప్రసవానికి చేరింది. కాన్పు కాగా శిశువు వింత ఆకారంతో జన్మించడం చూసి అవాక్కయ్యారు. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మైసూరులోని చెలువాంబ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు.
ఇది రెండోసారి
ఈ మహిళకు వింత శిశువు జన్మించడం ఇది రెండవసారి. కొన్నేళ్ల క్రితం ఇదే దంపతులకు ఇలాంటి రూపం కలిగిన శిశువు జన్మించింది. నాలుగైదు రోజుల తర్వాత మరణించింది. ఇప్పుడు పునరావృతమైంది. ఈ పరిణామం వైద్య లోకానికి సవాలు విసిరినట్లయింది. చాలా దగ్గరి బంధువుల మధ్య పెళ్లి జరగడం, లేదా ఆ దంపతులలో విపరీతమైన జన్యు సమస్యలు ఉండడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment