
మిసెస్ ఇండియా పోటీలకు తెలుగు ఎన్‌ఆర్ఐ
జాతీయ వేదికపై తెలంగాణకు బింధు ప్రియ ప్రాతినిధ్యం
సాక్షి, సిటీబ్యూరో: లండన్ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో కార్పొరేట్ లీడ్ రోల్ నిర్వహిస్తున్న తెలుగు వనిత బిందు ప్రియ.. త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా 2025 పోటీల్లో ఎన్‌ఆర్‌ఐ విభాగంలో తెలంగాణకు
ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని నిజామాబాద్ జిల్లాకు చెందిన బిందు ప్రియ తెలిపారు.
బిందు ప్రియా జైస్వాల్ మిసెస్ ఇండియా తెలంగాణా 2025 క్లాసిక్ NRI కేటగిరీలో విజేతగా నిలిచింది. 2025 ప్రారంభంలో ఎన్‌ఆర్‌ఐ విభాగంలో మిసెస్ ఇండియా తెలంగాణ–2025 కిరీటాన్ని గెలుచుకుని త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
బిందు బహుముఖ ప్రజ్ఞాశాలి. వర్క్‌లైఫ్, ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఐటీలో కార్పొరేట్ లీడర్ , గ్లోబల్ బ్యాంకింగ్ నిపుణురాలు. ఉన్నత విద్యావంతురాలు. ఆరోగ్యం & ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు కూడా. తన తల్లి బోధించిన గీత పాఠాలే స్ఫూర్తి అని చెబతారు. కథక్, తెలుగు, హిందీ సంగీతం, గిటార్, పియానో వంటి సంగీత వాయిద్యాల్లో బిందుకు ప్రావీణ్యం ఉంది. అలాగే యూకేలోని ప్రసిద్ధ వేదికలపైన నృత్య ప్రదర్శనలివ్వడం విశేషం. సేవా (ఎస్‌ఈడబ్ల్యూఏ) సభ్యురాలిగా నిరుపేద విద్యార్థుల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment