సాక్షి, హైదరాబాద్: అల్కాజర్ వాచెస్, డీక్యూయూఈ సోప్ ఆధ్వర్యంలోని మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటాన్ని తెలంగాణకు చెందిన వర్షారెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో గెలుచుకున్న టైటిల్‌తో సందడి చేశారు. తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్లి లే మెరిడియన్ వేదికగా టైటిల్ నెగ్గడం సంతోషంగా ఉందని తెలిపారు.
2012లో మిస్ సౌత్
ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను, అప్పుడు మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించానని గుర్తు చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంతో పాటు యూఎస్‌ఐటీ సిబ్బంది, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, చలనచిత్ర నిర్మాణం వంటి ఐదు విభిన్న కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. విజేతకు పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జెబితా అజిత్ కిరీటాన్ని అందించారు.
మిసెస్ సౌత్ ఇండియా 2024 అందాల పోటీల్లో కేరళకు చెందిన రేవతి మోహన్ మొదటి రన్నరప్ స్థానాన్ని పొందగా, కేరళకు చెందిన దృశ్య డినాయర్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిసెస్ సౌత్ ఇండియా పోటీకి దక్షిణ భారత రాష్ట్రాల నుండి 12 మంది పోటీదారులు ఎంపికయ్యారు. మిసెస్ సౌత్ ఇండియా విజేతలకు పరక్కత్ జ్యూయలర్స్‌కు చెందిన ప్రీతి పరక్కత్ రూపొందించిన బంగారు కిరీటాన్ని బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment