నేరాల దర్యాప్తు వేగవంతంగా కొనసాగించాలి
నార్త్‌జోన్ ఐజీపీ నాగిరెడ్డి
కరీంనగర్ క్రైం : వివిధ రకాల నేరాల దర్యాప్తులను వేగవంతంగా కొనసాగించాలని నార్త్‌జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వై నాగిరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్వీజన అనంతరం నార్త్‌జోన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో బుధవారం కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో ఐజీపీ నాగిరెడ్డి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. క్రమ శిక్షణతో మెదులుతూ అంకితభావంతో విధు లు నిర్వహించాలని సూచించారు. సమర్థవంతమైన సే వల ద్వారానే పోలీస్‌శాఖకు గుర్తింపు లభిస్తుందన్నారు. పకడ్బందీగా దర్యాప్తులను కొనసాగించినట్లరుుతే వేగవంతంగా కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు. నేరాల నియంత్రణకు ముందస్తు ప్రణాళికలు రూపొం దించి అమలు చేయాలని సూచించారు.
వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు వెలుబుచ్చిన అభిప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలను పరిష్కారానికి పలు సూచనలు చేశారు. కరీం నగర్ ఇన్‌చార్జి డీఐజీ రవివర్మ, కరీంనగర్, రామగుండం కమిషనర్లు వీబీ.కమలాసన్‌రెడ్డి, విక్రమ్‌జిత్ దుగ్గల్, రాజన్న సిరిసిల్లా, జ గిత్యాల, అదిలాబాద్, కొము రం భీం, నిర్మల్, అచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జిల్లాలకు చెందిన ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, అనంతశర్మ, ఎం. శ్రీ నివాస్, సన్‌ప్రీత్‌సింగ్, విష్ణు ఎస్ వారియర్, బాస్కరన్, మురళీధర్, అంబర్‌కిషొర్‌ఝూ పాల్గొన్నారు.