Ravi Varma
-
Kalasa Movie Review: ‘కలశ’మూవీ రివ్యూ
టైటిల్: కలశ నటీనటులు: భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ తదితరులు నిర్మాత: రాజేశ్వరి చంద్రజ వాడపల్లి దర్శకత్వం:కొండా రాంబాబు సంగీతం: విజయ్ కురాకుల సినిమాటోగ్రఫీ:వెంకట్ గంగధారి ఎడిటర్: జునైద్ సిద్దిఖీ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తన్వి(భానుశ్రీ) ఓ హారర్ సినిమాను తెరకెక్కించాలనుకుంటుంది. ఇందుకోసం ఓ మంచి కథను సిద్ధం చేసుకొని నిర్మాతను కలుస్తుంది. అతను కథ మొత్తం విని క్లైమాక్స్ మార్చమని సలహా ఇస్తాడు. దీంతో తన్వి హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితురాలు కలశ(సోనాక్షి వర్మ) దగ్గరకు వెళ్తుంది. ఇంటికి వెళ్లేసరికి కలశ అక్కడ ఉండదు. తన్వి కాల్ చేస్తే.. పని మీద బయటకు వెళ్లాలని.. కాస్త లేట్‌గా వస్తానని చెబుతోంది. తన్వి ఒక్కతే ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇల్లు అచ్చం తన్వి రాసుకున్న కథలోని ఇల్లు మాదిరే ఉంటుంది. తన కథలో ఉన్న కొన్ని సీన్లే తన కళ్లముందు రిపీట్ అవుతాయి. ఓ వ్యక్తి ఆమె కదలిలను దొంగచాటున గమనిస్తుంటాడు. అలాగో ఇంట్లో మరోకరు తన్వికి కనిపించకుండా తిరుగుతుంటారు. కలశ చెల్లి అన్షు(రోషిణి కామిశెట్టి) తనను ఆట పట్టిస్తుందని తన్వి భావిస్తుంది. కట్ చేస్తే.. మరుసటి రోజు తన్వికి ఓ నిజం తెలుస్తుంది. కలశ, అంజు ఇద్దరూ రెండు నెలల క్రితమే చనిపోయారని, ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదని ఆ ఇంటి పని మనిషి చెబుతాడు. మరి తన్వికి ఫోన్ కాల్ చేసిందెవరు? అంజు, కలశ ఎలా చనిపోయారు? కలశ నేపథ్యం ఏంటి? రచయిత రాహుల్(అనురాగ్)తో ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోణి మానస హత్యకు ఈ కేసులో ఉన్న సంబంధం ఏంటి? సస్పెండ్ అయిన సీఐ కార్తికేయ(రవివర్మ) ఎందుకు రహస్యంగా ఈ కేసును ఎందుకు విచారించాడు? కార్తికేయకు తన్వి ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కలశ’మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై దాన్ని ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. అసలు కథను దాచిపెడుతూ.. ఫస్టాఫ్ అంతా సోసోగా నడిపించాడు. ప్రథమార్థంలో ఎక్కువగా కామెడీకే ప్రాధాన్యత ఇచ్చారు. రచ్చ రవి, భానుశ్రీల మధ్య వచ్చే కామెడీ సీన్ నవ్వులు పూయిస్తుంది. కానిస్టేబుల్ నారాయణ, అతని కూతురు మానసల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇంట్లో దెయ్యం చేసే పనులు కొన్ని చోట్ల సిల్లీగా అనిపిస్తే.. మరికొన్ని చోట్ల భయానికి గురి చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథ పరుగులు తీసుస్తుంది. కలశ నేపథ్యం, అక్కాచెల్లెళ్ల చావులకు గల కారణాలు ఊహించని విధంగా ఉంటాయి. కార్తికేయ ఇన్వెస్టిగేషన్లో తెలిసే ట్విస్టులు థ్రిల్లింగ్ ఉంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. హారర్ జానర్స్‌ని ఇష్టపడేవారికి కలశ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీకి చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. యంగ్ డైరెక్టర్ తన్విగా ఆమె చక్కగా నటించింది. తెరపై కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక టైటిల్ రోల్ ప్లే చేసిన సోనాక్షి వర్మ.. తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సెకండాఫ్‌తో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. అన్షుగా రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐగా సమీర్, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. విజయ్ కురాకుల నేపథ్యం సంగీతం కొన్ని చోట్ల భయపెట్టిస్తుంది. వెంకట్ గంగధారి సినిమాటోగ్రఫీ బాగుంది. . ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న రాజేశ్వరి చంద్రజ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాయే అయినా ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఖర్చు విషయంలో ఎక్కడ తగ్గకుంటా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. -
హీరోయిన్గా బిగ్‌బాస్ ఫేమ్.. టీజర్ రిలీజ్!
బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ...' చిత్రబృంద సభ్యులు పగలు, రేయి బాగా కష్టపడ్డారు. అనురాగ్, భానుశ్రీ, సోనాక్షి వర్మ, రోషిణిలు అద్భుతంగా నటించారు. మా అందరినీ వెనుక ఉండి నడిపించిన స్వామి, మేడమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘కలశ’ అనే టైటిల్ ఈ సినిమాలోని క్యారెక్టర్. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగింది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.' అని అన్నారు. దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ... 'టీజర్ చాలా బాగుంది. మంచి ఎమోషన్, యాక్షన్ ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అందరికీ అల్ ది బెస్ట్' అని అన్నారు. నిర్మాత చంద్రజ మాట్లాడుతూ...' రాంబాబు చాలా హార్డ్ వర్కర్. ఈ కథకు కావాల్సిన కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. ఎక్కడా అశ్లీలత లేకుండా చూశాం. సెన్సార్ వారు కూడా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నా. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి విజయ్ కురాకుల సంగీతమందించారు. -
‘ప్రత్యర్థి’ మూవీ రివ్యూ
టైటిల్: ప్రత్యర్థి నటీనటులు: రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానె తదితరులు నిర్మాణ సంస్థ : గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : సంజయ్ సాహ దర్శకత్వం : శంకర్ ముడావత్ సంగీతం: పాల్ ప్రవీణ్ సినిమాటోగ్రఫీ: రాకేష్ గౌడ్ విడుదల తేది: జనవరి 6, 2022 ‘ప్రత్యర్థి’ కథేంటంటే.. కృష్ణ ప్రసాద్(రవివర్మ) హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్సైగా పని చేస్తుంటాడు. భార్య జయ(సన), కూతురు నిత్య అతనికి దూరంగా ఉంటారు. ఓ సారి తన భర్త విజయ్ కనిపించడం లేదని వైశాలి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కేసు నమోదు చేసుకున్న కృష్ణ ప్రసాద్.. తనదైన స్టైల్లో విచారణ చేపడతాడు. ఈ క్రమంలో విజయ్, వైశాలికి మధ్య గొడవలు జరుగుతున్నాయని, అతనికి రేచల్ అనే ప్రియురాలు ఉందని తెలుస్తుంది. ఈ కోణంలో విచారణ చేపడుతుండగా.. సయ్యద్ అనే ఓ యువకుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి.. విజయ్ మిస్ అయిన రోజు రాత్రి ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని అతని ఇంట్లోకి వెళ్లడం తాను చూశానని చెబుతాడు. దీంతో విజయ్‌ని చంపింది వీరేనంటూ.. మెకానిక్ ఉద్యోగం చేస్తున్న శివ( రోహిత్ బెహల్), శశి, అశోక్(బల్వీర్ సింగ్)లను అరెస్ట్ చేస్తారు. కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుండగా షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అవేంటి? అసలు విజయ్‌ని ఎవరు హత్య చేశారు? ఈ ముగ్గురికి ఆ హత్యతో నిజంగానే సంబంధం ఉందా? ఆ రోజు రాత్రి ముసుగు వేసుకొని వెళ్లి ఆ ముగ్గురు ఎవరు? ఎందుకు వెళ్లారు? కృష్ణ ప్రసాద్ కూతురు నిత్యను గన్‌తో కాల్చి చంపిందెవరు? నిత్యతో శివకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు నేరస్తుడు ఎవరని తేలింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ల సినిమాలకు ఎప్పుడూ జనాల్లో ఆదరణ ఉంటుంది. సరైన కథ, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీస్తే జనాలు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారు. అందుకే ఆ తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన దర్శకత నిర్మాతలు. ‘ప్రత్యర్థి’ కూడా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే. ఊహించని ట్విస్ట్‌లతో కథనం సాగుతుంది. విజయ్ అనే వ్యక్తి మిస్ అవ్వడం.. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. కేసు విచారణలో భాగంగా ఎస్సై పలు రకాలుగా ఊహించడం.. ఆ పాత్రలో కాసెస్టేబుల్ని చూపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే రొమాంటిక్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. అలాగే పలు రకాల పాత్రలు వచ్చి పోవడం గందరగోళంగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. చెత్త కుప్పలో విజయ్ శవం దొరికిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ఫస్టాఫ్‌లో అనవరం అనుకున్న ప్రతి సీన్‌కి సెకండాఫ్‌లో క్లారిఫికేషన్ ఇచ్చాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో రివీల్ చేసే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లేని మరింత పకడ్బందీగా చేసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఎస్సై కృష్ణ ప్రసాద్ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. పలు చిత్రాలో చిన్నపాటి పాత్రలు పోషించిన రవి వర్మ.. ఈ చిత్రంలో ఫుల లెన్త్ రోల్ చేశాడు. శివ పాత్రకి రోహిత్ బెహల్ న్యాయం చేశాడు. తెరపై బాలీవుడ్ హీరోలా కనిపించాడు. కానిస్టేబుల్ సత్యగా వంశీ ఆలూర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ప్రైవేట్ డిటెక్టివ్ నిత్యగా అక్షత సోనవానె తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో స్నేహితుడిగా బల్వీర్ సింగ్ పాత్ర తీరు, కామెడీ ఆకట్టుకుంటుంది. లాయర్ రఘునాథ్ పాత్రలో దివంగత టీఎన్నార్ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తాగుబోతు రమేశ్, వంశీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతి విషయానికొస్తే.. దర్శకుడు శంకర్‌కి ఇది తొలి సినిమా .అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను తెరకెక్కించాడు. ట్విస్టులను క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచడంలో సఫలం అయ్యాడు. పాల్ ప్రవీణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. రాకేష్ గౌడ్ కెమెరాపనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
ఆసక్తికరంగా 'ప్రత్యర్థి' ట్రైలర్
రవి వర్మ, రొహిత్ బెహల్, అక్షత సోనవానెలు ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వ వహించిన ఈ చిత్రాన్ని గాలు పాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సంజయ్ సాహ నిర్మించారు. జనవరి 6న రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. నగరంలో జరిగిన మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ఎస్ఐ చనిపోయవడం, ఆ కేసును పరిష్కరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగడం వంటివి చూపించడం వల్ల మొదట్లోనే కట్టిపడేసినట్టు అయింది ట్రైలర్. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ట్విస్టులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూడ్‌ను మెయింటైన్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ పాల్ ప్రవీణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. -
ఒక రోజులో జరిగే కథ
భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సునీల్ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘302’ ట్రైలర్ బావుంది.. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు అవినాష్ సుందరపల్లి. కార్తికేయ మిరియాల మాట్లాడుతూ–‘‘క్రైమ్, సస్పె¯Œ ్స, కామెడీతో పాటు హారర్ అంశాలతో ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక రోజులో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం: రఘురాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహనిర్మాత: టి..వైకుంఠరావు. -
నువ్వు మాస్‌రా...
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన చిత్రం ‘నువ్వు తోపురా’. హరినాథ్ బాబు.బి దర్శకత్వంలో బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.జె.కె.ప్రొడక్షన్స్ (యు.ఎస్.ఎ) వారి సహకారంతో డి.శ్రీకాంత్ నిర్మించారు. గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. బి.హరినాథ్ మాట్లాడుతూ– ‘‘మాస్, థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం గీతా ఆర్ట్స్, జి3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా విడుదలవుతుండం ఆనందంగా ఉంది. ఇందుకు అల్లు అరవింద్‌గారికి, ‘బన్ని’ వాసుగారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీకాంత్. ‘‘అమెరికాలోని అత్యంత అందమైన ప్రదేశాలైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రమిది. మంచి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం’’ అని చిత్ర సహ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్.ఎ) అన్నారు. నిత్యాశెట్టి, నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి, ‘జెమిని’ సురేష్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్: రితేష్ కుమార్, కెమెరా: ప్రశాష్ వేళాయుధన్, వెంకట్ సి.దిలీప్, సంగీతం: సురేష్ బొబ్బలి, ఆమెరికా లైన్ ప్రొడ్యూసర్: స్టెపెనీ ఒల్లర్టన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి. -
ఫుల్ ఫోకస్
గతేడాది అజిత్ హీరోగా నటించిన ‘వివేగమ్’ సినిమా ద్వారా విలన్‌గా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఈ ఏడాది కన్నడ చిత్రం ‘రుస్తుం’ సినిమాతో శాండిల్‌వుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారాయన. ఇందులో శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ రవివర్మ ఈ చిత్రంతో దర్శకునిగా మారారు. ‘‘రుస్తుం’ సినిమాతో వివేక్ ఒబెరాయ్ శాండిల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారని చెప్పడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు రవివర్మ. అలాగే.. మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న ‘లూసీఫర్’ చిత్రంతో వివేక్ ఒబెరాయ్ మాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ‘రక్తచరిత్ర’ సినిమాతో ఆయన ఎప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేశారు. ప్రస్తుతం తెలుగులో బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇవన్నీ చూస్తుంటే.. వివేక్ సౌత్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ఉంది కదూ. -
సమకాలీన క్రైమ్ కథ
‘వీకెండ్ లవ్’ సినిమా ఫేమ్ నాగు గవర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వసంత్ సమీర్, సెహర్ జంటగా, శ్రీహర్ష, రవివర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకుడు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘జర్నలిస్ట్ వినాయకరావుగారి ద్వారా నాగు పరిచయమయ్యాడు. తను మంచి∙క్రైమ్ సబ్జెక్ట్ చెప్పాడు. ‘బిచ్చగాడు, డి16’ తరహాలోనే విభిన్నమైన చిత్రమిది’’ అన్నారు. ‘‘వీకెండ్ లవ్’ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని, వినాయకరావుగారి ద్వారా ఈ సినిమా చేస్తున్నా. ఇదొక సమకాలీన క్రైమ్ కథ. రియలిస్టిక్, గ్రిప్పింగ్ కథనంతో ఉంటుంది. ఈ నెల 14న చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు నాగు గవర. కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దుర్గా కిషోర్ బొయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్. -
ఏజెన్సీలో తగ్గని ఉద్రిక్తత!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఉట్నూర్: పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. భారీగా పోలీసుల మోహరింపు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నేరుగా పర్యవేక్షిస్తుండడంతో పరిస్థితి కొంతమేర అదుపులో ఉంది. పోలీసులు ఏజెన్సీలో 144 సెక్షన్‌ను విధించడంతోపాటు వదంతులు వ్యాపించకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించారు. అయితే శుక్రవారం నాటి ఘటనలపై ఇరువర్గాలు ఆగ్రహంగా ఉండడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పటిష్టంగా భద్రతా చర్యలు ఆదివాసీ, లంబాడీ తెగల మధ్య కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడం, ప్రతిగా లంబాడీలు ఆదివాసీల జెండాలను ధ్వంసం చేయడంతో ఏజెన్సీ ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం ఉదయం నుంచే ఏజెన్సీ గ్రామాలు, తండాల్లో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మీడియా ద్వారా ఈ విషయం విపరీతంగా ప్రచారమై ఉద్రిక్తతలను పెంచింది. శుక్రవారం రాత్రి వరకు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. భారీగా పోలీసు బలగాలను మోహరించి, తగిన చర్యలు చేపట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. డీఐజీ రవివర్మ స్వయంగా శాంతిభద్రతల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని పోలీసులను రంగంలోకి దింపారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన తరుణ్‌జోషి ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ముగ్గురు ఐజీ ర్యాంకు అధికారులు, పలువురు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఏజెన్సీ మండలాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏజెన్సీవ్యాప్తంగా బంద్ ఆదివాసీలు శనివారం ఏజెన్సీ బంద్‌కు పిలుపు నివ్వడంతో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు ఆదిలాబాద్ పట్టణంలో ఆదివాసీలు ర్యాలీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. నార్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూరు, సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల పరిధిలోని గ్రామాలతోపాటు ఆదివాసీల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. శనివారం మధ్యాహ్నం గాజిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం రావడంతో పోలీసు బృందాలు హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపు చేశాయి. ఇక జైనూరు, సిర్పూరు (యూ), లింగాపూర్, నార్నూర్ మండలాల పరిధిలో రాత్రిపూట దాడులు జరగవచ్చన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 144 సెక్షన్.. ఇంటర్నెట్ నిలిపివేత ఏజెన్సీలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించారు. ఏజెన్సీ ప్రభావం లేని మంచిర్యాల పట్టణంలోనూ మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందలేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో 2జీ మొబైల్ ఇంటర్నెట్ పనిచేసినట్లు తెలిసింది. కాగా శుక్రవారం ఉద్రిక్తతల సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించినట్లుగా భావిస్తున్న జితేందర్, ఎస్కే ఫారుఖ్ల మృతదేహాలకు ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం వారి స్వగ్రామం హస్నాపూర్‌కు తరలించారు. భూపాలపల్లి జిల్లాలో ఆదివాసీల ఆందోళన ఎస్ఎస్ తాడ్వాయి: ఆదివాసీల ఆందోళన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇతర ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. కొమురం భీం విగ్రహానికి చెప్పుల దండ వేయడాన్ని నిరసిస్తూ శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. పస్రా–తాడ్వాయి రహదారి మధ్యలో చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి.. రాస్తారోకో చేశారు. ఏటూరునాగారంలో బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వెంకటాపురం(కే), వాజేడు మండలాల్లో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ చేపట్టి.. బైక్ ర్యాలీ నిర్వహించారు. కాగా లంబాడీలు, ఆదివాసీల మధ్య గొడవల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నుంచి వారం పాటు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రకటించారు. 8 కేసులు నమోదు ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు ఇరువర్గాలపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను, 14 టెక్నికల్ బృందాలను ఏర్పాటు చేశారు. 16 చెక్‌పోస్టులు, 23 పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతులు నమ్మద్దు ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఆదివాసీలు, లంబాడీలు సమన్వయం పాటించాలి. వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. వివాదాలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. పరిస్థితి పూర్తిగా సద్దుమణిగాక జిల్లా కలెక్టర్, ఎస్పీల సమక్షంలో శాంతి కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తాం.. – వై.నాగిరెడ్డి, ఐజీ ఉట్నూరు అల్లర్లపై సర్కారు సీరియస్ ♦ కరీంనగర్ డీఐజీ, ఆదిలాబాద్, ♦ఆసిఫాబాద్ కలెక్టర్లు, ఎస్పీలపై వేటు ♦తక్షణం వర్తించేలా ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీలు, లంబాడీల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మతోపాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్, ఎస్పీ ఎం.శ్రీనివాసులు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్‌లపై బదిలీ వేటు వేసింది. ఉట్నూరులో శుక్రవారం జరిగిన గొడవలను ముందుగా పసిగట్టలేకపోవడం, పరిస్థితులను త్వరగా అదుపు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై వీరందరినీ మూకుమ్మడిగా బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఎస్పీ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులతో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సమావేశమైన అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివాసీలు, లంబాడీల మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్తత నెలకొన్నా స్థానిక అధికారులు సరైన విధంగా స్పందించలేదని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ ఎస్పీగా పని చేస్తున్న పి.ప్రమోద్ కుమార్‌ను కరీంనగర్ రేంజ్ డీఐజీగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన అధికారులకు ఇంకా కొత్త పోస్టింగులు కేటాయించలేదు. -
'నెపోలియన్' మూవీ రివ్యూ
టైటిల్ : నెపోలియన్ జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : ఆనంద్ రవి, రవివర్మ, కోమలి సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని దర్శకత్వం : ఆనంద్ రవి నిర్మాత : భోగేంద్ర గుప్తా ఇటీవల తొలి పోస్టర్, టీజర్ నుంచే ఎంతో ఆసక్తి కలిగించిన సినిమా నెపోలియన్. ఓ వ్యక్తి తన నీడ పోయిందంటూ పోలీస్ లను ఆశ్రయించటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ఆనంద్ రవి దర్శకుడిగా, నటుడిగా పరిచయం అవుతున్నాడు. నారా రోహిత్ హీరోగా మంచి విజయం సాధించటంతో సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ప్రతినిథి సినిమాకు కథ రచయిత ఈ ఆనంద్ రవి. తానే స్వయంగా డైరెక్టర్ గా, ప్రధాన పాత్రలో తెరకెక్కించిన నెపోలియన్ మరోసారి ప్రతినిథి స్థాయిలో ఆకట్టుకుందా..? దర్శకుడిగా.. నటుడిగా ఆనంద్ రవి విజయం సాధించాడా..? అసలు నీడ పోవటమేంటి..? కథ : సీఐ రవివర్మ(రవివర్మ).. రొటీన్ కేసులను డీల్ చేసి బోర్ కొట్టిన రవివర్మ ఓ ఆసక్తికరమైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో నెపోలియన్ (ఆనంద్ రవి) అనే వ్యక్తి నా నీడ పోయిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతడ్ని పరీక్షించిన పోలీసులు నిజంగానే నీడపడకపోవటం చూసి షాక్ అవుతారు. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న నెపోలియన్ మరో షాక్ ఇస్తాడు. తనకు దేవుడు కలలో కనిపించాడని.. నందినగర్ లో చనిపోయిన తిరుపతి అనే వ్యక్తిది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పాడని చెప్తాడు. ఆ కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి..? చనిపోయిన తిరుపతికి నెపోలియన్ కు సంబంధం ఏంటి..? నెపోలియన్ నీడ ఎలా మాయమైంది..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : మూడు కీలక పాత్రల నేపథ్యంలోనే కథ నడవటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సినదేమీ లేదు. ఉన్నవాళ్లలో సీనియర్ నటుడైన రవివర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. తొలిసారిగా నటుడిగా మారిన ఆనంద్ రవి పరవాలేదనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన కోమలి నటన ఆకట్టుకున్నా.. ఆ పాత్రకు పరిచయం ఉన్న నటిని తీసుకుంటే బాగుండనిపిస్తుంది. ప్రతినిథి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆనంద్ రవి తానే దర్శకుడిగా నటుడిగా పరిచయం అయ్యే సినిమాతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో మొదలుపెట్టినా.. పోను పోను సినిమా ఓ మామూలు రివేంజ్ డ్రామాల మారింది. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి , నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమా మొదలు పెట్టిన విధానం నేపథ్య సంగీతం సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ : కీలక పాత్రల నటన స్క్రీన్ ప్లే - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
భయపడే దెయ్యం
ఏ.వి రమణమూర్తి సమర్పణలో చిన్మయానంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్. సరిత నిర్మిస్తోన్న చిత్రం ఇదేం దెయ్యం. శ్రీనాధ్ మాగంటి హీరోగా పరిచయం అవుతున్నాడు. సాక్షి కక్కర్, రచన స్మిత్, రుచి పాండే నాయికలు. రచ్చ రవి, కిరాక్ ఆర్.పి కీలక పాత్రధారులు. వి. రవివర్మ దర్శకత్వం వహించగా, బాలు స్వామి సంగీతం అందించారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర హీరో మాగంటి శ్రీనాద్ మాట్లాడుతూ, 'హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది. భయపడే సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కానీ ఆ కష్టాలు థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను నవ్విస్తాయి. ముఖ్యంగా రచ్చ రవి, ఆర్ పి తో నా కాంబినేషన్ సీన్స్ బాగుంటాయి. ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం' అన్నారు. చిత్ర దర్శకుడు రవి వర్మ మాట్లాడుతూ, ` రచ్చరవి, ఆర్.పి, శ్రీనాధ్ ను దృష్టిల్లో పెట్టుకుని కథ రాసుకున్నా. నేను అనుకున్న దానికన్నా బాగా నటించారు. శ్రీనాధ్ కొత్త కుర్రాడైనా చాలా బాగా నటించాడు. కామెడీ హైలైట్ గా ఉంటుంది. హారర్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తాయి. సినిమా చూసిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకు మంచి డిస్ర్టిబ్యూటర్స్ దొరికారు. ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలో మొత్తం 100 థియేటర్లలలో సినిమా రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులంతా తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్న'మని తెలిపారు. -
కత్తి రెడ్డి : ఎత్తితే దించడు
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అంతగా ఫాంలో లేని బ్రహ్మీ లీడ్ రోల్లో సినిమా అంటే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కత్తి రెడ్డి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఎత్తితే దించడు అనేది ట్యాగ్ లైన్. రవి వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యాంకర్ రవి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. టైటిల్‌తో పాటు బ్రహ్మీ రవిల కాంబినేషన్‌పై అంచనాలు బానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏ మాత్రం ఫాంలోని లేని బ్రహ్మానందం లీడ్ యాక్టర్‌గా సినిమాను ఎంత వరకు కాపాడగలడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోసాని కృష్ణమురళీతో నేను కిడ్నాప్ అయ్యానోచ్ సినిమా చేస్తున్న బ్రహ్మీ, లీడ్ యాక్టర్ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. -
ముచ్చటగా మూడు
లవ్, రొమాన్స్, థ్రిల్... ముఖ్యాంశాలుగా రాజాశ్రీ దర్శకత్వంలో మిసిమి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సమయం’తో హీరోగా పరిచయమవు తున్నారు మాగంటి శ్రీనాథ్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘సమయం’ విడుదలకు ముందే మరో రెండు సినిమాల్లో హీరోగా శ్రీనాథ్‌కు అవకాశాలు వచ్చాయి. శ్రీనాథ్ మాట్లాడుతూ – ‘‘వరుసగా మూడు సినిమాల్లో ఛాన్స్ రావడం హ్యాపీ. నగేష్ మాకం దర్శకత్వంలో ఎం.ఎస్. క్రియేషన్స్ మహంకాళి శ్రీనివాస్ నిర్మించే సినిమా, రవివర్మ దర్శకత్వంలో చిన్మయానంద ప్రొడక్షన్స్ ఎస్. సరిత నిర్మించే మరో సినిమా అంగీకరించా. మూడు సినిమాలతో నటుడిగా నా ప్రతిభను నిరూపించుకుని, మంచి పేరు తెచ్చుకుంటా’’ అన్నారు. -
నేరాల దర్యాప్తు వేగవంతంగా కొనసాగించాలి
నార్త్‌జోన్ ఐజీపీ నాగిరెడ్డి కరీంనగర్ క్రైం : వివిధ రకాల నేరాల దర్యాప్తులను వేగవంతంగా కొనసాగించాలని నార్త్‌జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వై నాగిరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్వీజన అనంతరం నార్త్‌జోన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో బుధవారం కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో ఐజీపీ నాగిరెడ్డి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. క్రమ శిక్షణతో మెదులుతూ అంకితభావంతో విధు లు నిర్వహించాలని సూచించారు. సమర్థవంతమైన సే వల ద్వారానే పోలీస్‌శాఖకు గుర్తింపు లభిస్తుందన్నారు. పకడ్బందీగా దర్యాప్తులను కొనసాగించినట్లరుుతే వేగవంతంగా కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు. నేరాల నియంత్రణకు ముందస్తు ప్రణాళికలు రూపొం దించి అమలు చేయాలని సూచించారు. వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు వెలుబుచ్చిన అభిప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలను పరిష్కారానికి పలు సూచనలు చేశారు. కరీం నగర్ ఇన్చార్జి డీఐజీ రవివర్మ, కరీంనగర్, రామగుండం కమిషనర్లు వీబీ.కమలాసన్‌రెడ్డి, విక్రమ్‌జిత్ దుగ్గల్, రాజన్న సిరిసిల్లా, జ గిత్యాల, అదిలాబాద్, కొము రం భీం, నిర్మల్, అచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జిల్లాలకు చెందిన ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, అనంతశర్మ, ఎం. శ్రీ నివాస్, సన్‌ప్రీత్‌సింగ్, విష్ణు ఎస్ వారియర్, బాస్కరన్, మురళీధర్, అంబర్కిషొర్ఝూ పాల్గొన్నారు. -
మహేష్ కోసం ముగ్గురు స్టంట్ మాస్టర్లు
మహేష్ బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త సినిమాకు సంబందించి రోజుకో వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫైట్ సీన్స్‌ను కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే దేశంలోనే టాప్ స్టంట్ మాస్టర్లతో యాక్షన్స్ సీన్స్‌ను డైరెక్ట్ చేయిస్తున్నారు. మహేష్ బాబు రా ఏజెంట్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే అనల్ అరసు, పీటర్ హెయిన్స్ లాంటి టాప్ ఫైట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. తాజాగా వీరితో పాటు మరో స్టంట్ మాస్టర్ కూడా మహేష్ మూవీ టీంలో జాయిన్ అయ్యాడు. జయహో, రాజ్ కుమార్, అఖిల్ లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన రవి వర్మ మహేష్ మూవీ కోసం పని చేస్తున్నాడు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 2017 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
డీఐజీగా రవివర్మ బాధ్యతల స్వీకరణ
వరంగల్ : వరంగల్ రేంజ్ డిఐజీగా, కరీంనగర్ రేంజ్ ఇన్చార్జి డీఐజీగా సి.రవివర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సభర్వాల్ నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రవి వర్మ మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలో నేరాల అదుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయం లో రాజీపడే ప్రసక్తి లేదని, రెండు రేంజ్‌ల పరిధిలోని పోలీసులు ఒకే టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. జిల్లాకు సుపరిచితులే... డీఐజీ రవివర్మ జిల్లాకు సుపరిచుతులే. ములు గు డీఎస్పీగా 1990–92 మధ్య కాలంలో పనిచేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా, ఎల్బీనగర్ డీసీపీగా, హైదరాబాద్ క్రైం, వెస్ట్‌జోన్ డీసీపీగా, సీఐడీ డీఐజీగా పనిచేశారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన రవివర్మకు వరంగల్ రూరల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఎస్పీలు అంబర్ కిషోర్‌ఝూ, షానవాజ్ ఖాసీం, విక్రమ్‌జిత్ దుగ్గల్, జోయల్ డేవిడ్‌లు అభినందనలు తెలిపారు. -
రాగరంజితం.. రామవర్మ గాత్రం
వియవాడ కల్చరల్ : ఇమీస్ (ఐఎంఐఎస్) ఫార్మా ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం బెంగళూరుకు చెందిన ప్రిన్సెస్ రామవర్మ నిర్వహించిన కర్నాటక గాత్ర సంగీత సభలో రాగాల వర్షం కురిసింది. కర్నాటక సంగీత విద్వాంసుల కీర్తనలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. చాలాకాలం తరువాత సంగీతప్రియులు రామవర్మ గాత్రంతో మైమరచిపోయారు. కర్నాటక సంగీతాన్ని దశదిశలా ప్రవహింపజేసిన వాగ్గేయకారుల కీర్తనలను అద్భుతంగా గానం చేశారు. ‘అమ్మా ఆనంద దాయని..’తో ప్రారంభించి.. ‘గజవదన మాం పాహి..’ తదితర కీర్తనలను గానం చేశారు. వయోలిన్‌పై ఎస్ఆర్ వేణు, మృదంగంపై హరికుమార్ సహకరించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ ఇమీస్ వ్యవస్థాపకురాలు డాక్టర్, ఇందుమతి 80వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, కచేరీ నిర్వహించిన ప్రిన్స్ రామవర్మ.. ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ కుటుంబానికి చెందినవారని, దేశ విదేశాల్లో సంగీత సభలు నిర్వహించారని కొనియాడారు. డాక్టర్ ఇందుమతి కుటుంబసభ్యులు నాగప్రసూన, నాగలక్ష్మి, నాగమల్లిక, నాగశైల తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు రజనీ కాంతరావు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
వరంగల్ డీఐజీగా రవివర్మ
ప్రభాకర్‌రావు ఇంటిలిజెన్స్‌కు సాక్షి, హన్మకొండ : వరంగల్ రేంజ్ డీఐజీగా సి.రవివర్మ నియమితులయ్యారు. ఇక్కడ డీఐజీగా ఉన్న డాక్టర్ టి.ప్రభాకర్‌రావు ఇంటిలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం రవివర్మ సీఐడీలో డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి వరంగల్‌కు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎంసెట్–2 పేపర్ లీకేజీ కేసును రవివర్మ దర్యాప్తు చేపట్టారు. కాగా, వరంగల్ జిల్లా వాసి అయిన ప్రభాకర్‌రావు ఈ సంవత్సరం మే 21న వరంగల్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. మూడు నెలలకే ఆయన బదిలీ అయ్యారు. సీనియర్ పోలీసు అధికారులైన రవివర్మ, ప్రభాకర్‌రావు ఇద్దరూ 2001 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు కావడం విశేషం. -
3 కోట్ల ‘అర్ధనారి’కి 15 కోట్ల ఆఫర్!
అర్జున్ యజత్, మౌర్యాని జంటగా పత్తికొండ సినిమాస్ పతాకంపై రవికుమార్, భరత్ రాజ్, కర్లపూడి కృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘అర్ధనారి’. భాను శంకర్ చౌదరి దర్శకత్వం వహించారు. రవివర్మ సంగీత దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగుందనే టాక్ వచ్చింది. వసూళ్లు కూడా బాగున్నాయని దర్శకుడు భానుశంకర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన పలు విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ♦ మా యూనిట్ సభ్యులందరూ హైదరాబాద్‌లోని శ్రీ మయూరి థియేటర్లో సినిమా చూశారు. నేను నిజామాబాద్‌లో ప్రేక్షకులతో కలసి చూశాను. నిజామాబాద్ మల్టీప్లెక్స్‌లో మార్నింగ్ రెండు షోలు వేశారు. ప్రేక్షకుల స్పందన చూసి మరో రెండు షోలు పెంచారు. ముఖ్యంగా మహిళలు సెకండాఫ్‌లో ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. శుక్రవారం మార్నింగ్ మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మ్యాట్నీకీ, ఫస్ట్ షోకీ కలెక్షన్స్ పెరిగాయి. సాధారణంగా ఏ మాత్రం ఇమేజ్ లేని ఆర్టిస్టుల సినిమాలకు కలెక్షన్స్ తక్కువే ఉంటాయి. ఈ సినిమాకి మౌత్ టాక్ బలంగా ఉండడంతో ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆర్టిస్టులందరూ చక్కగా నటించారు. ఇలాంటి మంచి కథలు, సినిమాలు మరిన్ని రావాలని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించలేదు. ♦ కరెంట్, రోడ్, ఓటు హక్కు.. ఇలా సమాజంలో కళ్ల ముందు ఉండే ప్రతి అంశం గురించి ఈ సినిమాలో చర్చించాను. సామాన్యుడు తన బాధ్యతలను విస్మరించడం వల్లే సమాజంలో అన్యాయాలు ఎక్కువైయ్యాయన్నది చూపించాను. ముఖ్యంగా సినిమాలో చూపించిన పంచ సూత్రాల సన్నివేశానికి అద్భుత స్పందన లభిస్తోంది. రాజకీయ నాయకులందరూ ఈ పంచ సూత్రాలను అమలుపరిస్తే దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది. ♦ ‘అర్ధనారి’ కథ తయారు చేసుకున్నాక పలువురు నిర్మాతల్ని కలిశాను. ‘ఈ రోజుల్లో సందేశాలు చెప్తే ఎవరు వింటారండీ. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగింది. దేశభక్తి ఎవరికి కావాలండీ’ అని డిజప్పాయింట్ చేశారు. ‘దేశం గురించి చెప్పడం కూడా తప్పే’ అన్నట్లు మాట్లాడారు. సందేశం ఇవ్వాలంటే స్టార్ హీరోలు మాత్రమే ఇవ్వాలన్నారు. కొత్తవాళ్లు చెప్తే చూడరని అన్నారు. నిర్మాతలు ఎం.రవికుమార్, భరత్ రాజ్, కర్లపూడి కృష్ణలు కథ విని, ‘ఈ కథతోనే సినిమా తీద్దాం. వేరే కథ వద్దు’ అని ఎంకరేజ్ చేశారు. కొత్త నటీనటులతో 3 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా తీయడం రిస్కే. కానీ, ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలాంటి మంచి కథతో సినిమా తీయడం ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన ప్రక్రియ. కమర్షియల్ హంగుల పేరుతో తీసిన కథనే మళ్లీ మళ్లీ తీస్తున్నారు. సందేశాత్మక కథలు, సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మా ‘అర్ధనారి’ నిరూపించింది. ♦ శుక్రవారమే హిందీ, తమిళ, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి రీమేక్ రైట్స్ కోసం పలువురు నిర్మాతలు సంప్రతించారు. ఆయా భాషల్లో స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని భాషల్లో కలిపి సుమారు15 కోట్ల రూపాయలు రీమేక్ రైట్స్ ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే కథలతో సినిమాలు చేస్తాను. -
కళాశాలలో ప్రేమ!
ఆ ఇద్దరిదీ ఒకే కాలేజ్. ముందుగా చూపులూ, ఆ తర్వాత మనసులూ కలిశాయి. అనంతరం ఏం జరిగింది? కాలేజీలో సీనియర్స్, జూనియర్స్ మధ్య ఏం జరుగుతోంది? అనే కథతో రూపొందిన చిత్రం ‘సింపుల్ లవ్‌స్టోరి’. రవివర్మ దర్శకత్వంలో గాయత్రీ సినీ క్రియేషన్స్ పతాకంపై కుండలి పాండురంగమ్, మద్దెల అనిల్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. కార్తీక్, నరేష్, కార్తికేయ, కిరణ్, అమితారావు, సమలీ శర్మ తదితరులు ఇందులో ముఖ్యతారలు. -
థ్రిల్ చేస్తా!
‘‘నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే నా మొదటి సినిమాకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా’’ అని చెప్పారు ‘కాలింగ్ బెల్’ దర్శకుడు పన్నా రాయల్. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితీ ఖన్నా ముఖ్య తారలుగా గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై అనూద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ -‘‘వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న నేను ఓ పెద్ద సినిమా తీద్దామని వచ్చా. కానీ ముందు ఓ చిన్న సినిమా తీయమని స్నేహితులు సలహా ఇచ్చారు. అందుకే ‘కాలింగ్ బెల్’ సినిమా తీశా. చిన్న సినిమా అయినా బాగా ఆదరిస్తున్నారు. ఇక నుంచి అడ్వెంచరస్, సస్పెన్స్ నేపథ్యంలో సినిమాలు తీసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తా’’ అన్నారు. -
ఆ సినిమాలు చూసి... కథక్ నేర్చుకున్నా!
రాఖీ, జల్సా, రెడీ, బొమ్మరిల్లు, నువ్వే, క్లాస్మేట్స్, నేనొక్కడినే చిత్రాలతో నటునిగా మంచి పేరు తెచ్చుకున్న రవివర్మ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘కాలింగ్ బెల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని రవివర్మ అన్నారు. మరిన్ని విషయాలు పంచుకుంటూ, ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందు లోనూ కమల్‌హాసన్, చిరంజీవి అంటే ఇంకా ఇష్టం. కమల్ హాసన్ ‘సాగరసంగమం’, చిరంజీవి ‘అభిలాష’ చిత్రాలు చూసి స్కూల్లో ఉన్నప్పుడే కథక్ నేర్చుకున్నా. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేశా. ఇప్పటిదాకా 26 చిత్రాలలో నటించా. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’, నాగచైతన్య ‘దోచేయ్’ , నారా రోహిత్ ‘అసుర’, పీవీపీ బ్యానర్లో ‘క్షణం’, శ్రీకాంత్ ‘హోప్’ చిత్రాలలో నటిస్తున్నా. వీటిలో చేస్తున్నన్నీ విభిన్న తరహా పాత్రలే’’ అన్నారు. ‘‘పాత్ర బాగుంటే ప్రతినాయకుడిగా చేయడానికీ రెడీ’’ అని రవివర్మ తెలిపారు. -
త్వరలో రెండో భాగం!
‘‘ఈ సినిమా మీద మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉన్నాం. అందుకు తగ్గట్టే మంచి స్పందన లభిస్తోంది. ఈ ఉత్సాహంతో ‘కాలింగ్ బెల్ 2’ చేయబోతున్నాం’’ అని అనూద్ తెలిపారు. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితీ ఖన్నా ముఖ్య తారలుగా పన్నా రాయల్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘కాలింగ్ బెల్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో దర్శకుడు మాట్లాడుతూ -‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అన్నారు. -
పాటల బెల్ మోగింది...
హారర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, మమతా రహుత్ ముఖ్య తారలుగా షేక్ అన్వర్ బాషా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నా రాయల్ దర్శకుడు. సుకుమార్ స్వరాలు అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి. కల్యాణ్ బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుందంటే సినిమా బాగుంటుందేమో అనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. దర్శకుడిగా తనకిది తొలి చిత్రమని, ఇది ఒక మాస్ హారర్ అని పన్నా రాయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్, మనోజ్ నందం, సునీల్‌కుమార్ రెడ్డి, మాదాల రవి, రవివర్మ, మమత తదితరులు పాల్గొన్నారు. -
టీవీక్షణం : సెల్వస్వామి పాత్ర చేయొద్దన్నారు!
‘ఆరుగురు పతివ్రతలు’ రిలీజయ్యాక మావాళ్లు ఓ యాభైమందిని తీసుకుని థియేటర్‌కి వెళ్లాను. సినిమా చూసి బయటకు వస్తుంటే ఓ ముసలావిడ వచ్చి... ‘మీరందరూ ఇంతే’ అంటూ నా కాలర్ పట్టుకుంది. ఆమె అల్లుడు శాడిస్ట్ అంట. అతడు గుర్తొచ్చాడట. తర్వాత కూలయ్యి... ‘చాలా బాగా చేశావ్ బాబూ’ అంటూ ముద్దు పెట్టుకుంది. తిట్టిందో పొగిడిందో అర్థం కాలేదు కానీ... నటుడిగా నేను సక్సెస్ అయ్యానని మాత్రం అర్థమైంది. తెల్లని పంచె-లాల్చీ, కోరమీసం, మెడలో పులిగోరు, కళ్లలో అంతుపట్టని భావాలు... ‘మొగలిరేకులు’ సీరియల్లో ‘సెల్వస్వామి’ని చూసిన ప్రేక్షకులు ఆ ఆహార్యాన్నిగానీ, ఆ పాత్రను పండించిన రవివర్మని గానీ ఎప్పటికీ మర్చిపోలేరు. అతి చిన్న వయసులోనే ఇద్దరు యువకుల తండ్రిగా నటించి మెప్పించారాయన. ‘నటుడనేవాడు ఏ పాత్రయినా చేయాలి, అప్పుడే నిజమైన నటుడనిపించుకుంటాడు’ అనే రవివర్మ తన గురించి చెప్పిన కబుర్లివి... కెరీర్ ఎలా ఉంది? బ్రహ్మాండం! ‘బృందావనం’ సీరియల్‌తో పాటు రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నాను. సీరియల్స్ తగ్గించినట్టున్నారే? సినిమాలపై దృష్టి పెట్టాను. అందుకే డేట్స్ సమస్య రాకూడదని సీరియల్స్ తగ్గించాను. మీ కెరీర్ మొదలైంది సినిమాతోనా, సీరియల్తోనా? సినిమాతోనే. ‘ఆరుగురు పతివ్రతలు’ నా తొలి సినిమా. అసలు యాక్టర్ ఎలా అయ్యారు? మాది వైజాగ్. ఇంటర్ వరకూ అక్కడే చదివాక, నా ఫ్రెండ్ సింగపూర్‌లో ఉండటంతో నేనూ వెళ్లిపోయాను. రోబోటిక్స్ కోర్సు చేసి అమెరికా వెళ్లిపోదామనుకున్నాను. కానీ అప్పుడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలడంతో వెళ్లలేని పరిస్థితి. వైజాగ్ వచ్చేసి హీలియో కన్సల్టింగ్ అనే యానిమేషన్ సంస్థ పెట్టాను. నా ఫ్రెండ్ ఒకతను సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాడు. అప్పుడప్పుడూ నేనూ తనతో వెళ్లేవాడిని. నన్ను కూడా ఫీల్డ్కి రమ్మని సత్యానంద్‌గారు ప్రోత్సహించడంతో యాక్టింగ్‌తో పాటు డెరైక్షన్ కోర్సు కూడా చేశాను. మరి డెరైక్టరెందుకవ్వలేదు? అవుదామనే వర్మ కార్పొరేషన్‌కి వెళ్లాను. వర్మ బంధువు సుబ్బరాజు అక్కడ ఇన్చార్జ్. అయన నన్ను చూసి... ‘నటుడిగా ఎందుకు ట్రై చేయకూడదూ, ఈవీవీ ఓ సినిమా తీస్తున్నారు, వెళ్లి చూడు’ అన్నారు. వెంటనే నా పోర్ట్‌ఫోలియో ఈవీవీగారికి పంపాను. నచ్చడంతో ‘ఆరుగురు పతివ్రతలు’లో శాడిస్టు భర్త పాత్ర ఇచ్చారు. ఓ శాడిస్టు పాత్రతో ఎంటరవడం మైనస్ అనిపించలేదా? లేదు. ఏదైనా నటనే కదా! సినిమాల్లోకి వెళ్తానంటే మొదట ఒప్పుకోని మా నాన్న కూడా ‘చాలా బాగా చేశావు’ అంటూ మెచ్చుకున్నారు. ఎమ్మెస్ నారాయణగారు వాళ్లబ్బాయి సినిమా ‘కొడుకు’లో చాన్సిచ్చారు. మరికొన్నిటిలోనూ అవకాశాలొచ్చాయి. మరి సీరియల్స్ వైపు ఎందుకొచ్చారు? కొన్ని సినిమాల్లో నటించాక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో ముంబై వెళ్లిపోయాను. ‘ఆషిక్ బనాయా ఆప్నే’ చిత్రానికి డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తుండగా... తాను తీయబోయే షార్ట్ ఫిల్మ్‌లో నటించమంటూ రాఘవేంద్రరావు పిలిచారు. తీరా వచ్చాక షార్ట్ ఫిల్మ్ కాస్తా సీరియల్ అయ్యింది. అలా ‘త్రిశూలం’తో టెలివిజన్ నటుడిగా మారాను. సెల్వస్వామి పాత్ర ఎలా దొరికింది? ఆ పాత్రను మొదట సెల్వరాజ్ చేశారు. ఆయనను రీప్లేస్ చేయాలి అనుకుని ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నప్పుడు... సాగర్ (ఆర్కే నాయుడు) నా పేరు చెప్పాడట. వేరొకరు చేసిన పాత్రలోకి పరకాయప్రవేశం కష్టమనిపించలేదా? లేదు. అతడి ప్రభావం పడకూడదనే నేను సీరియల్ చూడలేదు. గెటప్ వేసుకున్నాను. నా స్టయిల్లో నటించే ప్రయత్నం చేశాను. మొదట్లో ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రను చేయడం అవసరమా అని కొందరు అన్నారు. చేయొద్దని చెప్పినవాళ్లూ ఉన్నారు. కానీ చేయడం వల్లే నేనే ంటో అందరికీ తెలిసింది. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ప్రకాశ్‌రాజ్ గారిలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుని కావాలి. ‘ఉయ్యాలా జంపాలా’లో హీరోయిన్ తండ్రిగా చేశాక, నాలో ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడని అందరూ గుర్తించారు. ప్రకాశ్‌రాజ్, రావు రమేష్‌ల తర్వాత అంత మంచి నటుడు దొరికాడంటూ రివ్యూలు రాశారు. ఆ పేరును నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. జగపతిబాబు హీరోగా చేస్తోన్న ‘ఓ మనిషి కథ’ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాను. అవార్డు కోసమే తీస్తోన్న సందేశాత్మక చిత్రమది. నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. - సమీర నేలపూడి