ఉద్యోగంకోసం విదేశాలకుపోతే ఘోర ప్రమాదం
లండన్‌లో ప్రాణాలతో పోరాడుతున్న హైదరాబాద్ యువతి
ఉపాధికోసం విదేశాలకు వెళ్లిన యువతిని దురదృష్టం వెంటాడింది. హైదరాబాద్‌కు చెందిన బాధిత యువతి ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనలో పడిపోయారు.
హైదరాబాద్ దిల్ సుఖ్‌నగర్ సమీపంలోని మారుతి నగర్‌కు చెందిన హిమ బిందు ఉద్యోగం కోసం లండన్ వెళ్లింది. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్ హిమ బిందును డీకొట్టింది దీంతో ఆమెకు తీవ్ర గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హిమ బిందు ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ యాక్సిండెట్ గురించి అధికారులు బిందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment