
హారర్ బెల్
వైవిధ్యమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని పన్నా రాయల్ దర్శకత్వంలో అనూద్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 13న పాటలను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్.పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: షాని సోలోమన్.