చెక్కు అందించిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్‌మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.
శనివారం మాదాపూర్ టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్‌మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.
చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ
Comments
Please login to add a commentAdd a comment