Mrs India
-
మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అల్కాజర్ వాచెస్, డీక్యూయూఈ సోప్ ఆధ్వర్యంలోని మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటాన్ని తెలంగాణకు చెందిన వర్షారెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో గెలుచుకున్న టైటిల్‌తో సందడి చేశారు. తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్లి లే మెరిడియన్ వేదికగా టైటిల్ నెగ్గడం సంతోషంగా ఉందని తెలిపారు. 2012లో మిస్ సౌత్ ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను, అప్పుడు మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించానని గుర్తు చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంతో పాటు యూఎస్ఐటీ సిబ్బంది, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, చలనచిత్ర నిర్మాణం వంటి ఐదు విభిన్న కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. విజేతకు పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జెబితా అజిత్ కిరీటాన్ని అందించారు. మిసెస్ సౌత్ ఇండియా 2024 అందాల పోటీల్లో కేరళకు చెందిన రేవతి మోహన్ మొదటి రన్నరప్ స్థానాన్ని పొందగా, కేరళకు చెందిన దృశ్య డినాయర్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిసెస్ సౌత్ ఇండియా పోటీకి దక్షిణ భారత రాష్ట్రాల నుండి 12 మంది పోటీదారులు ఎంపికయ్యారు. మిసెస్ సౌత్ ఇండియా విజేతలకు పరక్కత్ జ్యూయలర్స్‌కు చెందిన ప్రీతి పరక్కత్ రూపొందించిన బంగారు కిరీటాన్ని బహూకరించారు. -
క్లాసిక్ మిసెస్ ఇండియా విజేతగా హైదరాబాదీ (ఫొటోలు)
-
ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు
అందాల పోటీల గురించి ఉండే సంప్రదాయ ఆలోచనలను బ్రేక్ చేసింది మిసెస్ ఇండియా ఎంప్రెస్ ఆఫ్ ది నేషన్. పుణెలో జరిగిన ఈ అందాల పొటీలలో డెబ్బై సంవత్సరాల బామ్మలు కూడా పాల్గొన్నారు. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని బహుమానంగా గెలుచుకున్నారు.... ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేది ‘మిసెస్ ఇండియా ఎంప్రెస్ ఆఫ్ ది నేషన్–2023 (సీజన్4) నినాదం. సిల్వర్, గోల్డ్, ఎలిట్ విభాగాలలో 21 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న మహిళలు పాల్గొన్నారు. ర్యాంప్‌పై నడిచి ప్రేక్షకులను హుషారెత్తించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో ΄ాటు సినీనటులు, గత ΄ోటీల విజేతలు కూడా ΄ాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రతి విభాగంలో ‘టాప్ 3’ని ఎంపిక చేశారు. సిల్వర్ కేటగిరి (21 నుంచి 38 సంవత్సరాలు) లో పుణెకు చెందిన ప్రియాంక గడియ, ఆ తరువాత స్థానంలో దిల్లీకి చెందిన అభిలాష చహలియ, గోవాకు చెందిన డా. నేహా ప్రభు సల్గావ్కర్ నిలిచారు. గోల్డ్ కేటగిరి (39 నుంచి 49 సంవత్సరాలు)లో భో΄ాల్‌కు చెందిన అపేక్ష దబ్రాల్, ఆ తరువాత స్థానంలో పుణెకు చెందిన డా. మృణాళిని భరద్వాజ్, ముంబైకి చెందిన రక్షా కర్వ నిలిచారు. ఎలిట్ కేటగిరీ (50 సంవత్సరాల పైన) బెంగళూరుకు చెందిన సుజాత శర్మ, ఆ తరువాత స్థానంలో దిల్లీకి చెందిన సీమా సిన్హా, కోల్‌కత్తాకు చెందిన కకోలి ఘోష్ నిలిచారు. సిల్వర్ కేటగిరీ విజేతలలో ఒకరైన అభిలాష చహలియ వృత్తిరీత్యా న్యాయవాది.‘వివాహం తరువాత మనలోని కలలను పక్కన పెట్టడం సరికాదు’ అంటుంది. అభిలాషకు చిన్నప్పటి నుంచి లైట్లు, కెమెరాలతో కూడిన గ్లామర్ ఇండస్ట్రీ అంటే ఇష్టం. అయితే చదువు, కెరీర్, పెళ్లి వల్ల తనకు ఇష్టమైన రంగానికి దూరం కావాల్సి వచ్చింది. గ్లామర్ ఇండస్ట్రీపై తన ఇష్టం, కలలు మాత్రం చెక్కుచెదరలేదు. 37 సంవత్సరాల వయసులో ‘మిసెస్ ఇండియా ఎంప్రెస్ ఆఫ్ ది నేషన్’లో ΄ాల్గొనడం, ర్యాంప్ వాక్ చేయడం తనకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. ‘ఆలస్యం అయితేనేం! చిన్నప్పటి కలను నెరవేర్చుకున్నాను’ అనే సంతోషం అభిలాష మాటల్లో కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అభిలాష...‘చిన్నప్పటి కల నెరవేరడం కంటే గొప్ప సంతోషం ఏముంటుంది. కన్న కలను గుండెలో సజీవంగా ఉంచుకోగలిగితే అది నెరవేరడం అసాధ్యం కాదు. కుటుంబసభ్యులు నాకు ్ర΄ోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించారు. ఏమనుకుంటారో అనే సందేహం వదిలేయండి. మనసులో ఉన్న మాట నిస్సంకోచంగా బయటపెట్టండి చాలు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం మనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అంటుంది అభిలాష. ‘పదిమందిలో గుర్తింపు అనేది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం అందాన్నిస్తుంది’ అంటుంది ఎలిట్ కేటగిరి విజేతలలో ఒకరైన కోల్‌కత్తాకు చెందిన కకోలీ ఘోష్. ‘మనకు ఉండే బరువు బాధ్యతల వల్ల మనసులోని కలలను సాకారం చేసుకోవడం అసాధ్యమేమో అనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు. సాధించాలి అని గట్టిగా అనుకుంటే అసాధ్యమైనది లేదు. నా కలను సాకారం చేసుకున్నాను అనే సంతోషాన్ని మాటల్లో చెప్పలేం’ అంటుంది గోల్డ్ కేటగిరిలో విజేత అయిన భో΄ాల్‌కు చెందిన అపేక్ష దబ్రాల్. ‘విజేతల కళ్లలో కనిపించిన సంతోషం, ఆత్మవిశ్వాసం వారికి మాత్రమే పరిమితం కావు. ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి తమ కలను సాకారం చేసుకోవడానికి ముందుకు నడిపిస్తాయి’ అంటుంది ఈ కార్యక్రమ అతిథుల్లో ఒకరైన నటి నీలమ్ కొఠారి. -
మిసెస్ ఇండియా రన్నరప్‌గా తెలంగాణ మహిళ
అందాల పోటీల్లో తొలిసారి తెలంగాణ మహిళ మెరిసింది. మిసెస్ ఇండియా 2023 పోటీల్లో తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు రన్నరప్‌గా నిలిచారు. రాజస్థాన్ వేదికగా జరిగిన పోటీల్లో ఆమె మొదటి రన్నరప్ గా నిలిచారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో 50 మంది ఫైనల్ చేరుకోగా.. తుది పోటీల్లో కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్ ఇండియా తెలంగాణ రీజనల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేదీ ఆమెకు మెంటర్‌గా వ్యవహరించారు. వీణా పుజారి కిరణ్మయికి దుస్తులు డిజైన్ చేయగా... 10 కేటగిరీల్లో 30 మందితో పోటీపడ్డారు. టాలెంట్ రౌండ్ , డాన్స్ రౌండ్ , సఫారీ రౌండ్ తో పాటు ఫ్యాషన్ రౌండ్స్‌లో గట్టిపోటీ నడిచినప్పటికీ... జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చిన ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరీకి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు. కిరణ్మయి గతంలో 2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ గెలిచారు. వివాహం తర్వాత కూడా మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా ఏదైనా సాధించొచ్చు అనేది రుజువు చేసే ఉధ్ధేశంతో మిసెస్ ఇండియా పోటీలకు సిద్ధమయ్యారు. దాదాపు 8 నెలల పాటు ప్రిపేర్ అయ్యి జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీల్లో తన అందంతో పాటు మాట్లాడే తీరు, టాలెంట్, క్రియేటివిటీ వంటి అంశాల్లో ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా ఒక తెలంగాణ మహిళ నిలవడం ఇదే తొలిసారి. కాగా ఈ విజయంపై కిరణ్మయి ఆనందం వ్యక్తం చేశారు. అందాల పోటీల్లో వివాహం తర్వాత కూడా మహిళలు రాణించొచ్చు అనుకునే వారికి తాను రోల్ మోడల్‌గా నిలవాలనే లక్ష్యంతోనే జాతీయ పోటీల్లో పాల్గొన్నానని కిరణ్మయి చెప్పారు. తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన కిరణ్మయిని పలువురు అభినందించారు. -
Pydi Rajani: మిసెస్ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు ఆంధ్రా యూనివర్సిటీ స్కాలర్, ఏవీఎన్ కళాశాల ఇంగ్లిష్ విభాగాధిపతి, శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్(సేవ) అధ్యక్షురాలు పైడి రజని ఎంపికయ్యారు. గతేడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను ఈమె గెలుచుకున్నారు. ఆలిండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణపై నాలుగు రోజుల పాటు జరగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు. చదవండి: ఖైదీల బంక్.. రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
సాధనతోనే కీర్తికిరీటం... విశాఖ స్వాతి విజయ ప్రస్థానం
‘నేను ఒక సగటు భారతీయ మహిళకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. పెళ్లయ్యి, పిల్లలున్న నాకు అందాల సుందరిగా పట్టాభిషేకం చేయడం భారతదేశం నలుమూలల్లో ఉన్న అద్భుతమైన మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు స్వాతి పాల. ఈ యేడాది హాట్ మండే మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2022 విజేత కిరీటాన్ని ఇటీవల స్వాతి పాల అందుకున్నారు. విశాఖపట్టణంలో పుట్టి పెరిగిన స్వాతి, హైదరాబాద్‌లో మీడియా రంగంలోనూ పని చేశారు. కెనడాలో బిజినెస్ అనలిస్ట్‌గా, ఇద్దరు పిల్లలు తల్లిగా, కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న గృహిణిగా, తన కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తున్న సాధకురాలిగా స్వాతి ఎన్నో సంగతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ఈ ఏడాది ప్రయాణం నాకు చాలా అపురూపమైనది. వివాహిత మహిళల కోసం అత్యంత గౌరవనీయమైన, ప్రసిద్ధి చెందిన ఈ అందాల పోటీలు దుబాయ్‌లోని రస్ అల్ ఖైమాలోని హిల్టన్ గార్డెన్ ఇన్ లో జరిగింది. ఈ ఫైనల్స్‌లో దేశ దేశాల నుంచి 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నేను అగ్రగామిగా నిలవడం ఎంతో గొప్పగా, ఆనందంగా అనిపించింది. నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం, భూమిని సూచించేలా నన్ను ఎలిమెంట్స్ క్వీన్‌గా ప్రకటించారు. మాది వైజాగ్. అక్కడే ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీయే చేశాను. హైదరాబాద్‌కి ఉద్యోగరీత్యా వచ్చాక సాక్షి’ టీవీ ప్రారంభం నుంచి నాలుగేళ్లు హెచ్.ఆర్ విభాగంలోనూ, క్రియేటివ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గానూ వర్క్ చేశాను. మా వారి జాబ్ నేవీ కావడంతో తనకు కెనడాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో నేనూ కెనడా వెళ్లాను. అక్కడే బిజినెస్ అనలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై మా వారు ఆన్లైన్లో ఈ అందాల పోటీల గురించి చూసి, నన్ను ప్రోత్సహించారు. అప్లై చేయించారు. 50 వేల అప్లికేషన్స్‌లో 110 మందిని ఎంపిక చేశారు. అలా ఎంపిక అయిన వారిలో నేనున్నాను. అప్లై చేసిన దగ్గర నుంచి ఏడాదిగా చాలా సెషన్స్ అయ్యాయి. వాటిలో రకరకాల టాస్క్‌లు దాటుకుని దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలే వరకు వచ్చాను. మూడు రోజుల పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన 20 మందితో పోటీ పడి ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచాను. కష్టమైనా ఇష్టంతో.. ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఈ పోటీలో పాల్గొడానికి చేసిన కృషి చాలా కష్టమైనది. రోజూ జిమ్‌కి వెళ్లడం, సరైన పోషకాహారం తీసుకోవడం, గ్రూమింగ్ సెషన్స్ తీసుకోవడం, ర్యాంప్ వాక్, వెయిట్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం క్లాసులు .. ప్రతిసారీ టాస్క్ అనిపించింది. ఉద్యోగంతో పాటు ఈ హార్డ్ వర్క్ చేయగలనా.. అని సందేహం కలిగింది. కానీ, ప్రారంభించాక మెల్ల మెల్లగా మామూలు అయిపోయింది. అయితే, ఈ క్లాసులన్నీ దాదాపు ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇండియా నుంచి కోచ్‌లుగా ఉన్న రితిక రామ్త్రీ మొదటి ఆరు నెలలు, తర్వాత శైలజ సూచి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియా టైమింగ్స్‌ను బట్టి నైట్ టైమ్‌లోనూ కోచింగ్ తీసుకున్నాను. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకుంటున్నాను అనే ఉత్సాహంతో ఈ ప్రయాణం నడిచింది. క్లాసికల్ డ్యాన్సర్ ముందు కష్టం అనుకున్నది మెల్లగా మెల్లగా నా దినచర్య మార్చుకోవడంతో ట్రైనింగ్ సులువుగా మారిపోయింది. సెషన్స్‌లో ‘మిమ్మల్నే మిసెస్ ఇండియాగా ఎందుకు సెలక్ట్ చేయాలి?’ అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలామంది మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకున్నాను. చిన్నప్పుడు శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకున్నాను. దీంతో డ్యాన్స్‌లో నాకు సులువు అనిపించింది. పిల్లలే ప్రోత్సాహం కిరీటం వచ్చిందా లేదా అనేది తర్వాతి విషయం. శిక్షణ ఎంత బాగా తీసుకుంటామో ఫైనల్ పోటీలలో ప్రతిఫలిస్తుంది. కానీ, నాలో నాకే చాలా గొప్ప మార్పులు కనిపించాయి. నా పెద్ద కొడుకు తనీష్‌కి పదకొండేళ్లు. వాడు నా ఫొటోలు తీసి, సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేసేవాడు. చిన్నవాడు రేయాన్ ఫుడ్ తీసుకోవడంలో చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు. ‘నువ్వే గెలవాలి’ అనే వారి తాపత్రయం నాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. రాబోయే పోటీలు 12వ సీజన్ స్టార్ట్ కాబోతోంది. కెనడాలో వచ్చే నెలలో జరగబోయే ఆడిషన్స్‌లో నేను జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. అయితే, ఫైనల్స్ ఎక్కడ జరుగుతాయో తెలియాల్సి ఉంది’ అని వివరించారు ఈ మిసెస్ ఇండియా. – నిర్మలారెడ్డి -
ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ యువతి ఆర్య వల్వేకర్(18) మిస్ ఇండియా యూఎస్ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్ఇండియా యూఎస్ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు. సినిమాల్లోకి రావాలన్నది తన స్వప్నమని ఆర్య వల్వేకర్ ఈ సందర్భంగా చెప్పారు. ‘నన్ను నేను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో నటించాలనేది నా చిన్నప్పటి కల’ అని పీటీఐతో ఆమె అన్నారు. 18 ఏళ్ల ఆర్య వల్వేకర్.. వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హై స్కూల్లో చదువుకున్నారు. మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ హెల్త్‌పై ఆసక్తి కనబరిచే ఆమె పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. యుఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నారు. కొత్త ప్రదేశాల పర్యటన, వంట చేయడం, చర్చలు.. తనకు ఇష్టమైన వ్యాపకాలని వెల్లడించారు. యోగా చేయడం తనకు ఇష్టమన్నారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, చెల్లెలితో గడపడంతో పాటు... స్నేహితుల కోసం వంటలు చేస్తుంటానని చెప్పారు. ఇక పోటీల విషయానికొస్తే... మిస్ ఇండియా–యూఎస్ఏతో పాటు మీసెస్ ఇండియా, మిస్ టీన్ ఇండియా –యూఎస్ఏ కాంపిటేషన్స్ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా నిలిచారు. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) -
‘మిసెస్’ మిసమిస (ఫొటోలు)
-
ఓ గృహిణి లక్ష్యం.. సవాళ్లే మన గురువులు
‘ఒక చిన్న అడ్డంకి కూడా నా ఎదుగుదలను ఆపలేదు’ అంటోంది మోడల్ తనూ గార్గ్ మెహతా. భారతదేశంలోని హర్యానాలో పుట్టి పెరిగిన తనూ కెనడా వెళ్లి, అటు నుంచి అమెరికా చేరుకొని ప్రసిద్ధ కంపెనీలలో పని చేస్తూ అక్కడి గ్లామర్ ప్రపంచంలో మహామహులతో పోటీ పడుతూ గుర్తింపును పొందుతోంది. బ్రిటిష్ ఎయిర్‌లైన్, వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్లో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన అనుభవం తనూ గార్గ్ సొంతం. రాబోయే మిసెస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఒంటరి పోరుకు సిద్ధపడింది. అమెరికాలో పర్యావరణం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తోంది. ప్రకటనలలో నటిస్తోంది. కలల సాధనకు కృషితోపాటు కుటుంబం బంధాన్ని నిలుపుకోవాల్సిన విధానం గురించి కూడా వివరిస్తోంది. ‘‘భారతీయ మహిళ అనే కారణం ఏ దశలోనూ నన్ను తగ్గించలేదు. మోడల్‌గా రాణించాలనే నా కల నా పని షెడ్యూల్‌నూ మార్చలేదు. రంగుల ప్రపంచంలో విజయం సాధించడానికి ఏం అవసరమో నాకు తెలుసు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో పుట్టి పెరిగాను. మధ్య తరగతి కుటుంబం. బి.టెక్ అయ్యాక పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ కుటుంబం ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి చాలా కష్టమైంది. కెనడా వెళితే కొంత ఖర్చు తగ్గుతుందనుకున్నా. అందుకు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల సాయం తీసుకున్నాను. అప్పుడే అనుకున్నా ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని. అడుగడుగునా సవాళ్లు కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక పేరున్న ఐటి కంపెనీలలో ఉద్యోగం చేశాను. అక్కడే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి బంధానికి గుర్తుగా కొడుకు పుట్టాడు. అందమైన కుటుంబం. హాయిగా సాగిపోతోంది జీవితం. కానీ, నా కల మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అమెరికాలోని అందాల పోటీలలో విజేతగా నిలవాలన్నది నా కల. అక్కడి రంగుల ప్రపంచంలో మోడల్‌గా రాణించాలన్నది లక్ష్యం. ఇందుకు నా భర్త మద్దతు లభించింది. బాబును నా భర్త వద్ద వదిలి, కొద్ది కాలంలోనే అమెరికా చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చినవారికి ముఖ్యంగా స్త్రీకి చాలా సవాళ్లతో కూడిన జీవితం ఉంటుందని అర్థమైంది. మగవారితో పోల్చితే తక్కువ జీతం, వర్ణ వివక్ష, సాంస్కృతిక అడ్డంకులు .. ఎన్నో చూశాను. కానీ, అన్నింటినీ అధిగమించడమే నేను చేయాల్సింది అని బలంగా అనుకున్నాను. అప్పుడే అందరికీ సమాన అవకాశాలకు మద్దతు ఇచ్చే సేవాసంస్థ నిర్వాహకులతో పరిచయమైంది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సేవా సంస్థ పనుల్లో నిమగ్నమయ్యాను. మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటూనే సంస్థ పనులు చేస్తున్నాను. అలాగే, పర్యావరణ రక్షణకు పాటు పడే సంస్థకోసం కృషి చేస్తున్నాను. ఫలితంగా ఆర్థిక వెసులుబాటు, సేవాభాగ్యం లభించింది. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి మార్గమూ సులువయ్యింది. దూరాన్ని దగ్గర చేసే నమ్మకం పెళ్లి అనేది ఒక అద్భుతమైన విషయం. ఒక కప్పు కింద ఉన్నా, సుదూరంగా, ఇతర దేశాలలో ఉన్నా భాగస్వామి కలను అర్థం చేసుకోవడంతో బంధం బలంగా ఉంటుంది. దూరం హృదయాలను మరింత మృదువుగా మార్చేస్తుందనడానికి నా జీవితమే ఉదాహరణ. నిజానికి భారతీయ సంస్కృతిలో భార్య–భర్త దూరంగా ఉండటం ఇప్పటికీ నిషేధం. కానీ, బదిలీలు, దేశ రక్షణలో సైనికులు, అతిగా క్యాంపులు ఉండే ఉద్యోగాలు ఇవన్నీ జీవిత భాగస్వామికి దూరంగా ఉంచుతాయి. దూరం అనేది వివాహానికి సవాల్‌గా ఉంటుంది. కానీ, సరిగ్గా నిర్వహిస్తే వారిద్దరి బంధం కచ్చితంగా బలంగా ఉంటుంది. ఒక మహిళ కుటుంబాన్ని పోషించగలదు, కలలను సాధించుకోవడానికి కృషి చేయగలదు. ఏదైనా సంబంధాన్ని కొనసాగించడంలో వారి మధ్య కమ్యూనికేషన్, నమ్మకం రెండూ కీలకమైన అంశాలు. ఇవి మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అందుకే నా కల కోసం నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్, యోగా, ధ్యానం, పోషకాహారం .. అన్నింటిపైనా దృష్టిపెడుతున్నాను. తెలుపు–నలుపు, పొట్టి–పొడవు భేదాలేవీ మన కలలకు అడ్డంకి కావు. మానవ ప్రపంచంలో అందరూ సమానమే అని చాటాలన్నదే నా లక్ష్యం’’ అనే తనూ గార్గ్ ఎదుర్కొంటున్న సవాళ్లు మనకూ ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. -
మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌గా సిక్కోలు మహిళ
సాక్షి, శ్రీకాకుళం: సిక్కోలు మహిళ మెరిసింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో క్లాసిక్ కేటగిరీలో కిరీటం అందుకుంది. జిల్లాకు చెందిన పైడి రజని ఈ ఘనతను సాధించారు. మిసెస్ డైనమిక్ టైటిల్, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్, క్రౌన్ విజేతగా మొత్తం మూడు టైటిళ్లను గెలుచుకున్న ఏకైక మహిళగా ఆమె సత్తా చాటారు. ఈ పోటీల్లో 100 మంది మహిళలు పాల్గొనగా, 38 మంది ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే.. సోమ వారం ప్రకటించిన తుది ఫలితాల్లో రజని విన్నర్‌గా ఎంపికయ్యారు. ఉన్నత విద్యావంతురాలు.. పొందూరు మండలం కనిమెట్టలో జన్మించిన పైడి రజనీ ఎంఏ, ఎంఈడీ చదివారు. కింతలి జెడ్పీ హైస్కూల్లో ప్రాథమిక విద్యనభ్యసించి న ఆమె శ్రీకాకుళం ప్రభుత్వ మహిళ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ చేసి, అంబేడ్కర్ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ చేశారు. ఆమె భర్త పైడి గోపాలరావు పాలకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా చేశారు. ఆమె తల్లి బొడ్డేపల్లి ఉమాదే వి దేవదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసి రిటైరయ్యారు. ఆమె తండ్రి పేడాడ మల్లేశ్వరరావు ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేశారు. రెండు పీజీలు చేసిన రజని ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగంలో పరిశోధన(పీహెచ్డీ) చేస్తున్నారు. గతంలో శ్రీకాకుళంలో పార్ట్‌టైమ్ అధ్యాపకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. లెక్చరర్‌గా పని చేస్తూ.. శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీలోని చినబొందిలీపురంలో ఉంటున్న పైడి రజని.. ఒకవైపు లెక్చరర్‌గా పనిచేస్తూ మరోవైపు శక్తి అనే సంస్థను స్థాపించి మహిళల ఆర్థిక, సాంఘిక, విద్య, వ్యక్తిత్వ వికాసం, కళల్లో నైపుణ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గతంలో జేసీఐ ఇంటర్నేషనల్ సంస్థ ఫెమీనా అధ్యక్షురాలిగా ఎన్నో అవార్డులు సాధించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కు, పేద విద్యార్థులకు, క్రీడాకారులకు ఆర్థిక సాయం చేస్తున్న ఆమె వృద్ధాశ్రమం, అనాథాశ్రమాలకు వస్తువులు సమకూర్చారు. కోవిడ్ స మయంలోనూ సేవలు కొనసాగించారు. సంప్రదాయ నృత్యంపై మక్కువతో భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో కోవిడ్ మూలంగా వర్చువల్ విధానంలో నిర్వహించిన 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పోటీల్లో పాల్గొన్నారు. సింగపూర్, ముంబై, బెంగళూరు, చెన్నైకు చెందిన వారు న్యాయ నిర్ణేతలుగా ఉన్న ఈ పోటీల్లో ఆమె ఓ కేటగిరీలో విజేతగా నిలవడం జిల్లాకే గర్వకారణం. ఒకవైపు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. విజేతగా నిలిచిన పైడి రజనీని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు. -
మిసెస్ ఇండియా–2021గా బెజవాడ మహిళ
సాక్షి, ఆటోనగర్(విజయవాడతూర్పు): గుజరాత్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో గురువారం రాత్రి జరిగిన మిసెస్ ఇండియా–2021 అందాల పోటీల్లో విజయవాడ పటమటకు చెందిన బిల్లుపాటి దుర్గా శివనాగమల్లేశ్వరి ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు ఆమె తండ్రి సుంకర దుర్గాప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: (ఒమిక్రాన్‌కు ఆనందయ్య మందు) -
క్రియేటివ్ డైరెక్టర్ నుంచి మిసెస్ ఇండియాగా..
అందాల పోటీలు అంటేనే యువత, టీనేజ్ అమ్మాయిలు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లైన మహిళలు సైతం అందాల పోటీల్లో టీనేజ్ అమ్మాయిలకు పోటీని ఇస్తున్నారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేసేందుకు ఎన్నో వేదికలు సిద్దంగా ఉన్నాయి. అలాంటి వాటిలో హాట్ మాండే మిసెస్ ఇండియా ఒకటి. ఇటీవల ఈ వేదికపై మిసెస్ ఇండియాగా పోటీల్లో పాల్గోన్న తెలుగమ్మాయి స్వాతి పాల ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే అందాల పోటీల్లో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా శారీరక, మానసిక సామర్థ్యం, సమయస్ఫూర్తి ఆధారంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారు. అలాగే స్వాతిలో కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇన్నర్ బ్యూటీ అని కూడా అనిపించుకుంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్ట పొందిన ఆమె సృజనాత్మకతపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. టీవీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా కేరీర్ ప్రారంభించిన స్వాతి విద్య అనే పేరుతో షార్ట్ ఫిలీం తీసి ప్రశంసలు అందుకుంది. అంతేగాక స్వచ్చభారత్పై కొన్ని వీడియోలు తీసి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక పెళ్లయ్యాక పిల్లలకోసం కోన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె.. సేవారంగంపై మెగ్గుచూపింది. నావికాధికారి భార్యగా నేవి భార్యల సంక్షేమం కోసం‘ఎన్డబ్ల్యుడబ్ల్యుఏ’ అనే పేరుతో సంఘాన్ని స్థాపించి అందులో కీలకంగా వ్యవహిరిస్తోంది. అంతేగాక పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పేరుతో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 15వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. -
మిసెస్ ఇండియా రన్నరప్‌గా ఖమ్మంకు చెందిన వివాహిత
సాక్షి, ఖమ్మం: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈనెల 21న జరిగిన వీపీఆర్ మిసెస్ ఇండియా సీజన్–2లో ఖమ్మం నగరానికి చెందిన వివాహిత మహ్మద్ ఫర్హా రన్నరప్‌గా నిలిచారు. ఫొటోజెనిక్ విభాగంలో మిసెస్ ఇండియాగా ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 912 మంది వివాహితలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకోగా.. 41 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి ఫర్హా మాత్రమే ఎంపికయ్యారు. ఎంబీఏ చదివిన ఫర్హా, హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ మిషన్, మహిళా సాధికారత సంస్థలకు ఖమ్మం కార్య దర్శిగా సేవలందిస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ విజయం సాధిం చానని, మహిళా హక్కుల కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. -
జాయిన్ ఇమీడియట్లీ
జీవితం ఎప్పటికప్పుడు నియామక పత్రం పంపుతుంది. గృహిణిగా.. ఉద్యోగినిగా.. అమ్మగా.. అత్తగారిగా.. అమ్మమ్మగా.. ‘జాయిన్ ఇమీడియట్లీ’ అని అపాయింట్మెంట్ లెటర్. అరవై ఏళ్లకు అన్ని ‘ఉద్యోగాల’ విరమణ! తర్వాతేంటి?! మనమే ఇచ్చుకోవాలి.. సెల్ఫ్ అపాయింట్మెంట్ లెటర్. సేవకు.. సంతృప్తికి.. సంతోషానికి.. సఫలతకు. అరవై ఏళ్లంటే మహిళలు తమను తాము దూరం చేసుకునే వయసు. గృహిణి విషయానికి వస్తే... పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి ఉంటాయి. పిల్లల జీవితంలో తన అవసరం కనిపించకపోవడం ఆమెను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రతి చిన్న విషయానికీ పిల్లల జీవితంలో జోక్యం చేసుకుంటూ సలహాలు ఇస్తుంటారు. అకారణంగా అభద్రత ఆవరిస్తుంది. కోడలు ఉద్యోగానికి వెళ్లే హడావుడిలో పెరుగు తోడు పెట్టి చిన్న గిన్నె మీద పెట్టిన పెద్ద మూత కూడా పెద్ద తప్పుగా కనిపిస్తుంది. ఇవన్నీ చెప్పుకోవడానికి కూతురికి ఫోన్ చేసి చెప్పడం అలవాటు అవుతుంది. కాలక్షేపం కోసం సాయంత్రాలు గుడికి వెళ్తున్నా అక్కడా తన వయసు వాళ్లతో ఇంటి అసంతృప్త కబుర్లలోనే గడిపేస్తుంటారు. మొత్తానికి ఏదో వెలితి. సంతోషంగా జీవించలేరు. ఇకపై ఏం చేయాలి? ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వాళ్లది మరొక సమస్య. అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసిన అలవాటుకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పడుతుంది. ఆ ఖాళీని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇబ్బంది పడేవాళ్లు ఎందరో. నిజానికి జీవితాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు అరవై అనేది మంచి సమయం. అప్పటి వరకు కుటుంబం కోసం పని చేసి ఉంటారు. అప్పటి నుంచి సమాజం కోసం పని చేయడానికి అరవై ఏళ్లవయసు అనువైన సమయం. అరవై నిండిన మహిళలను సామాజిక వ్యక్తులుగా మార్చడానికి పెద్ద ప్రయత్నమే జరగాలి. అలాంటి ఓ ప్రయత్నమే మిసెస్ ఇండియా సిక్స్టీ ప్లస్ పోటీలు. మిస్, మిసెస్ పోటీలనగానే కాస్మటిక్ కంపెనీలు నిర్వహించే అందాల పోటీలే గుర్తుకు వస్తాయి. కానీ ఇవి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న పోటీలు. ఒకసారి పోటీలో పాల్గొన్న తర్వాత ఆ మహిళలు సామాజికంగా పదిమందికి అవసరమైన కార్యక్రమాల్లో తమవంతు సేవలందించడానికి ముందుకు వస్తున్నారు. నిజానికి మనం సంఘజీవులం అని తెలియచేసే ప్రయత్నమే ఈ మలివయసు పోటీలు. అయితే అరవై అనగానే దేహం మోకాళ్ల నొప్పులు, బీపీ, డయాబెటిస్ల నిలయం అనుకునే వాళ్లే ఎక్కువ. ఈ వయసులో మనకు మనమే బరువు, ఇక సమాజానికి ఏం చేస్తాం... అని నిర్లిప్తంగా ఉండే వాళ్లలో స్ఫూర్తి రగిలించడమే ఈ పోటీల ఉద్దేశం అని చెబుతున్నారు ‘మిసెస్ ఇండియా కర్నాటక’ పోటీల నిర్వహకురాలు ప్రతిభ. ఆమె గతంలో మిసెస్ ఇండియా పురస్కారగ్రహీత. ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఈ పోటీలను ఈ ఏడాది కర్నాటకలోని పట్టణాలకు తీసుకెళ్లారామె. ఈ ఏడాది పట్టణస్థాయి పోటీల్లో ‘మిసెస్ ఇండియా కర్నాటక, బళ్లారి’గా రజని లక్కా అనే మన తెలుగింటి మహిళ ఎంపికయ్యారు. అనంతపురం నుంచి బళ్లారికి వెళ్లి అక్కడే స్థిరపడిన కుటుంబం వాళ్లది. మలి సంధ్య పూదోట నా వయసు మహిళలందరికీ నేను చెప్పేది ఒక్కటే. కుటుంబానికి మీరు చేయాల్సిన పనులు కనిపించడం లేదంటే... ఇక మీరు సమాజం కోసం పని చేయాల్సిన సమయం మొదలైందని అర్థం. ఇతరుల కోసం మీకు చేతనైన పని చేయండి. వంట చేయడం తప్ప మరేమీ రావనుకుంటే... మీ చుట్టుపక్కల కొత్తగా పెళ్లయిన అమ్మాయిలకు వంటలో మెళకువలు నేర్పించండి. పిల్లలకు కథలు చెప్పడం మీకిష్టమైన వ్యాపకం అయినట్లయితే చుట్టుపక్కల పిల్లలకు కథలు చెప్పండి. కొత్తతరానికి ఈ అవసరాలున్నాయి. ఆ అవసరాన్ని మీరు నెరవేర్చండి. అరవైల తర్వాత జీవితం అంటే మీకోసం మీరు పెంచుకోగలిగిన చక్కటి పూలతోట. ఇంకా పాతికేళ్లు జీవించాల్సి ఉంటుంది. పాతికేళ్ల కాలాన్ని వృథాగా గడిపేయకూడదు. ఆరోగ్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి – రజని లక్కా, ‘మిసెస్ ఇండియా కర్నాటక, బళ్లారి’ విజేత నవ్వు వెనుక నమ్మకం నలభై లోపు, నలభై పై బడిన వారు, అరవై నిండిన వాళ్లు... ఈ మూడు కేటగిరీల్లో పోటీలు జరిగాయి. టాలెంట్, స్మైల్, ఫిట్ అవార్డులు కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం స్థాయిలే ఇందులో ప్రధానమైన కొలమానం. మొన్నటి పోటీలో.. ‘మీ గురించి మీరు చెప్పండి’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి పోటీలో పాల్గొన్న చాలామంది తడబడ్డారు. ‘‘నిజానికి వాళ్లలో చాలామంది తమకంటూ చెప్పుకోగలిగిన కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నవాళ్లే. అయినా వాటిని ఎలా చెప్పాలో తెలియక పోవడమే వారి తడబాటుకు కారణం. ఈ పోటీలో విజేత కాలేక పోయినప్పటికీ ఇందులో పాల్గొన్న తర్వాత వాళ్లు ఆ ప్రశ్నకు జవాబు కోసం తమను తాము శోధించుకుంటారు. మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైతే దీటుగా బదులివ్వగలుగుతారు. ఇందులో పాల్గొన్న వాళ్లకే కాదు, చూసిన వాళ్లలో కూడా ఆలోచన స్థాయిని విస్తృతపరుస్తాయి ఈ పోటీలు. నాకు ఈత వచ్చు. వికలాంగులకు ఈత నేర్పిస్తున్నాను. సమాజానికి నేను ఇస్తున్న సహకారం ఇది. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్న పనిలో నాకు కలుగుతున్న సంతోషాన్ని కొలవడానికి కొలమానాలు ఉండవు. సమాజానికి నేను చేయాల్సిన పని ఇంకా ఉందనే ఆలోచనే నన్ను నిత్యం పనిలో నిమగ్నం చేస్తోంది. అదే నాకు ఆరోగ్యం. అదే నాకు ఫిట్నెస్. నా నవ్వులో ప్రతిబింబించే ఆత్మవిశ్వాసం వెనుక ఇవన్నీ ఉన్నాయి’’ అన్నారు రజని లక్కా. తొలిదశ పోటీలు ఫిబ్రవరిలో మొదలయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్ర స్థాయి పోటీలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరిగితే అప్పుడు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు’ రజని చెప్పారు. – వాకా మంజులారెడ్డి -
విజయ శిఖరాల వైపు...
