Kansas City
-
అమెరికా ఎన్ఆర్ఐ కుటుంబానికి భారీ పరిహారం
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.శనివారం మాదాపూర్ టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ -
ఈ భూగర్భ వాణిజ్య కేంద్రం గురించి మీరెప్పుడైనా విన్నారా!?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వాణిజ్యకేంద్రం. అమెరికాలోని కాన్సస్ నగరంలో మిస్సోరీ నదీ తీరానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. నేలకు 150 అడుగుల లోతున 5.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భూగర్భ వాణిజ్య సముదాయంలో నిరంతరం వెయ్యిమందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.ఈ ప్రాంతంలో 27 కోట్ల ఏళ్ల నాటి సున్నపురాతి నిల్వలు బయటపడటంతో, ఇక్కడి సున్నపురాతినంతా తవ్వి తీసి, సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఈ భూగర్భ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు.హంట్ మిడ్వెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ వాణిజ్య సముదాయంలో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థలు, ఆహార ఉత్పత్తుల సంస్థలతో పాటు కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ కూడా ఇక్కడి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలతో పాటు అమెరికన్ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలను నిర్వహిస్తోంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాల్లో ఒక పోస్టాఫీసు, ఆర్కైవ్స్ కార్యాలయం, రికార్డు స్టోరేజీ కార్యాలయం ఉన్నాయి. పేరుకు ఇది వాణిజ్య సముదాయమే అయినా, విస్తీర్ణం దృష్ట్యా, వసతుల దృష్ట్యా ఇది నగరాన్ని తలపిస్తుంది. ఇందులో సరుకుల రవాణాకు వీలుగా 3.4 కిలోమీటర్ల రైలుమార్గం, సరుకులతో పాటు మనుషుల రవాణాకు వీలుగా 17 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండటం విశేషం. బయటి వాతావరణం ఎలా ఉన్నా, ఇందులోని వాతావరణం మాత్రం ఏడాది పొడవునా 19–21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఇవి చదవండి: అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..! -
అమెరికా స్పోర్ట్స్ పరేడ్‌లో కాల్పులు
కేన్సాస్ సిటీ: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మిస్సోరి రాష్ట్రం(స్టేట్) కేన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పరేడ్‌పై దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది దాకా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. కేన్సాస్ సిటీ చీఫ్స్ ‘సూపర్ బౌల్’ విజేతగా నిలవడంతో.. పరేడ్ నిర్వహించారు. ఆ సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరేడ్‌లో వేలాది మంది పాల్గొనగా.. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ తెలిపారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ అనేది అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో భాగం. ఏటా సూపర్ బౌల్ ఛాంపియన్ షిప్ జరుగుతుంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా.. వేల మంది ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. New video shows moment gunfire erupts at the Super Bowl rally in Kansas City. At least 22 people shot pic.twitter.com/dUYM9G07fg — BNO News (@BNONews) February 15, 2024 అమెరికాలో గన్ కల్చర్‌లో మాస్ షూటింగ్(సామూహిక కాల్పుల) ఘటనలూ తరచూ చోటుచేసుకుంటున్నాయి. కిందటి ఏడాది.. ఎన్బీఏ ఛాంపియన్షిప్ విజయం నేపథ్యంలో డెన్వర్(కొలరాడో)లో నిర్వహించిన ఫ్యాన్స్ సంబురాల్లోనూ కాల్పులు జరిగాయి. అప్పుడు పది మంది గాయపడ్డారు. అంతకు ముందు.. 2019లో టోరంటోలో జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. -
USA: చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది...
కాన్సాస్ సిటీ: నిద్ర పుచ్చేందుకు ఉయ్యాలలో ఉంచాల్సిన శిశువును పొరపాటున ఓవెన్లో పెట్టింది ఓ తల్లి. తప్పు గ్రహించేలోగానే ఆ శిశువు తీవ్రంగా కాలిన గాయాలతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన మరియా థామస్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తన శిశువును ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చాలనుకుంది. అయితే, చిన్నారిని పొరపాటున ఓవెన్లో ఉంచి, ఆన్ చేసింది. తప్పు తెలుసుకునే సరికే చిన్నారి ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు
కాన్సాస్: అమెరికా లోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూలులో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగువారు పాల్గొన్నారు. ప్రార్థనా గీతంతో కార్యక్రమానికి విశేషు రేపల్లె, శ్రావణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మన తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే కూచిపూడి, భరత నాట్యంతో పాటు జానపద నృత్యాలు అలరించాయి. కొత్త సినిమా పాటలకు చిన్నారుల నృత్యాలు, అభిగ్న పాటలు ప్రేక్షకులను ఉత్సాహపర్చాయి. టీఏజీకేసీకి సేవలు అందించిన శ్రీధర్ కొడాలి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శరత్ టేకులపల్లి, శ్రీధర్ అమిరెడ్డిలను టీఏజీకేసీ ఈ వేడుకలో ఘనంగా సత్కరించింది. టీఏజీకేసీ అధ్యక్షుడు వంశీ సువ్వారి, Trust chair దుర్గా తెల్ల గార్లను మెమొంటొలతో సత్కరించారు. Rafflesలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. 30 మందితో నిర్వహించిన ఫ్యాషన్ షో, ‘కాన్సాస్ కిష్కింద కాండ’ హాస్య నాటిక హైలైట్‌గా నిలిచాయి. టీఏజీకేసీకి ఉపాధ్యక్షులు నరేంద్ర దుదెళ్ళ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా చక్కని తెలుగు విందు భోజనాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్పార్సర్స్తో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ బోర్డు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
బేబీ బూమ్.. 'వాట్ ఏ కో ఇన్సిడెన్స్'
ఇంట్లోకి ఒక్క పసిబిడ్డ వస్తేనే సందడి అంతా ఇంతా కాదు. అలాంటిది ఆ హాస్పిటల్లో 14 మంది నర్సులు ఒకే సమయంలో గర్భం దాల్చారు. వారంతా ఒకే నెలలో పిల్లల్ని కననున్నారు. కాన్సాస్ సిటీలోని సెయింట్ ల్యూక్స్ ఈస్ట్ హాస్పిటల్ ఈ విషయాన్ని తమ ఫేస్బుక్ పేజ్‌లో షేర్ చేసింది. అది చూసినవారంతా ‘వాట్ ఏ కో ఇన్సిడెన్స్’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది మొదటిదేం కాదు. అచ్చు ఇలాంటి సంఘటనే 2019లో యూఎస్‌లోని పోర్ట్‌ల్యాండ్ మయినే మెడికల్ సెంటర్లో జరిగింది. అక్కడ 9 మంది నర్సులు ఒకే సమయంలో గర్భం దాల్చారు. ఆగస్టులోనే అందరూ పిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలతో కలిసి 9 మంది తల్లులు దిగిన ఫొటో ‘బేబీబూమ్’ అప్పట్లో వైరల్ అయ్యింది. మళ్లీ.. ఇప్పుడు మిస్సోరిలోని ల్యూక్ హాస్పిటల్ వంతయ్యింది. 14 మందిలో ఒకరు జూన్ 3న బిడ్డకు జన్మనివ్వగా.. 13 మంది డెలివరీ మంత్ డిసెంబర్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి డెలివరీలో తల్లీబిడ్డల సంతోషం కోసం చూసినట్టే.. ఈ 13 మంది పిల్లలకోసం ఎదురుచూస్తున్నామని హాస్పిటల్ వర్గాలు ఫేస్బుక్లో తమ ఆనందాన్ని పంచుకున్నాయి. చదవండి: (భర్తను అద్దెకిచ్చిన భార్య.. అవాక్కవ్వకండి, అక్కడే ఉంది అసలు విషయం) -
అమెరికాలో మళ్లీ కాల్పులు.. నలుగురి దుర్మరణం
కాన్సస్ : అమెరికాలో మరోసారి గన్‌కల్చర్ పంజా విసిరింది. కాన్సస్ నగరంలో ఒక బార్ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మరణించారు. కాగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 6.30 గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగింది. మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలోని సెంట్రల్ స్ట్రీట్స్ వద్ద ఒక దుండగుడు బార్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నిందితుడు పరారీలో ఉండగా, కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అమెరికాలో తెలుగు వైద్యుడు హత్య
-
పునరావృతం కానివ్వం!
శ్రీనివాస్ సంస్మరణ సభలో కన్సాస్ ఉన్నతాధికారులు ♦ కన్సాస్ సిటీలో భారత అమెరికన్ల శాంతి ర్యాలీ ♦ విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వబోమని ప్రకటన ♦ కూచిభొట్లతో అనుబంధాన్ని నెమరువేసుకున్న మిత్రులు హూస్టన్ : విద్వేషపూరిత ఉద్దేశంతో జరిగిన భారత ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు నిరసనగా అమెరికాలోని కాన్సస్ సిటీలో వందల మంది క్యాండిల్స్ పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘శాంతి కావాలి. ప్రేమతో ఉండాలి. సమాజంలో ఐకమత్యం కావాలి. కలిసుంటేనే కలదుసుఖం’ అని నినాదాలు చేశారు. విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ముక్తకంఠంతో తెలిపారు. ఈ ర్యాలీలో గత బుధవారం నాటి కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి సహా.. మృతుడు శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు, దాదాపు 200 మంది భారత–అమెరికన్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో.. కాన్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కాల్యర్, చట్ట సభ్యుడు కెవిన్ యోడర్, ఒలేత్ మేయర్ మైక్ కోప్లాండ్, పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకే, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ శాంతి సమావేశానికి హాజరయ్యారు. వివిధ మతాల పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘ఒకడు చేసిన చెడ్డ పని అమెరికా ఐకమత్యాన్ని దెబ్బతీయదు. భారత–అమెరికన్లకు మేం అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కాన్సస్ మేయర్ కోప్లాండ్ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని పోలీస్ చీఫ్ మెంకే వెల్లడించారు. అనురాగం, ఆప్యాయతల కలబోత కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ ఉద్వేగంగా సాగింది. ‘శ్రీనివాస్‌తో నాది తొమ్మిదేళ్ల స్నేహబంధం. ప్రతి ఒక్కరికీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత పంచే ఇలాంటి వ్యక్తిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆయన నోటివెంట ఒక్కసారి కూడా చెడు మాట వినబడలేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేతత్వం ఆయనది. ఆరోజు బార్లో జరిగిన ఘటన మరెక్కడా పునరావృతం కాకూడదు. శ్రీనివాస్ ఇకలేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా. నాకోసం ఆయనిక్కడుండాల్సింది’ అని అలోక్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కారు కొనుక్కునేంతవరకు రోజూ ఆఫీసుకు శ్రీనివాస్ తన కార్లోనే తీసుకెళ్లేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కున్నట్లు కనిపించలేదు. అలాంటి మనుషులను చాలా అరుదుగా చూస్తుంటాం. తొమ్మిదేళ్ల మా స్నేహం తాలూకు జ్ఞాపకాలింకా నా మదిలో మెదులుతున్నాయి’ అని వెల్లడించారు. శ్రీనివాస్ మిత్రులు మరికొందరు కూడా అతని మంచితనం, ఇతరులకు సహాయపడే తత్వాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ‘గోఫండ్‌మి’ పేరుతో తెరిచిన మూడు వేర్వేరు అకౌంట్లలో ఇప్పటివరకు దాదాపు మిలియన్ (దాదాపు రూ.6.71 కోట్లు) విరాళాలుగా వచ్చాయి. వీటితో అలోక్, ఇయాన్ కు వైద్యం చేయించటంతోపాటు శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేయనున్నారు. ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే! భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఇయాన్ గ్రిలాట్ ‘ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణమిచ్చేందుకూ సిద్ధమే’ అని తెలిపారు. ‘బార్లో కుటుంబాలతో, చిన్న పిల్లలతో వచ్చిన వారంతా బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారు. చాలా మందే అక్కడున్నారు. ఇంతలోనే ఇద్దరిపై కాల్పులు చేస్తున్న పురింటన్ ను చూశాను. వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు నా ప్రాణాలు బలిచ్చేందుకూ వెనకాడలేదు. నేను ఏదోఒకటి చేయాలి. అందుకే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను’ అని గ్రిలాట్ తెలిపాడు. పురింటన్ తో పెనుగులాటలో గ్రిలాట్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే దీన్ని తొలగించటంతో ప్రాణాపాయం తప్పినా.. ఆయన కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. -
తల్లి దారుణం.. పది అడుగుల గుహలో పిల్లలు
కాన్సాస్: అపాయకర పరిస్థితుల మధ్య తన పిల్లల్ని పెంచిన ఓ తల్లిని ముస్సోరి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఉంచకూడని ప్రదేశంలో వారిని ఉంచిందని కోర్టుకు తెలియజేశారు. ముస్సోరిలోని కాన్సాస్ సిటీ పోలీసులు ఓ కారు దొంగతనానికి సంబంధించి గాలింపులు జరుపుతుండగా ఓ గుహ ప్రాంతంలో భూమిగర్భంలో కనీసం పది అడుగుల లోతున్న ఓ చెక్కతో అరకొరగా నిర్మించిన నిర్మాణం కనిపించింది. వారు లోపలికి వెళ్లి చూడగా అందులో ఓ నాలుగేళ్ల, ఆరేళ్ల పిల్లలు కనిపించారు. వారిద్దరు కూడా మురికిపట్టి గబ్బుకొట్టే పరిస్థితులమధ్య ఉండటమే కాకుండా ఒంటిమీద పూర్తి స్థాయిలో దుస్తులు కూడా లేవు. కాళలకు చెప్పులు లేవు. ఓ చీకటి గుహలాంటి ప్రదేశంలో ఉంచిదని ఇది పిల్లల హక్కుల ప్రకారం నేరమవుతుందని కోర్టు చెప్పడంతో కోర్టు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది.