పాటల బెల్ మోగింది... | Calling Bell Movie Audio Launchd | Sakshi
Sakshi News home page

పాటల బెల్ మోగింది...

Published Mon, Mar 16 2015 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

పాటల బెల్ మోగింది...

పాటల బెల్ మోగింది...

హారర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, మమతా రహుత్ ముఖ్య తారలుగా షేక్ అన్వర్ బాషా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నా రాయల్ దర్శకుడు. సుకుమార్ స్వరాలు అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి. కల్యాణ్ బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుందంటే సినిమా బాగుంటుందేమో అనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. దర్శకుడిగా తనకిది తొలి చిత్రమని, ఇది ఒక మాస్ హారర్ అని పన్నా రాయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్, మనోజ్ నందం, సునీల్‌కుమార్ రెడ్డి, మాదాల రవి, రవివర్మ, మమత తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement