Panna Royal
-
భయపెట్టేందుకు వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
సినీ ఇండస్ట్రీలో ఇటీవల హారర్ చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. గతంలో కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడు పన్నారాయల్ మరోసారి భయపెట్టేందుకు వస్తున్నారు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తాజా చిత్రం 'ఇంటి నెం.13'. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ చూడగానే విభిన్నమైన మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సందర్భంగా పన్నారాయల్ మాట్లాడుతూ..'ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ ఎన్నో హారర్ సినిమాలు చూశారు. కానీ పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. ఇందులోని మిస్టరీ, సస్పెన్స్ ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయి. సినిమాలో ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది. మేం అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిస్తుంది' అని అన్నారు. నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ.. ' ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని ఒక కొత్త తరహా చిత్రమిది. పన్నా గత చిత్రాలను మించేస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 1న ఈ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతమందించారు. -
కృష్ణాష్టమి వేడుకల్లో రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శ్రీ జుగల్ కిషోర్ మందిరంలో వైభవోపేతంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్న సమయంలో పన్నా రాజ కుటుంబీకురాలు జితేశ్వరీ దేవి ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించినందుకు పన్నా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆమె మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. Maharani Jiteshwari Devi of Panna Royal house of Madhya Pradesh arrested Due to widowhood of Queen, she was prevented from performing the Aarti of Shri Krishna in Jugal Kishore Temple in Panna#G20India2023 #G20जनता_विरोधी #G20_Anti_Social#सनातनी_ऐक_शैतानी #BharatMandapam #G20 pic.twitter.com/tR5hHx4kYz — Vikram Kumar (@VikramKumar6262) September 9, 2023 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్నా జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రఖ్యాత శ్రీ జుగల్ కిశోర్ మందిరంలో కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణ పరమాత్ముడి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం ఆనవాయితీ. అయితే ఈ ఉత్సవాల్లో రాజ కుటుంబీకులు ప్రతిమను చీపురుతో శుభ్రపరిచే 'చాన్వార్' సంప్రదాయాన్ని మాత్రమే ఆచరిస్తారని, అది కూడా పురుషులు మాత్రమే ఆచరిస్తారని తెలిపారు. कल रात जब उनकी विधवा पत्नी जेतेश्वरी देवी अपने बेटे को लेकर जुगल किशोर मंदिर पूजा करने के लिए आई और गर्भ गृह में घुसने लगी तो विधवा बता कर उन्हें और बेटे को रोक दिया गया। कुछ देर बाद जीतेश्वरी गर्भगृह के अंदर घुस गई और आरती करने लगी तो विधवा द्वारा आरती करना अशुभ बता कर कथित थाली… pic.twitter.com/svOZjgcW5y — काश/if Kakvi (@KashifKakvi) September 8, 2023 కానీ జితేశ్వరీ దేవి నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి హారతినిచ్చారన్నారు. దీంతో అర్చకులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకోగా వారిపై కూడా దుర్భాషలాడారని తెలిపారు. పోలీసులు వచ్చి వారించినా ఆమె తగ్గలేదు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కుని తీసుకెళ్లామని ఆమెపై కేసు నమోదు చేశామని కూడా తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. पन्ना राजपरिवार की महारानी #jiteshwaridevi को श्री जुगलकिशोर जू मंदिर से बाहर फेंका गया pic.twitter.com/J7wKpELBYF — Piyush Kumar Shukla (@Piyushkumarshu8) September 8, 2023 అరెస్టు సమయంలో జితేశ్వరీ దేవి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రక్షణ శాఖ సంక్షేమ నిధిలో సుమారు రూ.65,000 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఆమెను అరెస్టు చేశారన్నారు. వైధవ్యం కారణంగానే గర్భగుడిలోకి ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారని సంఘటన సమయంలో ఆమె బాగా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు. बवाल के बाद महारानी जीतेश्वरी देवी अदालत जाते वक्त बोली- पुजारियों ने गलत किया! हमारे साथ बुरा बर्ताव किया, उन पर कोई FIR नहीं हुई#Queen #JiteshwariDevi #Court #Panna pic.twitter.com/BP40yRECQH — Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) September 8, 2023 ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి -
కొత్త తరహా కామెడీతో వస్తోన్న ‘ప్లాంట్ మ్యాన్’‘!
కాలింగ్ బెల్, రాక్షసి వంటి చిత్రాలతో మెప్పించిన పన్నా రాయల్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే కొత్తవారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పన్నా రాయల్ డీఎం యూనివర్సల్ స్టూడియోస్ పేరుతో కొత్త బ్యానర్‌ను స్థాపించారు. ఈ పతాకంపై తాజాగా ఆయన ‘ప్లాంట్ మ్యాన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కె.సంతోష్‌బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దీంతో పాటు పన్నా రాయల్ దర్శకత్వంలో మరో చిత్రం ‘ఇంటి నెం.13’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. (ఇది చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి చెక్‌తో పాటు మరో సర్ప్రైజ్ ఇచ్చిన నిర్మాత!) సైంటిఫిక్ కామెడీగా వస్తున్న ‘ప్లాంట్ మ్యాన్’ను ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. భవిష్యత్తులో కొత్తవారికి అవకాశాలు ఇచ్చి మరిన్నీ సినిమాలు నిర్మిస్తామని నిర్మాత పన్నా రాయల్ తెలిపారు. చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్థన్, యాదం రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత, అక్కం బాలరాజు, చలపతిరావు, తడివేలు, బాలరాజ్, లక్ష్మీకిరణ్, శేఖర్, వీరభద్రం, శ్రీకుమార్, మురళీకృష్ణ, వాణిశ్రీ, బిందు, సరస్వతి, జగపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ పి.ఎస్.మణికర్ణన్.. ఆనంద బాలాజీ సంగీత మందిస్తున్నారు. (ఇది చదవండి: పూజలో పాల్గొన్న మెగా వారసురాలు.. ఉపాసన పోస్ట్ వైరల్!) -
రాక్షసి పిలుస్తోంది!
హారర్ నేపథ్యంలో ‘కాలింగ్ బెల్’ చిత్రం తెరకెక్కించిన దర్శకుడు పన్నా రాయల్, ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాక్షసి’ పేరుతో మరో చిత్రానికి దర్శకత్వం వహించారు. పూర్ణ, అభినవ్ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి ముఖ్యపాత్రల్లో అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ పోస్టర్, మరో నిర్మాత రాజ్ కందుకూరి లోగో రిలీజ్ చేయగా, మరో నిర్మాత కె.సురేష్‌బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచే సినిమా ఇది’’ అని పన్నా రాయల్ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాది ఇద్దరు పిల్లల తల్లి పాత్ర అనగానే ఆలోచించా. కథ విని, ఓకే చెప్పాను’’ అని హీరోయిన్ పూర్ణ తెలిపారు. -
పాటల బెల్ మోగింది...
హారర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, మమతా రహుత్ ముఖ్య తారలుగా షేక్ అన్వర్ బాషా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నా రాయల్ దర్శకుడు. సుకుమార్ స్వరాలు అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి. కల్యాణ్ బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుందంటే సినిమా బాగుంటుందేమో అనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి’’ అని ఆకాంక్షించారు. దర్శకుడిగా తనకిది తొలి చిత్రమని, ఇది ఒక మాస్ హారర్ అని పన్నా రాయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కె.ఎం. రాధాకృష్ణన్, మనోజ్ నందం, సునీల్‌కుమార్ రెడ్డి, మాదాల రవి, రవివర్మ, మమత తదితరులు పాల్గొన్నారు. -
హారర్ బెల్
వైవిధ్యమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కాలింగ్ బెల్’. రవివర్మ, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని పన్నా రాయల్ దర్శకత్వంలో అనూద్ నిర్మించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ నెల 13న పాటలను విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్.పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: షాని సోలోమన్.