వయసేదైతేనేం.. ఏదో సాధించాలన్న ఆరాటం చిన్నతనం నుంచి ఆమె నైజం. ఎన్నుకున్నది ఏ రంగమైతేనేం.. పోటీ పడి మరీ అగ్రపథంలో ఉండాలన్నది ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ధ్యేయం. ఆ పట్టుదల ఆమెను వివిధ రంగాల్లో ముందంజలో నిలిపింది. వివాహం తర్వాత కేవలం ఇంటికే పరిమితం కాకుండా పరిచయంలేని రంగాల్లో కూడా రాణించేలా ప్రేరణ ఇచ్చింది. ఇందుకు భర్త సహకారం కూడా తోడైంది. దాంతో షార్ట్ ఫిల్మ్ రూపకల్పనలో తన సామరధ్యన్ని రుజువు చేసుకోవడమే కాదు.. చలనచిత్ర రంగంతో సైతం ఆమె పరిచయం పెంపొందించుకున్నారు. మోడలింగ్ రంగంలో ముందంజ వేశారు. అలా ఒక్కో అడుగుగా పురోగమించిన మమత, ఇప్పుడు మిసెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ దక్కించుకుని విజయ శిఖరాల దిశగా దూసుకుపోయే ఉత్సాహం తనలో మెండుగా ఉందని నిరూపించారు. తన పయనాన్ని ఇంకా కొనసాగించి మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని విశాఖ ఖ్యాతిని వ్యాపింపజేయాలన్నది తన ధ్యేయమని తెలిపారు. విశాఖపట్నం, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘చిన్నతనం నుంచి ఏదో ఒక ప్రత్యేకత నాలో ఉండాలనుకునే స్వభావం నాది. అయితే ఏం సాధించాలో తెలియని వయస్సది. తల్లిదండ్రులకూ అవగాహన పరిమితంగానే ఉండేది. దాంతో ఆరాటంతోనే ఆగిపోయాను.’అని తన గురించి, తన ప్రయత్నాల గురించి చెప్పుకొచ్చారు మిసెస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎన్నికైన మమత. డాజిల్ సంస్థ ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ ఇండియా వరల్డ్ పోటీల్లో ప్రతిభ చూసి క్రౌన్ గెలుచుకున్న మమత ఈ దారిలో తన అనుభవాలను వివరించారు. వివాహం అయిన తర్వాత తన జీవితంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందని చెప్పారు. ‘చలనచిత్ర రంగంతో పరిచయం ఉన్న కారం విజయ్ నా భర్త. నా పట్టుదలను ఆయన అర్థం చేసుకున్నారు. దాంతో ఆసక్తి ఉన్న రంగాల్లో ముందంజ వేశాను.’ అన్నారామె. యాంకర్‌గా ప్రారంభం ‘భర్త సినీ పరిశ్రమలో, మీడియాలో ఉండడంతో ఆయనకు తోడుగా అడుగు ముందుకేశాను. ఆయన రూపొందించే కార్యక్రమాలలో యాంకర్‌గా వ్యవహరించడం మొదలెట్టాను. క్రమేణా ఇతరులు రూపొందించే కార్యక్రమాలలో కూడా యాంకర్‌గా కొనసాగాను. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. క్రమంగా చిత్ర నిర్మాణంపై అవగాహన పెరిగింది. ఆ అనుభవంతో రైట్ చాయిస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. అలా ఉత్తరాంధ్రలో లఘు చిత్రం తీసిన తొలి మహిళా డైరెక్టర్ అన్న పేరు తెచ్చుకున్నాను.’అన్నారు. రైట్ చాయిస్ చిత్రానికి ఎందరినుంచో అభినందన లభించిందని తెలిపారు. తర్వాత తన నిర్మాణ సారథ్యంలో మహాత్మా గాంధీ అన్న చిత్రం రూపొందిందని చెప్పారు. తాను కాస్ట్యూమ్ డైరెక్టర్‌గా, నటిగా రూపు దిద్దుకున్న అంబేడ్కర్ చిత్రానికి అందరి ప్రశంసలు లభించాయని, ఈ రెండు చిత్రాలూ నంది అవార్డులు పొందాయని తెలిపారు. తొలిపోటీలోనే షాక్ ‘క్రమంగా నా చూపు మోడలింగ్ రంగం వైపు మళ్లింది. నా అంతట నేనుగా ఈ రంగం గురించి అవగాహన పెంపొందించుకున్నాను. ఆ ఉత్సాహంతోనే గత ఏడాది మిసెస్ వైజాగ్ పోటీలలో పాల్గొన్నాను. కానీ.. ఫైనల్స్ వరకు వచ్చిన నేను ఓటమి చవిచూశాను. ఇది షాక్‌లా తగిలింది. అవగాహన ఉందనుకుంటే చాలదని.. పట్టుదలతో ప్రయత్నించాలని అర్థమైంది. దాంతో ఈసారి ప్రతీ అంశంపై దృష్టి పెట్టి కిరీటం గెలుచుకున్నాను.’ అని చెప్పారు. ఆశయం ఉంటే చాలదు.. తాను ఎందరికి ఆదర్శప్రాయమయ్యానో తెలియదని.. అయి తే ఆకాంక్ష ఉంటే చాలదని, దానిని సాధించడానికి దీక్షతో పని చేయాలన్న సూత్రాన్ని మాత్రం చాటి చెప్పగలిగానని మమత అన్నారు. ఆశయాలు ఉండి వాటిని సఫలం చేసుకోలేని వారిలో చైతన్యం నింపాలన్నది తన ఆకాంక్షని చెప్పారు. తనకు ఇద్దరు కుమార్తెలని, ఇద్దరూ మోడలింగ్ రంగంలో రాణించేలా చూడాలన్నది లక్ష్యమని చెప్పారు. -
మిసెస్ ఇండియా యునివర్స్ మనీషా
యశవంతపుర : ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన డాజల్ మిసెస్ ఇండియా యునివర్స్–2018 కిరీటాన్ని శివమొగ్గకు చెందిన మనీషా వరుణ్ దక్కించుకొంది. ఈ పోటీలు శ్రీలంక–భారత పర్యటక శాఖ అధికారులు నిర్వహించారు. ఈనెల 14న జరిగిన ఈ పోటీలలో శివమొగ్గకు చెందిన వక్క వ్యాపారి వరుణ్ భార్య మనీషా పాల్గొని మిసెస్ ఇండియా యునివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మిస్ ర్యాంప్ వాక్, మిసెస్ ఇండియా యునివర్స్ సౌత్ పురస్కారాలు దక్కించుకున్న ఆమె మిసెస్ ఇండియా యునివర్స్–2018లో విన్నర్‌గా నిలిచారు. -
‘తృప్తి’గా ఉంది
► మిసెస్ ఇండియా తృప్తి ► బెంగళూరు వనితకు అందాల కిరీటం శివాజీనగర: బెంగళూరు నగరానికి చెందిన తృప్తి 2017వ సంవత్సరానికి మిసెస్ ఇండియా కిరీటం అందుకున్నారు. నగరంలో ఒక ప్రముఖ సంస్థలో మానవ వనరుల విభాగం ఉన్నతోద్యోగి అయిన తృప్తి మిసెస్ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నారని మిసెస్ ఇండియా కర్ణాటక విభాగం డైరెక్టర్ ఎస్.ప్రతిభా సౌశీమత్ తెలిపారు. బుధవారం వారిద్దరూ బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 700 మంది అభ్యర్థులు ఈ పోటీల్లో తలపడ్డారు. అందులో తృప్తి విజేతగా నిలిచిందని తెలిపారు. భారతీయ సంస్కృతి, తొమ్మిది గజాల పట్టుచీరను ధరించి నడవటంలోను ఆమె ప్రతిభను చూపించారు. ఈ నెల 4న చెన్నైలో జరిగిన తుది పోటీల్లో 25 మంది కిరీటం కోసం పోటీ పడ్డారు. ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని తృప్తి చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనటం ద్వారా అనేక విషయాలు నేర్చుకోగలిగానని తెలిపారు. -
చేనేతకు శిల్పకళ
టాప్ మోడల్‌గా పేరు తెచ్చుకున్నాక అదే గొప్ప అనుకొని అక్కడితో విశ్రాంతి తీసుకుంటారు చాలామంది. కానీ, ఆమె అలా కాదు. పెళ్లయిన తర్వాతా ‘మిసెస్ ఇండియా’ కిరీటం దక్కించుకున్నారు. ప్రసిద్ధ మోడల్స్ ఎందరో కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో స్థానం పొందడం కలగా భావిస్తారు. ఆ కలను ఆమె నిజం చేసుకున్నారు. పట్టుబట్టి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అయ్యారు. నృత్యకారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఫ్యాషన్ డిజైనర్‌గా ఈఫిల్ టవర్‌పై తెలుగు చేనేత వైభవాన్ని చాటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రత్యేకతను సాధిస్తూ తనను తాను మలచుకోవడం శిల్పారెడ్డి ఘనత. సౌందర్య ‘శిల్ప’ సూత్రాలు.. ► మన శరీరానికి ఏది నప్పుతుందో తెలుసుకోవాలంటే మన శరీరం మనకే తెలిపే భాషను అర్థం చేసుకోవాలి. దానిని బట్టి సౌకర్యంగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ► ఎక్కువ డబ్బు ఖర్చుపెడితేనే ఫ్యాషనబుల్‌గా ఉండగలం అని చాలా మంది అనుకుంటారు. ఇది చాలా పెద్ద అపోహ. శరీరాకృతి, వ్యక్తిత్వాన్ని బట్టి తయారవడం ఈ రోజుల్లో తప్పనిసరి. ► అన్నీ బ్రాండెడ్ దుస్తులే వేసుకోవాలనుకోకూడదు. అలా వేసుకోవడమూ సరైనది కాదు. ఇండియన్-వెస్ట్రన్ స్టైల్స్‌ని మిళితం చేస్తూ చాలా రకాలుగా ధరించవచ్చు. అప్పుడే స్టైల్‌గా కనబడతారు. ► నడుము కింది భాగం పెద్దగా ఉంటే పై టాప్ మోకాళ్ల కిందవరకు ధరించడం, ఛాతీ పరిమాణం పెద్దగా ఉంటే హై నెక్స్ జోలికి వెళ్లకపోవడం.. వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ► మనవారి చర్మ రంగుకు ఎరుపు, నారింజ, పచ్చ.. ముదురు రంగులూ బాగా నప్పుతాయి. వీటిలో అన్ని షేడ్స్నూ ఎంచుకోవచ్చు. ► అలంకరణలో రంగురంగుల పూసల ఆభరణాలు ఇటీవల కాలంలో ముందువరసలో ఉన్నాయి. పరిచయం అక్కర్లేని పేరు ఆమెది. హైదరాబాద్‌లోని పేజ్ 3 పీపుల్ జాబితాలో ముందువరసలో ఉండే శిల్పారెడ్డి సోషలైట్గానూ గుర్తింపు పొందారు. గృహిణిగా, తల్లిగా, సాధికారత గల మహిళగా శిల్పారెడ్డి చెప్పే మాట - ‘‘మహిళ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. నేను డిజైన్ చేసిన దుస్తుల్లో ఆమె మరింత ఉన్నతంగా కనిపించాలి’ అని. అందుకే మహిళను ఆత్మవిశ్వాసంతో చూపే బ్లేజర్స్ అంటే చాలా ఇష్టమని చెప్పే ఈ మోడల్ ఇటీవల తెలుగుదనపు చేనేతను ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ైపై మెరిపించారు. అక్కడ జరిగిన ఫ్యాషన్ షోలో తను డిజైన్ చేసిన దుస్తులను ప్రదర్శించారు. దాని వెనక దాగున్న తన కృషిని తెలియజేశారు. ప్యారిస్ అనుభవాలు... ‘‘వివిధ దేశాలకు చెందిన పది మంది ప్రసిద్ధ డిజైనర్లు ప్యారిస్ ఫ్యాషన్ షోలో తమ వస్త్ర వైవిధ్యాలను ప్రదర్శించారు. అందులో మన దేశం తరపున నేను ఒక్కదాన్నే పాల్గొన్నాను. మన దేశ సంస్కృతి, వారసత్వ వైభవం అక్కడ ప్రదర్శించే అవకాశం నాకు రావడం చాలా గర్వంగా అనిపించింది. మన చేనేతకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న మట్కా ఫ్యాబ్రిక్ ప్యారిస్‌లో హొయలు పోవడం, అందరి నుండి ప్రశంసలు అందుకోవడం ఓ గొప్ప అనుభూతి. ఇండియా అనగానే గొప్పదైన మన చేనేత ప్రపంచ దేశాల ప్రజల మదిలో తప్పక మెదులుతుంది. ఈఫిల్ ఫ్యాషన్ షో అవకాశం రాగానే ముందుగా ఎలాంటి తరహా డిజైన్లు బాగుంటాయని చాలా శోధించాను. ఈఫిల్ టవర్ ఐరన్‌తో నిర్మించిన అతిపెద్ద కట్టడం. దానికి తగ్గట్టుగా ఒక వారసత్వ అంశాన్ని జోడించాలి. అలాగే ప్రస్తుతకాలానికి ఏది బాగా నప్పుతుందో చూడాలి. ఆ విధంగా తెలంగాణ చేనేతకారుల్లో రూపుదిద్దుకునే మట్కా ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నాను. దానికి కొంత రస్టిక్ గోల్డ్ ఎలిమెంట్స్ జోడించాను. ప్యారిస్‌లో పూర్తి చలికాలం కావడంతో దుస్తులకు ఫుల్ స్లీవ్స్ జత చేశాను’’ అంటూ తను డిజైన్ చేసిన దుస్తుల గురించి, ప్రశంసల గురించి ఆనందంగా వివరించారు శిల్పారెడ్డి. చేనేత.. ఇప్పుడంతా యువతదే! ‘‘ఫ్యాషన్ అనగానే చాలా మంది గ్లామర్ మాత్రమే అని అపోహపడుతుంటారు. అలా కానే కాదు. మన నేల గొప్పతనాన్ని చాటే వేదిక ఫ్యాషన్. మనదైన కళను ముందు తరాలకు అందజేసేది ఫ్యాషన్. చేనేత దుస్తులు వయసు పైబడినవారు మాత్రమే ధరించేది అని నిన్న మొన్నటి వరకు భావించేవారందరూ. కానీ, నేడు యువతరం ఫ్యాషన్ అంతా చేనేత చుట్టూనే ఉంది. మనదైన ఫ్యాబ్రిక్‌తో యువతరం మెచ్చే ఎన్నో డిజైన్లు సృష్టించవచ్చు. అదే నేను చేసింది. ప్యారిస్‌లో జరిగిన ఫ్యాషన్ షో కోసం మొత్తం 16 డ్రెస్సులు సృష్టించాను. వాటిని అక్కడి వరకు తీసుకెళ్లి, అక్కడి మోడల్స్ చేత ధరింపజేసి, వేదిక మీద ప్రదర్శించాను. వాటిని తయారు చేయడానికి 2 నెలలకు పైగా సమయం పట్టింది. ఇంటి బాధ్యతలు చూస్తూనే అంకితభావంతో డిజైన్స్ సృష్టించాను’’ అంటూ ఇష్టంగా చేసిన శ్రమను, చేనేత చుట్టూ అల్లుకుపోయిన జీవితాల గురించి ప్రస్తావించారు ఈ ఫ్యాషన్ డిజైనర్! డిజైన్లలో మనదైన ముద్ర ‘‘ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మకతకే పెద్ద పీట. అలాగే డిజైనర్‌కి మంచి నెట్వర్క్ ఉండాలి. దానికి తోడు తాము సృష్టించే డిజైన్లకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఎలిమెంట్‌ను, మనదైన వారసత్వ అంశాన్ని జోడించాలి. అప్పుడే డిజైనర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందగలరు’’ అంటూ ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టేవారికి సూచనలు ఇచ్చారు శిల్పారెడ్డి. ‘‘నేడు ఎంతోమంది డిజైనర్స్ ఉన్నారు. ఇంకా ఎంతో మంది కొత్త డిజైనర్లు పుట్టుకువస్తున్నారు. వీరంతా ఇప్పుడు మన కాటన్స్ని యువతరం ఫ్యాబ్రిక్‌గా కీర్తిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పాశ్చాత్య దుస్తులకే మనదైన కాటన్ని జత చేస్తే ఖరీదులోనూ అందరికీ అందుబాటులోకి తీసుకురాగలరు. ఇందుకు కొంత సృజనాత్మకత చూపాలి’’ అంటారు ఆమె. మట్కా డిజైన్స్‌తో విదేశాలలోనూ అదరగొట్టిన శిల్పారెడ్డి తదుపరి తన డ్రెస్ డిజైన్లను ఖాదీ, సిల్క్‌తో రూపుకట్టడానికి సిద్ధమవుతున్నారు. చేనేత పట్ల తనకున్న అభిమానం గురించి తెలియజేస్తూ - ‘‘గతంలోనూ ఎక్కువగా చందేరి, అన్బ్లీచ్డ్ కాటన్‌తో దుస్తులను డిజైన్ చేశాను. చేనేత దుస్తులకు ఎక్కడికెళ్లినా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీని గురించి ఒక కథ చెప్పినట్టుగా ఎక్కడైనా పరిచయం చేయవచ్చు. చేనేతకారులకు చేయూతనివ్వడానికి ఇదో మంచి అవకాశం...’ అని తెలియజేశారు. నూటికి నూరు శాతం అంకితభావం.. ఒకటి సాధించామని అంతటితో ఆగిపోతే ప్రయాణంలో మజా ఉండదు అంటారు శిల్పారెడ్డి. మోడల్‌గానూ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్గానూ పేరున్న ఆమె నాలుగేళ్ల క్రితం నగరంలో ‘శిల్పారెడ్డి డిజైనర్ స్టూడియో’ ప్రారంభించారు. ఇంతేకాదు పోషకాహార నిపుణురాలిగానూ వ్యవహరిస్తున్నారు. వ్యాయామాలు, ఇంటిపనులు, డిజైనింగ్ పనులు .. మల్టీ టాస్కింగ్‌గా ఇన్ని పనులను చేయడంలో కృషిని తెలియజేస్తూ.. ‘‘నాకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని పెంచుకుంటూ వెళ్లడం ఇష్టం. పెందరాళే నిద్రలేస్తాను. రాత్రి పదిలోపు నాకున్న బాధ్యతలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మా బాబుకు నాలుగేళ్లు. వాడితోనూ తగినంత సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. ఏడాదిలో రెండు ట్రిప్‌లు మా వారితోనూ, మరో రెండు ట్రిప్‌లు ఫ్యామిలీ మొత్తం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. తల్లిగా, ఇల్లాలిగా.. ఎక్కడా లోపం రానివ్వను. ఏ పని చేసినా నూటికి నూరు శాతం అంకితభావంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అంటూ నవ్వుతూ వివరించారు ఈ ఎనర్జిటిక్ ఉమన్. - నిర్మలారెడ్డి