
ఇంట్లోకి ఒక్క పసిబిడ్డ వస్తేనే సందడి అంతా ఇంతా కాదు. అలాంటిది ఆ హాస్పిటల్‌లో 14 మంది నర్సులు ఒకే సమయంలో గర్భం దాల్చారు. వారంతా ఒకే నెలలో పిల్లల్ని కననున్నారు. కాన్సాస్ సిటీలోని సెయింట్ ల్యూక్స్ ఈస్ట్ హాస్పిటల్ ఈ విషయాన్ని తమ ఫేస్‌బుక్ పేజ్‌లో షేర్ చేసింది. అది చూసినవారంతా ‘వాట్ ఏ కో ఇన్సిడెన్స్’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది మొదటిదేం కాదు. అచ్చు ఇలాంటి సంఘటనే 2019లో యూఎస్‌లోని పోర్ట్‌ల్యాండ్ మయినే మెడికల్ సెంటర్‌లో జరిగింది.
అక్కడ 9 మంది నర్సులు ఒకే సమయంలో గర్భం దాల్చారు. ఆగస్టులోనే అందరూ పిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలతో కలిసి 9 మంది తల్లులు దిగిన ఫొటో ‘బేబీబూమ్’ అప్పట్లో వైరల్ అయ్యింది. మళ్లీ.. ఇప్పుడు మిస్సోరిలోని ల్యూక్ హాస్పిటల్ వంతయ్యింది. 14 మందిలో ఒకరు జూన్ 3న బిడ్డకు జన్మనివ్వగా.. 13 మంది డెలివరీ మంత్ డిసెంబర్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి డెలివరీలో తల్లీబిడ్డల సంతోషం కోసం చూసినట్టే.. ఈ 13 మంది పిల్లలకోసం ఎదురుచూస్తున్నామని హాస్పిటల్ వర్గాలు ఫేస్‌బుక్‌లో తమ ఆనందాన్ని పంచుకున్నాయి.
చదవండి: (భర్తను అద్దెకిచ్చిన భార్య.. అవాక్కవ్వకండి, అక్కడే ఉంది అసలు విషయం)
Comments
Please login to add a commentAdd a comment