Reddy
-
AP: ఐపీఎల్ రేసులో చిన్నదోర్నాల మనీష్‌రెడ్డి
పెద్దదోర్నాల: ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ రేసులో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన గొలమారు మనీష్‌రెడ్డి ఉన్నారు. గొలమారు ఉమామహేశ్వరరెడ్డి కుటుంబం వ్యాపార రీత్యా విశాఖపట్నంలో స్థిరపడింది. ఉమామహేశ్వరరెడ్డి తండ్రి గొలమారు పెద్దతాతిరెడ్డి గతంలో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని అఖిల భారత రెడ్ల సత్రం ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తించారు. ఉమామహేశ్వరరెడ్డి పెద్ద కుమారుడు మనీష్‌రెడ్డి చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని, ఆంఽధ్ర తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వేలానికి సిద్ధమయ్యారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఐపీఎల్ వేలం రిజిస్టర్ చేసుకున్నారు. పలు ఐపీఎల్ జట్లు కొత్త కుర్రాళ్ల వైపు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో మనీష్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. కాగా సోమవారం కూడా నిర్వహించనున్న ఐపీఎల్ వేలంలో మనీష్‌రెడ్డికి అవకాశం దక్కవచ్చని భావిస్తూ మనీష్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. -
త్వరలోనే సీఎం పాపం పండుతుంది
కుషాయిగూడ: శిశుపాలుడి పాపాల మాదిరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారని.. తొందరలోనే ఆయన పాపం పండుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం చర్లపల్లి జైల్లో ములాఖత్ అయ్యారు.నరేందర్‌రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు ఆవరణలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారన్నారు. తనలాగే చేయని తప్పునకు ప్రభుత్వం జైల్లో పెట్టిన 30 మంది పేద, గిరిజన, దళిత రైతులకు అండగా ఉండాలని, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని నరేందర్‌రెడ్డి కోరారని కేటీఆర్ తెలిపారు. రైతన్నలకు అండగా కేసీఆర్ ఉన్నారని.. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి సొంతూరులో ఆయన సోదరులు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి తోవ లేకుండా గోడ కట్టడంతో క్షోభతో ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం ఉందని సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకొనేలా ఒత్తిడి తెచ్చిన సీఎం సోదరుడు నుముల గురువారెడ్డి చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనించాలన్నారు. రేవంత్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. -
అరెస్టు నోటీసులు భార్యకు ఇవ్వకుండా.. సలీమ్‌కు ఎందుకు ఇచ్చారు?
సాక్షి, హైదరాబాద్: ఇంటి వద్దే అరెస్టు చేస్తే పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) భార్యకు నోటీసులు ఇవ్వకుండా, సలీమ్ అనే వ్యక్తికి ఎందుకు ఇచ్చారని హైకో ర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సహకరించని, పరారీలోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. ఇతర నిందితుల వాంగ్మూలం, కాల్ డేటా ఆధారంగా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి పేరు వెల్లడించినట్లు చెబుతున్న లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాల కాపీలను అనుమతిస్తున్నట్లు పేర్కొంటూ.. తీర్పు రిజర్వు చేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ విచారణార్హం కాదు.. న్యాయమూర్తికి పెన్‌డ్రైవ్ అందజేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి, కలెక్టర్ ఎవరొచి్చనా కూడా దాడి చేయాలని పిటిషనర్ (నరేందర్‌రెడ్డి) ప్రేరేపించారు. లగచర్లలో అధికారులపై దాడికి ముందు, తర్వాత ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోల పెన్‌డ్రైవ్ ఉంది. పిటిషనర్ రెచ్చగొట్టకుంటే దాడి జరిగేదే కాదు. పిటిషనర్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారం సాగుతోంది. వరుసగా పిటిషన్లు వేస్తూ విచారణను ముందుకు సాగకుండా చేస్తున్నారు. కేసీఆర్ నుంచి రూ.10 కోట్లు పిటిషనర్‌కు అందినట్లు తెలుస్తోంది. క్వాష్ పిటిషన్ విచారణార్హం కాదు.. కొట్టివేయాలి’అని అన్నారు. అయితే సెక్షన్ 482 కేసులో పెన్‌డ్రైవ్ ఎలా సమరి్పస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ముందస్తు పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్పడానికి అందులోని వివరాలే సాక్ష్యమని పీపీ బదులిచ్చారు.అరెస్టు ఫొటోలను న్యాయమూర్తికి అందజేసిన గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘15 మంది సివిల్ డ్రస్‌లో వచ్చి బలవంతంగా అరెస్టు చేశారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. పిటిషనర్‌తో పలు పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. అందులో ఏముందో చూసుకునే అవకాశం ఇవ్వలేదు’అని చెప్పారు. సంతకాలు అభ్యంతరకరం వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘చట్టపరమైన అవకాశం ఉన్నప్పుడు పిటిషన్లు వేయకుండా అడ్డుకోవడం సాధ్యం కాదు. నివేదికలపై సంతకాలు కూడా అభ్యంతరకరం’అని అన్నారు. గాయపడిన వారి వివరాల్లో ప్రశ్నార్థకాలు ఎందుకున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ప్రాథమిక సమాచారం తీసుకునే క్రమంలో అలా పేర్కొన్నారని పీపీ బదులిచ్చారు. ఈ సందర్భంగా విచారణ తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేశారు. కాగా, లగచర్ల ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చటవిరుద్ధమంటూ నరేందర్ రెడ్డి భార్య శ్రుతి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ముందు విచారణకు రానుంది. -
ఆయనేమన్నా టెర్రరిస్టా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయన ఏమైనా టెర్రరిస్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను బహిరంగ ప్రదేశంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఆయన పరారీలో లేరు కదా.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చట్టప్రకారం అరెస్టు చేయొచ్చు కదా అని పేర్కొంది. గాయపడ్డ వారి వివరాల పక్కన ప్రశ్నార్థకం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వైద్యుడికే స్పష్టత లేదా అని అడిగింది. నరేందర్‌రెడ్డి మరో నిందితుడికి రెండు నెలల కాలంలో 84 సార్లు ఫోన్ చేశారన్న పోలీసుల వాదనపై ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు నేరపూరిత కుట్రపైనే మాట్లాడుకున్నారని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది.నరేందర్‌రెడ్డికి ప్రమేయం ఉందంటూ నిందితులు చెప్పిన వాంగ్మూలాల కాపీలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం: పీపీ ‘నరేందర్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు. నవంబర్ 11న రిమాండ్ డైరీలో ఆయన పేరు లేదు. నవంబర్ 13 నాటి డైరీలో చేర్చారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో ఒకటి తప్ప అన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇతర నిందితులు నరేందర్‌రెడ్డి పేరు చెప్పారంటూ చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజున ఆయన నుంచి మరో నిందితుడి (ఏ–4)కి ఒకే ఒక్క కాల్ వెళ్లింది. అలాంటప్పుడు ఘటన వెనుక ఆయన ఉన్నట్లు ఎలా చెబుతారు? రాజకీయ కోణంలోనే మాజీ ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమీ చెప్పకున్నా.. కేటీఆర్ పేరు చెప్పినట్లు, నేరాన్ని అంగీకరించినట్లు తప్పుడు నివేదికను ట్రయల్‌కోర్టుకు అందజేశారు. తోపులాటలో జరిగిన చిన్న గాయాలను రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు’అని గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారు. దీని కోసమే మరో నిందితుడికి రెండు నెలల్లో 84 సార్లు కాల్ చేశారు. నరేందర్‌రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశాం. విచారణ సాగుతోంది. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలి. నరేందర్‌రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై వికారాబాద్ కోర్టు విచారిస్తోంది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.ప్రాథమిక విచారణ చేశారా?వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఇంటి వద్దే అరెస్టు చేస్తే, విచారణ సమయంలో సలీమ్ అనే వ్యక్తి సమాచారం ఎందుకు ఇచ్చారు? సొంత పార్టీ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన అరెస్టు చేస్తారా? ఇతర నిందితుల స్టేట్మెంట్లు కాకుండా నరేందర్‌రెడ్డి పాత్రపై ప్రాథమిక విచారణ చేశారా? మీరు చెబుతున్నట్లు కుట్ర కోణం ఉంటే ఘటన జరిగిన రోజున ఇద్దరి మధ్య ఒకే కాల్ ఎందుకు ఉంటుంది? లగచర్ల ఘటనలో అధికారులకు పెద్దగా గాయాలు కాలేదని నిమ్స్ వైద్యుల నివేదిక చెబుతోంది. లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాలను అందజేయండి’అంటూ తీర్పు రిజర్వు చేశారు. అయితే తమ వాదనలకు కొంత సమయం కావాలని పీపీ విజ్ఞప్తి చేయడంతో గురువారానికి వాయిదా వేశారు. -
మెజార్టీ నిందితులకు భూముల్లేవు
వికారాబాద్: తమ వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నందునే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చి అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ అయిన ఆయన, ఆ తర్వాత ఎస్పీ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌రెడ్డితో పాటు మరో 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కోర్టులో హాజరుపర్చిన సమయంలో జరిగిన వాదనల సందర్భంగా సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలు సమరి్పంచామని వెల్లడించారు. కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముందుగా 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించిన తర్వాత ఘటనతో సంబంధం లేని 40 మందిని విడుదల చేశామని చెప్పారు. దాడిలో పాల్గొన్నవారిలో 42 మందిని గుర్తించామని, అయితే ఇందులో 19 మంది ఏ సంబంధం లేకుండానే దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. మెజార్టీ నిందితులకు అక్కడ భూములు లేవని, ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ఆధారాలున్నాయని ఐజీ చెప్పారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. తొలుత ఏ–1గా సురేశ్ ఉండగా దర్యాప్తు తర్వాత లభ్యమైన సాక్ష్యాధారాలతో నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చామని వివరించారు. దాడిలో సురేష్, మహేశ్, దేవదాస్, గోపాల్‌నాయక్, విఠల్, రాజు, విజయ్ ప్రధాన భూమిక పోషించారన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉందన్నారు. గతంలో సురేష్ పై కేసులున్నాయని, రేప్ కేస్ ఉంటే మేనేజ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. రిమాండ్‌కు తరలించింది వీరినే..ఏ1 పట్నం నరేందర్‌రెడ్డి, ఏ 21 బోగమోని మహేశ్, ఏ 22 బ్యాగరి విశాల్, ఏ 24 నీరటి సాయిలు, ఏ 27 నీరటి రమేశ్ (వీరిని బుధవారం అరె స్టు చేశారు), ఏ 3 ఎ.శివకుమార్, ఏ 11 మైలారం విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ 14 హీర్యానాయక్, ఏ 15 పతీవత్ శ్రీను, ఏ 16 పతీవత్ ప్రవీణ్, ఏ 17 పతీవత్ వినోద్, ఏ 18 రాథోడ్ వినోద్, ఏ 19 జర్పాల హీర్యానాయక్, ఏ 20 బాస్యానాయక్, ఏ 23 బ్యా గరి యాదయ్య, ఏ 25 దోరేమోని రమేష్, ఏ 26 కావ లి రాఘవేందర్, ఏ 28 లక్ష్మయ్య, ఏ29 నీలి రవి, ఏ 30 శ్రీశైలం, ఏ 31 బాలకిష్టయ్య (వీరిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు). -
సజ్జల భార్గవ్ కేసు వివరాలేవీ?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ పోలీసులను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.మొసాద్ ఏజెంట్లలా మోహరించి ఉన్నారు..ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని భార్గవ్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్‌ను కోరారు. అంత అత్యవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. భార్గవ్ కోసం పోలీసులు మొసాద్ ఏజెంట్ల మాదిరిగా మోహరించారని తెలిపారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణ జరిపారు.ఎప్పుడో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని పొన్నవోలు తెలిపారు. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌ని నిందితుడిగా చేర్చారని తెలిపారు. జూలై 1కి ముందు పెట్టిన పోస్టులపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ కింద కేసులు పెట్టారని, వాస్తవానికి అప్పటికి ఈ చట్టాలేవీ అమల్లోకి రాలేదని తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ కింద మాత్రమే కేసులు పెట్టాలన్నారు. భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇదే వ్యవహారంలో మరో నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా న్యాయమూర్తి 14కి వాయిదా వేశారు.అర్జున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. -
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్‌పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్‌పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్‌నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
రామ రామ.. ఏమిటీ డ్రామా!
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ శ్రీరాములోరి రథం దగ్ధం కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ సానుభూతిపరులేనంటూ సర్వత్రా కోడై కూస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీపై నెట్టేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని బుధవారం అనంతపురంలో మీడియా ఎదుట హాజరు పరిచారు. రథానికి నిప్పు పెట్టడంలో ఈశ్వర్‌రెడ్డి పాత్ర ఉందని, ఇతను వైఎస్సార్సీపీకి చెందిన వాడని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించారు. వాస్తవంగా ఈశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి పని చేశాడని, ఆ విషయాన్ని పోలీసులు దాచి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రథం దగ్ధం తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలాలు గ్రామంలోని నలుగురి ఇళ్ల వద్దకు వెళ్లాయి. ఆ నాలుగిళ్లూ టీడీపీ సానుభూతిపరులవే కావడం గమనార్హం. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ టీడీపీకి చెందిన వారే ఈ పని చేసినట్లు తేలినప్పటికీ వారెవ్వరినీ నిందితులుగా చూపలేదు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం. అన్ని వేళ్లూ వారి వైపే.. హనకనహాళ్ గ్రామంలో శ్రీరాములోరి రథం పట్ల ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది టీడీపీ వారే కావడం గమనార్హం. ఈ విషయం గ్రామస్తులందరూ చెబుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి బ్రదర్స్ 2022లో రూ.19 లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని తయారు చేయించినప్పుడు అదే పార్టీకి చెందిన వారు ఎందుకు నిప్పు పెడతారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ వారే రథానికి నిప్పు పెట్టి.. ఆ నెపం వైఎస్సార్సీపీ మద్దతుదారులపై నెట్టేలా వ్యూహం పన్నినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి సంఘటనలెన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం చెప్పిందొకటి..జరిగింది మరొకటి..కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు చెప్పినప్పటికీ, మరోవైపు అందుకు భిన్నంగా జరుగుతోంది. దోషులు టీడీపీ వారేనని తేలినప్పటికీ, ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి మచ్చ రావడం ఖాయమని, వైఎస్సార్‌సీపీపైకి నెపం నెట్టాలని టీడీపీ పెద్దలు చెప్పడంతో పోలీసులు జీ హుజూర్ అన్నట్లు సమాచారం. సీఎం వ్యాఖ్యలకు అర్థం ఇదేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసు యంత్రాంగం ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, అతను వైఎస్సార్సీపీ అని చెప్పడం గమనార్హం. పోలీసుల తీరు పట్ల గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.రథానికి నిప్పు ఘటనలో ఒకరి అరెస్ట్: ఎస్పీ జగదీష్అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఈశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హనకనహాళ్లో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలను పగులగొట్టి మండపంలోకి ప్రవేశించి.. రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే గ్రామస్తులు మంటలు ఆర్పారని, అప్పటికే రథం ముందు భాగం కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ఘటనా స్థలంలో ఆధారాల సేకరించామని చెప్పారు. రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారని తెలిపారు. గ్రామంలో ఏ ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారన్నారు. దీంతో గ్రామస్తుల్లో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలియడంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. పోలీస్ కస్టడీలోకి తీసుకుని, ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే అంశంపై విచారిస్తామన్నారు. -
సాయికార్తీక్ ఖాతాలో ఏడో డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు టోర్నమెంట్లలో ఫైనల్ చేరి... రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయికార్తీక్ రెడ్డి ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ఈ ఏడాది తన ఖాతాలో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఇండోనేసియా ఆ«దీనంలోని బాలి ద్వీపంలో జరిగిన ఐటీఎఫ్ ఎం25 టోరీ్నలో సాయికార్తీక్ రెడ్డి (భారత్)–బొగ్డాన్ బొబ్రోవ్ (రష్యా) జోడీ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాయికార్తీక్–బొగ్డాన్ ద్వయం 6–2, 6–4తో మాథ్యూ స్కాగ్లియా (ఫ్రాన్స్)–జాకుబ్ వోచిక్ (అమెరికా) జంటపై గెలిచింది. సాయికార్తీక్ »ొగ్డాన్ జోడీకి 1,550 డాలర్ల (రూ. 1 లక్ష 30 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఓవరాల్‌గా సాయికార్తీక్ కెరీర్లో ఇది ఏడో డబుల్స్ టైటిల్‌కాగా, ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్. 24 ఏళ్ల సాయికార్తీక్ 2023లో నాలుగు డబుల్స్ టైటిల్స్‌ను, 2022లో రెండు డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు. ఈ ఏడాది సాయికార్తీక్ మొత్తం 22 ఐటీఎఫ్ టోరీ్నలలో పాల్గొన్నాడు. ఐదు టోర్నీల్లో డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచి, ఒక టోరీ్నలో టైటిల్ గెలిచాడు. -
మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అల్కాజర్ వాచెస్, డీక్యూయూఈ సోప్ ఆధ్వర్యంలోని మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటాన్ని తెలంగాణకు చెందిన వర్షారెడ్డి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో గెలుచుకున్న టైటిల్‌తో సందడి చేశారు. తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్లి లే మెరిడియన్ వేదికగా టైటిల్ నెగ్గడం సంతోషంగా ఉందని తెలిపారు. 2012లో మిస్ సౌత్ ఇండియా పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాను, అప్పుడు మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించానని గుర్తు చేసుకున్నారు. ఫ్యాషన్ రంగంతో పాటు యూఎస్ఐటీ సిబ్బంది, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, చలనచిత్ర నిర్మాణం వంటి ఐదు విభిన్న కంపెనీలకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. విజేతకు పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ జెబితా అజిత్ కిరీటాన్ని అందించారు. మిసెస్ సౌత్ ఇండియా 2024 అందాల పోటీల్లో కేరళకు చెందిన రేవతి మోహన్ మొదటి రన్నరప్ స్థానాన్ని పొందగా, కేరళకు చెందిన దృశ్య డినాయర్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మిసెస్ సౌత్ ఇండియా పోటీకి దక్షిణ భారత రాష్ట్రాల నుండి 12 మంది పోటీదారులు ఎంపికయ్యారు. మిసెస్ సౌత్ ఇండియా విజేతలకు పరక్కత్ జ్యూయలర్స్‌కు చెందిన ప్రీతి పరక్కత్ రూపొందించిన బంగారు కిరీటాన్ని బహూకరించారు. -
సరదా.. సరదాకే..
ఎంచుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువేంకాదు.. ఇది ఒకప్పటి మాట.. టెక్నాలజీ రాకతో, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నేటి తరం యువత కలలు నెరవేర్చుకుంటున్నారు. సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలా తాను అనుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన వ్యక్తే హర్షిత్ రెడ్డి మల్గి...సరదాగా డబ్స్మాలతో మొదలై ప్రభాస్ కల్కి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. చిన్నతనం నుంచి తనకు నటనపై ఉన్న సరదా.. అందులోనే నిలదొక్కుకునేందుకు చేసిన తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు.. తెలుసుకుందాం.. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. బిటెక్ ఇక్కడే పూర్తి చేశాను. చిన్నతనం నుండే స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్‌లో ఉత్సాహంగా సింగింగ్, యాక్టింగ్‌లలో సరదాగా పాల్గొనేవాడిని. 2018లో డబ్‌స్మాష్‌లను నేను సరదాగా చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చే«శాను. దీంతో ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. అలా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ చాయ్బిస్కట్లో యాక్టర్‌గా కొన్ని స్కెచ్ విడియోస్ చేశాను. అలా మొదలైన నా ప్రస్థానం.. నేడు ప్రపంచస్థాయి చిత్రంగా నిలుస్తున్న ప్రభాస్ కలి్క–2898 చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నా అని తెలిపారు హర్షిత్‌రెడ్డి మల్గి. లాక్డౌన్లో యాక్టింగ్‌పై మరింత ఆసక్తి... లాక్డౌన్లో వందలాది సినిమాలు చూశాను. అలా నటనపై మరింత ఆసక్తితో పాటు పలు మెళకువలు నేర్చుకున్నాను. అనంతరం ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. అలా ఆహాలో నటుడు ప్రియదర్శితో కలిసి ‘మెయిల్’ సినిమాలో మెయిన్ రోల్ చేశాను. థియేటర్లో కాకుండా ఆహాలో విడుదలయింది. తరగతిగదిదాటి, అర్థమైందా అరుణ్‌కుమార్, లూసర్ వెబ్‌సీరిస్‌లను చేశాను. అలా నటుడిగా మంచి మార్కులు సాధించి పలు అవార్డులను అందుకున్నాను. మెయిల్ చిత్రంలో నటనకు చాలా మంది మెచ్చుకున్నారు. కల్కిలో అవకాశం... సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మంచి క్యారెక్టర్స్ రాలేదు. ఓ డిఫరెంట్ రోల్లో చేయాలనుకునే సమయంలో మెయిల్ చిత్రం ప్రొడ్యూసర్ స్వప్నదత్ ప్రభాస్‌తో కల్కి 2898 చిత్రాన్ని చేస్తున్నారు. ఓ మంచి రోల్ ఉంది చేస్తావా అని చిత్ర టీం అడగటంతో ఖచి్చతంగా చేస్తానని చెప్పాను. దర్శకుడు నాగ్అశి్వన్ మెయిల్ చిత్రం చూసి ఎటువంటి ఆడిషన్స్ లేకుండా సెలెక్ట్ చేశారు. హీరో ప్రభాస్‌తో కలిసి ఓ డిఫరెంట్ రోల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో రిలీజ్ అయ్యే నా మొదటి సినిమా పాన్ వరల్డ్ సినిమా అవ్వడం మరింత గర్వంగా ఉంది. చిత్రంలో నా క్యారెక్టర్ పేరుకూడా కొత్తగా ఉంటూ చిత్రంలోని బుజ్జి క్యారెక్టర్‌తో ఆద్యతం ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోగా రాణిస్తా... ప్రేక్షకులను అలరిస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ హీరో, నటుడిగా రాణించాలని ఉంది. తెలుగులో పుష్ఫ చూశాక అల్లు అర్జున్ బాగా నచ్చారు. అలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. నా డ్రీమ్‌రోల్ సూపర్‌హీరో రోల్ చేయాలని ఉంది. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం ఇష్టం. హైదరాబాద్‌తో నాకు విడదీయలేని బంధం. ఇక్కడే నా లైఫ్ ప్రారంభమై సెలబ్రిటీ హోదాను తీసుకొచి్చంది. ఇండియన్ వంటకాలు ఇష్టం. హెల్తీ ఫుడ్ తీసుకొని తరచూ జిమ్ చేస్తుంటా. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండటానికే ఇష్టపడతా... -
నాన్న ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నా..
పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్‌లో బీటెక్ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్‌గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.– మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి -
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు. -
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు. -
కోవూరులో బెడిసికొడుతున్న టీడీపీ వ్యూహాలు
డబ్బుతో ఏమైనా చేసేయొచ్చనే కొందరి అంచనాలు తారుమారవుతున్నాయి. నగదును వెదజల్లి తద్వారా గెలవొచ్చనే టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంచనాలు ప్రజాక్షేత్రంలో తలకిందులవుతున్నాయి. తన విజయం అంత సులభం కాదనే విషయం బోధపడటం.. పైగా వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకోవడం ఆమె వంతవుతోంది. కోవూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోవూరు నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగదు ప్రలోభాలతో నేతలను టీడీపీలో చేర్చుకోవడం.. దురాయి పేరుతో మత్స్యకార గ్రామాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలను వేమిరెడ్డి దంపతులు ప్రకటించడం.. ఈ విషయాలు బయటకు పొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికెళ్లినా సమస్యల స్వాగతం ప్రచారంలో భాగంగా ప్రశాంతిరెడ్డి ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు వర్గపోరు.. మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఆమె చేతులెత్తేశారు. ఆత్మీయ సమావేశాలు.. ప్రచారాలు.. పార్టీ కార్యాలయాల ప్రారంభం.. ఇలా సందర్భమేదైనా గొడవలు మాత్రం కామన్‌గా మారుతున్నాయి. కోవూరు టీడీపీ సీటును ఆశించి భంగపడిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డి.. ప్రశాంతిరెడ్డి విజయానికి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవమో అర్థం కాని పరిస్థితి. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న కుమ్ములాటలకు వెన్నుపోటు రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. అడుగడుగునా ప్రతికూలతలే.. క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూల వాతావరణం లేదు. చంద్రబాబు గత పాలనను ప్రజలు నేటికీ మర్చిపోలేదు. రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల ను గతంలో ఆయన మోసగించారు. తాజాగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మడం లేదు. మరోవైపు వలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం బూమరాంగ్ అయింది. చంద్రబాబు వ్యూహాలు, గత పాలన టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారాయి. ఆడియో కలకలం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము గెలిస్తే ప్రజల్లో ఉంటామని.. ఓటమిపాలైతే వ్యాపారాలు చూసుకుంటామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే వేమిరెడ్డి దంపతులు గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడియో దుమారంతో వీరిపై నమ్మకం మరింత సన్నగిల్లింది. -
అసైన్డ్ భూమిని ఎలా కొట్టేయాలనుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేసిన వ్యవహారంలో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి బుధవారం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల ఎదుట హాజరయ్యారు. అధికారులు శివానందరెడ్డిని దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయన నుంచి కొంత సమాచారం సేకరించిన పోలీసులు వచ్చే వారం మరోసారి సీసీఎస్‌లో హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివానందరెడ్డి భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్్క, ప్రశాంత్రెడ్డినీ సీసీఎస్ పోలీసులు గత వారం ప్రశ్నించిన విషయం విదితమే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని తొలుత ప్రయత్నించిన రియల్టర్లు టీజే ప్రకా‹Ù, గాం«దీ, రామారావు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ 2021లో మిమ్మల్ని ఎందుకు సంప్రదించారంటూ పోలీసులు శివానందరెడ్డిని ప్రశ్నించారు. బుద్వేల్లోని ఆ భూమికి సంబంధించిన పూర్వాపరాలు తెలిసినప్పటికీ పోలీసు అధికారిగా ఉన్న పరిచయాలు, పలుకుబడి వినియోగించి అసైన్డ్ ల్యాండ్‌ను కాజేయాలని ప్రయత్నించడంపై శివానందరెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ భూములు సొంతం చేసుకునే ఉద్దేశంతో 2021–22 మధ్య కాలంలో అసైనీలకు శివానందరెడ్డి తన సంస్థ ద్వారా చెక్కుల రూపంలో చెల్లించిన మొత్తం వివరాలను సీసీఎస్ పోలీసులు అడిగారు. ఇంకా మీ వెనుక ఎవరున్నారు? ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం 2022–23 మధ్య ఎవరెవరి ద్వారా? ఎక్కడెక్కడ లాబీయింగ్ చేశారు? ఈ వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారు? అనే వివరాలను శివానందరెడ్డి నుంచి రాబట్టడానికి సీసీఎస్ పోలీసులు ప్రయత్నించారు. అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు మె మో జారీ అవడం వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశా న్నీ పోలీసులు ప్రశ్నించారు. గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరగ్గా.. ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు వారిపై రిజిస్టర్ చే యడం పైనా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. అసైనీలను భయపెట్టి ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర ప న్న డం ఉద్దేశపూర్వకంగా చేసిందా? అనే అంశాన్నీ పోలీ సు లు పరిగణనలోకి తీసుకుని శివానందరెడ్డిని ప్రశ్నించా రు. ఆయన నుంచి సేకరించిన సమాచారాన్ని సరిచూడాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం మరోసారి రావాలని స్పష్టం చేశారు. -
పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పథకం ప్రకారం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే దానిచుట్టూ కట్టుకథ అల్లుతున్నారు. అలాంటి కట్టుకథే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైలుకెళ్లి బెదిరించానని చెప్పడం’.. అని వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని శంకర్ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించానని, రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చామని చెబుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు. కడప సెంట్రల్ జైలులో మెడికల్ క్యాంపు నవంబరులో నిర్వహించారని.. అది అంతకు మూడు నెలల ముందు ఖరారైందన్నారు. క్యాంపు ప్రారంభం నుంచి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, పది మంది జైలు అధికారులు తమతోనే ఉన్నారని, సహచర వైద్యులు ఖైదీల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని చికిత్స అందించాక తాము బయటికి వచ్చేశామన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఓ పెద్ద కట్టుకథ అల్లారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సెంట్రల్ జైలులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు అధికారులు ఉంటారు.. అంత పటిష్ట రక్షణ ఉన్న ప్రాంతంలోకి బుద్ధి ఉన్నవారు ఎవరైనా వెళ్లి బెదిరిస్తారా? అలాచేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోరా? వెంటనే ఫిర్యాదుచేస్తే సీసీ ఫుటేజీ అధారంగా చర్యలు తీసుకుంటారు కదా.. నేను నిజంగానే బెదిరించి ఉంటే దస్తగిరి అప్పుడే జైలు అధికారులకుగానీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారికిగానీ, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రిమాండ్ ఖైదీగా పలుమార్లు కోర్టుకు హాజరైన దస్తగిరి న్యాయమూర్తులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మూడునెలల తర్వాత మీడియా ముందుకు రావడమేమిటి? ఇంకొన్నినెలలు గడిస్తే సీసీ ఫుటేజీ దొరకదని పక్కా క్రిమినల్ మైండ్‌తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ వేయగానే.. ఇక ఈ దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మా నాన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగానే తెరపైకి కట్టుకథలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే సీబీఐ అధికారి డ్రైవర్‌ను బెదిరించినట్లు కుట్ర చేశారు. పోలీసు అధికారులు విచారిస్తే అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ప్రస్తుతం హైకోర్టులో బెయిల్ పిటిషన్ నడుస్తున్నందున దాన్ని అడ్డుకోవడానికే ఇలా కొత్త కారణాలు సృష్టిస్తున్నారు. దస్తగిరి ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ వెంటనే నర్రెడ్డి సునీత కోర్టులో అఫిడవిట్ వేయడం క్రమం తప్పకుండా జరుగుతోంది. నర్రెడ్డి సునీత డైరెక్షన్లో అప్రూవర్ దస్తగిరి యాక్షన్ చేస్తున్నాడు. ఏకంగా ఎంపీ, సీఎం స్థాయి వారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడంటే అతని దురుద్దేశం అర్థమవుతోంది కదా. అప్రూవర్‌గా మారడమే వింత.. నిజానికి.. నేరానికి పాల్పడిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి ఈ కేసులోనే చోటుచేసుకుంది. తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపం పడినప్పుడే ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారతాడు. కానీ, కేసులో తనకెలాంటి సంబంధంలేదని దస్తగిరి ముందే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశాడు. అందుకు నర్రెడ్డి సునీతగానీ, సీబీఐ వారుగానీ అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు. కానీ, వాస్తవాలు పరిశీలిస్తే.. అంతకుముందు ఆగస్టులోనే వివేకానందరెడ్డిని నరికి చంపామని మీడియాతో దస్తగిరి మాట్లాడుతాడు.. ముందస్తు బెయిల్ పిటిషన్లో తనకేమి తెలీదని కోర్టుకు చెబుతాడు.. అయినప్పటికీ నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పరు. దీన్నిబట్టి.. సీబీఐ, సునీత, దస్తగిరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకే ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతోంది. హత్యచేసిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం సరైంది కాదని మేం పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. కరెక్ట్ పర్సన్ వచ్చి ఈ పిటిషన్ వేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. సునీత, దస్తగిరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంవల్లే దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఇంత ఘోరంగా ఈ హత్య కేసులో నర్రెడ్డి సునీత, దస్తగిరి కుమ్మకై వ్యవహరిస్తున్నారు. రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా.. ఇక వాచ్‌మన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిని గుర్తుపట్టి వారి పేర్లు చెప్పాడు. అయినప్పటికీ నలుగురిలో ఒకరిని అప్రూవర్‌గా తీసుకొస్తారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్తే సీబీఐ నో అబ్జెక్షన్ చెబుతోంది. కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే నర్రెడ్డి సునీత, దస్తగిరి ముందస్తు బెయిల్పట్ల మౌనం వహిస్తుంది. అప్రూవర్ ముసుగులో అత్యున్నతస్థాయి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలకు మసిబూసి..మరోవైపు.. ఘటన స్థలంలో లెటర్ ఉందని పీఏ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే దాచిపెట్టమని వారే చెబుతారు. రక్తగాయాలు ఉన్నాయని చెప్పినా, హార్ట్ అటాక్ కారణంగా కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని ఊహించామని ఆమె చెబుతోంది. అసలు హార్ట్అటాక్ అనే ప్రచారం నర్రెడ్డి సునీత కుటుంబం నుంచే మొదలైంది. అలాగే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి చెబుతారు. మరోవైపు.. హత్యచేసిన వ్యక్తులు పరారీ కాకుండా డాక్యుమెంట్ల కోసం వెతికామని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిందిగా నర్రెడ్డి సునీత కోరకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది. చివరి ఛార్జిషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతున్నా.. ఈ కేసు చివరి ఛార్జీషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతోంది. మోస్ట్ ఎఫెక్టెడ్గా ఉన్న మా కుటుంబం ఏనాడు మీడియా ముందుకురాలేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగా, కొత్తగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టే రావాల్సి వచ్చింది. మరోవైపు.. నర్రెడ్డి సునీత గూగుల్ టేకౌట్ గురించి, ఎంపీ వాట్సాప్ గురించి చెబుతోంది. నెట్ ఆన్‌లో ఉంటే వాట్సాప్ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉంటుంది కదా.. ముందు గూగుల్ టేకౌట్ పేరుతో మభ్యపెడుతూ వచ్చారు. తర్వాత పొరపాటు పడ్డామని స్వయంగా సీబీఐ కోర్టుకు విన్నవించారు. గూగుల్ టేకౌట్ అనేది కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించి దుష్ప్రచారం చేశారు. ఎంపీ కాకముందు, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, మా నాన్న ఇద్దరూ ప్రతిరోజు కలిసి తిరగడమే కాక నిత్యం ఫోన్లో టచ్‌లో ఉంటారు. ఆ రోజు మాత్రమే ఫోన్లో మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు.. వివేకా హత్యతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి, మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే పథకం ప్రకారం పన్నిన కుట్రలో ఇరుక్కున్నాం. చెయ్యని తప్పుకు మా నాన్న జైల్లో ఉన్నారు. -
Rayachoty: ఔను ఆయనకు టికెట్ లేదు !
సాక్షి ప్రతినిధి, కడప : రాయచోటి టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పార్టీ వీడనున్నారా..? కుటుంబ సభ్యుడే అన్యాయానికి ఒడిగట్టారని విశ్వసిస్తు న్నారా.. చంద్రబాబు నియంతృత్వ, ఏకపక్ష ధోరణిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రగిలిపోతున్నారా? అని ప్రశ్నిస్తే విశ్లేషకులు ఔను అనే సమాధానం ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే రమేష్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి కన్పి స్తోంది. సోమవారం లక్కిరెడ్డిపల్లె కేంద్రంగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టికెట్ లేదంటూ తేల్చి చెప్పిన అధిష్టానంపై ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచర ప్రకటించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇరువైఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్నాం, నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చిత్తశుదిత్ధో చేపట్టాం. అయినప్పటీకీ టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఎవరి విజయం కోసం పనిచేయాలని చెబుతోంది. ఇక పార్టీలో ఉండలేం, మనదారి మనం చూసుకోవాలని సన్నిహితులతో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రీజనల్ ఇన్చార్జి దీపక్‌రెడ్డిలు మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. ఈమారు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ప్రత్యామ్నాయంగా మీకేమి పదవి కావాలో చెప్పండి, అధినేత చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం మినహా మరే పదవి వద్దని రమేష్ కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. ఒక్కసారి అధినేత చంద్రబాబుతో మాట్లాడించండి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినా నిష్ప్రయోజనమే అయినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం మండలాల వారీగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత లక్కిరెడ్డిపల్లె మండల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన రమేష్ నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టలేదని వివరిస్తూనే, ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. సోదరుడు శ్రీనివాసులరెడ్డిపై గుర్రు.. చంద్రబాబు టికెట్ నిరాకరణకు సోదరుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కారకుడని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి టికెట్ మా అన్నకు ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయలేనంటూ టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పలేదనే ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తల ఊపి వచ్చాడని, ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ మేరకే శ్రీనివాసులరెడ్డి మౌనం వహించారని తెలుస్తోంది. కుటుంబం, సోదరుడు కంటే శ్రీనివాసులరెడ్డికి పదవే ముఖ్యమైందా? ఇక తనతో కూడా తెగదెంపులు చేసుకోవాలనే దిశగా రమేష్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రెడ్డెప్పగారి కుటుంబ సభ్యులు, బంధువులంతా మాజీ ఎమ్మెల్యే రమేష్ నిర్ణయానికే అనుగుణంగా నిలిచేందుకు సంసిద్ధులైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫొటో ఎత్తేశారు సోమవారం సాయంత్రం లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ కేడర్‌తో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలో లేకుండా ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు, తన తండ్రి మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో వాడుకున్నారు. ఎక్కడ కూడా టీడీపీ జెండా ఏర్పాటు చేయలేదు. పైగా తన సోదరుడు పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీలో లేదు. ఇవన్నీ రమేష్‌కుమార్‌రెడ్డి టీడీపీ వీడేందుకు చిహ్నాలుగా స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆరు మండలాలకు చెందిన కేడర్‌తో సమావేశం పూర్తయిన తర్వాత టికెట్ విషయమై బహిర్గత పర్చనున్నట్లు సమాచారం. ఇరువై ఏళ్లుగా మీకు తోడు నీడగా ఉంటున్నా, ఇప్పుడేమి చేయాలో మీరే చెప్పాలని కార్యకర్తల అభిప్రాయాలు కోరనున్నట్లు తెలుస్తోంది. కలిసివచ్చే వారందరీతో టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేయాలనే ఆలోచన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. -
అనూహ్యంగా వచ్చి మంత్రినే ఓడించిన యశస్విని
జనగామ/తొర్రూరు/దేవరుప్పుల: రాజకీయాలతో ప్రత్యక్షంగా అనుభవం లేని యువతి అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ దుందుభి మోగించారు. తొలి ఎన్నికలోనే 66 ఏళ్ల రాజకీయ నేత ఎర్రబెల్లిని 26 ఏళ్ల యశస్వినిరెడ్డి మట్టి కరిపించి.. విజయకేతనం ఎగురవేశారు. పాలకుర్తి నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన మామిడాల యశస్వినిరెడ్డి వివాహం అనంతరం అమెరికాకు వెళ్లారు. అక్కడ కొంతకాలం అత్తామామలకు సహకారంగా సొంత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. వాస్తవానికి పార్టీ అధిష్టానం తొలుత యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. పౌరసత్వం విషయంలో అడ్డంకులు రావడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె కోడలు యశస్వినిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆమె స్థానంలో కోడలు యశస్వినిరెడ్డికి అవకాశమివ్వాలని ఝాన్సీరెడ్డి పార్టీని కోరడంతో అధిష్టానం టికెట్ ఇచ్చింది. పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు. పాత చెన్నూరు ప్రస్తుత పాలకుర్తి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండో మహిళగా యశస్వినిరెడ్డి నిలిచారు. నాడు 26.. నేడూ 26 పాలకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నిక చిత్రవిచిత్రాలకు నెలవుగా మారింది. గెలిచినా, ఓడినా అభ్యర్థులకు 26 సంఖ్యతో అనుబంధం ఉంది. 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది 40 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా దయాకర్‌రావు రాజకీయం నడిపారు. ఆయనపై 26 ఏళ్ల యువతి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 66 ఏళ్ల రాజకీయ ఉద్ధండుడు 26 ఏళ్ల యువతి చేతిలో ఓడడం, ఏ వయసులో రాజకీయం ప్రారంభించాడో అదే వయసు యువతిపై ఓటమి పాలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
ఎర్రబెల్లికి చుక్కలు చూపిస్తున్న హనుమాండ్ల ఫ్యామిలీ
పాలకుర్తి/పాలకుర్తి టౌన్/కొడకండ్ల/పెద్దవంగర : ఆడబిడ్డగా మీ ముందుకొచ్చాను.. ఆశీర్వదించి గెలిపించండి.. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది అభివృద్ధి మార్క్ చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. మా అత్త మామ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి ఝాన్సీరెడ్డి ముప్పై ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం.. దోచుకొవడానికి దాచుకొవడానికి కాదు.. అది మా కుటుంబ నైజం కాదు.. దగాకోరు దయాకర్‌రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుయాయులకే కట్టబెట్టారు.. తనను గెలిపిస్తే అర్హులందరి కీ అందేలా చూస్తానన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకురాలి గా పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేతనాన్ని కూడా ప్రజల అభివృద్ధికే వెచ్చిస్తానని అన్నా రు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను రూపొందించింద ని, అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలి పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది.. ప్రజలు అండగా నిలిచి పాలకుర్తిలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ప్రవీణ్‌కుమార్, పార్టీ మండల కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, నాయకులు అబ్దుల్లా, పులి గణేష్, వెంగల్రావు, సురేష్‌నాయక్, రాజేష్‌నాయక్, ఉప్పల చిన్నసోమయ్య, వనం మోహన్, మనోహర్, వంశీకృష్ణ, సోమనర్సయ్య, భిక్షపతి, యాకేష్ పాల్గొన్నారు. కేసీర్ కుటుంబమే బాగుపడింది పాలకుర్తి మండల పరిధి అయ్యంగారిపల్లి, గోపాలపురం, రాఘవాపురం, కిష్టాపురంతండా, పెద్దతండా, బమ్మెర గ్రామాల్లో యశస్వినిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం యశస్వినిరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల బీఎస్ఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి, దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు వంటి పేర్లు చెప్పి కేసీఆర్ ప్రజలను వంచించారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, తిరుమలగిరి, సర్పంచ్‌లు బక్క పుల్లయ్య, జలగం నాగభూషనం, మంద కొమురయ్య, సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ సభ్యురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. సోమవారం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ బొమ్మెర స్వరూప, 10వ వార్డు సభ్యులు రాంపాక లావణ్య, బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ జలగం ప్రభాకర్ తదితరులు యాసారపు కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంర్భంగా ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఇక నుంచి కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేంది లేదని హెచ్చరించారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్వినిరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అశోక్, శేఖర్, యాకయ్య, రంజాన్, రజిత, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
నాపై పోటీకి అభ్యర్థులే లేరు
రాయపర్తి: ‘నాపై పోటీకి అభ్యర్థులే కరువయ్యారు.. అమెరికా నుంచి టూరిస్టులను తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిండ్లు’ అని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. శుక్రవారం మండలంలోని తిర్మలాయపల్లి, రాయపర్తి, గన్నారం, కొండూరు, బురహాన్‌పల్లి, కాట్రపల్లి, మొరిపిరాల, కిష్టాపురం, మహబూబ్‌నగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలినడకన ప్రజలను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు. తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశా రు. సేవ చేశానే తప్ప అవినీతి పేరు తెచ్చుకోలేదు.. దయాకర్‌రావు హామీ ఇచ్చాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేశాను.. కొత్తగా చేర్చిన హామీల ప్రకారం ప్రతి గ్రామంలో వంద డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తా.. పదివేల మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇప్పించి సంగెం టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ అవకాశం కల్పిస్తా.. తిర్మలాయపల్లి, తొర్రూరులో ఆయిల్‌పాం మిల్లు పెట్టిస్తున్నాను.. అందులో వెయ్యిమందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. గ్రామాలను, ఆలయాలను అభివృద్ధి చేశాను.. కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయించాను.. గ్రామాల్లో ఉన్న కోతులను పట్టించి ఏటూరునాగారం అడవుల్లో వదలడమే కాకుండా అక్కడ కోతులకోసం పండ్ల మొక్కలను నాటించానని వివరించారు. ఆదరించి గెలిపిస్తే మీముందుకు వచ్చి మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు, బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్‌రావు, మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఆకుల సురేందర్‌రావు, పూస మధు, వనజారాణి, ఎండీ.నయీం, గబ్బెట బాబు, సర్పంచ్, ఎంపీటీసీలు గారె నర్సయ్య, గజవెల్లి అనంత, రాధిక, ఐత రాంచందర్, కర్ర సరితరవీందర్రెడ్డి, కుక్కల భాస్కర్, గాదె హేమలత పాల్గొన్నారు. పద్మశాలి సంఘం మద్దతు కొడకండ్ల: బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మండల పద్మశాలి సంఘం మద్దతు తెలిపింది. అధ్యక్షుడు పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో శుక్రవారం కులస్తులు మంత్రిని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సొంత గూటికి చేరిన కార్యకర్తలు పాలకుర్తి : మండలం నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు కార్యకర్తలు కళాకారుడు చిరుపాటి ఎల్ల్ల స్వామి, రాజు మరో 20 మంది తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం వారిని మంత్రి దయాకర్‌రావు సతీమణి, ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదేవి స్వాగతించి కండువాలు కప్పారు. పాలకుర్తి వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు, ముదిరాజ్ సంఘం నాయకుడు మామిండ్ల శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు దేవరుప్పుల : పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజయం సాధించాలని కోరుతూ.. కామారెడ్డిగూడెం మసీదులో శుక్రవారం ముస్లింలు మతగురువు ఇనాయత్ రసూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఖాసీం, జాకీర్, ఖలీల్, షబ్బీర్, మీరాన్, అర్జుమాన్, మౌలానా, పాషా, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కార్పొరేటర్ అనిత ఇంటికి మల్లా రెడ్డి కోడలు
బోడుప్పల్: కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనిత ఇంటికి సోమవారం బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు చామకూర ప్రీతిరెడ్డి వచ్చారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన దానగల్ల అనిత బీఆర్ఎస్లో చేరగా, వారం రోజుల క్రితం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ప్రీతిరెడ్డి కలిసి మళ్లీ బీఆర్ఎస్లో చేరాలని కోరారు.. తమను బీఆర్ఎస్లో చాలా ఇబ్బందులకు గురి చేశారని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఇంటికి వచ్చి ఎన్నికల సమయంలో ప్రలోభపెడుతున్నారని వాదించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టిక్కెట్లు అమ్ముకున్నారని, అలాంటి వారికి ఓట్లు వేయవద్దంటూ నినాదాలు చేశారు. అక్కడ నుంచి ప్రీతిరెడ్డి కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అడ్డుకున్న వారిలో కాంటెస్ట్డ్ కార్పొరేటర్ రాపోలు ఉపేందర్, నాయకులు చెంచల నర్సింగ్‌రావు, గోపు రాము, జయేందర్‌రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. -
విలువలకు నిదర్శనం రావి జీవితం
కుటుంబం కోసం కాకుండా జీవితాంతం ప్రజల కోసం పరితపించిన తన తాత రావి నారాయణరెడ్డి జీవితం తనకు ఆదర్శమని ఆయన మనవరాలు రావి ప్రతిభారెడ్డి తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా హరిజనులు, సామాన్యుల అభ్యున్నతి కోసం తపిస్తూ సాధారణ జీవితాన్ని గడిపారని.. ఎంపీగా పొందిన పింఛన్‌ను సైతం ప్రజల అవసరాల కోసం ఖర్చు చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. విలువలు, దార్శనికత కలిగిన రావి నారాయణరెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ప్రభావం తనపై ఎంతో ఉందని ప్రతిభారెడ్డి చెప్పారు. తాత చూపిన మార్గంలో పయనించాలని ఉద్యోగాన్ని వదిలేశానని, ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాటం.. అందులో పాల్గొన్న వీరుల చరిత్ర తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు.. అయినా నిగర్వి.. రావి నారాయణరెడ్డి ఓ నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. నీతి, నిజాయతీ కోసం ప్రాణం ఇచ్చేవారు. విలువలకు ఆయన ప్రాధాన్యతను ఇచ్చే వారు. ఆయన 1952 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా, ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన నీతి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంపీగా నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్న గర్వం ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు. హరిజనులను ప్రేమించే వారు.. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ తాత సాధారణ జీవితం గడిపే వారు. తనకున్న 500 ఎకరాల భూమిని హరిజనులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంట్లో కార్లు కూడా ఉండేవి కాదు. ఆయనకు రెండు, మూడు జతల దస్తులే ఉండేవి. నానమ్మ బంగారు నగలను గాంధీజీ హరిజన సేవా సంఘానికి ఇచ్చారు. హిమాయత్‌నగర్‌లో మా ఇంటికి ఎప్పడూ భువనగిరి నుంచి వచ్చే వారికి నానమ్మ అన్నం పెట్టేది. తినకుండా ఎవరినీ వెళ్లనిచ్చే వారుకాదు. తాత చివరి దశలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి చూడటానికి వచ్చి నీకు ఏమైనా కావాలా అని అడిగితే కుటుంబం కోసం కాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలని అడిగారు. తాతయ్యతో ఎంతో అనుబంధం .. చిన్నతనం నుంచి హిమాయత్‌నగర్‌లోని మా ఇంట్లో తాతయ్య రావి నారాయణరెడ్డి దగ్గరే పెరిగాను. నాపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. నేను 8, 9 తరగతులు చదువుతున్న వయసులో హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలు, సమావేశాలతోపాటు రెడ్డి హాస్టల్‌కు నన్ను ఎప్పుడూ తీసుకెళ్లేవారు. నిజాయితీగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని నాకు చెప్పేవారు. ఆడపిల్లలకు చదువు అవసరమనేవారు. నన్ను కూడా బాగా చదువుకోమనే వారు. ఇంట్లో నానమ్మ రావి సీతాదేవి, మేనేత్త రావి భారతి, అమ్మానాన్నలు రావి ఉర్మిల, సంతో‹Ùరెడ్డిలు ఉండేవారు. అప్పుడున్న పరిస్థితులను చర్చించే వారు. స్త్రీలకు సమాన హక్కులు, విద్య, రైతాంగ సమస్యలు, సామాజిక విప్లవం, రాజకీయ చైతన్యం గురించి చెప్పేవారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, విద్యా, వైద్యసౌకర్యాలపై చర్చించే వారు. ఆయా అంశాలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. తాతయ్య ఆశయాల సాధన కోసం 17 సంవత్సరాలు చేసిన ఉద్యోగం వదిలి ఆయన చూపిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నా. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనుంది.. తాత కోరుకున్న సమ సమాజం కోసం పనిచేస్తా. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4 వేల కుటుంబాలకు ఏదైనా మంచి చేయాలన్న తాత ఆలోచనలను ముందుకు తీసుకెళ్తా. బొల్లేపల్లిలోని పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. దానికోసం నాకు ఏమైనా చేయాలని ఉంది. గత సంవత్సరం నుంచి టెన్త్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. జూన్ 4న తాత జయంతి సందర్భంగా టెన్త్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నగదు బహుమతులు అందజేశాం. బొల్లేపల్లిలో శిథిలావస్థలో ఉన్న తాత పుట్టిన ఇంటిని బాగు చేసి సంక్షేమ సెంటర్‌గా తీర్చిదిద్దుతా. అక్కడ స్త్రీల సాధికారత కోసం కంప్యూటర్ విద్య, కుట్టు పనులు నేర్పిద్దామనుకుంటున్నా. నేటి రాజకీయం డబ్బుమయం.. ప్రస్తుతం రాజకీయాలు డబ్బులమయమయ్యాయి. తాత లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారు ఇప్పుడు రాజకీయాల్లో నెగ్గలేరు. ప్రస్తుతం నాయకులు పార్టీలు మారడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ప్రజలు సంక్షేమ పథకాలకు, డబ్బులకు అలవాటుపడ్డారు. ఓట్ల కోసం నాయకులు ఇస్తున్న డబ్బుతో చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకునికి ఐదేళ్ల కాలానికి చేసే అభివృద్ధి విజన్ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలిసి ఉండాలి. అలాంటి వారినే ప్రజలు ఎన్నుకోవాలి. - యంబ నర్సింహులు -
బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇంజినీరు భరత్‌రెడ్డి మృతి
కర్ణాటక: ఓవర్టేక్కి తోడు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక యువకుడు నిండు ప్రాణం పోగొట్టుకున్న సంఘటన యలహంక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సివిల్ ఇంజినీరు కమ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న భరత్‌రెడ్డి (26) మృతుడు. బుధవారం సాయంత్రం భరత్‌రెడ్డి అట్టూరు వైపు నుంచి స్కూటర్‌పై వెళ్తూ ముందు వెళ్తున్న బీఎంటీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సును ఢీకొని కిందపడిపోయాడు. బస్సు డ్రైవర్ గమనించకుండా భరత్‌రెడ్డి మీద నుంచి బస్సును పోనివ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తల పూర్తిగా ఛిద్రమైపోయింది. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సు వదిలి పరారయ్యాడు. రోడ్డు ఇరుకుగా ఉండడం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. యలహంక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భరత్‌రెడ్డి స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా కాగా, బెంగళూరులోనే కత్రిగుప్పెలో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్ భరత్‌రెడ్డి మృతితో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బీఎంటీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుని చిన్నాన్న నారాయణరెడ్డి మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు యలహంకలో జరుగుతున్న ఒక నిర్మాణ పని చూడడానికి వెళ్లాడు. బస్ డ్రైవర్లు ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు అని ఆయన వాపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సొంతూరికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం యలహంక పోలీసులు గాలింపు చేపట్టారు. -
కేబుల్‌రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల.